ప్రేమాభిషేకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమాభిషేకం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
శ్రీదేవి,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

ప్రేమాభిషేకం 1981లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

ప్రాచుర్యం, ప్రభావం[మార్చు]

ప్రేమాభిషేకం సినిమా తెలుగు సినిమాలపైన ఎంతో ప్రభావాన్ని చూపింది. ప్రేమాభిషేకం సినిమా కథ స్ఫూర్తిగా వెలువడ్డ సినిమాల్లో బొబ్బిలి సింహం వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి.[1]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • నా కళ్ళు చెబుతున్నాయి, నిను చూస్తున్నాయని. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం. పి. సుశీల. రచన: దాసరి నారాయణరావు.(అన్ని పాటలు)
  • ఆగదు ఏ నిముషము నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకమూ. శ్రీ పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం.
  • కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా . ఎస్ పి. బాలు. పి. సుశీల.
  • ఒక దేవుని గుడిలో ఒక దేవత .బాలు, సుశీల
  • వందనం, అభివందనం, నీ అందమే ఒక నందనం బాలు సుశీల
  • దేవీమౌనమా. ఎస్.పి.బాలు.పి సుశీల
  • తారలు దిగివచ్చిన వేళ.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల.

అవార్డులు[మార్చు]

చిత్ర విశేషాలు[మార్చు]

  1. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో 4 కోట్ల పైన షేర్ వసూల్ చేసిన మొదటి చిత్రం కాగా, మొత్తం 4.5 కోట్ల షేర్ వచ్చింది. 1987లోవచ్చిన పసివాడి ప్రాణం సినిమా ఆ రికార్డును క్రాస్ చేసింది.
  2. డైరెక్టుగా 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి సినిమా ఇది. షిఫ్టింగ్స్ తో కలిపి మొత్తం 43 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది.
  3. తెలుగు సినిమారంగంలో మొట్టమొదటి ప్లాటినం జూబ్లీ సినిమా, 75 వారాలు ఆడిన తొలి సినిమా కూడా ఇదే.
  4. 20 కేంద్రాల్లో 200 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు ఆడిన ఏకైక చిత్రం ఇది. 8 కేంద్రాలలో సంవత్సరంపాటు ఆడిన ఏకైక చిత్రమిది.
  5. 29 కేంద్రాల్లో 175 రోజులు ఆడి, 1979లో సమరసింహారెడ్డి సినిమా దాన్ని క్రాస్ చేసేవరకు ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది.
  6. ఒకే థియేటర్ లో 10 లక్షలు వసూల్ చేయడమే కష్టమైన ఆ రోజుల్లో 10 కేంద్రాల్లో 10 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డ్ సొంతం చేసుకుంది.
  7. ఒకే థియేటర్ లో 15 లక్షలు, 20 లక్షలు వసూల్ చేసిన తొలి సినిమా చరిత్ర సృష్టించింది.
  8. బెంగుళూరు నగరంలోని 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక సెంటర్ లో 46 లక్షలు వసూల్ చేసి కర్ణాటక రాష్ట్ర రికార్డ్ క్రియేట్ చేసింది.

మూలాలు[మార్చు]

  1. సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.