ప్రైవేట్ నెట్వర్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంటర్నెట్ అడ్రెసింగ్ వ్యవస్థలో, RFC 1918 మరియు RFC 4193 ప్రమాణాలను అనసరించి ప్రైవేట్ IP అడ్రెస్ స్పేస్ ను వాడే నెట్వర్క్ ను ప్రైవేట్ నెట్వర్క్ (Private network) అని అంటారు. ఈ అడ్రెస్లను ఎక్కువగా ఇల్లు, కార్యాలయం మరియు సంస్థాగత లోకల్ ఏరియా నెట్వర్క్ లకు (LANs) వాడుతారు. ప్రపంచవ్యాప్తంగా రూటింగ్ చేయగలే అడ్రెస్లను వాడవలసిన నిర్బంధం లేనప్పుడు లేదా ఉద్దేశించిన నెట్వర్క్ ప్రయోగాలకు అవి అందుబాటులో లేనప్పుడు, ఈ విధంగా చేయబడుతుంది. IPv4 అడ్రెస్ శోషణమును ఆలస్యం చేసే ప్రయత్నంలోనే మొదట్లో ప్రైవేట్ IP అడ్రెస్లు ప్రవేశపెట్టబడ్డాయి. కాని ఇవి మరుసటి తరం ఇంటర్నెట్ ప్రోటోకాల్ అయిన IPv6 లో కూడా ఒక భాగంగా ఉన్నాయి.

ఈ అడ్రెస్లు ప్రపంచవ్యాప్తంగా కేటాయించబడలలేదు కనుకనె ఇవి ప్రైవేట్ అని పిలవబడ్డాయి. అనగా, ఈ అడ్రెస్లు ఏ యొక్క సంస్థకు ప్రత్యేకంగా కేటాయించబడలేదు. ఇవి పంపే IP పాకెట్స్‌లను పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా పంపడం వ్ఈలు కాదు. ప్రాంతీయ ఇంటర్నెట్ రెజిస్ట్రి (RIR) ఆమొధం లేకుండా ఎవరైన ఈ అడ్రెస్లను వాడవచ్చు. ఇటువంటి ఒక ప్రైవేట్ నెట్వర్క్ ఇంటర్నెట్‌తో కలవాలంటే, ఒక నెట్వర్క్ అడ్రెస్ ట్రాంస్లేటర్ (NAT) గేట్వే లెదా ప్రాక్సి సెర్వర్ ను గాని వాడాలి.

సహజ ఉపయోగాలు[మార్చు]

ఈ తరహా అడ్రెస్లు సహజంగా గ్రుహ నెట్వర్క్‌లలో ఎక్కువగా వాడబడుతాయి. ఎందుకంటే, ప్రతి గ్రుహ ఖాతాధారుడుకు ఇంటర్నెట్ సెర్వీస్ ప్రొవైడర్ లు (ISPs) కేవలం రూట్ చేయగల ఒక్క IP అడ్రెస్‌ను మాత్రమే కేటాయిస్తుంది. కాని అనేక గ్రుహాలలో ఒకటికంటే ఎక్కువ నెట్వర్క్ చేయబడిన పరికరాలు ఉంటాయి కనుక. ఉదా: అనేక కంప్యూటర్లు మరియు ఒక్క వీడియో గేమ్ కన్‌సోల్. ఈ నేపథ్యయంలో, బహుళ-హోస్ట్‌లకు ఇంటర్నెట్ అనుసంధానం ఇవ్వడానికి సహజంగా ఒక NAT గేట్వే వాడబడుతుంది

ప్రైవేట్ అడ్రెస్లు కార్పరేట్ నెట్వర్క్‌లలో కూడా సహజంగా వాడబడుతున్నాయి. రక్షణా కారాణాల వలన ఈ నెట్వర్క్‌‌లు నేరుగా ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయబడవు. సహజంగా, SOCKS గేట్వే వంటి పరికరాల ద్వారా, నెట్వర్క్-లోపల ఉన్నవారికి నియంత్రిచబడిన ఇంటర్నెట్ ఏక్సస్ ఇవ్వబడుతుంది.

ఈ రెండు విషయాలలోనూ, ప్రైవేట్ అడ్రెస్లు అంతర్గత నెట్వర్క్ యొక్క రక్షణను పెంచడానికి వాడబడుతుంది. ఎందుకంటే, ఒక ఇంటర్నెట్ హోస్ట్ నేరుగా ఒక అంతర్గత వ్యవస్థతొ అనుసంధానం అవ్వడం చాలా కష్టం.

ప్రైవేట్ నెట్వర్క్‌లను విలీనం చేయడం[మార్చు]

పలు ప్రైవేట్ నెట్వర్క్‌లు అదే ప్రైవేట్ IP అడ్రెస్ స్పేస్‌ను వాడడం వలన ఒక సమస్య వస్తుంది. వాటిని విలీనం చేసినప్పుడు, అడ్రెస్ స్పేస అభిఘాతం జరుగుతుంది. అనగా, ఒకె అడ్ఱెస్లు పలు పరికరాలలో ఉంటాయి. అప్పుడు, నెట్వర్క్‌లను గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇది చాలా సమయం వ్రుదా అవుతుంది. లేదా డూప్లికేట్ అడ్రెస్‌అను మాయ చేయడానికి నెట్వర్క్‌ల మధ్య ఒక NAT రూటర్‌ను పెట్టాలి.

ప్యాకెట్‌లు "లీకింగ్"[మార్చు]

ప్రైవేట్ అడ్రెస్ స్పేస్‌ల నుంచి వచ్చే పాకెట్లు ఇంటర్నెట్‌లోకి లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరిగ్గా పరికూర్పు చేయబడని ప్రైవేట్ నెట్వర్క్‌లు ఈ అడ్రస్‌లకు రివర్స్ DNS లుక్‌అప్ ను ప్రయత్నిస్తాయి. దీని వలన ఇంటర్నెట్ రూట్ నేమ్ సర్వర్‌లకు సంచారం అధికరిస్తుంది. ఈ అధిక సంచార సమస్యను తగ్గించడానికి AS112 ప్రాజెక్ట్ ప్రయత్నించింది. ప్రైవేట్ అడ్రెస్‌లకు విసేష బ్లాక్‌హోల్ ఎనీకాస్ట్ నేమ్‌సర్వర్లను ఉపయోగించి ఈ ఫలితాన్ని సాధించాయ. ఈ నేమ్‌సర్వర్లు ఈ కొరీ లకు నెగతటివ్ కోడ్‌లను (లేవు ) మాత్రమే పంపుతాయి.

సంస్ధాగత ఎడ్జ్ రూటర్లు, నెట్వర్క్‌లకు ఇంగ్రెస్స్ IP సంచారాన్ని వదిలివేయడానికే పరికూర్పు చేయబడి ఉంటాయి. ఇది అనుకోకుండా జరగవచ్చు లేదా ఒక స్పూఫేడ్ సోర్సు అడ్రెస్ ను వాడే మెలీషియస్ సంచారం నుంచి కావచ్చు.

కొన్ని సార్లు ISP ఎడ్జ్ రూటర్లు ఇటువంటి ఎగ్రెస్ సంచారాన్ని ఖాతాదారులకు చేరకుండా వదిలెస్యాయి. దీని వలన ఇంటర్నెట్‌కు తాకిడి తగ్గుతుంది.

ప్రైవేట్ IPv4 అడ్రెస్ స్పేస్‌లు[మార్చు]

ఈ క్రింద ప్రైవేట్ నెట్వర్క్‌ల IPv4 అడ్రెస్‌లను RFC 1918లొ ప్రచురించిన విధంగా కేటాయించాలని ఇంటర్నెట్ స్ద్సిండ్ నంబర్స్ అథారిటి (IANA) ను ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సు (IETF) ఆదేశించింది:

RFC1918 పేరు IP అడ్రెస్ శ్రేణి అడ్రెస్లు సంఖ్య క్లాస్‌ఫుల్ వివరణ హోస్ట్ id సైజు
24-బిట్ బ్లాక్ 10.0.0.0 – 10.255.255.255 16,777,216 ఒక క్లాస్ A 10.0.0.0/8 (255.0.0.0) 24 బిట్లు
20-బిట్ బ్లాక్ 172.16.0.0 – 172.31.255.255 1,730,000 16 వరుస క్లాస్ Bలు 172.16.0.0/12 (255.240.0.0) 20 బిట్లు
16-బిట్ బ్లాక్ 192.168.0.0 – 192.168.255.255 65,536 256 వరుస క్లాస్ Cలు 192.168.0.0/16 (255.255.0.0) 16 బిట్లు

క్లాస్‌ఫుల్ అడ్రెసింగ్ అనేది ఒక కాలం చెల్లిన పద్ధతి. 1993లో క్లాస్లెస్ ఇంటర్-డొమైన్ రూటింగ్ (CIDR) అమలు ప్రారంభించినప్పటినుంచి ఈ పద్ధతి ఇంటర్నెట్‌లో వాడబడదం లేదు. ఉధాహరణకు: 10.0.0.0/8 ఒక క్లాస్ A నెట్వర్క్. కాని దీనిని సంస్థలు మరింత చిన్న /16 or /24 నెట్వర్క్‌లుగా విబజిస్తాయి.

ప్రైవేట్ IPv6 అడ్రెస్లు[మార్చు]

ఈ ప్రైవేట్ నెట్వర్క్‌లు మరియు వాటికి విసేష అడ్రెస్ కేటాయింపులను IPv6 అనే తరువాత తరం ఇంటర్నెట్ ప్రోటోకాల్ లో కూడా వాడబడుతుంది.

RFC 4193లొ వివరించినట్లుగా fc00::/7 అనే అడ్రెస్ బ్లాక్‌ను IANA రిజర్వ్ చేసింది. . ఈ అడ్రెస్లు యునిక్ లోకల్ అడ్రెస్లు (ULA) అని పిలవబడుతాయి. వీటిని ఉనికాస్ట్ అని పిలుస్తారు. రెండు ప్రైవేట్ నెట్వర్క్‌లు అంతర్గత అనుసంధానం అయినప్పుడు, అభిఘాతాన్ని తప్పించడానికి ఇది రూటింగ్ ప్రేఫిక్స్‌లో ఒక 40-బిట్ రాండం సంఖ్యను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా లోకల్ అయినప్పటికి, యునిక్ లోకల్ అడ్రెస్లు IPv6 అడ్రెస్ స్కోప్ గ్లోబల్‌గా ఉంటుంది. (cf. IPv6 అడ్రెస్లు, సెక్షన్ "IPv6 అడ్రెస్ స్కోప్స్").

ఒక పూర్వపు ప్రమాణం "సైట్ లోకల్" అడ్రెస్ లను fec0::/10 శ్రేణిలో వాడాలని ప్రతిపాదించింది. కాని స్కేలబిలిటి, సైట్ అనే పదానికి సరైన నిర్వచనం లేకపోవడంవంటి కారణాల వలన RFC 3879 దీనిని సెప్టెంబర్ 2004 నుంచి తొలగించింది.

లింక్-లోకల్ అడ్రెస్లు[మార్చు]

మరొక ప్రైవేట్ నెట్వర్కింగ్ RFC 5735 మరియు RFC 3927 లలో కోడిఫై చేయబడిన లింక్-లోకల్ అడ్రెస్ శ్రేణిను వాడుతుంది. ఈ అడ్రస్ల ఉపయోగం ఏమంటే, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ (DHCP) సేవలు అందుబాటులో లేనప్పుడు మరియు నెట్వర్క్ నిర్వాహుకుడు చే మాన్యువల్ కాన్ఫిగరేషణ్ చేయడం అనువు కానప్పుడు, నెట్వర్క్ పరికరాలు సెల్ఫ్-ఆటోకాన్ఫిగరేషణ్ చేసుకుంటాయి.

IPv4లో, బ్లాక్ 169.254/16 ఈ ఉపయోగానికోసం రిజర్వ్ చేయబడింది. మొదటి మరియు ఆకరి /24 సబ్నేట్ మాత్రం మినాయిమ్చ బడింది. IEEE 802 (ఈతేర్నేట్) నెట్వర్క్ లోని ఒక హోస్ట్ DHCP ద్వారా నెట్వర్క్ అడ్రెస్ ను పొందలేనప్పుడు, సూడోరాండం పద్ధతిలో 169.254.1.0 నుండి 169.254.254.255 లోపల ఒక అడ్రస్ కేటాయించబడుతుంది అడ్రస్ అభిఘాతాలను సాఫీగా కైకోనాలని ప్రమాణం నియంత్రిస్తుంది.

IPv6 అద్రేసింగ్ విధానం బ్లాక్ fe80::/10ను IP అడ్రెస్ ఆటో కన్ఫిగరేషన్ కొరకు కేటాయించింది.

రిజర్వ్ చేయబడిన ఇతర అడ్రెస్ల ప్రైవేట్ ఉపయోగం[మార్చు]

చారిత్రాత్మకంగా, ప్రైవేట్ అడ్రెస్ శ్రేణీలు కాకుండా ఇతర అడ్రెస్ బ్లాక్ లను ఇతర భవిష్యత్తు ఉపయోగాల కొరకు రిజర్వ్ చేయబడ్డాయి. అధికారకంగా హెచ్చరికలు జారి చేసినాప్ప్తికి, కొన్ని సంస్థలు వీటిని ప్రైవేట్ నేత్వోర్కింగ్ ఉపయోగాలకు వాడుతున్నాయి.

RFC రెఫెరెన్సులు[మార్చు]

 • RFC 1918"ప్రైవేట్ ఇంటర్నెట్ల కొరకు అడ్రెస్ కేటాయింపులు"
 • RFC 2036"ఇంటర్నెట్లో క్లాస్ A అడ్రెస్ స్పేస్ ల భాగాలను వాడకం గురించి పరిశీలనాలు"
 • RFC 2050"ఇంటర్నెట్ రిజిస్ట్రీ IP కేటాయింపు మార్గదర్శకాలు"
 • RFC 2101"ప్రస్తుతం IPv4 అడ్రెస్ యొక్క ప్రవర్తన"
 • RFC 2663"IP నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్లెటర్ (NAT) టెక్నాలజీ మరియు ఆలోచనలు"
 • RFC 3022"సాప్రదాయక IP నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్లెటర్ (సాంప్రదాయక NAT)"
 • RFC 3330"విశేష-ఉపయోగం IPv4 అడ్రెస్లు" (ఇప్పుడు కొట్టేయబడింది)
 • RFC 5735"విశేష-ఉపయోగం IPv4 అడ్రెస్లు"
 • RFC 3879"సైట్ లోకల్ అడ్రెస్ లను తొలగించడం"
 • RFC 3927"డైనమిక్ కాన్ఫిగరేషన్ అఫ్ IPv4 లింక్-లోకల్ అడ్రసస్"
 • RFC 4193"యునిక్ లోకల్ IPv6 యునికస్ట్ అడ్రసస్"

సూచనలు[మార్చు]