ప్రైవేటు బ్యాంకింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రైవేట్ బ్యాంకింగ్ అనేది ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టగలిగినంత ఆస్తులకు, బ్యాంకుల ద్వారా ఇచ్చే బ్యాంకింగ్, పెట్టుబడి మరియు ఇతర ఆర్థిక సేవలకు సంబంధించిన పదము. "ప్రైవేట్" అనే పదము, వినియోగదారులకు మూకుమ్మడిగా కాకుండా, బ్యాంకు సలహాదారుల ద్వారా విడివిడిగా బ్యాంకు సేవలు ఎక్కువ ప్రత్యేకముగా అందించడమును సూచిస్తుంది. దీనిని ఒక పేరు పొందని లేదా పేరు రిజిస్టర్ చేయబడని బ్యాంకింగ్ సంస్థ అయిన ప్రైవేట్ బ్యాంకు అనుకుని పొరపాటు పడకండి.

ఇప్పుడు 250,000 డాలర్లతో కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులు[ఉల్లేఖన అవసరం] బ్యాంకులో ఖాతా తెరవగలిగినప్పటికినీ, చరిత్రాత్మకముగా చూస్తే ప్రైవేట్ బ్యాంకింగ్ అంటే చాలా చాలా ప్రత్యేకముగా కనీసము డబ్బు రూపములో 2 మిలియన్ డాలర్లు కలిగి ఉండి, ఎక్కువ మొత్తములో విలువ కలిగిన వ్యక్తుల యొక్క బ్యాంకింగ్ అవసరములకు మాత్రమే అని అన్నట్లుగా చూడబడింది. ఒక సంస్థ యొక్క ప్రైవేట్ బ్యాంకింగ్ భాగము సంపద నిర్వహణలోనూ, పొదుపు చేయడము లోనూ, వారసత్వము మరియు ఆదాయపు పన్ను వంటివి కావలసిన రీతిలో నిర్వహించడము లోనూ వారి వినియోగదారులకు సహాయము చేస్తాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ సేవలలో (బాగా డబ్బు కలిగిన వారికీ) పెద్దది సంపద నిర్వహణ. ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ సేవల కొరకు వినియోగదారుడు లావాదేవీల మీద ఆధారపడి కానీ లేదా మొత్తము పెట్టుబడి[ఉల్లేఖన అవసరం] పెట్టినంత ధనము పై సంవత్సరమునకు ఇంత శాతము అని లెక్కగట్టే "ఫ్లాట్-ఫీ" లేదా సంవత్సరము మొత్తము మీద పనితీరును లెక్కకడతారు.

"ప్రైవేట్" అనే పదము బ్యాంకుల రహస్యము మరియు ఆస్తులను జాగ్రత్తగా సరైన చోటకు ఇవ్వడము లేదా ఆస్తులను పన్ను వేసే అధికారుల నుంచి దాచి ఉంచడము అని కూడా వస్తుంది. స్విస్ మరియు కొన్ని విదేశీ బ్యాంకులు ఇలా పన్ను ఎగవేతదారులకు ఇలాంటి సహాయము చేస్తున్నందుకు కించపరచబడ్డాయి. పన్నుకు సంబంధించిన మోసములు స్విట్జర్లాండ్ లో పెద్ద నేరము అయినప్పటికినీ, పన్ను ఎగవేత అనేది కేవలము మామూలు నేరము, అందువలన బ్యాంకులు పన్నుకు సంబంధించిన అధికారులకు తెలియ చేయవలసిన అవసరము లేదు.[1]

ప్రైవేట్ బ్యాంకుల ర్యాంక్ లు[మార్చు]

వాడుకోదగిన ఆస్తులు, లాభములు, వినియోగదారులకు, మానేజర్ లకు, మరియు ఇవ్వ చూపుతున్న సేవలకు మధ్య రేషియో లను పరిగణనలోకి తీసుకునే యూరోమనీస్ 2010 సంవత్సరాంతపు ప్రైవేట్ బ్యాంకు మరియు సంపద నిర్వహణ ర్యాంకుల ప్రకారము ప్రపంచ వ్యాప్తముగా బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన ఆస్తులు ఒక్కో సంవత్సరము $11.8 ట్రిలియన్ల నుండి $6.8 ట్రిలియన్లకు తగ్గుతూ వస్తున్నాయి.

[2]

చాలా ఎక్కువ నెట్ వర్త్ ($30m+) 2010తో ఉండే ప్రైవేట్ బ్యాంకు అన్నింటిలో మంచిది. ఈ క్రింది పట్టిక ఒక తరగతికి చెందిన ప్రైవేటు బ్యాంకుల ర్యాంకుల ఫలితాలను చూపిస్తుంది. [3]

ర్యాంకు 10 కంపెనీ ర్యాంకు 09
1. జేపీ మోర్గాన్ 3
2. గోల్ద్మ్యన్ సఖ్స్ 2
3. యుబీయస్ 1
4. క్రెడిట్ స్యుసే 6
5. హెచ్ యస్ బీ సి 4
6. సిటిగ్రూప్ 5
7. పిక్టేట్ 8
8= డ్యుయిష్ బ్యాంక్ 7
8= రోత్స్ చైల్డ్ 11
10. బిఎన్ పి పరిబాస్ 10

2010లో జరిగిన యూరోమనీ యొక్క "బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఫోర్ అల్ట్రా హై నెట్ వర్త్ ($35m+)" అనే సర్వేలో జేపిమోర్గాన్ అన్నిటిలో పై స్థానములో నిలచింది.[4]

స్కేల్[మార్చు]

స్కార్పియో యొక్క 2010 ఉమ్మడి సంవత్సరాంతపు ప్రైవేట్ బ్యాంకింగ్ బెంచ్ మార్క్ ప్రకారము, అన్నిటికన్నా పెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ భాగము బ్యాంక్ ఆఫ్ అమెరికా లోనూ, ఆ తరువాతవి యుబియస్ ఏజీ, మోర్గాన్ స్టాన్లీ స్మిత్ బార్మే, మరియు వెల్ల్స్ ఫార్గోలో ఉన్నాయి. ఈ సంస్థలు అన్నీ ప్రైవేట్ వినియోగదారుల కొరకు పనిచేస్తూ ఒక ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులు సమీకరించుకున్నాయి. ప్రపంచ సంపత్తి మేనేజర్ల సంవత్సరపు రాంకింగ్ లు ఆస్తులు పెరుగుతున్నప్పటికీ వాటి స్థాయిలో మాత్రము అలాగే ఉన్నట్లుగా చూపించాయి (పెరిగిన ఆస్తుల నిర్వహణ చేస్తున్నా కూడా). మొదటి 10 సంస్థలు కలిసికట్టుగా USD8.733 ట్రిలియన్ లను HNW ఆస్తులుగా కలిగి ఉన్నాయి. మొత్తములో 64% ఈరోజు కేవలము ఫీజు మీద ఆధారపడి నిర్వహింపబడే ఆస్తులు మాత్రమే. మొదటి 20 కంపెనీలు క్రితం సంవత్సరపు USD9.2 ట్రిలియన్ల నుండి USD10.451 ట్రిలియన్లకు పెరిగాయి, అంటే మార్కెట్లో 77% కలిగి ఉన్నాయి. స్కార్పియో పార్టనర్ షిప్ బెంచ్ మార్క్ 2010, ప్రెస్ రిలీజ్ మరియు సారాంశము.

2009 డిసెంబరు 31, వరకు ప్రపంచంములోనే మొదటి పది పెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఇలా ఉన్నాయి. (ఆస్తులను బట్టి సూచిలో ఇవ్వబడ్డాయి.) [5]

 1. బ్యాంక్ అఫ్ అమెరికా ($1.740 ట్రిలియన్లు)
 2. యుబియస్ ($1.593 ట్రిలియన్లు)
 3. మోర్గాన్ స్టాన్లీ స్మిత్ బార్నే ($1.508 ట్రిలియన్లు)
 4. వెల్స్ ఫార్గో ($1.218 ట్రిలియన్లు)
 5. క్రెడిట్ సుజే ($775 బిలియన్లు)
 6. జేపి మోర్గాన్ ($636 బిలియన్లు)
 7. రాయల్ బ్యాంక్ అఫ్ కెనడా ($379 బిలియన్లు)
 8. HSBC (US$427.3 billion) (As at 31 dec 2009) http://www.assetmanagement.hsbc.com/gam/about-us హెచ్ యస్ బీ సి (యుయస్$427.3 బిలియన్లు) (2009 డిసెంబరు 31 వరకు) http://www.assetmanagement.hsbc.com/gam/about-us
 9. డ్యుచ్ బ్యాంక్ ($272 బిలియన్లు)
 10. పిక్తేట్ ($243 బిలియన్లు)

వీటిని కూడా చూడండి[మార్చు]

 • బ్యాంక్ యొక్క గోప్యత
 • విదేశీ/ఆఫ్షోర్ బ్యాంకు
 • స్విస్ బ్యాంక్
 • ఆర్ధిక విషయాల జాబితా
 • ఆర్థిక అంశాల జాబితా

సూచనలు[మార్చు]

 1. వైట్ లాక్,క్రైగ్."బ్యాంకింగ్ యుద్దములో స్విస్స్ గట్టిగా మాట్లాడింది: టాక్స్ హెవేన్స్ పై త్రేట్ లూమ్స్ ను బ్లాక్ లిస్టు చేసింది".వాషింగ్టన్ పోస్ట్, ఆదివారము,మార్చ్ 29, 2009; పేజీ A07.
 2. సంవత్సరముగా నిర్వహణలో ఉన్న ప్రైవేట్ బ్యాంకింగ్ కు చెందిన ఆస్తులు
 3. యూరోమని పత్రిక.ఫిబ్రవరి 2010 సంవత్సరపు ర్యాంకులు
 4. యూరోమని పత్రిక .ఫిబ్రవరి 2010 సంవత్సరపు ర్యాంకులు, అల్ట్రా హై నెట్ వర్త్ తో బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ($35m+)
 5. "Scorpio Partnership 2010 Global Private Banking". Cite news requires |newspaper= (help)$1 మిలియన్ లేదా అంత కంటే ఎక్కువ ఉన్నవి ఇవ్వబడ్డాయి.
 • అంతర్జాతీయ ప్రైవేట్ బ్యాంకర్- ప్రైవేట్ బ్యాంకింగ్ కు సంబంధించిన వార్తలు, సమాచారము, వివరణ మరియు వ్యాపార వివరములు :Privatebankerinternational.com
 • సంపద నిర్వహణలో తిరిగి శక్తి పుంజు కోవడము, రోలాండ్ బర్గర్ వ్యూహము యొక్క సలహాదారులు[1]