ప్రేమిక
Jump to navigation
Jump to search
ప్రేమిక | |
---|---|
నిర్మాత | శంకర్ వెంకట కృష్ణ లక్ష్మయ్య |
తారాగణం | తనీష్ శ్రుతి యుగళ్ కవిత గెటప్ శ్రీను |
ఛాయాగ్రహణం | రాహుల్ మాచినేని |
సంగీతం | దిలీప్ బండారి |
విడుదల తేదీ | 8 డిసెంబరు 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమిక 2017లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. దేశాల ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై శంకర్, వెంకట కృష్ణ, లక్ష్మయ్య నిర్మించిన ఈ సినిమాకు మహీంద్ర దర్శకత్వం వహించాడు. తనీష్, శ్రుతి యుగళ్, కవిత, రూపాలక్ష్మి, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 8న విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]కృష్ణ (తనీష్), తులసి (శ్రుతి యుగళ్) ఒకే ఊరిలో ఉంటారు, కృష్ణ తులసిని చూసి ఇష్టపడుతాడు. తులసి కూడా కొంతకాలం తరువాత కృష్ణను ప్రేమించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆ ఊరు సర్పంచ్ తమ్ముడు కృష్ణ చేతిలో చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న సర్పంచ్ తన తమ్ముడి చావుకు కారణం అయిన కృష్ణ పై పగ పెంచుకొని కృష్ణ ప్రేమించిన అమ్మాయిని అతడికి దూరం చేద్దాం అనుకుంటాడు. కృష్ణ సర్పంచ్ తమ్ముణ్ణి ఎందుకు చంపాడు ? తులసి కృష్ణ చివరికి ఒక్కటి అయ్యారా ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- తనీష్
- శ్రుతి యుగళ్
- కవిత
- గెటప్ శ్రీను
- వైభవ్ సూర్య
- మహేష్
- దేవా
- సూర్య
- శివ పార్వతి
- రవి వర్మ[3]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (2017). "Premika". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Samayam Telugu (8 December 2017). "ఒకే రోజు 4 సినిమాలు.. హిట్టుకొట్టేదెవరో!". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
- ↑ 123 TELUGU (19 August 2015). "'ప్రేమిక' మూవీ ప్రెస్‌మీట్ విశేషాలు". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)