ప్రి-ఎక్లంప్సియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Pre-eclampsia
Classification and external resources
Hypertrophic decidual vasculopathy high mag.jpg
Micrograph showing hypertrophic decidual vasculopathy, a histomorphologic finding seen in gestational hypertension - a component of preeclampsia. H&E stain.
ICD-10 O11, O13, O14
ICD-9 642.4-642.7
DiseasesDB 10494
MedlinePlus 000898
eMedicine med/1905 ped/1885
MeSH D011225

ప్రీఎక్లంప్సియా (Pre-eclampsia) అనేది గర్భము ధరించి ఉన్న సమయములో పెరిగే రక్తపోటు ( ప్రెగ్నెన్సీ ఇన్ద్యూస్డ్ హైపర్ టెన్షన్) తో పాటుగా మూత్రములో పెద్ద మొత్తములో ప్రోటీన్లు ఉండడం అనే ఒక వైద్య పరిస్థితి. ప్రీఎక్లంప్సియా అనేది ఒక రోగ కారకం కంటే కొన్నిరోగ చిహ్నముల సమాహారముగా చెప్పబడుతుంది, ఈ స్థితికి కారణమైన వేరు వేరు కారణములు చాలానే ఉన్నాయి. గర్భస్థమావి లోని కొన్ని పదార్ధములు వలన ఈ ఇబ్బందికి గురికాబోతున్న, తల్లి కాబోతున్న స్త్రీ యొక్క రక్త నాళములలో ఎండోలెథియమ్ పనితీరు సరిగా లేనట్లుగా కన్పిస్తుంది.[1] ఈ జబ్బులో రక్తపోటు బాగా పెరుగుతూ ఉండడం అనేది బాగా తెలుస్తూ ఉండే ఒక గుర్తు, అలాగే అది మాములుగా మాతృ సంబంధిత ఎండోలెథియమ్, మూత్రపిండాలు మరియు కాలేయములను దెబ్బ తీస్తుంది మరియు వాసోకన్స్ట్రి క్టివ్ కారణములు అసలు దెబ్బతీసే వాటికి తోడుగా రెండవ ప్రభావముగా ఉంది.

ప్రీఎక్లంప్సియా గర్భధారణ జరిగిన 20 వారముల నుండి పెరగడం మొదలు అవ్వవచ్చు(ఇది అంతగా పెరుగుదల లేని మొదటి 32 వారములకు ముందుగా ఉంటే త్వరగా వచ్చింది అని భావిస్తారు). రోగులలో ఇది ఎదిగే విధానము మారుతూ ఉంటుంది; చాలా మందిలో ఇది ముందుగానే కనుగొనబడినది. ప్రీఎక్లంప్సియా అనేది ప్రసవము అయిన ఆరు వారముల తరువాత కూడా రావచ్చును. అలాంటి సందర్భములలో శస్త్రచికిత్స చేయడము లేదా బలవంతముగా ప్రసవము అయ్యేలా చేయడము(మరియు దీని వలన గర్భస్త మావి కూడా ప్రసవములో వచ్చేస్తుంది) తప్ప మరొక చికిత్స మార్గము లేదు. ఇది చాలా కష్టము అయిన ప్రసవములలో మాములుగా వచ్చే పెద్ద ఇబ్బంది; ఇది తల్లి మరియు ఇంకా పుట్టని బిడ్డ పై కూడా ప్రభావము చూపిస్తుంది.[1]

రోగ నిర్ధారణ[మార్చు]

ప్రీఎక్లంప్సియా ఉన్నది అనే సంగతి తల్లి కాబోతున్న స్త్రీలో అధికముగా రక్త పోటు(140/90 కాకుండా లేదా అంత కంటే ఎక్కువగా ఉన్నా ఆరు గంటల తేడా తోటి కనీసము రెండుసార్లు రక్తపోటు యొక్క రీడింగ్ తీసుకోబడుతుంది) గమనించబడినప్పుడు తెలుస్తుంది మరియు ప్రోటీయూరియా అనబడే 300 మిల్లీ గ్రాములు ప్రోటీన్ ఒక రోజులో వచ్చిన మూత్రములో ఉండడం వలన కూడా తెలుస్తుంది. 30mmHg సిస్టాలిక్ లేదా 15mmHg డయస్టాలిక్ ల బేస్ లైన్ బ్లడ్ ప్రెషర్(BP)పెరగడము, అదే సమయములో 140/90 ఉండవలసిన రక్త పోటు అలా ఉండక పోవడము వంటివి తప్పనిసరిగా, ముఖ్యముగా గమనించ వలసిన వివరములు,కాని ఇవి రోగ నిర్ధారణకు వాడబడవు. మొదట్లో వాపు రావడము లేదా నీరు రావడము వంటివి(ముఖ్యముగా చేతులమీద మరియు ముఖము పై)వంటివి ఈ వ్యాధికి సంబంధించిన ముఖ్య సూచికలుగా ఉండేవి, కానీ ప్రస్తుతము ఉన్న వైద్యములలో కేవలము రక్తపోటు[2] మరియు ప్రోటీయూరియాలు మాత్రమే వ్యాధి నిర్ధారణకు అవసరం అవుతున్నాయి. గుంటపడి కాసేపు అలాగే ఉండేలా చేసేంతగా చేరిన నీరు (చేతులు,కాళ్ళు లేదా నొక్కితే గుంటలు పడి అలాగే ఉండడం)చాలా ముఖ్యమైనది మరియు దీనిని ఆరోగ్య రక్షకులకు వెంటనే తెలపవలసి ఉంటుంది.

"సివియర్ ప్రీఎక్లంప్సియా" లో BP 160/110[3][4] కంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఇతర రోగ చిహ్నములు కూడా ఉంటాయి.

ప్రీఎక్లంప్సియా ఎక్లంప్సియాగా కూడా మార్పు చెందవచ్చు, ఇది టానిక్-క్లానిక్ లు, హఠాత్తుగా మూర్ఛలు వంటి రావడం వలన తెలుస్తుంది. ఇది సరైన వైద్యము తీసుంటే చాలా అరుదుగా వస్తుంది.

ఎక్లంప్సియా నెమ్మదిగా సంభవించేది అయినప్పటికీ, ప్రీ-ఎక్లంప్సియా అనేది పెరుగుతూ,తరుగుతూ ఉంటుంది మరియు దీనిని వ్యాధికి సంబంధించిన సూచనల ద్వారా లేదా పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ఏది ఏమైనప్పటికీ, దీని విషయములో తరచుగా పొరపడడం జరుగుతుంది కాబట్టి వ్యాధికి సంబంధించిన ఒక సూచన చాలా ముఖ్యమైనది. ఉదరభాగములో వచ్చే నొప్పి కాలేయము యొక్క పని తీరును తెలుపుతుంది మరియు ఇది ఒక HELLP లక్షణముల సంపుటి, దీనిని గర్భావస్థలో చాలా సహజముగా వచ్చే ఇబ్బంది అయిన గుండెమంటగా పొరపాటు పడే అవకాశం ఉంది. ఇది గొంతు ద్వారా పైకి పాకకుండా ఉండడం, కాలేయము సున్నితముగా ఉండడము, వీపుకు నొప్పి పాకడము మరియు ఎసిడిటీ నుండి ముక్తి కల్పించే మందులు తీసుకున్నప్పటికీ తగ్గక పోవడముతో ఇది గుండె మంట కాదు అని తెలుసుకోవచ్చు. ఇది తరచుగా చాలా ఎక్కువగా ఉంటుంది మరియు దాని బారిన పడినవారు ఇంతకు పూర్వము ఎప్పుడూ ఇంత బాధ అనుభవించలేదు అని చెపుతారు. దీని బారిన పడిన స్త్రీలకు సాధారణముగా మామూలు శస్త్ర చికిత్స నిపుణలు సంప్రదించమని సలహా ఏమీ ఇవ్వరు, కానీ పొత్తికడుపులో తట్టుకోలేనంత నొప్పి(ఉదాహరణకు: కోలేసైస్టిసిస్) ఉన్నప్పుడు ఇలాంటి సలహా ఇవ్వబడుతుంది.

సాధారణముగా ప్రీఎక్లంప్సియాకు చెందినవిగా చెప్పబడే ఈ సూచనలు ఏవీ అంత ఖచ్చితము అయినవి కాదు మరియు ఎక్లంప్సియా కంటే ఎక్కువగా గర్భావస్థలో మూర్ఛలు ఈ కారణములు కలిగి ఉంటాయని ఇప్పుడు అనుకుంటున్నారు. ప్రీఎక్లంప్సియా ఉందని నిర్ధారించడానికి, దాని చాలా సహజ లక్షణములు ఉన్నట్లుగా పరీక్షల ద్వారా తేల్చడము, ప్రసవము తరువాత అయిన తిరిగి వస్తుంది అని తెలియడానికి ఉన్న ఆఖరు సాక్షముగా ఉంటుంది.

కొంతమంది స్త్రీలలో ప్రోటీయూరియా(మూత్రములో యూరియా) లేకుండా కేవలము రక్తపోటు మాత్రమే పెరుగుతుంది, దీనినే గర్భధారణ వలన వచ్చిన రక్తపోటు(ప్రెగ్నెన్సీ ఇన్ద్యూస్డ్ హైపర్ టెన్షన్) (PIH ) అని లేదా గర్భదారణ సమయ రక్తపోటు అని అంటారు. ప్రీఎక్లంప్సియా మరియు PIH రెండు చాలా కష్టమైన విషయములే మరియు తల్లినీ, బిడ్డను జాగ్రత్తగా చూసుకుని తీరవలసిన అవసరము కలిగి ఉన్నవే.

సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]

ప్రీఎక్లంప్సియా 10% శాతము మంది గర్భవతులకు వస్తుంది, మాములుగా ఆరు లేదా తొమ్మిది నెలలలో మరియు 32వ వారము తరువాత వస్తుంది. కొంచెం అరుదుగా, కొంతమంది స్త్రీలకు ప్రీఎక్లంప్సియా ఇరవయ్యో వారములోనే అనుభవమునకు వస్తుంది. తొలిసారిగా[5] తల్లి కాబోతున్న వారిలో ఇది చాలా సాధారణము మరియు రెండవసారి గర్భం దాల్చినప్పుడు ఇది తక్కువ సార్లు వస్తుంది. మరియు ఆ తరువాతి గర్భధారణలో పితృత్వములో మార్పు రావడం వలన ఇది మరింతగా తగ్గిపోతుంది, కానీ ఆ కుటుంబములో గర్భధారణ సమయములో రక్తపోటు ఎక్కువగా వచ్చే వ్యాధి లేకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. [6]వయసు పెరిగిన తరువాత వచ్చే గర్భము వలన ఈ వ్యాధి ఎక్కువగా రావడానికి అవకాశము ఉన్నందున, పితృత్వములో మార్పు అనేది ఎంత ముఖ్యము అనేది ఖచ్చితముగా తెలపడము చాలా కష్టము[7] మరియు ఈ విషయము పైన అధ్యయనములు తమ తమ వివరములతో వేరు వేరు అభిప్రాయములు వెలిబుచ్చుతున్నాయి.

గర్భం ధరించడానికి ముందుగానే రక్తపోటు, చక్కెర వ్యాధి మరియు వ్యాధినిరోధక వ్యవస్థకు సంబంధించిన జబ్బు అయిన చర్మ వికారము వంటివి మరియు వారసత్వముగా వచ్చే ఫాక్టర్ V లీడెన్, మూత్రపిండములకు సంబంధించిన వ్యాధులు వంటివి ఉన్న స్త్రీలు, కుటుంబములో అప్పటికే కొంత మందికి ప్రీఎక్లంప్సియా అనే వ్యాధి ఉన్నవారు మరియు కవలలు చాలా సార్లు పుట్టిన స్త్రీలు లేదా చాలా మంది పిల్లలను కన్న స్త్రీలు త్వరగా ఈ ప్రీఎక్లంప్సియా బారిన పడతారు. ఈ ప్రీఎక్లంప్సియా రావడానికి అత్యంత ముఖ్యమైన, బలమైన కారణము అంతకు ముందు గర్భధారణ అప్పుడు ప్రీఎక్లంప్సియా వచ్చి ఉండడం.

ప్రీఎక్లంప్సియా అనేది ప్రసవము జరిగిన వెంటనే కూడా రావచ్చును. దీనిని "ప్రసవానంతర ప్రీఎక్లంప్సియా(పోస్ట్పారటం ప్రీఎక్లంప్సియా)" అని వ్యవహరిస్తారు. ప్రసవానంతరము మొదటి 24–48 గంటలు తల్లికి ప్రమాదకరమైన సమయము మరియు ఆ సమయములో తనను గమనిస్తూ ప్రీఎక్లంప్సియాకు సంబంధించిన సూచనలు ఏమైనా ఉన్నాయేమో చూస్తూ ఉండాలి.[8]

కారణాలు[మార్చు]

ప్రీఎక్లంప్సియా లక్షణము అనేది అంతగా లోతు లేని గర్భస్థ మావి హైపాక్సిక్ అవ్వడం వలన వస్తుంది అని, ఇది ఒక కారణము అని భావిస్తున్నారు, ఇది వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి ద్రవములు స్రవించేలా చేసి మావి లోంచి తాపము కలిగించేలా వస్తున్న వాటిని చల్లబరుస్తుంది మరియు రక్త నాళముల అంతరాస్తరముగా పని చేస్తుంది. ఇలా లోతు లేకుండా నాటుకోవడము అనేది తల్లి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ మావితో ఎలా స్పందించింది అనే విషయము వద్దనే బీజము వేసుకుంది. ఈ వాదము వలన తల్లి వ్యాధి నిరోధక శక్తి యొక్క భూమిక తెలుస్తోంది మరియు గర్భము ధరించిన సమయములో వ్యాధి నిరోధక వ్యవస్థ బలముగా లేకపొతే, తల్లి ఆ బిడ్డ యొక్క తండ్రి శుక్ర కణముల నుండి రక్షణ కొరకు రక్షణ పదార్ధములు తయారు చేసుకుంటుంది, అలగే బిడ్డ నుంచి మరియు మావి నుంచి కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది.[9] కొంత మంది విషయములో ప్రీఎక్లంప్సియా అనేది తల్లిలో మావి తల్లి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ పని తీరును ప్రభవితం చేసేలా వాడుకుంటున్న ప్రోటీన్ లను గ్రహించగలిగే శక్తి లేకపోవడము అని భావిస్తున్నారు.[10] ఈ ఆలోచనా విధానము సరైనదే ఎందుకంటే చాలా గర్భస్రావములలో ఇమ్మ్యునోలాజికల్ ఇబ్బందులు ఉండడం ఒక సాక్షముగా ఉంది, ఇందులో తల్లి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ "ఎదుగుతున్న బిడ్డ పై నాశనమునకు కారణము అయ్యేలా ఒక పెద్ద దాడి చేస్తుంది.[11]

చాలా మంది విషయములో ప్రీఎక్లంప్సియా అనేది, మావి మాములుగా పాతుకోవడమునకు జరిగే ప్రయత్నములో జరిగే చర్యగా భావించబడుతున్నది. దాదాపు ఎప్పుడూ ఉండే రక్తపోటు లేదా వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వంటివి కలిగి ఉన్న స్త్రీలలో నొప్పి వీటి వలనే కలుగుతుంది మరియు గర్భధారణ వలన రాబోయే నొప్పులు తట్టుకునే శక్తి అంతగా ఉండదు.

బాగా ఎక్కువ అయితే, ప్రీఎక్లంప్సియా అనేది ప్రాణాంతకము అయిన ప్రీఎక్లంప్సియా గా మారుతుంది, దీనితో పాటుగా తలనొప్పి, సరిగా కనిపించక పోవడము మరియు ఛాతీలో నొప్పి ఇంకా HELLP సిండ్రోమ్ మరియు ఎక్లంప్సియా వాటివి కూడా ఉంటాయి. ఇలా అధిక రక్తపోటుతో కూడిన గర్భధారణలో గర్భస్థ మావి గర్భసంచి నుండి క్రిందకు జారడం వంటివి కూడా సంభవము అవుతాయి. ఇవి తల్లికీ మరియు ఎదుగుతున్న బిడ్డకు ఇద్దరకూ కూడా జీవన్మరణ సమస్య కలిగించగల పరిస్థితులు .

అసలు ప్రీఎక్లంప్సియా అనేది ఎందుకు వస్తుంది అనే దాని పై చాలా వాదనలు వచ్చాయి, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసాయి మరియు అవి ఈ లక్షణము ఈ క్రింది వాటి వలన వస్తుంది అని తెలిపాయి:

 • ఎండోథెలియల్ సెల్ గాయపడడము
 • మావిని అంగీకరించని వ్యాధినిరోధక వ్యవస్థ
 • సర్దుకున్న మావి చిలకరణ
 • నాళముల పని తీరులో మార్పు
 • ప్రోస్టాసైక్లిన్ మరియు త్రోంబాక్సిన్ ల మధ్య అసమతుల్యత
 • మూత్ర పిండములు సరిగా పనిచేయక పోవడముతో నీరు మరియు ఉప్పు లోపలే ఉండిపోవడము
 • లోపలి నాడుల పరిమాణము తగ్గడము
 • కేంద్ర నాడీ వ్యవస్థలో పెరిగిన మంట, ఇబ్బంది
 • నాడుల లోపల గడ్డకట్టబడి చల్లబడడము
 • మూత్రనాళము యొక్క కండరములు వ్యాకోచించడము (ఇసెచిమియా)
 • ఆహార అలవాట్లు, వాటితో పాటుగా విటమిన్ల లోపం
 • అనువంశిక కారణములు[12]
 • వాయు కాలుష్యము[13]
 • అతిగా బరువు కలిగి ఉండడము[14]

ప్రస్తుతము దీని గురించి తెలిసిన దాని ప్రకారము ఇది రెండు దశలుగా పెరిగే పద్దతిలో ఉంటుంది, మొదటి దశలో మావిని హైపాక్సియాగా మార్చేస్తుంది, ఆ తరువాత నీటిలో కరిగే పదార్ధములను ప్రవేశం పెడుతుంది, తత్ఫలితముగా వేరే గమనించబడిన మార్పులు చోటు చేసుకుంటాయి. దీని క్రిందకే ఇంకా చాలా పాత కథలు వచ్చి చేరతాయి, ఎందుకంటే కరిగే పదార్దములు ఎండోథేలియాల్ కణములు దెబ్బతినడానికి, నరముల పని తీరు దెబ్బతినడానికి, మూత్రపిండముల ఎండోతిలియాసిస్ శరీర భాగములు దెబ్బ తినడానికి, లోపలి నరముల పరిమాణము తగ్గడానికి,నొప్పి కలగడానికి కారణము అవుతాయి కాబట్టి ఇవ్వన్ని ఒకటిగానే వర్గీకరించవచ్చు. వీటితో పాటుగా తల్లితనమునకు విఘాతము కలుగుతుంది.

వ్యాధి జననం[మార్చు]

ప్రీఎక్లంప్సియా గురించి చాలా హేతు విజ్ఞాన పరిశోధనలు మరియు నిర్మాణము జరిగినప్పటికీ, దాని అసలు జననమునకు కారణములు ఇంకా సరిగ్గా తెలియరాలేదు. కొన్ని అధ్యయనములు మావికి సరిపోయినంత రక్త ప్రసరణ జరగక పోవడముతో కొన్ని ప్రత్యేక రకముల హార్మోన్లను మరియు రసాయన పదార్ధములను తల్లి యొక్క శరీరములోకి పంపిస్తుంది అనే భావనను సమర్ధించాయి, వీటి వలన ఎండోథేలియం (రక్త నాళముల అంచులు)దెబ్బతినడము,జీవక్రియలో మార్పులు రావడము, నొప్పి మరియు ఇతర అన్ని రకముల ఇబ్బందులు తలెత్తుతాయి.[1]

తల్లి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులు మరియు గర్భావస్థలో వచ్చే మార్పులు తట్టుకునే శక్తి లేక పోవడము వంటివి ప్రీఎక్లంప్సియా లో ముఖ్య భూమిక పోషిస్తాయి. ప్రీఎక్లంప్సియా లో కనుగొనబడిన ముఖ్యమైన తేడాలు Th1 యొక్క తీరు మరియు IFN-γ తయారు కాబడడము. IFN-γ యొక్క మూలాలు ఇంకా సరిగ్గా తెలియ రాలేదు మరియు ఇవి గర్భసంచి యొక్క కణములను సహజముగానే చంపివేస్తాయి, ప్లాసెన్ట డెన్డ్రిటిక్ కణములు T హెల్పర్ కణముల పని తీరును నియంత్రించే T కణజాలముల వైపు లేదా గర్భావస్థలో నియంత్రణ ఉన్న T కణములను నియంత్రిస్తుంది.[15] వ్యాధినిరోధక వ్యవస్థలో అసాధారణ మార్పులు ప్రీఎక్లంప్సియా రావడానికి కారణము అవుతాయి మరియు ఇవి మారిన పిండము యొక్క ఉనికిని లేదా నొప్పి రాబోతున్న సందేశమును తెలుపుతాయి.[15] ప్రీఎక్లంప్సియా ఉన్న స్త్రీలలో పిండము యొక్క ఎరితోబ్లాస్ట్ కణములు మరియు కణములు లేని పిండము యొక్క DNA లు తల్లి కాబోతున్న సమయములో బాగా పెరిగినట్లు నమోదు చేయబడినది. ఇలా కనుగొనబడిన వాటి వలన మావిలో వచ్చే అనూహ్యమైన మరియు అవ్వచితమైన మార్పులు దానిని హైపాక్సియాగా మార్చి పిండమునకు సంబంధించిన పదార్ధములకు తల్లి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ జావాబిచ్చేలా చేస్తుంది మరియు ఎండోతేలియాల్ దెబ్బ తినడము వలన ప్రీఎక్లంప్సియాకు మరియు ఎక్లంప్సియాకు దారి తీస్తుంది.

కొన్ని అధ్యయనములు హైపాక్సియా అనేది sFlt-1, VEGF మరియు PlGF వంటి విరోధ భావము కలిగినవి చిలకరింపబడడము వంటి వాటి వలన వస్తుంది అని తేల్చాయి, ఇవి తల్లితనమునకు సంబంధించిన ఎండోలిథియంను నాశనము చేస్తుంది మరియు మావి యొక్క పెరుగుదలను నియంత్రిస్తుంది.[16] వీటితో పాటుగా, ప్రీఎక్లంప్సియా ఉన్న స్త్రీలలో ఒక TGF-బీటా విరోధి అయిన ఎండోగ్లిన్ కూడా పెరుగుతుంటుంది.[17] కరిగే ఎన్దాల్జిన్ అనేది కణము పై వచ్చిన తల్లి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా పెంచబడిన ఎన్దాల్జిన్ కు జవాబుగా మావిచే తయారు చేయబడుతుంది, అయినప్పటికీ sEng అనేది తల్లి యొక్క వ్యవస్థ చేతనే తయారు చేయబడినది. ఈ వ్యాధి ముదిరే కొద్ది sFlt-1 మరియు sEng లు రెండు పెరుగుతూ ఉంటాయి, అదే HELLP సిండ్రోమ్ విషయములో sEng యొక్క స్థాయి sFlt-1 ను దాటి వెళుతుంది. ఈ మధ్య కొత్తగా వచ్చిన సమాచారము ప్రకారము ప్రీఎక్లంప్సియాలో Gadd45a ఒత్తిడి అనేది sFlt-1 వలన వచ్చిన ఒత్తిడిని నియంత్రిస్తుంది.[18]

sFlt-1 మరియు sEng లు రెండు కూడా కొంత స్థాయి వరకు గర్భముతో ఉన్న స్త్రీలలో అనివార్యము, మరియు ఇది గర్భావస్థలో ఇలా రక్త పోటు రావడము చాలా సహజము అనే వంకర భావనను బలపరుస్తుంది. మావిలో సహజముగానే చంపేయగలిగిన కణములు ఉంటాయి మరియు ఈ మావి లో కొంత వరకు తల్లి యొక్క వ్యాధి నిరోధక శక్తి యొక్క ఓర్చుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ మావి లికి వ్యతిరేకముగా తల్లి వ్యాధి నిరోధక వ్యవస్థ పని చేయడం ఏమాత్రము ఆశ్చర్యం కాదు, అలాంటి మావి పలురకముల శస్త్రచికిత్సలకు మాత్రమే లొంగుతుంది. మొదటిలో తల్లి నుంచి మావికి చెందిన సైటోట్రోఫోబ్లాస్ట్ లకు ఎదురైన వ్యతిరేకత వలన వంకరలు తిరిగిన ధమనులు సరిగ్గా తయారు అవుతాయి మరియు దీని వలన అంతగా లోటు లేని చోటే గర్భం నిలుస్తుంది, ఆ తరువాత అది హైపాక్సియాకు దారి తీస్తుంది మరియు sFlt-1 మరియు sEng లు బాగా పెరగడంతో తల్లి నుండి సూచనలు తెలుస్తాయి.

వైవిధ్య వ్యాధి నిర్దారణ[మార్చు]

ప్రీఎక్లంప్సియా-ఎక్లంప్సియా అనుకరిస్తూ ఉంటాయి మరియు వీటిని వేరే జబ్బులుగా పొరపడవచ్చును, వీటిలో ఎప్పుడు ఉండే రక్త పోటు,ఎప్పుడు ఉండే మూత్ర పిండముల జబ్బు, మొదటి స్థాయిలో ఉండే మూర్చల జబ్బు , మూత్రాశయము మరియు పాన్క్రియాట్ కు ఉండే జబ్బు, వ్యాధి నిరోధక వ్యవస్థ లేదా రక్తము కారిపోవడం వలన కుళ్ళి పోవడము మరియు చర్మము మీద రక్తము గడ్డ కట్టడము ,యాంటిఫాస్ఫాలిపిడ్ సంపుటి మరియు హేమోలిటిక్ యురేనిక్ లక్షణముల సంపుటి వంటివి ఉన్నాయి. ఇది గర్భము దాల్చి 20 వారముల కంటే ఎక్కువ గడిచిన స్త్రీలలో చాలా సామాన్యముగా కనిపిస్తుంది. అంతకు పూర్వమే రక్తపోటు గనక ఉంటే దానిని కనిపెట్టడము కూడా చాలా కష్టము.[19]

ఉపద్రవాలు[మార్చు]

ప్రీఎక్లంప్సియా బాగా ముదిరిన తరువాత ఎక్లంప్సియా రావచ్చును. ఎక్లంప్సియా,మరింత కష్టమైన పరిస్థితి మరియు యునైటెడ్ కింగ్డం లో ప్రతి రెండు వేల మంది గర్భిణులలో ఒకరి పరిస్థితి క్లిష్టం అయ్యేలా చేస్తుంది మరియు 1.8 శాతము మంది మరణమునకు కారణము అవుతుంది.[20] HELLP లక్షణములు చాలా మాములుగా 1 నుండి 500 మంది గర్భిణీ లలో కనిపిస్తాయి, కానీ ఇది కూడా ఎక్లంప్సియా అంత భయంకరమైనదే. గర్భావస్థ లోని ఈ రెండు పెద్ద కష్టములు కూడా ప్రీఎక్లంప్సియా యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకటించబడవు.

అంతర్గత రక్తస్రావము అనేది ప్రీఎక్లంప్సియా లేదా ఎక్లంప్సియా ల తో కూడి ఉన్నప్పుడు ప్రాణములను హరిస్తుంది. వాటిలో వేరే సందర్భములలో, ఈ అంతర్గత రక్తస్రావము అనేది చాలా ఎక్కువగా రక్తపోటు వచ్చింది అని తెలియచేసే సమస్య, ఇది ముందుగానే సమస్యను తెలిపే ఒక వివరముగా తెలిసి ఉండాలి, కానీ ఈ మాట ఇంకా ధృవీకరించబడలేదు. పెద్దలలో శ్వాస ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడడము అనేది చాలా సాధారనముగా జరిగేదే, ఇది ఒక వ్యాధా లేక ప్రస్తుతం ఇవ్వబడుతున్న శ్వాస సహకారముల వలన వస్తోందా అనేది ఇంకా తెలియ రాలేదు.

ఒక క్రమ పద్దతిలో చేసిన సమీక్ష ప్రకారము మరియు నిర్ణయ విశ్లేషణ ప్రకారము ప్రీఎక్లంప్సియా ఉన్న గర్భవతులలో దాని తీవ్రతను యూరిక్ యాసిడ్ ఎంత స్థాయిలో ఉంది అనే దానిని బట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలుసుకోవచ్చు.[21] ఈ అధ్యనములో సున్నితత్వము 68% మరియు ఖచ్చితత్వము 68% ఉంది. ఈ అధ్యయనములో గర్భావస్తలో వస్తాయని అనుకుంటున్న ఇబ్బందులు 5%, ఖచ్చితముగా వస్తాయనే విలువ 6.2% గాను మరియు రావనుకునే విలువ 98.6% గాను ఉంది( ఇక్కడ నొక్కి పెట్టి ఉంచి ఈ రోగుల ఫలితములను తల్లితనములోని హెచ్చు స్థాయి ఇబ్బందులు మరియు తక్కువ స్థాయి ఇబ్బందులుగా విభజించండి). ఇలా రోగిని పరీక్షించి నిర్ణయము తీసుకునే పద్దతిలో, వారు అమితమైన బాధ కలిగే శాతము 10 గా భావించారు (ఒక ఆపరేషన్ జరగడము వలన వచ్చే బాధ కంటే ఈ తీవ్రమైన ఇబ్బందుల వలన వచ్చే బాధ పది రెట్లు ఎక్కువగా భావించారు), మరియు ఈ ఆలోచనల మధ్య వారు సెరమ్ యూరిక్ యాసిడ్ ను వాడడము అనేది అన్నిటికంటే తక్కువ బాధ కలిగించేదిగా నిర్ణయించారు. ఈ అద్యాయనము గురించి వ్రాసిన వారు దీని గుర్తించి తీరవలసిన స్థాయిలో హద్దులు ఉన్నాయని, అవి వారు చాలా విస్తారమైన విడి విడి అధ్యయనములు చేయడం వలన మరియు ఏప్పుడు మారుతూ ఉండే విలువలు వాడడం వలన వచ్చాయని చివరలో తెలిపారు.

చికిత్స మరియు నివారణ[మార్చు]

ఎక్లంప్సియా లేదా పెరుగుతున్న ప్రీఎక్లంప్సియా లకు ప్రస్తుతము తెలిసి ఉన్న ఒకే వైద్యము గర్భ విచ్చిత్తి చేయడము లేదా నొప్పులు వచ్చేలా చేసి కానీ, కాకుంటే ఆపరేషన్ ద్వారా కానే కాన్పు చేయడము మాత్రమే. ఏది ఏమైనప్పటికీ, కాన్పు అయిన ఆరు వారముల వరకు గర్భం ధరించి ఉన్నప్పుడు ఏమి లక్షణములు కనిపించనప్పటికీ ప్రీఎక్లంప్సియా రావడానికి అవకాశము ఉన్నది. కాన్పు తరువాత వచ్చే ఈ ప్రీఎక్లంప్సియా తల్లి ఆరోగ్యానికి చాలా హానికరమైనది, ఎందుకంటే ఆ సమయములో లక్షణములను కేవలము మాములుగా కాన్పు తరువాత వచ్చే తలనొప్పి లేదా నీరు చేరటము వంటి వాటిగా భావించి నిర్లక్షం చేయవచ్చు. రక్తపోటు కొన్ని సార్లు ఉన్నట్లుగా ఖచ్చితముగా నిర్ధారణ అయితే అప్పుడు దాని సంబంధించిన వైద్యము చేయడం ద్వారా కొన్ని కొన్ని సందర్భములలో నయం చేసుకోవచ్చు.

సదా ఉండే రక్తపోటు లేదా వ్యాధి నిరోధక వ్యవస్థతో అనారోగ్యం ఉన్న స్త్రీలు గర్భధారణకు ముందే వీటికి వైద్యం తీసుకోవడము మరియు అతిగా పని చేస్తున్న వ్యాధి నిరోధక వ్యవస్థను శాంతింప చేయడం వంటివి చేయడం మంచిది.[ఆధారం కోరబడింది]

త్రాంబోఫిలియాస్ కు ప్రీఎక్లంప్సియాకు చాలా తక్కువ సంబంధం ఉంది. త్రాంబోఫిలియాస్ ఉన్న స్త్రీలలో రక్తము పలుచగా ఉండే వారు ప్రీఎక్లంప్సియా బారిన పడకుండా ఉంటారు అని చెప్పడానికి సరైన అధ్యయనములు ఏవి లేవు.[22]

పొగ త్రాగడము అనేది ప్రీఎక్లంప్సియా [23][24]రావటాన్ని తగ్గిస్తుంది(కానీ పొగ త్రాగడము అనేది గర్భావస్థలో సమ్మతము కాదు.)

రక్తపోటు తగ్గడానికి చికిత్స[మార్చు]

రక్త పోటు తగ్గించడానికి ఇచ్చే మందులు ప్రభావము లేని మందుల కంటే ఎక్కువగా రక్త పోటు తగ్గించి మాతాశిశు మరణములను కూడా తగ్గిస్తున్నట్లుగా ఒక రాండం ట్రయల్ లో తెలిసింది.[25] మొత్తము మీద, మూడు వారముల చికిత్స అనంతరము, ఇస్రాపిడిన్ సమూహములో ప్రభావము లేని మందు ఇచ్చిన సమూహము కంటే MAP తక్కువగా ఉన్నట్లు తెలిసింది, కానీ ఈ తేడా సాంఖ్యక శాస్త్ర పరముగా అంతగా విలువైనది కాదు. ఇస్రాపిడిన్ తో చికిత్స అనంతరము ప్రోటీ యూరియా లేని రోగుల సిస్టాలిక్ రక్త పోటులో 8.5 నుండి 11.3 mmHg ల వరకు తరుగుదల మరియు ప్రోటీ యూరియా ఉన్న రోగుల సిస్టాలిక్ రక్త పోటులో కేవలము 1 mmHg మాత్రమే తరుగుదల ఉన్నట్లుగా తెలియవచ్చినది. ప్రభావము లేని మందు ఇవ్వబడిన సమూహములో ప్రోటీ యూరియా ఉందా లేదా అనే విషయముతో సంబంధము లేకుండా వారి సిస్టాలిక్ రక్త పోటులో ఏమి మార్పు తెలియ రాలేదు. కాబట్టి, ప్రోటీ యూరియా లేని రోగులు మరియు ప్రోటీ యూరియా ఉన్న రోగులు ఆ ఇస్రాదిపిన్ మందుకు వేరు వేరుగా స్పందిస్తారు అని ఈ ట్రయల్ యొక్క రచయితలు తెలిపారు.

మెగ్నీషియం సల్ఫేట్[మార్చు]

ప్రీఎక్లంప్సియా లేదా ఎక్లంప్సియా ఉన్న స్త్రీలలో మెగ్నీషియం సల్ఫేట్ ను మూర్చ రావడానికి ముందుగానే ఇవ్వడం వలన రాకుండా ఆపివేయవచ్చును మరియు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడము ద్వారా కడుపులోని పిండమునకు ఉపిరితిత్తులు సరిగా ఎదిగేలా చేయవచ్చును. 1955[26] వరకు మెగ్నీషియం సల్ఫేట్ ను మంచి వైద్యముగా భావించారు , ఈ మధ్య కాలములో UK లో దీని బదులుగా డయజేపమ్ మరియు ఫెనిటిన్ లు వాడబడుతున్నవి.[27] అంతర్జాతీయముగా చేయబడిన MAGPIE అధ్యయనము మెగ్నీషియమ్ సల్ఫేట్ వాడుకకు కావలసిన ఆధారమును ఇచ్చినది.[28] గర్భధారణ జరిగిన 37 వారములకు ముందుగా బలవంతముగా కాన్పు చేయవలసి వస్తే అప్పుడు బిడ్డ ముందుగా పుట్టడం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయని, దానికి తగినట్టుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తీరవలెనని అంగికరించబడినది.

మంచి పోషకాహార లక్షణములు[మార్చు]

ప్రీఎక్లంప్సియా పై ప్రోటీన్/కాలోరిలు బయట నుంచి ఇచ్చి చేసిన అధ్యయనములలో ఏమి ప్రభావము లేదని తెలిసింది మరియు ఆహారములో ప్రోటీన్ ను నియంత్రించడము కూడా ప్రీఎక్లంప్సియాను పెంచినట్లుగా ఏమి లేదు.[29] ప్రోటీన్ లేదా కాలోరీ లు లోపలికి తీసుకోవడము అనేది మావిని కానీ నొప్పిని కాని ప్రభావితం చేసేటట్లుగా ఏమీ నిర్మాణము లేదు.

ప్రీఎక్లంప్సియా పై విటమిన్ C మరియు E వంటి యాంటి ఆక్సిడెంట్ల ప్రభావము ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చేసిన అధ్యయనములలో ఏమీ ప్రభావము లేదని తేలింది.[30] ఏది ఏమైనప్పటికీ, డాక్టర్ పడయట్టే మరియు లెవిన్ లు NIH తో ఈ అధ్యయనములలో వాటి వాడుక గెలిచేలా ఉన్న చాలా ముఖ్య విషయములను పట్టించుకోనందుకు విమర్శించాడు.[31]

ప్రీఎక్లంప్సియా రావడానికి విటమిన్ D యొక్క లోపము ఒక కారణము కావచ్చును[32] మరియు తక్కువ కాల్షియం ఉన్న స్త్రీలకు కాల్షియంను బయట నుండి ఇవ్వడం అనేది ప్రీఎక్లంప్సియా విషయములో పని చేయలేదు కానీ కాలి నరములలో వచ్చే భయంకరమైన నొప్పి తగ్గు ముఖము పడుతున్నట్లుగా గమనించారు.[33] సెలేనియం తక్కువగా ఉండడం అనేది ప్రీఎక్లంప్సియా ఎక్కువగా రావడానికి ఒక కారణము అవుతుంది.[34][35] మరే ఇతర విటమిన్ అయినా కొంత ముఖ్య భూమిక పోషించవచ్చు.[36]

యాస్ప్రిన్ ను అనుబంధముగా ఇవ్వడము[మార్చు]

యాస్ప్రిన్ ను అనుబంధముగా ఇవ్వడము అనేది ఇంకా మోతాదు,సమయము మరియు ఎవరికి ఇవ్వవచ్చు అనే విషయము పై పరిశోధన స్థాయిలోనే ఉంది మరియు కొంత మంది స్త్రీలలో కొంతవరకు నివారణ ఉపాయముగా పనిచేస్తుంది; ఏది ఏమైనప్పటికీ, యాస్ప్రిన్ పై కావలసినంత పరిశోధన జరిగింది మరియు ఫలితములు అంతగా ఆశాజనకముగా లేవు.[37]

వ్యాయామం[మార్చు]

వ్యాయామమును[38] కానీ, పూర్తిగా విశ్రాంతిని కాని[39] ప్రీఎక్లంప్సియా యొక్క నివారణ ఉపాయముగా తెలపడానికి తగినంత ఆధారములు లేవు.

తండ్రి తరఫున ఉన్న ఓర్చుకునే శక్తిని ప్రవేశపెట్టడము[మార్చు]

చాలా అధ్యయనములలో స్త్రీ యొక్క వ్యాధి నిరోధక శక్తికి, ఆమెలో ఉన్న బిడ్డ మరియు మాయలో ఉన్న తండ్రి జన్యువులు సవాలు విసురుతాయి అని తెలుస్తోంది.[9][40] ఈ వాదము పై ఇంకా పరిశోధన చేసిన తరువాత, [41]పరిశోధకులు ఆ స్త్రీ తన సహచరుని వీర్యమును గర్భము ధరించడానికి ఎంత కాలము ముందు నుంచి భరిస్తూ వచ్చింది అనే విషయము పై విస్తృతముగా పరిశోధన చేస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఒబేస్ట్రీస్ అండ్ గైనకాలజీ లో ప్రచురించబడిన ఒక అధ్యయనము తెలిపిన వివరముల ప్రకారము వందల మంది స్త్రీలలో "గర్భము ధరించడానికి ముందుగా తన సహచరునితో కొద్ది కాలముగా మాత్రమే సంభోగములో పాల్గొంటూ(నాలుగు నెలల కంటే తక్కువ సమయముగా) మరియు గర్భ నియంత్రణకు పై తొడుగులు వాడే వారికి, సహచరునితో దాదాపు సంవత్సరము పాటుగా సంభోగములో పాల్గొంటూ వచ్చిన స్త్రీకు ప్రీఎక్లంప్సియా వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది." అని తెలుస్తోంది.[42] ఏది ఏమైనప్పటికీ, 2004లో జరిగిన ఒక అధ్యయనము యొక్క ఫలితముల ప్రకారము ఈ వాదన పూర్తిగా సరైనది అని ఇంకా తెల్చలేము. ఈ అధ్యయనమును కొంచెం సర్ది మరియు విభాగములుగా చేసిన తరువాత గర్భ నిరోధమునకు పై తొడుగులు వాడడము అనేది ప్రీఎక్లంప్సియా పై దాని ప్రభావమును తీసివేసింది, రెండు విభాగములలో ప్రీఎక్లంప్సియా ఒక లానే ఉంది.[43] ఈ అధ్యయనములో కావలసిన విధముగా వివరములను మలుచుకున్నారు అనే విమర్శ ఉన్నప్పటికీ, సహచరుని వీర్యమును భరించడానికి ముందు కొంత ప్రభావము ఉంటుంది అని తెలుపుతోంది కాబట్టి అది కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది.

సహచరుని వీర్యమును గ్రహిస్తూ ఉండడం అనేది ప్రీఎక్లంప్సియాను చాలా వరకు తగ్గిస్తుంది, ఎందుకంటే ఈ వీర్యములోని చాలా వ్యాధి నిరోధక అంశములను అప్పటికే గ్రహించడం అలవాటు అయి ఉంటుంది.[44][45]

చాలా కాలము ఒకే పురుషునితో శారీరిక సంబంధము కలిగి ఉండడము మరియు అతని బిడ్డకే తల్లి అవ్వడము అనేది ఒక స్త్రీ కు ప్రీఎక్లంప్సియా నుంచి పరిరక్షణ కల్పిస్తుంది.[42][45] అంతకు చాలా ముందుగా జరిగిన ఒక అధ్యయనము ఇలా తెలుపుతుంది, "ప్రీఎక్లంప్సియా అనేది తోలిసారి గర్భం ధరించినప్పుడు వచ్చే ఒక జబ్బు అయినప్పటికీ, సహచరుని మార్చడం వలన ఒకేలా వచ్చే అవకాశము తగ్గుతుంది."[46] ఈ అధ్యయనము చాలా మంది పురుషులతో సంభోగములో పాల్గొనే స్త్రీలకు దాని వలన జబ్బులు రాకుండా ఉండడానికి కండోమ్ వాడమని సలహా ఇస్తుంది, "గర్భం ధరించాలి అనుకున్నప్పుడు ముందుగా కొంత కాలము వీర్యమును భారించడము అనేది ప్రీఎక్లంప్సియాకు నివారణ ఉపాయముగా పని చేస్తుంది."[46]

వేరే చాలా అధ్యయనములు తమ సహచారుని రక్తము ఎక్కించుకున్నవారు, చాలా కాలము పై తొడుగులు లేకుండా శారీరిక సంబంధము కలిగి ఉన్నవారు మరియు రోజు అంగ చూషణ చేసేవారికి[47][48] ప్రీఎక్లంప్సియా వచ్చే అవకాశములు తక్కువ అని తేల్చారు, ఒక అధ్యయనము "పిండము లోని HLAమాలిక్యుల్స్ లోకి తండ్రి యొక్క అలోజేనిక్ ఓర్చుకునే శక్తిని ఇంజెక్ట్ చేయడం ముఖ్యము అని తేల్చారు." ఇలా ఉండడమునకు సంబంధించి సేకరించిన సమాచారము ప్రకారము "అది బలముగా సమర్ధించబడినది మరియు ముఖ్యముగా అంగ చూషణ చేసినప్పుడు వీర్యము నుండి కరిగే HLAఆ ఓర్పును వీరికి బదిలీ చేస్తుంది".[48]

వేరే అధ్యయనములు ఎలుకల పునరుత్పత్తి మార్గము పై వీర్య ప్రభావమును పరిశోధించాయి మరియు "వీర్యమును పంపించడము వాటి పునరుత్పత్తి మార్గములో నొప్పిని కలిగించాయి"[49] అని తేల్చారు మరియు "తండ్రికి చెందిన యాంటిజెన్ లను ప్రవేశ పెట్టడము మరియు బిడ్డ పై ప్రభావము చూపిస్తాయి" అని తెలిసింది. అలాంటి విషయము పై ఆ తరువాత వరుసగా జరిగిన ఒక అధ్యయనముల పరంపర ఆడ ఎలుకలలో వీర్యమును తీసుకోవడము వలన పరిస్థితులకు తట్టుకునేలా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అన్న వాదనను సమర్ధిస్తుంది, TGF-Beta తగ్గితే ఆడవాటిలో గర్భ విచ్చేదము జరుగుతుంది అని మరియు మగవారిలో నపుంసకత్వము వస్తుంది అని కూడా తెలిపాయి.

ఈ వాదన ప్రకారము, పిండము మరియు మావి కూడా తండ్రి జన్యువులకు చెందిన వేరే ప్రోటీన్ లను కలిగి ఉంటాయి, కానీ,తరచుగా తండ్రి వీర్యమును భరిస్తూ ఉండడం అనేది ఆ ప్రోటీన్ లను తట్టుకునే శక్తిని కలిగిస్తుంది మరియు సరిగా గర్భము దాల్చడానికి వీలు కలిపిస్తుంది, ఈ పద్ధతి ఈ వీర్యములోని 93 రకముల వ్యాధి నిరోధక విషయములు ఉన్నట్లుగా చక్కగా తెలిపింది.[9][40]

స్త్రీ కు తన బిడ్డ తండ్రి జన్యువుల పట్ల వ్యాధి నిరోధక వ్యవస్థ నుండి వ్యతిరేకత ఎదురు అవ్వకూడదు అనే విషయము అర్ధం అయిన తరువాత, చాలా మంది డచ్ సంతాన బయలజిస్ట్ లు ఈ పరిశోధనను మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళే పనికి పూనుకున్నారు. మానవుని వ్యాధి నిరోధక వ్యవస్థ నోటి ద్వారా లోపలి వచ్చిన వాటికి అంతగా వ్యతిరేకత చూపదు అనే నిజమును బాగా దృష్టిలో పెట్టుకుని, డచ్ పరిశోధకులు ఒక అధ్యయనముల పరంపరను కొనసాగించి స్త్రీలు నోటి ద్వారా అంగ చూషణ చేయడం ద్వారా తన సహచరుని వీర్యమును మింగితే, దాని వలన ప్రీఎక్లంప్సియా వచ్చే అవకాశము బాగా తగ్గిపోతుంది అని తేల్చారు.[47][48][50][51][52][53] ఈ పరిశోధకులు స్త్రీ సంభోగములో ఏ రకముగా అయినా సరే తన సహచరుని వీర్యమును కలవడము అనేది ఆమెకు గర్భం ధరించినప్పుడు వచ్చే అనేక సమస్యల నుంచి ముక్తి కల్పిస్తాయని తేల్చారు,"వ్యాధి నిరోధక శక్తి ఓర్చుకునే తత్వము" అనేది ఎక్కువగా నోటి ద్వారా వీర్యమును తీసుకోవడము మరియు మూత్రనాళము ద్వారా తీసుకోవడము అనే ద్వారా వస్తుంది.[48][50] కొన్ని అధ్యయనములు కొన్ని విషయములను పదే పదే తెలిపాయి, వాటిలో స్త్రీలు అంగ చూషణ చేయడము మరియు ఎక్కువగా సంభోగములో పాల్గొనడము మరియు వీర్యమును మింగడము వంటివి ఎక్కువగా చేయడము వంటివి ఉన్నాయి, ఇంకా పరిశోధకులు "ఈ వివరములు ఇంకా అసలు వాదమును బాగా సమర్ధిస్తున్నాయి" అని తెలిపారు,ఈ అధ్యయనములలో తరచూ వీర్యముతో సంబంధము కలిగి ఉండడము తల్లి కాబోతున్నప్పుడు కావలసిన "వ్యాధి నిరోధక ఓర్పు" రావడానికి మరియు చక్కటి గర్భం రావడానికి, ఎదగడానికి సహాయము చేస్తుంది అని తెలుస్తోంది.[45][50]

యునివర్సిటీ ఆఫ్ అడేలైద్ కు చెందిన ఒక సమూహము గర్భ విచ్చిత్తి జరిగిన లేదా ప్రీఎక్లంప్సియా వచ్చిన గర్భములకు కారణమైన పురుషుల వీర్యములో TGF-Beta వంటి రోగ నిరోధక శక్తులు లేవు అని తేల్చారు. ఈ సమూహము కొంత మంది పురుషులను "హానికారకమైన పురుషులు" అని తేల్చింది, వీరు చాలా సార్లు గర్భమునకు కారణము అవుతారు కానీ అది ప్రీఎక్లంప్సియాగా కానీ లేదా విచ్చిత్తికి కానీ దారి తీస్తుంది.[45] వేరే విషయములలో, చాలా మంది "హానికారకమైన పురుషులలో" వారి సహచరులలో వ్యాధి నిరోధక వ్యవస్థను శాంత పరచడానికి కావలసిన భాగములు లేవు.[54]

వ్యాధి నిరోధక వ్యవస్థ పరిపాలన[మార్చు]

ప్రీఎక్లంప్సియాకు వ్యాధి నిరోధక వ్యవస్థ ఒక కారణము అన్న విషయము అంగీకరించబడిన తరువాత, మరల మరలా ప్రీఎక్లంప్సియా బారినపడే స్త్రీలలో ,గర్భ విచ్చిత్తి జరిగే స్త్రీలలో లేదా టెస్ట్ ట్యూబ్ లలో ఫలదీకరణము కూడా జరగక పోవడము వంటివి జరిగినప్పుడు TGF-betaవంటి వ్యాధి నిరోధక విషయములను తీసుకోవలసి వస్తుంది, వాటితో పాటుగా తండ్రికి సంబంధించిన ప్రోటీన్లను నోటి ద్వారా, నాలుక ద్వారా లేదా సంభోగములో పాల్గొనే ముందుగా జననంగాముల గోడల పై జెల్లీలు వ్రాసుకోవడము ద్వారా అయినా సరే తీసుకోవలసి ఉంటుంది.[45]

2006లో, మానవులు వాడుకునేలా TGF-Beta ను కలిగిన ఒక జెల్ ను యునివర్సిటీ ఆఫ్ అడేలైద్ కు చెందిన పరిశోధకులు తయారు చేసారు.[55] ఆ తరువాత, TGF-Beta3 పై పేటెంట్ ను పొందిన గ్రోపెప్ సంస్థ ఎలుకలలో గర్భస్రావము /1} సగము పడిపోయింది అని పరిశోధన ద్వారా నిరూపించారు. ఆ తరువాత గ్రోపెప్ ప్రచురించిన వివరముల ప్రకారము. "దాదాపు 50% వరకు గర్భస్రావములు హేతువాదమునకు సంబంధించిన తప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ కారణము అని తెలిపారు."[56] వారి మందు,PV903 వచ్చేసి ""పిండమునకు సంబంధించిన వ్యాధి నిరోధక వ్యవస్థ వలన తరచూ గర్భ స్రావములు జరుగుతున్న వారికొరకు నిర్దేశించబడినది, దీనికి ప్రస్తుతము వైద్యము ఏదీ అందుబాటులో లేదు." [56]జననంగాములపై రాసుకునే జెల్లీకు సంబంధించిన మొదటి స్టేజ్ క్లినికల్ ట్రయల్ లు సఫలీకృతము అయ్యాయి, కానీ కొన్ని వ్యాధి నిరోధక కణములను పెంచడంలో సఫలము కాలేదు,అవి ఆ మందు భద్రమైనది అని నిరూపించాయి,ఇది ఇమ్మ్యునోలాజికల్ సంవేద్యీకరణము జరగకుండా చూడడానికి చాలా అవసరము.[56][57] ఆ తరువాతి కాలములో ఈ అధ్యయనములు వీర్యములో ఉన్న ముఖ్యమైన వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రభావితము చేయగలిగిన అంశములను కనుగొనలేక పోయాయని విమర్శించారు,ఈ అంశములు కలిసి పనిచేస్తాయి మరియు తండ్రి నుంచి వచ్చిన ప్రోటీన్లను స్త్రీలో వచ్చిన వాటిగా మారుస్తాయి, మరియు దాని వలన గర్భం వచ్చేలా చూస్తాయి, ఆ తరువాత దానిని రోగ నిరోధక వ్యవస్థ అంగీకరించేలా(వేరే వాటిని) కూడా చూస్తాయి మరియు గర్భ ధారణా సమయము మొత్తము పిండమును రక్షిస్తాయి. గ్రోపెప్ ఆ తరువాత బయోటెక్నాలజీలో పెద్ద సంస్థ అయిన నోవోజైమ్స్ లో కలిసి పోయింది. అప్పటి నుంచి PV903 మందు తయారీ నిలిపివేయబడినది.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 డ్రిఫ్ JO, మగోవాన్ (eds). క్లినికల్ అబ్స్టారిక్స్ అండ్ గైనకాలజీ , చాప్టర్ 39, pp 367-370. ISBN 0-07-223174-2
 2. "Hypertension - Validations - Pregnancy". microlife.com. 
 3. "MATERNITY GUIDE - Labor & Delivery". Retrieved 2010-01-02. 
 4. "Preeclampsia and High Blood Pressure During Pregnancy : University of Michigan Health System". Retrieved 2010-01-02. 
 5. రాబిన్స్ అండ్ కొట్రాన్,పాథలాజికల్ బేసిస్ ఆఫ్ డిసీజ్,7th ed .
 6. Hjartardottir S, Leifsson BG, Geirsson RT, Steinthorsdottir V (2004). "Paternity change and the recurrence risk in familial hypertensive disorder in pregnancy". Hypertension in Pregnancy 23 (2): 219–25. doi:10.1081/PRG-120037889. PMID 15369654. 
 7. Zhang J (July 2007). "Partner change, birth interval and risk of pre-eclampsia: a paradoxical triangle". Paediatric and Perinatal Epidemiology 21 (Suppl 1): 31–5. doi:10.1111/j.1365-3016.2007.00835.x. PMID 17593195. 
 8. Munjuluri N, Lipman M, Valentine A, Hardiman P, Maclean AB (November 2005). "Postpartum eclampsia of late onset". BMJ 331 (7524): 1070–1. doi:10.1136/bmj.331.7524.1070. PMC 1283194. PMID 16269495. 
 9. 9.0 9.1 9.2 Burne, Jerome (2006-01-30). "Give Sperm a Fighting Chance". The Times. Retrieved 2007-11-16. [dead link]
 10. Moffett A, Hiby SE (April 2007). "How Does the maternal immune system contribute to the development of pre-eclampsia?". Placenta 28 (Suppl A): S51–6. doi:10.1016/j.placenta.2006.11.008. PMID 17292469. 
 11. "Immune system 'causes miscarriage'". BBC News. 2000-01-20. Retrieved 2007-11-26. 
 12. Courtney Reynolds, MD, William C. Mabie, MD, & Baha M. Sibai, MD (2006). "Preeclampsia". Pregnancy - Hypertensive Disorders. Armenian Medical Network. Retrieved 2006-11-23. 
 13. Jun Wu, Cizao Ren, Ralph J. Delfino, Judith Chung, Michelle Wilhelm, & Beate Ritz (2009). "Association Between Local Traffic-Generated Air Pollution and Preeclampsia and Preterm Delivery in the South Coast Air Basin of California" (PDF). Environmental Health Perspectives. Archived from the original (PDF) on 2009-07-19. Retrieved 2009-07-05. 
 14. "Excess Weight Raises Pregnancy Risks". Medline Plus. 2010. Retrieved 2010-02-15. [dead link]
 15. 15.0 15.1 Laresgoiti-Servitje E, Gómez-López N, Olson DM (April 2010). "An immunological insight into the origins of pre-eclampsia". Hum Reprod Update 16 (5): 510–24. doi:10.1093/humupd/dmq007. PMID 20388637. 
 16. Maynard SE, Min JY, Merchan J et al. (March 2003). "Excess placental soluble fms-like tyrosine kinase 1 (sFlt1) may contribute to endothelial dysfunction, hypertension, and proteinuria in preeclampsia". The Journal of Clinical Investigation 111 (5): 649–58. doi:10.1172/JCI17189. PMC 151901. PMID 12618519. 
 17. Venkatesha S, Toporsian M, Lam C et al. (June 2006). "Soluble endoglin contributes to the pathogenesis of preeclampsia". Nature Medicine 12 (6): 642–9. doi:10.1038/nm1429. PMID 16751767. 
 18. Xiong Y, Liebermann DA, Tront JS et al. (September 2009). "Gadd45a stress signaling regulates sFlt-1 expression in preeclampsia". Journal of Cellular Physiology 220 (3): 632–9. doi:10.1002/jcp.21800. PMID 19452502. 
 19. "Preeclampsia-Eclampsia". Diagnosis and management of pre-eclampsia and eclampsia. Armenian Medical Network. 2003. Retrieved 2005-11-23. 
 20. Douglas KA, Redman CW (November 1994). "Eclampsia in the United Kingdom". BMJ 309 (6966): 1395–400. PMC 2541348. PMID 7819845. 
 21. Koopmans, CM; Van Pampus, MG; Groen, H; Aarnoudse, JG; Van Den Berg, PP; Mol, BW (2009). "Accuracy of serum uric acid as a predictive test for maternal complications in pre-eclampsia: bivariate meta-analysis and decision analysis.". European journal of obstetrics, gynecology, and reproductive biology 146 (1): 8–14. doi:10.1016/j.ejogrb.2009.05.014. PMID 19540647. 
 22. రాడ్జర్, AJOG, 2008
 23. Janakiraman V, Gantz M, Maynard S, El-Mohandes A (June 2009). "Association of cotinine levels and preeclampsia among African-American women". Nicotine Tob. Res. 11 (6): 679–84. doi:10.1093/ntr/ntp049. PMC 2688602. PMID 19395687. 
 24. Jeyabalan A, Powers RW, Durica AR, Harger GF, Roberts JM, Ness RB (August 2008). "Cigarette smoke exposure and angiogenic factors in pregnancy and preeclampsia". Am. J. Hypertens. 21 (8): 943–7. doi:10.1038/ajh.2008.219. PMC 2613772. PMID 18566591. 
 25. Wide-Swensson, DH; Ingemarsson, I; Lunell, NO; Forman, A; Skajaa, K; Lindberg, B; Lindeberg, S; Marsàl, K; Andersson, KE (1995). "Calcium channel blockade (isradipine) in treatment of hypertension in pregnancy: a randomized placebo-controlled study.". American journal of obstetrics and gynecology 173 (3 Pt 1): 872–8. doi:10.1016/0002-9378(95)90357-7. PMID 7573260. 
 26. PRITCHARD JA (February 1955). "The use of the magnesium ion in the management of eclamptogenic toxemias". Surgery, Gynecology & Obstetrics 100 (2): 131–40. PMID 13238166. 
 27. కంపేర్ డిస్క్రిప్షన్స్ ఇన్ 1977 బిట్వీన్ ఏ బ్రిటిష్ అండ్ అమెరికన్ పేపర్.
  * Hibbard BM, Rosen M (January 1977). "The management of severe pre-eclampsia and eclampsia". British Journal of Anaesthesia 49 (1): 3–9. doi:10.1093/bja/49.1.3. PMID 831744. 
  * Andersen WA, Harbert GM (October 1977). "Conservative management of pre-eclamptic and eclamptic patients: a re-evaluation". American Journal of Obstetrics and Gynecology 129 (3): 260–7. PMID 900196. 
 28. The Magpie Trial Follow Up Study Management Group; The Magpie Trial Follow Up Study Collaborative Group (March 2004). "The Magpie Trial follow up study: outcome after discharge from hospital for women and children recruited to a trial comparing magnesium sulphate with placebo for pre-eclampsia [ISRCTN86938761]". BMC Pregnancy and Childbirth 4 (1): 5. doi:10.1186/1471-2393-4-5. PMC 416479. PMID 15113445. 
 29. Kramer MS, Kakuma R (2003). "Energy and protein intake in pregnancy". Cochrane Database of Systematic Reviews (4): CD000032. doi:10.1002/14651858.CD000032. PMID 14583907. 
 30. Rumbold AR, Crowther CA, Haslam RR, Dekker GA, Robinson JS (April 2006). "Vitamins C and E and the risks of preeclampsia and perinatal complications". The New England Journal of Medicine 354 (17): 1796–806. doi:10.1056/NEJMoa054186. PMID 16641396. 
 31. Padayatty SJ, Levine M (September 2006). "Vitamins C and E and the prevention of preeclampsia". The New England Journal of Medicine 355 (10): 1065; author reply 1066. doi:10.1056/NEJMc061414. PMID 16957157. 
 32. Bodnar LM, Catov JM, Simhan HN, Holick MF, Powers RW, Roberts JM (September 2007). "Maternal vitamin D deficiency increases the risk of preeclampsia". The Journal of Clinical Endocrinology and Metabolism 92 (9): 3517–22. doi:10.1210/jc.2007-0718. PMID 17535985. 
 33. Villar J, Abdel-Aleem H, Merialdi M et al. (March 2006). "World Health Organization randomized trial of calcium supplementation among low calcium intake pregnant women". American Journal of Obstetrics and Gynecology 194 (3): 639–49. doi:10.1016/j.ajog.2006.01.068. PMID 16522392. 
 34. Rayman MP, Bode P, Redman CW (November 2003). "Low selenium status is associated with the occurrence of the pregnancy disease preeclampsia in women from the United Kingdom". American Journal of Obstetrics and Gynecology 189 (5): 1343–9. doi:10.1067/S0002-9378(03)00723-3. PMID 14634566. 
 35. Vanderlelie J, Venardos K, Perkins AV (November 2004). "Selenium deficiency as a model of experimental pre-eclampsia in rats". Reproduction 128 (5): 635–41. doi:10.1530/rep.1.00260. PMID 15509710. 
 36. Rumiris D, Purwosunu Y, Wibowo N, Farina A, Sekizawa A (2006). "Lower rate of preeclampsia after antioxidant supplementation in pregnant women with low antioxidant status". Hypertension in Pregnancy 25 (3): 241–53. doi:10.1080/10641950600913016. PMID 17065044. 
 37. Duley L, Henderson-Smart DJ, Knight M, King JF (2004). "Antiplatelet agents for preventing pre-eclampsia and its complications". Cochrane Database of Systematic Reviews (1): CD004659. doi:10.1002/14651858.CD004659. PMID 14974075. 
 38. Meher S, Duley L (2006). "Exercise or other physical activity for preventing pre-eclampsia and its complications". Cochrane Database of Systematic Reviews (2): CD005942. doi:10.1002/14651858.CD005942. PMID 16625645. 
 39. Meher S, Duley L (2006). "Rest during pregnancy for preventing pre-eclampsia and its complications in women with normal blood pressure". Cochrane Database of Systematic Reviews (2): CD005939. doi:10.1002/14651858.CD005939. PMID 16625644. 
 40. 40.0 40.1 "Sex Primes Women for Sperm". BBC News. 2002-02-06. Retrieved 2007-11-19. 
 41. Waite LL, Atwood AK, Taylor RN (May 2002). "Preeclampsia, an implantation disorder". Reviews in Endocrine & Metabolic Disorders 3 (2): 151–8. doi:10.1023/A:1015411113468. PMID 12007292. 
 42. 42.0 42.1 Einarsson JI, Sangi-Haghpeykar H, Gardner MO (May 2003). "Sperm exposure and development of preeclampsia". American Journal of Obstetrics and Gynecology 188 (5): 1241–3. doi:10.1067/mob.2003.401. PMID 12748491. 
 43. Ness RB, Markovic N, Harger G, Day R (2004). "Barrier methods, length of preconception intercourse, and preeclampsia". Hypertension in Pregnancy 23 (3): 227–35. doi:10.1081/PRG-200030293. PMID 15617622. 
 44. Sarah Robertson. "Research Goals --> Role of seminal fluid signalling in the female reproductive tract". 
 45. 45.0 45.1 45.2 45.3 45.4 Robertson SA, Bromfield JJ, Tremellen KP (August 2003). "Seminal 'priming' for protection from pre-eclampsia-a unifying hypothesis". Journal of Reproductive Immunology 59 (2): 253–65. doi:10.1016/S0165-0378(03)00052-4. PMID 12896827. 
 46. 46.0 46.1 Dekker GA, Robillard PY, Hulsey TC (June 1998). "Immune maladaptation in the etiology of preeclampsia: a review of corroborative epidemiologic studies". Obstetrical & Gynecological Survey 53 (6): 377–82. doi:10.1097/00006254-199806000-00023. PMID 9618714. 
 47. 47.0 47.1 Bonney EA (December 2007). "Preeclampsia: a view through the danger model". Journal of Reproductive Immunology 76 (1-2): 68–74. doi:10.1016/j.jri.2007.03.006. PMC 2246056. PMID 17482268. 
 48. 48.0 48.1 48.2 48.3 Koelman CA, Coumans AB, Nijman HW, Doxiadis II, Dekker GA, Claas FH (March 2000). "Correlation between oral sex and a low incidence of preeclampsia: a role for soluble HLA in seminal fluid?". Journal of Reproductive Immunology 46 (2): 155–66. doi:10.1016/S0165-0378(99)00062-5. PMID 10706945. 
 49. Johansson M, Bromfield JJ, Jasper MJ, Robertson SA (June 2004). "Semen activates the female immune response during early pregnancy in mice". Immunology 112 (2): 290–300. doi:10.1111/j.1365-2567.2004.01876.x. PMC 1782486. PMID 15147572. 
 50. 50.0 50.1 50.2 Fox, Douglas (2002-02-09). "Gentle Persuasion". The New Scientist. Retrieved 2007-06-17. 
 51. Mattar R, Soares RV, Daher S (February 2005). "Sexual behavior and recurrent spontaneous abortion". International Journal of Gynaecology and Obstetrics 88 (2): 154–5. doi:10.1016/j.ijgo.2004.11.006. PMID 15694097. 
 52. Danielle Cavallucci, and Yvonne K. Fulbright (2008). Your Orgasmic Pregnancy. Alameda, CA: Hunter House Inc. Publishers. p. 90. ISBN 0897935012.  http://books.google.com/books?id=othN_A1w2BYC&pg=PA90&lpg=PA90
 53. Jelto Drenth (2005). The Origin of the World. London: Reaktion Books. pp. 114–115. ISBN 1861892101. 
 54. Dekker G (2002). "The partner's role in the etiology of preeclampsia". Journal of Reproductive Immunology 57 (1-2): 203–15. doi:10.1016/S0165-0378(02)00039-6. PMID 12385843. 
 55. "రిప్రొడక్టివ్ హెల్త్ రీసెర్చర్స్ డెవలప్ ఇన్ఫెర్టిలిటీ డ్రగ్ టెక్నాలజీ," థర్స్ డే , 16 ఫిబ్రవరి 2006, http://www.adelaide.edu.au/news/news9761.html
 56. 56.0 56.1 56.2 న్యూస్ రిలీజ్; 14 సెప్టెంబర్ 2006; గ్రోపెప్ కంప్లీట్స్ ఫేజ్ 1a ఇన్ఫెర్టిలిటీ ట్రయల్ ; http://web.archive.org/web/20070829201701/http://www.bioinnovationsa.com.au/resources/123/GroPep%20Press%20Release%20(Sep-06)%20140906.pdf
 57. "గ్రోపెప్ ట్రయల్ మిక్స్డ్"; సెప్టెంబర్ 15, 2006; https://archive.is/20121230131256/www.news.com.au/adelaidenow/story/0,22606,20413971-913,00.html

బాహ్య లింకులు[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

 • ఏ మామ్ అండ్ డాడ్స్ గైడ్ టు ప్రీఎక్లమ్ప్సియా బై డేవిడ్ పాపన్ద్రియాస్

మూస:Pathology of pregnancy, childbirth and the puerperium