ప్రేమ దేశం
Appearance
ప్రేమ దేశం | |
---|---|
దర్శకత్వం | కదిర్ |
రచన | కదిర్ |
తారాగణం | అబ్బాస్ వినీత్ టబు యస్.పి. బాలసుబ్రహ్మణ్యం వడివేలు చిన్ని జయంత్ శ్రీ విద్య |
ఛాయాగ్రహణం | కె. వి. ఆనంద్ |
సంగీతం | ఎ.ఆర్.రెహమాన్ |
విడుదల తేదీ | ఆగస్ట్ 30, 1996 |
భాష | తెలుగు |
' ప్రేమ దేశం 1996 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళంలో కాదల్ దేశం ఈ చిత్రానికి మాతృక. హిందీలో ఈ చిత్రం దునియా దిల్ వాలోంకి పేరుతో విడుదలైంది. అన్ని భాషలలో కూడా ఈ చిత్రం బహుళ జనాదరణ పొందింది.
కథ
[మార్చు]వేరు వేరు కళాశాలల్లో చదివే ఇద్దరు యువకులు బద్ద శతృత్వం వదిలి ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ తమ స్నేహితురాలినే ప్రేమించడము, చివరకు ఆమె ఎవరిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకొన్నది అన్నదే చిత్ర మూల కథ.
సంగీతం
[మార్చు]ఈ చిత్ర విజయానికి ఎ.ఆర్.రెహమాన్ ఇచ్చిన సంగీతము ప్రాణం పోసింది. చిత్రంలోని అన్ని పాటలు ప్రజలని ముఖ్యంగా యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
1. ముస్తఫా ముస్తఫా
2. వెన్నెలా వెన్నెలా
3. కనులు తెరిచిన
4. హల్లో డాక్టర్
5. ఓ వెన్నెలా తెలిపేదెలా
6. నను నేను మరచినా
వనరులు :ప్రేమ దేశం Archived 2010-09-18 at the Wayback Machine