Coordinates: 28°38′17″N 77°17′37″E / 28.6380°N 77.2936°E / 28.6380; 77.2936

ప్రీత్ విహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రీత్ విహార్
ఉప జిల్లా
ప్రీత్ విహార్ is located in ఢిల్లీ
ప్రీత్ విహార్
ప్రీత్ విహార్
భారతదేశంలో ఢిల్లీ స్థానం
Coordinates: 28°38′17″N 77°17′37″E / 28.6380°N 77.2936°E / 28.6380; 77.2936
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లాతూర్పు ఢిల్లీ జిల్లా
Government
 • Bodyఢిల్లీ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారహిందీ, ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
పిన్
110092
ప్రాంతీయ ఫోన్‌కోడ్91-11-2201xxxx
సమీప నగరంఘజియాబాద్

ప్రీత్ విహార్, భారతదేశ, కేంద్రపాలిత భూభాగమైన ఢిల్లీలోని, తూర్పుఢిల్లీ జిల్లా 3 పరిపాలనా ఉపవిభాగాలలో ఇది ఒకటి.[1] ఇది తూర్పు ఢిల్లీ జిల్లా ముఖ్య పట్టణం. ఒక నాగరిక నివాస ప్రాంతం.ప్రీత్ విహార్ వికాస్ మార్గంలో మెట్రో స్టేషన్ ఉంది. దీని సమీపంలో పెద్ద వాణిజ్య సముదాయం ఉంది.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం తూర్పు జిల్లాకు చెందిన ప్రీత్ విహార్ మొత్తం జనాభా 1,066,098. వీరిలో 568,086 మంది పురుషులు కాగా, 498,012 మంది మహిళలు ఉన్నారు. 2011 లో ప్రీత్ విహార్ నగర పరిధిలో మొత్తం 228,414 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రీత్ విహార్ సగటు లింగ నిష్పత్తి 877.

2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం జనాభాలో 99.7% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 0.3% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 88.8% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 94.6%గా ఉంది ప్రీత్ విహార్ పట్టణ ప్రాంతం లింగ నిష్పత్తి 877 కాగా, గ్రామీణ ప్రాంతాలు 897 గా ఉన్నాయి.

0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 125276, ఇది మొత్తం జనాభాలో 12%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 66794 మగ పిల్లలు ఉండగా, 58482 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల లింగ నిష్పత్తి 876, ఇది ప్రీత్ విహార్ సగటు సెక్స్ రేషియో (877) కన్నా తక్కువ.అక్షరాస్యత రేటు 88.79%. పురుషుల అక్షరాస్యత రేటు 82.24%కాగా మహిళా అక్షరాస్యత రేటు 73.94%గా ఉంది.[1]

విస్తీర్ణం[మార్చు]

ప్రీత్ విహార్ ఢిల్లీలోని తూర్పు ఢిల్లీ జిల్లాలో ఒక తహసీల్ / బ్లాక్ (సిడి). 2011 భారత జనాభా లెక్కల సమాచారం ప్రకారం ప్రీత్ విహార్ బ్లాక్ ఉప-జిల్లా కోడ్ 00441. ప్రీత్ విహార్ మొత్తం వైశాల్యం 37 కిమీ², అందులో 0.27 కిమీ² గ్రామీణ ప్రాంతం కాగా, 36.42 కిమీ² పట్టణ ప్రాంతం.[2]

పట్టణం గురించి[మార్చు]

తూర్పు ఢిల్లీ జిల్లాలో, ప్రీత్ విహార్ ఉన్నతస్థాయి నివాస ప్రాంతం.ఢిల్లీ తూర్పు భాగంలో ఇది బాగా స్థిరపడిన వారు నివసించే కాలనీ,క న్నాట్ ప్లేస్ నుండి కొద్ది నిమిషాల దూరంలో కలిగిఉన్నఈ ప్రాంతం ఢిల్లీకి గుండెగా పరిగణించుతారు. ఈ ప్రాంతం శివ మందిరాలకు, దుకాణాలుకు, విద్యా సంస్థలకు మంచి పేరు పొందింది. ప్రీత్ విహార్ ప్రధాన రహదారిలో చాలా బ్యాంకులు,అగ్ర బ్రాండ్ల ఆభరణాల అందించే వాణిజ్య భవనాలు ఉన్నాయి.చాలా మంచి వసతిని అందించే నివాస భవనాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రీత్ విహార్లో బ్లాక్ ఎజి, నిర్మన్ విహార్, భారతి ఆర్టిస్ట్సు కాలనీ, మధుబన్ ఎన్క్లేవ్ ఉన్నాయి.ప్రీత్ విహార్‌లోని వాణిజ్య సముదాయాల ప్రదర్శనలలో వివిధరకాల ఫ్యాషన్ సేకరణలు లభిస్తాయి.అసంఖ్యాక రెస్టారెంట్లు, ఆహార పదార్థాలు లభించే వాణిజ్య భవనాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.చిన్న, పెద్ద షాపులు, పెద్ద పెద్ద మాల్సుతో నిండిన ఈ ప్రాంతం ఢిల్లీలోని ఉత్తమ వాణిజ్య నివాస కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ప్రీత్ విహార్ పట్టణ ప్రాంతాన్ని ఏడు విభాగాలుగా విభజించారు. వీటికి ఎ నుండి జి వరకు గల అక్షరాల పేర్లు పెట్టారు. వీటిలో 'జి' బ్లాక్ చాలా పెద్దది.ఇందులో సుమారు 365 నుండి 370 గృహాలు ఉన్నాయి.

మైలురాళ్ళు[మార్చు]

ప్రీత్ విహార్ ప్రాంతంలో కర్కార్దూమా జిల్లా కోర్టు, పిఎస్‌కె (పూర్వ సంస్కృత కేంద్రం), స్కోప్ టవర్, గుఫా వాలా మందిర్ (ఆలయం), దిగంబార్ జైన్ మందిర్, మహావీర్ స్వామి జైన్ మందిర్, పార్కు ఎండ్ మసీదు, వి 3 ఎస్ మాల్, మెట్రో స్టేషన్, ఎన్‌ఐఐటి కేంద్రం, మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ షోరూమ్ మొదలగునవి ఉన్నాయి.ప్రీత్ విహార్ పరిసరాల్లో మెట్రో హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి పేరుగడించిన సంస్థలు ఉన్నాయి.

స్థానికంగా అనేక కోచింగ్ కేంద్రాలు, భాషా సంస్థలు, కంప్యూటర్ సంస్థలు మొదలైనవి ఉన్నాయి.వీటిలో కెరీర్ లాంచర్, ఆల్డిన్ వెంచర్సు ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.ఆకాష్ ఇన్స్టిట్యూట్, అచీవర్స్ పాయింట్, ఎన్‌ఐఐటి, ఆప్టెక్, గిటార్‌మోంక్, ఫటెక్ మొదలగు సంస్థలు ఉన్నాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) భవనం ప్రీత్ విహార్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. యమునా నదికి అవతలి వైపున ఢిల్లీలోని శివారు ప్రాంతంలో నివసిస్తున్న సమాజానికి సేవ చేస్తున్న పాఠశాలలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

వివిధ ప్రాంతాలకు రవాణా సౌకర్యం[మార్చు]

ఆనంద్ విహార్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ISBT) దీనికి సమీప బస్ డిపో. ఇది సుమారు 4 కి.మీ.దూరంలో ఉంది. ప్రీత్ విహార్ మెట్రో స్టేషన్, దీనికి సమీపంలో ఉంది. ఇది ఢిల్లీలోని ఇతర అన్ని ప్రాంతాలను రవాణా ద్వారా కలుపుతుంది.

స్థలం ప్రీత్ విహార్ నుండి దూరం
ఐ.టి.ఒ 6కి.మీ. లేదా 3.8 మైళ్ళు
సి.పి 10కి.మీ. లేదా 6 మైళ్ళు
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 30కి.మీ. లేదా 18.5 మైళ్ళు
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ 10కి.మీ.
ఆనంద్ విహార్ 4కి.మీ. లేదా 2.5 మైళ్ళు

ప్రీత్ విహార్ వాణిజ్య సముదాయం[మార్చు]

ఇక్కడ చాలా షాపులు, కార్యాలయాలు కలిగి ఉన్నాయి. తూర్పు ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం, కొనుగోలు కోసం జరిగే ప్రధాన మార్కెట్లలో ఇది ఒకటి.ఈ సముదాయంలో ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్, కార్వీ వంటి అనేక స్టాక్ బ్రోకింగ్ యూనిట్లు ఉన్నాయి. కెరీర్ లాంచర్‌కు సొంత కార్యాలయం ఉంది. కొన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థలు, బిల్డర్లు, ప్రాపర్టీ డీలర్లు, గృహ రుణాల కోసం డిఎస్‌ఎ ఆస్తిపై రుణం, ఆపిల్ స్టోర్, సేవా కేంద్రం,ఎపిఎన్ ఐటి ఎక్స్‌పర్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ మొదలైనవి ఈ సముదాయంలో ఉన్నాయి,

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Preet Vihar Tehsil Population, Religion, Caste East district, Delhi - Census India". www.censusindia.co.in. Retrieved 2021-01-04.
  2. "List of Villages in Preet Vihar Tehsil | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-04.

వెలుపలి లంకెలు[మార్చు]