ప్రేమికుల రోజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమికుల రోజు
ఇలా కూడా అంటారుసెయింట్ వాలంటైన్స్ డే
జరుపుకునే వాళ్ళుక్రైస్తవ సంస్కృతి
రకంChristian, cultural, multinational
ప్రాధాన్యతప్రేమికులు తమ ప్రేమలు వ్యక్తం చేస్తారు
తేదీఫిబ్రవరి 14
ఆచరణలుగ్రీటింగ్ కార్డులు ఇచ్చి పుచ్చుకోవడం,

ప్రేమికుల రోజు లేదా సెయింట్ వాలెంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జరుపుకునే సెలవుదినం. ఆంగ్ల భాష మాట్లాడే దేశాల్లో, వాలెంటైన్స్ కార్డులు పంపడం, పువ్వులు బహూకరించడం లేదా మిఠాయిలు ఇవ్వడం ద్వారా ప్రేమికులు ఒకరికిఒకరు ఈ రోజున ప్రేమను వ్యక్తపరుచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అసంఖ్యాక క్రైస్తవ మృతవీరుల్లో (మతం కోసం బలిఇవ్వబడిన వ్యక్తులు) ఇద్దరికి వాలెంటైన్ అనే పేరు ఉండటంతో ఈ సెలవుదినానికి కూడా ఇదే పేరు చేర్చబడింది. మధ్యయుగ కాలానికి చెందిన జెఫ్రే చౌసెర్ రచనల కారణంగా శృంగార ప్రేమతో ఈ రోజుకు అనుబంధం ఏర్పడింది, ఈ కాలంలోనే నాగరిక ప్రేమ సంప్రదాయం కూడా వృద్ధి చెందింది.

"వాలెంటైన్స్" రూపంలో ప్రేమ సందేశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ రోజుకు మరింత అనుబంధం ఉంది. హృదయాకృతులు, పావురాలు మరియు విల్లు, బాణం ధరించిన రెక్కలున్న క్యుపిడ్ (గ్రీకుల ప్రేమ దేవత పేరు, మన్మథుడు) బొమ్మలు ఆధునిక కాలంలో వాలెంటైన్ గుర్తులయ్యాయి. 19వ శతాబ్దం నుంచి, చేతితోరాసిన సందేశాలు ఇచ్చే సంప్రదాయం భారీ స్థాయిలో గ్రీటింగ్ కార్డ్‌ల తయారీకి మార్గం చూపింది.[1] గ్రేట్ బ్రిటన్‌లో పందొమ్మిదొవ శతాబ్దంలో వాలెంటైన్‌లను (ప్రేమ కానుకలను) పంపడం నాగరికమైంది, 1847లో ఈస్టర్ హౌలాండ్ అనే మహిళ మాసాచుసెట్స్‌లోని వర్సెస్టెర్‌లో ఉన్న తన ఇంటిలో బ్రిటీష్ నమూనాల్లో చేతితో వాలెంటైన్ కార్డులను తయారు చేసి విజయవంతమైన వ్యాపారాన్ని అభివృద్ధి పరిచారు. 19వ శతాబ్దపు అమెరికాలో వాలెంటైన్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి, ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువ వాలెంటైన్ కార్డులు ప్రేమ ప్రకటనలతో కాకుండా సాధారణ గ్రీటింగ్ కార్డులుగా తయారవుతున్నాయి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిగిలిన సెలవుదినాలను వ్యాపారాత్మకం చేసేందుకు ఇది భవిష్య సూచకమైంది.[2] వ్యాపారాత్మక సెలవుదినాల్లో ఒకదానిగా ఇది పరిగణించబడుతోంది.

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ వాలెంటైన్ కార్డులు పంపబడుతున్నట్లు U.S. గ్రీటింగ్ కార్డుల సంఘం అంచనా వేసింది, ఏడాదిలో క్రిస్మస్ తరువాత కార్డులు ఎక్కువగా పంపబడే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ రోజున మహిళల కంటే పురుషులు సగటున రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు సంఘం అంచనా వేసింది.[3] it is a great day

విషయ సూచిక

సెయింట్ వాలెంటైన్[మార్చు]

అసంఖ్యాక క్రైస్తవ మృతవీరుల్లో చాలా మందికి వాలెంటైన్ అనే పేరు ఉంది.[4] 1969 వరకు, కాథలిక్ చర్చి అధికారికంగా 11 వాలెంటైన్ డేలను గుర్తించింది.[ఆధారం చూపాలి] ఫిబ్రవరి 14న గౌరవించబడే వాలెంటైన్‌లు రోమ్‌కు చెందిన వాలెంటైన్ (Valentinus presb. m. Romae ) మరియు టెర్నీకి చెందిన వాలెంటైన్ (Valentinus ep. Interamnensis m. Romae ).[5] పురాతన రోమ్ నగరంలో పూజారిగా పనిచేసే రోమ్ వాలెంటైన్[6] AD 269 సమయంలో మతాచారాల కోసం బలిఇవ్వబడ్డాడు, అతడిని వయా ఫ్లామినియాలో సమాధి చేశారు. రోమ్‌లోని సెయింట్ ప్రాక్సెడ్ చర్చిలో[7] మరియు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న వైట్‌ఫ్రియర్ స్ట్రీట్ కార్మెలైట్ చర్చిలో అతని పునరావశేషాలు చూడవచ్చు.

AD 197 ప్రాంతంలో ఇంటెరమ్నా (ఆధునిక టెర్నీ) క్రైస్తవ మతపెద్ద అయిన టెర్నీ వాలెంటైన్[8] ఆరేలియన్ చక్రవర్తి మతోన్మాదానికి బలైనట్లు చెప్పబడుతోంది. అతడిని కూడా వయా ఫ్లామినియాలోనే సమాధి చేశారు, అయితే అతని అంత్యక్రియలు రోమ్ వాలెంటైన్‌ను సమాధి చేసిన ప్రదేశంలో జరగలేదు. అతని పునరావశేషాలను టెర్నీలోని సెయింట్ వాలెంటైన్ బసిలికా (Basilica di San Valentino )లో చూడవచ్చు.[9]

కాథలిక్ విజ్ఞాన సర్వస్వంలో ఫిబ్రవరి 14కు సంబంధించిన మృతవీరుల జాబితాలో వాలెంటైన్ పేరుతో మూడో సెయింట్ ప్రస్తావన కూడా ఉంది. మూడో వ్యక్తి, అనేక మంది అతని సహచరులతోపాటు ఆఫ్రికాలో మతాచారాల కోసం బలి ఇవ్వబడ్డాడు, అతని గురించి ఇతర వివరాలేవీ తెలియలేదు.[10]

వాస్తవానికి ప్రారంభ మధ్యయుగానికి చెందిన ఈ మృతవీరుల ఆత్మకథల్లో ఎవరికీ, ఎటువంటి ప్రేమసంబంధమైన అంశాలతో సంబంధం లేదు. పద్నాలుగొవ శతాబ్దంలో సెయింట్ వాలెంటైన్‌కు ప్రేమ సంబంధ అంశాలతో ముడిపెట్టబడిన సమయానికి రోమ్ వాలెంటైన్ మరియు టెర్నీ వాలెంటైన్ మధ్య విలక్షణతలు మరుగునపడ్డాయి.[11]

"సెయింట్ వాలెంటైన్‌కు సంబంధించి పురాతన జ్ఞాపకాలు ఉండటంతో, అతని జ్ఞాపకంగా జరుగుతున్న సెలవుదినాన్ని జరుపుకోవడంపై నిర్ణయాన్ని ప్రాంతీయ క్యాలెండర్‌లకు వదిలిపెట్టారు, అతని పేరు, అతను వయా ఫ్లామినియాలో ఫిబ్రవరి 14న సమాధి చేయబడినట్లు మాత్రమే వివరాలు తెలుస్తున్నాయి, దీనికి మించి అతనికి సంబంధించిన ఇతర వివరాలేవీ తెలియవు" కనుక 1969లో రోమన్ కాథలిక్ సెయింట్స్ క్యాలెండర్ పునఃపరిశీలన సందర్భంగా, ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్ యొక్క విందురోజును సాధారణ రోమన్ క్యాలెండర్‌ల నుంచి తొలగించారు, దీనిని (స్థానిక లేదా జాతీయ) క్యాలెండర్‌ల ఇష్టానికి వదిలిపెట్టారు.[12] సెయింట్ యొక్క పునరావశేషాలను గుర్తించిన బల్జాన్‌లో (మాల్టా) మరియు ప్రపంచవ్యాప్తంగా పాత, వాటికన్ II కాలానికి ముందు క్యాలెండర్‌ను పాటించే సంప్రదాయవాద కాథలిక్‌లు ఈ విందురోజును ఇప్పటికీ జరుపుకుంటున్నారు.

సెయింట్ వాలెంటైన్‌తోపాటు ప్రారంభ మధ్యయుగానికి సంబంధించిన ఆక్టా (ప్రసిద్ధవ్యక్తుల వివరాలు)ను బెడే సంగ్రహించి, Legenda Aureaలో కొంతమేర ప్రస్తావించారు.[13] ఈ నమూనా ప్రకారం, సెయింట్ వాలెంటైన్ క్రైస్తవుడిగా పీడించబడ్డట్లు ఉంది మరియు రోమన్ చక్రవర్తి క్లాడియస్ II అతడిని స్వయంగా విచారించినట్లు చెప్పబడుతోంది. వాలెంటైన్ విషయంలో మంత్రముగ్ధుడైన క్లాడియస్ ఉరిశిక్ష ఎదుర్కోవడానికి బదులుగా అతడిని రోమన్ బహుదేవతారాధన స్వీకరించాలని కోరాడు. వాలెంటైన్ అందుకు నిరాకరించడంతోపాటు, క్లాడియస్ చేత క్రైస్తవ మతం స్వీకరింపజేసేందుకు ప్రయత్నించాడు. ఈ కారణంగా, వాలెంటైన్ ఉరి తీయబడ్డాడు. వాలెంటైన్ ఉరిశిక్ష ఎదుర్కోవడానికి ముందు, అతని యొక్క చెరశాలాధిపతి కుమార్తెకు అంధత్వం పోగొట్టి అద్భుతం చేసినట్లు చెప్పబడింది.

Legenda Aurea ("గోల్డెన్ లెజెండ్" పేరుతో సెయింట్‌లు, ఇతర లౌకిక, ప్రసిద్ధ వ్యక్తుల ఆత్మకథలు ఉండే రచన) ఇప్పటికీ వాలెంటైన్‌కు ప్రేమ భావాలతో గల సంబంధం గురించి ఎటువంటి ఆధారాలను అందజేయడం లేదు, పూజారి అయిన వాలెంటైన్‌ను వర్ణించేందుకు ఆధునిక రోజుల్లో కాల్పనిక విజ్ఞానంతో ఒక అల్లికను సృష్టించారు, ఆ రోజుల్లో రోమ్ చక్రవర్తి క్లాడియస్ యువకులను వివాహితులు కాకుండా అడ్డుకునే ఉద్దేశంతో జారీ చేసిన అంగీకారయోగ్యం కాని చట్టాన్ని వాలెంటైన్ వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. వివాహితులు మంచి సైనికులు కాలేరని భావించిన చక్రవర్తి తన సైన్యాన్ని పెంచుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెబుతారు. అయితే వాలెంటైన్ యువకులకు రహస్యంగా వివాహాలు జరిపించాడు. ఇది క్లాడియస్‌కు తెలిసిపోవడంతో, అతను వాలెంటైన్‌ను చెరశాల పాలు చేశాడు. తనను ఉరితీసే ముందురోజు సాయంత్రం వాలెంటైన్ తాను ప్రేమించిన చెరశాలాధికారి కుమార్తె చిరునామాకు తొలిసారి ప్రేమసందేశం పంపినట్లు[14] History.com యొక్క ది గోల్డెన్ లెజెండ్‌కు అమెరికన్ గ్రీటింగ్స్, ఇంక్ అందజేసిన ఒక అలంకారంలో పదేపదే ప్రస్తావించబడింది, కారాగారంలో ఉన్న సమయంలో వాలెంటైన్ చెరశాలాధికారి కుమార్తెతో స్నేహం చేయడంతోపాటు, ఆమె అంధత్వాన్ని[15] పోగొట్టినట్లు పేర్కొంది. ఆమెకు పంపిన సందేశంలో "ఫ్రమ్ యువర్ వాలెంటైన్" అని ఉన్నట్లు చెబుతున్నారు.[14]

అనుబంధ సంప్రదాయాలు[మార్చు]

లూపెర్కాలియా[మార్చు]

సరిగా వివరాలు తెలియని గ్రీక్-రోమన్ ఫిబ్రవరి సెలవుదినాలను ప్రజనన శక్తికి మరియు సెయింట్ వాలెంటైన్స్ డేను ప్రేమకు ముడిపెడుతూ ప్రసిద్ధ ఆధునిక వ్యక్తులు కల్పనలను సృష్టించినప్పటికీ, కాన్సాస్ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు జాక్ ఓరుచ్[16] మాత్రం చౌసెర్ కాలానికి ముందు వాలెంటైనస్ పేరు గల సెయింట్‌లకు, శృంగార ప్రేమకు మధ్య ఎటువంటి సంబంధం లేదని వాదించారు. పురాతన ఏథేన్స్ క్యాలెండర్‌లో జనవరి నెల మధ్య నుంచి ఫిబ్రవరి మధ్యకాలం వరకు గామెలియన్ నెలగా ఉండేది, జోస్ (గ్రీకు పురాణ దేవత) మరియు హెరాల పవిత్ర వివాహానికి ఈ నెల అంకితం చేయబడింది.

పురాతన రోమ్‌లో, లూపెర్కాలియాను ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరుపుకునేవారు, ఇది ప్రజనన శక్తికి సంబంధించిన పురాతన కర్మగా పరిగణించబడేది. రోమ్ నగరంలో లూపెర్కాలియా ఒక స్థానిక వేడుకగా ఉండేది. ఇంకా సాధారణంగా జునో ఫెబ్రువా వేడుకను ఫిబ్రవరి 13-14 తేదీల్లో జరుపుకునేవారు, జూనౌ ఫెబ్రువా అంటే జూనౌ (వివాహాన్ని రక్షించే ఒలింపియా దేవతల రాణి) ది ఫ్యూరిఫైయర్ (శుద్ధికారి) లేదా పరిశుద్ధ జూనౌ అని అర్థం. పోప్ గెలాసియస్ I (492-496) లూపెర్కాలియాను రద్దు చేశారు.

అన్యమత లూపెర్కాలియా వేడుకలను క్రైస్తవీకరణ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఫిబ్రవరి మధ్యలో వాలెంటైన్ విందు రోజును జరుపుకోవాలని క్రైస్తవ చర్చి నిర్ణయించినట్లు సాధారణ అభిప్రాయం ఏర్పడింది, "... దేవుడికి మాత్రమే తెలిసిన కర్మలను ఆచరించినవారు, ప్రజల్లో పూజ్యభావం ఉన్న వ్యక్తుల కోసం" 496లో పోప్ గెలాసియస్ I సంస్మరణ విందును ఏర్పాటు చేశారు, వీరిలో వాలెంటైన్‌కు గుర్తుగా ఈ సెలవుదినం ఆచరించబడుతోంది. ప్రత్యామ్నాయంగా, ప్రజల్లో బలంగా వేళ్లూనుకొని ఉన్న లూపెర్కాలియా వేడుకను తొలగించడం కాథలిక్ చర్చికి సాధ్యపడలేదు, అందువలన చర్చి కన్య మేరీ గౌరవసూచకంగా ఈ రోజును కేటాయించినట్లు విలియం ఎం. గ్రీన్ వాదించారు.[17]

థామస్ ఓక్లివ్ రాసిన జెఫ్రే చౌసెర్ (1412)

చౌసెర్ ప్రేమ పక్షులు[మార్చు]

జెఫ్రే చౌసెర్[18] రాసిన పార్లమెంట్ ఆఫ్ పౌల్స్ (1382)లో శృంగార ప్రేమతో వాలెంటైన్స్ డేకు తొలిసారి అనుబంధం ఏర్పరిచినట్లు, ఇది తప్పుడు అర్థవివరణ ఫలితమని కొందరు వాదిస్తున్నారు. చౌసెర్ కవిత:

For this was on seynt Volantynys day
Whan euery bryd comyth there to chese his make .

ఇంగ్లండ్ రాజు రిచర్డ్ II, బహేమియాకు చెందిన అన్నేల నిశ్చితార్థం జరిగి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవసూచకంగా ఈ కవిత రాయబడింది.[19] వీరి వివాహానికి సంబంధించిన ఒప్పందంపై 1381 మే 2లో సంతకం చేశారు.[20] (దీనికి ఎనిమిది నెలల ముందు వారు వివాహం చేసుకున్నారు, అతనికి ఆ సమయంలో వయస్సు 13 లేదా 14 కాగా, ఆమె వయస్సు 14.)

చౌసెర్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా సూచిస్తున్నట్లు పాఠకులు సులభంగా ఊహించగలిగారు; అయితే, ఫిబ్రవరి మధ్యకాలం ఇంగ్లండ్‌లో పక్షులు దగ్గరయ్యే సమయం కాదు. లిటుర్జికల్ క్యాలెండర్ ప్రకారం, జెనోవా వాలెంటైన్ యొక్క సెయింట్స్ డేగా మే 2ను పరిగణిస్తున్నట్లు[21] హెన్రీ అస్గర్ కెల్లీ ప్రస్తావించారు. ఈ సెయింట్ వాలెంటైన్ జెనోవా బిషప్‌గా పనిచేశారు, ఆయన AD 307 సమయంలో మరణించారు.[22]

చౌసెర్ యొక్క పార్లమెంట్ ఆఫ్ పౌల్స్ ఒక కాల్పనిక పురాతన సంప్రదాయాన్ని ప్రస్తావించింది, అయితే వాస్తవానికి చౌసెర్‌కు ముందు ఇటువంటి సంప్రదాయమేదీ లేదు. ప్రబల విశ్వాసాలను చారిత్రాత్మక వాస్తవంగా పరిచయం చేయడంతోపాటు, వాటి యొక్క ఊహాజనిత వివరణ, మూలాలు పద్దెనిమిదో శతాబ్దపు పురాతన వృత్తాంతాల్లో, ముఖ్యంగా బట్లెర్స్ లైవ్స్ ఆఫ్ సెయింట్స్ రచయిత అల్బాన్ బట్లెర్ సంగ్రహాల్లో ఉన్నాయి, వీటిని ప్రసిద్ధ ఆధునిక పరిశోధకులు కూడా శాశ్వతీకరించారు. ముఖ్యంగా, "రోమన్ లూపెర్కాలియా జరుపుకునే ప్రజలు కూడా వాలెంటైన్స్ డే సంప్రదాయాలను సులభంగా అంగీకరించడంతోపాటు, వాటిని ఇప్పటివరకు వివిధ రూపాల్లో కొనసాగించారు"[23]

మధ్యయుగ కాలం మరియు ఆంగ్ల పునరుజ్జీవనం[మార్చు]

నాగరిక ప్రేమ సంప్రదాయాలకు న్యాయస్థానాల భాషను ఉపయోగించి, ప్యారిస్‌లో 1400వ సంవత్సరపు ప్రేమికుల రోజున ఒక హైకోర్ట్ ఆఫ్ లవ్‌ను ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానం ప్రేమ సంబంధాలు, మోసాలు మరియు మహిళలపై హింస కేసులను విచారిస్తుంది. కవితలు చదవడాన్ని ప్రాతిపదికగా చేసుకొని మహిళలు ఈ కోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేస్తారు.[24][25] తొలిసారి ప్రాణాలు దక్కించుకున్న వాలెంటైన్ పదిహేనోవ శతాబ్దంలో ఓర్లెన్స్ సేనాధిపతి చార్లెస్, ఆయన తన ప్రేయసి భార్యకు రాండౌ (ఒకరకమైన ఫ్రెంచ్ కవిత) పంపారు, ఈ పద్ధతి తదనంతరకాలంలో వ్యాప్తి చెందింది.

Je suis desja d'amour tanné
Ma tres doulce Valentinée…

—Charles d'Orléans, Rondeau VI, lines 1–2 [26]

ఆ సమయంలో, సేనాధిపతి లండన్ టవర్‌లో బంధించబడ్డాడు, 1415 అగిన్‌కోర్ట్ యుద్ధంలో అతను బంధీగా చిక్కాడు.[27]

వాలెంటైన్స్ డేను హామ్లెట్‌లో (1600-1601) ఓఫెలియా పశ్చాత్తాపానికి సూచనగా పరిగణించారు:

To-morrow is Saint Valentine's day,
All in the morning betime,
And I a maid at your window,
To be your Valentine.
Then up he rose, and donn'd his clothes,
And dupp'd the chamber-door;
Let in the maid, that out a maid
Never departed more.

—William Shakespeare, Hamlet, Act IV, Scene 5
1910 కాలానికి చెందిన వాలెంటైన్స్ డే పోస్ట్‌కార్డ్

ఆధునిక కాలం[మార్చు]

సొంతంగా కవితలు రాయడం తెలియని యువ ప్రేమికుల కోసం అనేక భావ కవితలు కలిగిన ది యంగ్ మ్యాన్స్ వాలెంటైన్ రైటర్‌ను 1797లో ఒక బ్రిటన్ ప్రచురుణకర్త విడుదల చేశారు. అప్పటికే "యాంత్రిక వాలెంటైన్‌లు" పేరుతో పిలిచే కవితలు మరియు రేఖాచిత్రాలు కలిగిన కార్డులను పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేయడం ముద్రణకర్తలు ప్రారంభించారు, తరువాతి శతాబ్దంలో పోస్టల్ ఛార్జీలు తగ్గడంతో, వాలెంటైన్‌లను పోస్ట్ ద్వారా పంపడం బాగా వాడుకలోకి వచ్చింది. కాలక్రమంలో, గుర్తుతెలియకుండా కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైంది, విక్టోరియా శకంలో ఒక్కసారిగా మాధుర్యమైన కవితలు ప్రత్యక్షమవడానికి ఇది కారణమైంది.[28]

1800 ప్రారంభంలో ఇంగ్లండ్‌లో కాగితపు వాలెంటైన్‌లకు ఎంతో ఆదరణ ఏర్పడింది, వాలెంటైన్‌లను కర్మాగారాల్లో తయారు చేయడం కూడా ప్రారంభించారు. నిజమైన లేస్‌లు మరియు రిబ్బన్లు, కాగితపు లేస్‌లతో తయారు చేసిన ఫ్యాన్సీ వాలెంటైన్‌లు 1800 మధ్యకాలంలో పరిచయమయ్యాయి.[29]. 1840లో సెయింట్ వాలెంటైన్స్ డే పునఃసృష్టిని లీగ్ ఎరిక్ ష్మిత్ గుర్తించాడు.[30] గ్రాహమ్స్ అమెరికన్ మంథ్లీలో ఒక రచయితగా 1849లో, "సెయింట్ వాలెంటైన్స్ డే జాతీయ సెలవుదినంగా మారినట్లు ప్రస్తావించాడు."[31] వర్సెస్టెర్, మాసాచుసెట్స్‌కు చెందిన ఈస్టర్ హౌలాండ్ (1828-1904) 1847 తరువాత అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తొలిసారి కాగితపు లేస్‌లతో రూపొందించిన వాలెంటైన్‌లను భారీస్థాయిలో తయారు చేసి, విక్రయించింది. ఆమె తండ్రి ఒక పెద్ద పుస్తక మరియు కాగితపు స్టోర్‌ను నిర్వహించేవాడు, అయితే హౌలాండ్ మాత్రం తనకు ఒక ఆంగ్ల ప్రేమికుడు పంపిన కానుక నుంచి స్ఫూర్తి పొందింది, దీనినిబట్టి ఉత్తర అమెరికాలో ప్రాచుర్యం పొందే సమయానికి ముందు నుంచే వాలెంటైన్స్ కార్డులు పంపే సంప్రదాయం ఇంగ్లండ్‌లో ఉండేదనే విషయం స్పష్టమవుతుంది. ఇంగ్లండ్‌లో వాలెంటైన్స్ కార్డులు పంపే సంప్రదాయం ఎలిజబెత్ గాస్కెల్ యొక్క Mr. హారిసన్స్ కన్ఫెషన్స్ (1851లో ప్రచురితమైంది)లో కనిపిస్తుంది. 2001 నుంచి, గ్రీటింగ్ కార్డుల సంఘం వార్షిక "గ్రీటింగ్ కార్డ్ విజినరీకి సంబంధించి ఈస్టర్ హౌలాండ్ అవార్డు"ను అందజేస్తోంది. U.S. గ్రీటింగ్ కార్డుల సంఘం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు ఒక బిలియన్ వాలెంటైన్‌లు పంపబడుతున్నట్లు అంచనా వేసింది, దీంతో క్రిస్మస్ తరువాత ఏడాదిలో ఎక్కువగా గ్రీటింగ్ కార్డులు పంపే సెలవుదినం ప్రేమికుల రోజు అయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, మహిళల కంటే పురుషులు దీని కోసం రెట్టింపు వ్యయం చేస్తున్నట్లు సంఘం అంచనా వేసింది.[3]

19వ శతాబ్దం నుంచి, చేతితోరాసిన సందేశాలు భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయబడుతున్న గ్రీటింగ్ కార్డులకు మార్గం చూపాయి.[1] పందొమ్మిదో శతాబ్దం మధ్యకాలపు వాలెంటైన్స్ డే వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మిగతా సెలవుదినాలను వ్యాపారాత్మకం చేసేందుకు దోహదపడింది.[2]

20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రకాల కానుకలు అందజేయడానికి, సాధారణంగా పురుషుల నుంచి మహిళలకు, కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయమైంది. ఇటువంటి కానుకలను గులాబీలు, చాక్లెట్‌లతో కలిపి ఎరుపు వస్త్రంతో తయారు చేయబడిన హృదయాకారపు పెట్టలో ఉంచి ఇచ్చేవారు. 1980వ దశకంలో, వజ్రాల పరిశ్రమ కానుకలుగా ఆభరణాలను ఇచ్చే సందర్భంగా కూడా ప్రేమికుల రోజును ప్రోత్సహించడం ప్రారంభించింది. ఈ రోజున "హ్యాపీ వాలెంటైన్స్ డే" అనే సాధారణ అలైంగిక అభినందన తెలియజేయడం కూడా సంప్రదాయంగా మారింది. "సింగిల్స్ అవేర్‌నెస్ డే"గా వాలెంటైన్స్ డేను సూచిస్తూ ఒక హాస్యోక్తి వాడుకలో ఉంది. ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో, పిల్లలు ఈ రోజున తరగతి గదులను అలంకరించడం, కార్డులు పంచుకొని మిఠాయిలు తినే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. ఈ గ్రీటింగ్ కార్డుల్లో విద్యార్థులు ఒకరిలోఒకరికి నచ్చే అంశాలను ప్రస్తావిస్తుంటారు.

సహస్రాబ్దం మారుతున్న సమయంలో ఇంటర్నెట్ ప్రాధాన్యత బాగా పెరిగిపోవడంతో, కొత్త సంప్రదాయాలు సృష్టించబడుతున్నాయి. సహస్రాబ్ది ప్రజలు ప్రతి ఏటా ఈ-కార్డులు, లవ్ కూపన్‌లు లేదా ముద్రించదగిన గ్రీటింగ్ కార్డుల రూపంలో ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపే సందేశాలను పంపుతున్నారు.

ప్రాచీనకాలపు మరియు పాతకాలపు వాలెంటైన్‌లు, 1850–1950[మార్చు]

19వ శతాబ్దం మధ్యకాలంలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలోని వాలెంటైన్‌లు[మార్చు]

సుమారు 1900-1930 కాలంనాటి పోస్ట్‌కార్డులు, "పాప్-అప్‌లు" మరియు యాంత్రిక వాలెంటైన్‌లు[మార్చు]

నల్ల అమెరికన్ కళాకృతులు మరియు పిల్లల వాలెంటైన్‌లు[మార్చు]

ప్రేమను గౌరవించే ఇతర రోజులు[మార్చు]

పశ్చిమ ప్రాంతంలో[మార్చు]

ఐరోపా[మార్చు]

UKలో ప్రేమికుల రోజుకు ప్రాంతీయ సంప్రదాయాలు ఉన్నాయి. నోర్‌ఫోల్క్‌లో 'జాక్' వేషంలోని వాలెంటైన్ ఇళ్ల వెనుక తలుపులను తట్టి అక్కడ మిఠాయిలు మరియు పిల్లలకు బహుమతులు ఉంచి వెళతాడు. అతను తినుబండారులు వదిలిపెట్టి వెళ్లినప్పటికీ, ఎక్కువ మంది పిల్లలు ఈ రహస్య వ్యక్తి విషయంలో భయపడుతుంటారు. వేల్స్‌లో, ఎక్కువ మంది పౌరులు జనవరి 25న సెయింట్ వాలెంటైన్స్ డేకు బదులుగా లేదా దీని మాదిరిగానే Dydd Santes Dwynwen (సెయింట్ డ్వైన్‌వెన్స్ డే )ను జరుపుకుంటారు. వెల్ష్ ప్రేమికులకు రక్షకుడిగా కీర్తించబడుతున్న సెయింట్ డ్వైన్‌వెన్ సంస్మరణార్థం ఈ రోజును జరుపుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా కాథలిక్ దేశమైన ఫ్రాన్స్‌లో, వాలెంటైన్స్ డేను "సెయింట్ వాలెంటైన్"గా గుర్తిస్తారు. మరియు ఇతర పశ్చిమ దేశాల మాదిరిగానే ఇక్కడ ఈ రోజును జరుపుకుంటారు. స్పెయిన్లో వాలెంటైన్స్ డే "San Valentín"గా తెలుసు, యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాదిరిగానే ఇక్కడ ఈ సెలవుదినాన్ని జరుపుకుంటారు, కాటాలోనియాలో మాత్రం దీనికి బదులుగా గులాబీలు మరియు/లేదా పుస్తకాలు ఇచ్చే సంబరాలను La Diada de Sant Jordi (సెయింట్ జార్జెస్ డే) రోజున నిర్వహిస్తారు. పోర్చుగల్‌లో దీనిని సాధారణంగా "Dia dos Namorados" (బాయ్/గర్ల్‌ఫ్రెండ్స్ డే)గా గుర్తిస్తారు.

డెన్మార్క్ మరియు నార్వే దేశాల్లో, వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) Valentinsdagగా తెలుసు. భారీస్థాయిలో దీనిని జరుపుకోనప్పటికీ, ఎక్కువ మంది ప్రజలు తన భాగస్వామితో కలిసి రాత్రి విందు చేయడం, రహస్య ప్రేమికులగా కార్డులు పంపడం లేదా ప్రేమికులకు ఎర్రటి గులాబీ ఇవ్వడం చేస్తుంటారు. స్వీడన్‌లో దీనిని Alla hjärtans dag ("ఆల్ హార్ట్ డే")గా పిలుస్తారు మరియు అమెరికా సంస్కృతి ప్రభావం, పువ్వుల పరిశ్రమ యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం 1960వ దశకంలో ఇది ప్రారంభమైంది. ఇక్కడ ఇది అధికారిక సెలవుదినం కాదు, అయితే మదర్స్ డే కంటే ఎక్కువగా సౌందర్య సాధనాలు, పువ్వుల విక్రయాలు జరిగే రోజుగా వాలెంటైన్స్ డే వేడుకలు గుర్తింపు పొందాయి.

ఫిన్లాండ్‌లో వాలెంటైన్స్ డేను Ystävänpäiväగా పిలుస్తారు, దీని అర్థం "ఫ్రెండ్స్ డే". పేరు సూచిస్తున్న విధంగానే, ఈ రోజును ఎక్కువగా ప్రేమించే వ్యక్తులతోపాటు మిత్రులను గుర్తుకు తెచ్చుకుంటారు. ఎస్టోనియాలో వాలెంటైన్స్ డేను Sõbrapäevగా పిలుస్తారు, దీనికి కూడా ఫ్రెండ్స్ డే అని అర్థం.

స్లొవేనియాలో "సెయింట్ వాలెంటైన్ వేళ్ల తాళాలను తీసుకొస్తాడనే" జాతీయం ప్రచారంలో ఉంది, అందువలన ఫిబ్రవరి 14న మొక్కలు, పువ్వులు పెరగడం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు. వైన్‌యార్డుల్లో (వైన్ తయారీకి ఉపయోగించే ద్రాక్ష పంట పండించే ప్రదేశాలు) మరియు పంటపొలాల్లో మొదటి పనులు ప్రారంభించేందుకు గుర్తుగా వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. అంతేకాకుండా పక్షులు ఈ రోజున ఒకదానికొకటి ప్రేమ లేదా వివాహ ప్రతిపాదన చేస్తాయని చెబుతుంటారు. అయితే, ఇటీవల కాలం నుంచే దీనిని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా మార్చి 12న జరుపుకునే సెయింట్ గ్రెగోరీస్ డేను ప్రేమికుల రోజుగా పరిగణిస్తారు. మరో జాతీయం ప్రకారం "Valentin - prvi spomladin" ("వాలెంటైన్ — వసంతకాలపు మొదటి సెయింట్"), కొన్ని ప్రదేశాల్లో (ముఖ్యంగా వైట్ కార్నియోలా) సెయింట్ వాలెంటైన్‌ను వసంతకాలం ప్రారంభమవడానికి సూచనగా పరిగణిస్తున్నారు.

రొమేనియాలో, ప్రేమికులకు సంప్రదాయ సెలవుదినం డ్రాగోబేట్, దీనిని ఫిబ్రవరి 24న జరుపుకుంటారు. రొమేనియన్ల జానపదసాహిత్యంలోని ఒక పాత్ర నుంచి ఈ పేరు వచ్చింది, ఇది బాబా డోచియా కుమారుడి పేరు అయివుంటుందని భావిస్తున్నారు. పేరులోని ఒక భాగమైన drag ("డియర్") అనే పదాన్ని, dragoste ("లవ్") పదంలోనూ గుర్తించవచ్చు. ఇటీవల సంవత్సరాల్లో, సంప్రదాయ సెలవుదినం Dragobete ఉన్నప్పటికీ, రొమేనియా కూడా వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవడం ప్రారంభించింది. దీని వలన అనేక గ్రూపులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, సంస్థలు[32], నోవా డ్రీప్టా వంటి జాతీయ సంస్థలు నిరసనలు మొదలుపెట్టాయి, వాలెంటైన్స్ డే ప్రాధాన్యతలేని, వ్యాపారాత్మక వేడుకని, పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న డాంబికమైన ఆచారం అంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

టర్కీలో వాలెంటైన్స్ డేను Sevgililer Günüగా పిలుస్తారు, దీని అర్థం "స్వీట్‌హార్ట్స్ డే".

యూదుల సంప్రదాయం ప్రకారం Av - Tu B'Av (సాధారణంగా వెనుకటి ఆగస్టు) నెలలో 15వ రోజును ప్రేమ దినంగా పరిగణించేవారు. పురాతన కాలంలో బాలికలు తెలుపు వస్త్రాలు ధరించి వైన్‌యార్డులలో నృత్యం చేసేవారు, అక్కడ బాలురు వారి కోసం వేచి ఉండేవారు (Mishna (యూదుల మతగ్రంథమైన టాల్ముడ్‌కు ఆధారభూతమయిన ప్రధాన ధర్మాల సంకలనం) Taanith 4వ అధ్యాయం చివర). ఆధునిక ఇజ్రాయేల్ సంస్కృతిలో ప్రేమను వ్యక్తపరిచేందుకు, వివాహ ప్రతిపాదన చేసేందుకు, కార్డులు లేదా పువ్వుల వంటి బహుమతులు ఇచ్చేందుకు ఇదొక ప్రసిద్ధమైన రోజు.

మధ్య మరియు దక్షిణ అమెరికా[మార్చు]

గ్వాటెమాల మరియు El సాల్వడార్ ప్రాంతాల్లో వాలెంటైన్స్ డే "Día del Amor y la Amistad"గా (డే ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్) తెలుసు. దాదాపుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరుపుకునే తరహాలోనే ఇక్కడ కూడా వేడుకలు జరుపుకుంటారు, ఈ రోజున ప్రజలు వారి స్నేహితుల చర్యలను ప్రశంసించడం ఇక్కడ సాధారణంగా కనిపిస్తుంది.[33]

బ్రెజిల్‌లో, Dia dos Namorados (lit. "మోహితుల దినం", లేదా "బాయ్‌ఫ్రెండ్స్'/గర్ల్‌ఫ్రెండ్స్' డే")ను జూన్ 12న జరుపుకుంటారు, ఈ రోజున జంటలు బహుమతులు, చాక్లెట్‌లు, కార్డులు, పూలగుత్తులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సెయింట్ ఆంథోనీస్ డే యొక్క Festa junina వేడుకలు జరిగే ముందురోజును దీనికోసం ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు, ఈ దేశంలో సెయింట్ ఆంథోనీని మ్యారేజ్ సెయింట్‌గా పరిగణిస్తారు, ఈ రోజున ఒంటరిగా ఉన్న మహిళలు సంప్రదాయబద్ధంగా మంచి భర్త లేదా మగతోడు కోసం సింపాటియాస్ అని పిలిచే ప్రసిద్ధ మతాచారాలను నిర్వహిస్తారు. సాంస్కృతిక మరియు వ్యాపార కారణాల వలన ఇక్కడ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జరుపుకోరు, బ్రెజిల్‍‌లో ప్రసిద్ధ పడవ పోటీల సెలవుదినం కార్నివల్‌కు కాస్త ముందు లేదా తరువాత వాలెంటైన్స్ డే వస్తుండటం వేడుకలు జరుపుకోకపోవడానికి ప్రధాన కారణం — ఈ దేశంలో అనేక మంది లైంగిక వాంఛ మరియు వేశ్యాలోలత్వానికి సంబంధించిన ఈ కార్నివల్‌ను జరుపుకుంటున్నారు[34] — ఈ సెలవుదినం ఫిబ్రవరి ప్రారంభం నుంచి మార్చి ప్రారంభ రోజుల మధ్యలో వస్తుంది.

వెనిజులాలో, అధ్యక్షుడు హుగో చావెజ్ ఫిబ్రవరి 15, 2009న జరగబోతున్న ఆ దేశ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 14న వేడుకలు చేసుకునేందుకు ఏమాత్రం సమయం లేదని, కేవలం ఒక చిన్న ముద్దు లేదా తేలికైన వేడుకతో సరిపెట్టుకోవాలని సూచించాడు, ఎన్నికలు ముగిసిన తరువాత ఒక వారంపాటు ప్రేమ వేడుకలు జరుపుకోమని సూచించాడు.[35]

దక్షిణ అమెరికాలోని ఎక్కువ ప్రాంతాల్లో Día del amor y la amistad (lit. "లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ డే") మరియు Amigo secreto ("రహస్య మిత్రుడు") వేడుకలు బాగా ప్రసిద్ధి చెందాయి, వీటిని ఫిబ్రవరి 14న ఒకేసారి జరుపుకుంటారు (ఒక్క కొలంబియా దేశంలో మాత్రం ఈ వేడుకలను సెప్టెంబరు నెలలో మూడో శనివారం జరుపుకుంటారు). రహస్య మిత్రుడు వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి యాదృచ్ఛికంగా గుర్తు తెలియని బహుమతి ఇస్తాడు (ఇది క్రిస్మస్ సంప్రదాయమైన సీక్రెట్ శాంతాను పోలి వుంటుంది).

ఆసియా[మార్చు]

వ్యాపార చర్యల ఫలితంగా, ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో వాలెంటైన్స్ డేను భారీగా జరుపుకుంటున్నారు, సింగపూర్ వాసులు, చైనీయులు, దక్షిణ కొరియా వాసులు వాలెంటైన్స్ డే బహుమతుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.[36]

జపాన్‌లో, అతిపెద్ద మిఠాయిల కంపెనీల్లో ఒకటైన మోరినాగా 1960లో కేవలం మహిళలు మాత్రమే పురుషులకు చాక్లెట్‌లు ఇవ్వాలనే సంప్రదాయం ప్రారంభమవడానికి కారణమైంది. ముఖ్యంగా, కార్యాలయ మహిళలు వారి సహోద్యోగులకు చాక్లెట్‌లు ఇస్తారు. ఒక నెల తరువాత, మార్చి 14న జపాన్ జాతీయ మిఠాయి పరిశ్రమల సంఘం సృష్టించిన వైట్ డేను "బదులు రోజు"గా జరుపుకుంటారు, ఈ రోజున పురుషులు వాలెంటైన్స్ డే రోజు తమకు చాక్లెట్‌లు ఇచ్చిన మహిళలకు తిరిగి బహుమతులు ఇస్తుంటారు. పశ్చిమ దేశాల మాదిరిగా, కాండీలు, పువ్వులు లేదా రాత్రివిందు రోజుల వంటి బహుమతులు ఇక్కడ పెద్దగా కనిపించవు. ఇదిలా ఉంటే సహోద్యోగ పురుషులు అందరికీ చాక్లెట్‌లు ఇవ్వాలనడం అనేక మంది మహిళలకు అభ్యంతరకరమైంది. ఈ రోజున ఎక్కువ చాక్లెట్‌లు పొందిన పురుషులు గర్వపడుతుంటారు; పురుషుల్లో చాక్లెట్‌ల సంఖ్య బాగా చర్చనీయాంశమవుతుంది, చాక్లెట్‌ల సంఖ్యను బయటకు చెప్పకుండా ఉంటామనే హామీ పొందిన తరువాతే వారు దీనిపై మాట్లాడుతుంటారు. దీనిని giri-choko (義理チョコ)గా పిలుస్తారు, ఇందులో giri అంటే ("బాధ్యత") మరియు choko అంటే ("చాక్లెట్"), జనరంజకంకాని సహోద్యోగులు కేవలం "అతి-ఉపకార బద్ధమైన" chō-giri choko తక్కువ రకం చాక్లెట్‌లను పొందుతారు. దీనికి పూర్తిగా భిన్నంగా ఇచ్చేవే honmei-choko (本命チョコ, ఇంటిలోచేసిన చాక్లెట్); వీటిని ప్రేమించినవారికి ఇస్తుంటారు. స్నేహితులు, ముఖ్యంగా యువతులు, tomo-choko (友チョコ)గా పిలిచే చాక్లెట్‌లను ఇచ్చిపుచ్చుకుంటారు; ఇందులో tomo అంటే "మిత్రుడు" అని అర్థం.[37]

దక్షిణ కొరియాలో, మహిళలు ఫిబ్రవరి 14న పురుషులకు చాక్లెట్‌లు ఇస్తుంటారు, పురుషులు మార్చి 14న చాక్లెట్‌-యేతర మిఠాయిలను ఇస్తారు. ఏప్రిల్ 14న (బ్లాక్ డే). ఫిబ్రవరి 14 లేదా మార్చి 14న ఎటువంటి బహుమతులు అందుకోనివారు చైనా రెస్టారెంట్‌కు వెళ్లి బ్లాక్ న్యూడిల్స్ తింటూ, వారి ఒంటరి జీవితాన్ని గుర్తు చేసుకొని విచారిస్తారు. కొరియన్లు నవంబరు 11న Pepero Dayను కూడా జరుపుకుంటారు, యువ జంటలు ఈ రోజున ఒకరికొకరు పెపెరో కుకీలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున పంచుకునే పొడవైన ఆకారంలో కుకీలను '11/11' తేదీ ప్రతిబింబిస్తుంది. కొరియాలో ప్రతి నెలలో 14వ తేదీని ప్రేమకు సంబంధించిన రోజుగా పరిగణిస్తారు, వీటిలో ఎక్కువ రోజులు అప్రసిద్ధమైనవే. జనవరి నుంచి డిసెంబరు వరకు: కాండిల్ డే, వాలెంటైన్స్ డే, వైట్ డే, బ్లాక్ డే, రోజ్ డే, కిస్ డే, సిల్వర్ డే, గ్రీన్ డే, మ్యూజిక్ డే, వైన్ డే, మూవీ డే మరియు హగ్ డే.[38]

చైనాలో, పురుషుడు తాను ప్రేమించిన మహిళకు చాక్లెట్, పువ్వులు లేదా రెండూ ఇచ్చే సాధారణ సంప్రదాయం చూడవచ్చు. చైనీయులు ప్రేమికుల రోజును (మూస:Zh-stp)గా పిలుస్తారు.

ఫిలిప్పీన్స్‌లో, ప్రేమికుల రోజును "Araw ng mga Puso" లేదా "హార్ట్స్ డే"గా పిలుస్తారు. సాధారణంగా పువ్వుల ధరను పెంచేందుకు దీనిని జరుపుకోవడం ప్రారంభించారు.

ఇదేవిధమైన ఆసియా సంప్రదాయాలు[మార్చు]

చైనా సంస్కృతిలో, ప్రేమికులకు సంబంధించి "ది నైట్ ఆఫ్ సెవెన్స్" (మూస:Zh-cp) అనే పాత సంప్రదాయం ఒకటి భాగమై ఉంది. పురాణ గాథ ప్రకారం, కౌహెర్డ్ స్టార్ మరియు వీవర్ మెయిడ్ స్టార్ సాధారణంగా పాలపుంత (తెల్లని నది) చేత వేరు చేయబడివుంటాయి, అయితే వాటికి నదిని దాటి కలుసుకునేందుకు చైనీయుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల 7వ రోజున అనుమతించబడివుంది.

ఇదే రోజున కొరియాలో Chilseok అని పిలిచే వేడుక జరుపుకుంటారు, అయితే శృంగారంతో చాలాకాలం క్రితమే ఈ రోజు యొక్క అనుబంధం తెగిపోయింది.[ఆధారం చూపాలి]

జపాన్‌లో, కొద్దిగా వైవిధ్యం ఉండే 七夕 (Tanabataగా పిలుస్తారు, దీనర్థం 棚機, దేవుడికి నేత నేసే వ్యక్తి) పద్ధతి ఆచరణలో ఉంది, దీనిని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూలై 7న జరుపుకుంటారు. దీనికి సంబంధించిన పురాణ గాథ కూడా చైనా పురాణ గాథ మాదిరిగానే ఉంటుంది.[ఆధారం చూపాలి] అయితే, సెయింట్స్ వాలెంటైన్స్ డే లేదా ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆచారంతో దీనికి ఎప్పుడూ, ఎటువంటి సంబంధం లేదు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

మత సిద్ధాంతవాదులతో సంఘర్షణ[మార్చు]

భారతదేశం[మార్చు]

భారతదేశంలో, హిందూ మతవాదులు ప్రేమికుల రోజుతో స్పష్టంగా విభేదించారు.[39] 2001 నుంచి ప్రతి ఏటా ప్రేమికుల రోజుకు సంబంధించిన వస్తువులు విక్రయించేవారితో హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి, "పశ్చిమ దేశాల సాంస్కృతిక కాలుష్యం"గా ఈ రోజును పరిగణించే శివసేన కార్యకర్తలు ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నారు.[39][40] ముఖ్యంగా, ముంబయి మరియు దాని పరిసర ప్రాంతాల్లో బాల్ థాకరే, ఇతరులు ప్రేమికుల రోజుకు ముందు ఎటువంటి సంస్కృతి విరుద్ధమైన కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.[41] వారి హెచ్చరికలను అతిక్రమించినవారితో, ముఖ్యంగా పార్కుల వంటి బహిరంగ ప్రదేశాల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారిని, ఇతర అనుమానిత ప్రేమికులను పట్టుకొని శివసేన సాయుధ కార్యకర్తలు కరుకుదనం ప్రదర్శించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పార్కుల్లో మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కనిపించినవారికి శివసేన మరియు ఇతర సారూప్య సంస్థల కార్యకర్తలు అక్కడికక్కడే వివాహం జరిపించారు. ప్రేమికుల ది నోత్సవాన్ని ఆచరించడం మన సంస్కృతి కాదంటున్న శ్రీరామసేన అధ్యక్షులు ప్రమోద్‌ముతాలిక్ సంఘంలో చోటు చేసుకున్నకులము అస్పృశ్యత, మహిళలపై దౌర్జన్యం వంటి వాటిపై ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.ముతాలిక్ వ్యాఖ్యల వల్ల శ్రీరామసేన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే, మాజీముఖ్యమంత్రి ధరంసింగ్ ప్రేమికుల దినోత్సవాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.(ఈనాడు 16.2.2010)

మధ్యప్రాచ్య దేశాలు[మార్చు]

ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ[ఆధారం చూపాలి][dubious ], ప్రస్తుతం ఇరాన్‌[ఆధారం చూపాలి][dubious ]లో ప్రేమికుల రోజును జరుపుకుంటున్నారు. యువ ఇరానియన్లు ఈ రోజున బయటకు వెళ్లి బహుమతులు కొనుగోలు చేయడం, వేడుకలు జరుపుకోవడం చూడవచ్చు.[42][dubious ]

సౌదీ అరేబియాలో, 2002 మరియు 2008 సంవత్సరాల్లో, మత పోలీసులు అన్ని ప్రేమికుల రోజు వస్తువులను నిషేధించారు, దుకాణాలవారిని ఎరుపు వర్ణంలోని వస్తువులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు, దీనిని ఇస్లాంయేతర సెలవుదినంగా పరిగణిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.[40][43] 2008లో ఈ నిషేధం కారణంగా గులాబీలు మరియు ఆకర్షణీయ కాగితానికి నల్ల బజారు సృష్టించబడింది.[43]

ఇవి కూడా చూడండి[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 లీగ్ ఎరిక్ ష్మిత్, "ది ఫాషనింగ్ ఆఫ్ ఎ మోడరన్ హాలిడే: సెయింట్ వాలెంటైన్స్ డే, 1840-1870" వింటెర్‌థూర్ ఫోర్ట్‌ఫోలియో 28 .4 (శీతాకాలం 1993), పేజీలు. 209-245.
 2. 2.0 2.1 లీగ్ ఎరిక్ ష్మిత్, "ది కమర్షియలైజేషన్ ఆఫ్ ది క్యాలెండర్: అమెరికన్ హాలిడేస్ అండ్ ది కల్చర్ ఆఫ్ కన్సంప్షన్, 1870-1930" జర్నల్ ఆఫ్ అమెరికన్ హిస్టరీ 78 .3 (డిసెంబరు 1991) పేజీలు 890-98.
 3. 3.0 3.1 "American Greetings: The business of Valentine's day".
 4. హెన్రీ అస్గర్ కెల్లీ, చౌసెర్ అండ్ ది కల్ట్ ఆఫ్ సెయింట్ వాలెంటైన్ (లీడెన్: బ్రిల్) 1986లో, (చాప్టర్. 6 "ది జెనోస్ సెయింట్ వాలెంటైన్ అండ్ ది అబ్జెర్వెన్సెస్ ఆఫ్ మే") ఈ సెయింట్ వాలెంటైన్‌లు మరియు ఇతర స్థానిక సెయింట్ వాలెంటైన్‌ల గురించి ప్రస్తావిస్తూ, చౌసెర్ వృద్ధిచెందిన సంస్కృతిని దృష్టిలో ఉంచుకున్నాడని వాదించాడు, మరియు (పేజీలు 79ff) వాలెంటైన్‌కు సంబంధించిన ప్రశ్నకు జెనోవా తొలి బిషప్ వాలెంటైన్‌కు సంబంధాన్ని ఆపాదిస్తూ, చౌసెర్ సూచించిన వసంతకాలంలో విందుతో గౌరవించబడే ఒకేఒక్క వాలెంటైన్ ఇతనేనని పేర్కొన్నాడు.జెనోవా వాలెంటైన్‌ను వెరాజె జాకోబస్ అతని యొక్క జెనోవా క్రానికల్‌ లో విచారిస్తాడు (కెల్లీ పేజీ. 85).
 5. ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీ ఆఫ్ సెయింట్స్ , s.v. " వాలెంటైన్": "వీరిద్దరి కర్మలు అవిశ్వసనీయంగా ఉండటంతో, పరిశోధకులు ఈ ఇద్దరు వాలెంటైన్‌లు వాస్తవానికి ఒకరేనని అభిప్రాయపడుతున్నారు."
 6. "Valentine of Rome".
 7. "Saint Valentine's Day: Legend of the Saint".
 8. "Valentine of Terni".
 9. "Basilica of Saint Valentine in Terni".
 10. "Catholic Encyclopedia: St. Valentine".
 11. ప్రస్తుత రోమన్ మృతవీరుల జాబితాలో ఫిబ్రవరి 14 రికార్డుల ప్రకారం, "రోమ్‌లోని, మిల్వియాన్ బ్రిడ్జ్ సమీపంలో వయా ఫ్లామినియా: సెయింట్ వాలెంటైన్, మృతవీరుడు."
 12. Calendarium Romanum ex Decreto Sacrosancti Œcumenici Concilii Vaticani II Instauratum Auctoritate Pauli PP. VI Promulgatum (Typis Polyglottis Vaticanis, MCMLXIX), p. 117
 13. Legenda Aurea, "సెయింట్ వాలెంటైన్".
 14. 14.0 14.1 "The History of Valentine's Day". History.com.
 15. హిస్టరీ ఆఫ్ వాలెంటైన్స్ డే, TheHolidaySpot.com
 16. జాక్ బి. ఓరుచ్, "సెయింట్ వాలెంటైన్, చౌసెర్, మరియు స్ప్రింగ్ ఇన్ ఫిబ్రవరి" స్పెక్యులమ్ 56 .3 (జులై 1981:534-565)
 17. విలియం ఎం. గ్రీన్ "ది లూపెర్కాలియా ఇన్ ది ఫిప్త్ సెంచరీ", క్లాసికల్ ఫిలాలజీ 26 .1 (జనవరి. 1931), పేజీలు 60‑69 పేజీలు60‑69
 18. ఓరుచ్, జాక్ బి., "సెయింట్ వాలెంటైన్, చౌసెర్, అండ్ స్ప్రింగ్ ఇన్ ఫిబ్రవరి," స్పెక్యులమ్, 56 (1981): 534-65. చౌసెర్ కాలానికి ముందు వాలెంటైన్ మరియు శృంగారానికి మధ్య ఎటువంటి అనుబంధం లేదని సాహిత్యంపై ఓరుచ్ చేసిన అధ్యయనం గుర్తించింది. ఈ ఉదాహరణలో కల్పనగాథకు చౌసెర్ పునాది వేసి ఉండవచ్చని అతను ఒక అభిప్రాయానికి వచ్చాడు.http://colfa.utsa.edu/chaucer/ec23.html
 19. "Henry Ansgar Kelly, Valentine's Day / UCLA Spotlight".
 20. "Chaucer: The Parliament of Fowls".
 21. కెల్లీ, హెన్రీ అస్గర్, చౌసెర్ అండ్ ది కల్ట్ ఆఫ్ సెయింట్ వాలెంటైన్ (బ్రిల్ అకడెమిక్ పబ్లిషర్స్, 1997), ISBN 90-04-07849-5. జెనోస్ వాలెంటైన్ యొక్క సెయింట్స్ డే మే 3 అని కెల్లీ ఆపాదించాడు మరియు రిచర్డ్ యొక్క నిశ్చితార్థం కూడా ఇదే రోజున జరిగిందని వాదించాడు. http://www.iol.co.za/general/newsview.php?art_id=qw981696180625B241&click_id=1890&set_id=1
 22. క్యాలెండర్ ఆఫ్ ది సెయింట్స్: 2 మే; సెయింట్స్ పాట్రిక్స్ చర్చ్: సెయింట్స్ ఆఫ్ మే 2
 23. ఓరుచ్ 1981:539.
 24. డొమెస్టిక్ వాయిలెన్స్, డిస్‌కర్సెస్ ఆఫ్ రొమాంటిక్ లవ్, అండ్ కాంప్లెక్స్ పర్సన్‌హుడ్ ఇన్ ది లా - [1999] MULR 8; (1999) 23 మెల్‌బోర్న్ యూనివర్శిటీ చట్ట సమీక్ష 211
 25. "Court of Love: Valentine's Day, 1400".
 26. full text in wikisource
 27. హిస్టరీ ఛానల్.
 28. http://www.ummah.net/Al_adaab/dawah/valentines.html
 29. http://www.emotionscards.com/museum/vals.html
 30. ష్మిత్ 1993:209-245.
 31. ష్మిత్ 1993:209లో చెప్పబడింది.
 32. వాలెంటైన్స్ డే వర్సెస్ డ్రాగోబెటె (in Romanian)
 33. "Día del Amor y la Amistad".
 34. ది సైకాలజీ ఆఫ్ కార్నవల్, TIME మేగజైన్ , ఫిబ్రవరి 14, 1969
 35. ప్రేమికుల రోజుపై చావెజ్ విసిరిన హాస్యోక్తికి సంబంధించిన వీడియో, youtube.com, 2009-01-31
 36. డొమింగో, రోనెల్. ఎమాంగ్ ఏషియన్స్, ఫిలిపినోస్ డిగ్ వాలెంటైన్స్ డే ది మోస్ట్. ఫిలిప్రైన్ డైలీ ఎంక్వైరెర్ , ఫిబ్రవరి 14, 2008. 2008-02-21న సేకరించబడింది.
 37. Yuko Ogasawara (1998). University of California Press (ed.). Office Ladies and Salaried Men: Power, Gender, and Work in Japanese Companies (illustrated ed.). Berkeley: Univ. of California Press. pp. 98–113, 142–154, 156, 163. ISBN 0520210441.
 38. కొరియా రైవల్స్ U.S. ఇన్ రొమాంటిక్ హాలిడేస్, సెంటర్ డైలీ టైమ్స్ , ఫిబ్రవరి 14, 2009.
 39. 39.0 39.1 Arkadev Ghoshal & Hemangi Keneka (2009-02-14). "V-Day turns into battlefield". Times of India.
 40. 40.0 40.1 "Cooling the ardour of Valentine's Day". BBC News. 2002-02-03.
 41. వాలెంటైన్స్ డే సంప్రదాయానికి నిరసన తెలుపుతూ ముంబయిలో బ్యానర్ పట్టుకొని ఉన్న ఒక వ్యక్తి
 42. "ముస్లిం సంస్కృతి స్పష్టమైన క్యుపిడ్‌ను స్వీకరించనప్పటికీ, ఇరాన్ యువకుల్లో, ముఖ్యంగా పశ్చిమ దేశాలపట్ల ఆకర్షితులైన వ్యక్తుల్లో ప్రేమికుల రోజుకు ఆదరణ పెరుగుతుందని షాఘాయెగ్ అజిమి అనే ఇరానియన్- అమెరికన్ చిత్రనిర్మాత చెప్పారు, ఆమె తన చిత్రాల్లో కొంత శృంగారాన్ని జోడించారు. జంతువుల ఆకారాలు, హృదయాకారపు చాక్లెట్‌లు మరియు ఎర్రటి బెలూన్‌లతో స్టోర్లను అలకరించడం, టెహ్రాన్ వీధుల్లో యువకులు చేతులు పట్టుకొని ఈ రోజుపై తమకున్న ఇష్టాన్ని చాటుతున్నారు."మెలానీ లిండ్నెర్ వాలెంటైన్స్ డే ఎరౌండ్ ది వరల్డ్ ఫిబ్రవరి 11, 2009 ఫోర్బ్స్ http://www.forbes.com/2009/02/11/valentine-mexico-ghana-entrepreneurs-sales_0211_globe.html
 43. 43.0 43.1 "Saudis clamp down on valentines". BBC News. 2008-02-11.

మూస:US Holidays mwl:Die de ls namorados ckb:ڤالێنتاین