ప్రోథ్రాంబిన్ సమయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కణజాల కారకం జోడించిన తరువాత రక్తంలో ప్లాస్మా (వేగవంతమైన-పరీక్ష). ఒక స్టీలు బంతిని నిలిపివుంచగల బలం ఉన్న జిగురు-లాంటి నిర్మాణం.

ప్రోథ్రాంబిన్ సమయం (prothrombin time) (PT ) మరియు దీని యొక్క ఉత్పన్న ప్రమాణాలు ప్రోథ్రాంబిన్ నిష్పత్తి (PR ) మరియు అంతర్జాతీయ సాధారణ నిష్పత్తి (INR ) అనేవి ఘనీభవనం యొక్క బాహ్య మార్గ ప్రమాణాలు. వార్ఫరిన్ మోతాదు, కాలేయం దెబ్బతినడం, మరియు విటమిన్ K స్థాయిని కొలవడంలో రక్తం గడ్డకట్టే ధోరణిని గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. I, II, V, VII, మరియు X కారకాలను PT కొలుస్తుంది. అంతర్గత మార్గాన్ని కొలిచే ఉత్తేజిత అంశిక థ్రాంబోప్లాస్టిన్ సమయం (aPTT) తో ఉమ్మడిగా దీనిని ఉపయోగిస్తారు.

ప్రయోగశాల కొలత[మార్చు]

సాధారణ స్థాయి[మార్చు]

ప్రోథ్రాంబిన్ సమయం యొక్క నమూనా స్థాయి సాధారణంగా 11-16 సెకన్లు ఉండగా; INRకు సాధారణ స్థాయి 0.8–1.2 ఉంటుంది. వార్ఫరిన్ వంటి ప్రతిస్కందకాలు (యాంటీకోయాగ్యులాంట్‌లు) ఉపయోగించడం ద్వారా వైద్య నిపుణులు చికిత్సా సంబంధ యాంటికోయాగ్యులేషన్ (రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించేందుకు ప్రతిస్కందకాలను వాడటం) తో అధిక INR - అనేక సందర్భాల్లో 2.5 - కోసం ప్రయత్నించవచ్చు.

పరిశోధనా పద్ధతి[మార్చు]

రక్తంలో ప్లాస్మాను ఉపయోగించి ఎక్కువగా ప్రోథ్రాంబిన్ సమయాన్ని కొలుస్తారు. నమూనాలో కాల్షియాన్ని బంధించడం ద్వారా ఒక ప్రతిస్కందకంగా పనిచేసే ద్రవరూప సిట్రేట్ ఉన్న ఒక పరీక్ష నాళిక (టెస్ట్ ట్యూబ్) లోకి రక్తాన్ని తీసుకుంటారు. రక్తం కలిసిపోయిన తరువాత ప్లాస్మా నుంచి రక్త కణాలను వేరుపరిచేందుకు అపకేంద్రీకరణం చేస్తారు. శిశువుల్లో, ఒక కేశనాళిక నిండు రక్త నమూనాను ఉపయోగిస్తారు.[1]

37 °C (సెంటీగ్రేడ్) ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మా నమూనాను ఉంచే ఒక స్వయంచాలక ఉపకరణంపై ఒక జీవవైద్య శాస్త్రవేత్త ప్లాస్మాను విశ్లేషిస్తారు. కాల్షియాన్ని అదనంగా జోడించినట్లయితే (అందువలన సిట్రేట్ యొక్క ప్రభావాలు తిరగబెడతాయి) రక్తం తిరిగి గడ్డకట్టడానికి దారితీస్తుంది. కచ్చితమైన కొలత కోసం రక్తం మరియు సిట్రేట్ నిష్పత్తిని స్థిరీకరించాల్సిన అవసరం ఉంది; నాళిక సరిగా నిండనట్లయితే మరియు అధిక స్థాయిలో సిట్రేట్ ఉన్నట్లయితే అనేక ప్రయోగశాలలు నిర్ధారణ మాపనాన్ని నిర్వహించవు. నాళికను సరిగా నింపకపోయినా లేదా రక్తంతో ఎక్కువగా నింపినా, ప్రామాణికం చేసిన విలీనీకరణం, అంటే 9 భాగాల రక్తానికి 1 భాగం ప్రతిస్కందకం జోడించడం, చెల్లుబాటు కాదు. ప్రోథ్రాంబిన్ సమయ పరీక్ష కోసం తగిన నమూనాలుగా పైభాగం నీలిరంగులో ఉండే నాళిక లేదా ఒక ద్రవీకృత ప్రతిస్కందకమైన సోడియం సిట్రేట్ నాళిక గుర్తించబడుతున్నాయి.

కణజాల కారకాన్ని (దీనిని III కారకంగా కూడా గుర్తిస్తారు) జోడించినట్లయితే, నమూనా గడ్డకట్టడానికి పట్టే సమయాన్ని కంటిచూపును ఉపయోగించి కొలవవచ్చు. కొన్ని ప్రయోగశాలలు ఒక యాంత్రిక కొలతను ఉపయోగిస్తాయి, ఇది లెపెమిక్ మరియు ఐక్టెరిక్ నమూనాల నుంచి జోక్యాలను తొలగిస్తాయి. ప్రోథ్రాంబిన్ నిష్పత్తి అనేది నియంత్రణ ప్లాస్మా యొక్క ఫలితం ద్వారా విభజించబడే ఒక రోగి యొక్క ప్రోథ్రాంబిన్ సమయం.

అంతర్జాతీయ సాధారణ నిష్పత్తి[మార్చు]

నిర్వహించిన విశ్లేషణ పద్ధతి రకం ఆధారంగా సాధారణ వ్యక్తిపై ప్రోథ్రాంబిన్ సమయం కోసం నిర్వహించే పరీక్ష ఫలితం (సెకన్లలో) మారుతుంటుంది. ఉత్పత్తిదారు, పరీక్షను నిర్వహించేందుకు ఉపయోగించే కణజాల కారకం యొక్క బ్యాచ్‌ల మధ్య వ్యత్యాసాలు కారణంగా ఇది సంభవిస్తుంది. ఫలితాలను ప్రామాణికం చేసేందుకు INRను ఉపయోగిస్తారు. ప్రతి ఉత్పత్తిదారు తయారు చేసే ప్రతి కణజాల కారకానికి ఒక ISI విలువ (అంతర్జాతీయ సూక్ష్మగ్రాహ్య సూచి) ను కేటాయిస్తారు. కణజాల కారకం యొక్క ప్రతి బ్యాచ్ ఏ విధంగా ఒక అంతర్జాతీయ సాధారణ నమూనాకు సరిపోలుతుందో ISI విలువ సూచిస్తుంది. ISI సాధారణంగా 1.0 మరియు 2.0 మధ్య ఉంటుంది. ఉపయోగించే విశ్లేషణ పద్ధతి కోసం ISI విలువను ఘాతానికి పెంచి, ఒక రోగి యొక్క ప్రోథ్రాంబిన్ సమయం మరియు ఒక సాధారణ (నియంత్రణ) నమూనా మధ్య కనుగొనే నిష్పత్తిని INRగా పరిగణిస్తారు.

'"`UNIQ--postMath-00000001-QINU`"'

వివరణ[మార్చు]

కణజాల కారకాన్ని (జంతువుల నుంచి సేకరిస్తారు) జోడించిన తరువాత ప్లాస్మా గడ్డకట్టేందుకు పట్టే సమయాన్ని ప్రోథ్రాంబిన్ సమయం అంటారు. ఘనీభవనం యొక్క బాహ్య మార్గం (సాధారణ మార్గం యొక్క) నాణ్యతను ఇది కొలుస్తుంది. బాహ్య మార్గం యొక్క వేగం శరీరంలో కారకం VII యొక్క స్థాయిలతో బాగా ప్రభావితమవుతుంది. కారకం VIIకు తక్కువ అర్ధ-జీవితం ఉంటుంది, దీని యొక్క సంయోజనానికి విటమిన్ K అవసరమవుతుంది. ప్రోథ్రాంబిన్ సమయం విటమిన్ Kలో లోపాల ఫలితంగా పొడిగించబడవచ్చు, వార్ఫరిన్, వక్ర శోషణ లేదా బ్యాక్టీరియాలు పేగుల్లో స్థిరపడటం (శిశువుల్లో) ద్వారా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా, కారకం VII యొక్క పేలవమైన సంయోజనం (కాలేయ వ్యాధి కారణంగా) లేదా పెరిగిన వినియోగం (ప్రసరణ రక్తనాళ స్కంధనంలో) కూడా PT పొడిగించబడటానికి కారణం కావొచ్చు.

INR=5 వంటి అధిక INR స్థాయి రక్తస్రావానికి ఎక్కువ అవకాశం ఉండటాన్ని సూచిస్తుంది, ఇదిలా ఉంటే INR=0.5 ఉన్నట్లయితే రక్తం గడ్డకట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి సాధారణ స్థాయి 0.9–1.3 మధ్య, వార్ఫరిన్ చికిత్సలో ఉన్న వ్యక్తులకు 2.0–3.0 మధ్య ఉంటుంది, అయితే లక్షిత INR కొన్ని పరిస్థితుల్లో ఇంకా ఎక్కువగా ఉండవచ్చు, యాంత్రిక హృదయ కవాటం లేదా శస్త్రచికిత్సకు ముందు, తరువాత కొద్ది కాలంలో తక్కువ-పరమాణు బరువు గల హెపరిన్ (ఎనోక్సాపరిన్ వంటివి) తో అనుసంధాన వార్ఫరిన్ వినియోగం వంటి సందర్భాల్లో ఇది ఎక్కువగా ఉండవచ్చు.

మూస:Bleeding worksheet

కచ్చితత్వాన్ని గుర్తించే కారకాలు[మార్చు]

థ్రాంబోసిస్ కోసం ముందుగా నిక్షేపించబడే ఒక వ్యావర్తక అవరోధకం ల్యూపస్ ప్రతిస్కందకం ఉపయోగించిన నిర్ధారణ మాపనం ఆధారంగా PT ఫలితాలను వక్రీకరించవచ్చు.[2] గతంలో వివిధ థ్రాంబోప్లాస్టిన్ తయారీల మధ్య వ్యత్యాసాలు INR కొలతల కచ్చితత్వాన్ని తగ్గించడానికి దారితీశాయి, అంతర్జాతీయ క్రమాంకన చర్యలు (INR చేత) చేపట్టినప్పటికీ, ప్రస్తుతం కూడా వివిధ కిట్‌ల మధ్య గణాంకపరంగా గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు ఒక 2005 అధ్యయనం సూచించింది, [3] తద్వారా ప్రతిస్కందక చికిత్సకు ఒక ప్రమాణంగా PT/INR యొక్క దీర్ఘ-కాల సమర్థతపై సందేహాలు ఏర్పాడ్డాయి.[4]

గణాంకాలు[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారుగా 800 మిలియన్ PT/INR నిర్ధారణ మాపనాలను నిర్వహిస్తున్నారు.[4]

రోగి వద్ద పరీక్ష[మార్చు]

పైన పేర్కొన్న ప్రయోగశాల పద్ధతులతోపాటు, నియర్ పేషెంట్ టెస్టింగ్ (రోగి వద్ద నిర్వహించే పరీక్ష) (NPT) లేదా ఇంటిలో INR పర్యవేక్షణ కొన్ని దేశాల్లో సాధారణ వాడుకలోకి రావడం పెరుగుతోంది. ఉదాహరణకు, యునైటెడ్ కింగ్‌డమ్‌లో రోగి వద్ద నిర్వహించేందుకు ఉద్దేశించిన పరీక్షను ఇంటివద్ద రోగులు మరియు కొందరు ప్రతిస్కందక చికిత్సా కేంద్రాలు (తరచుగా వైద్యశాలలోని) ఉపయోగిస్తున్నాయి, దీనిని ప్రయోగశాల పద్ధతి కంటే వేగవంతమైన మరియు అనుకూలమైన పద్ధతిగా ఉపయోగించడం జరుగుతుంది. మొదట NPT ఫలితాల యొక్క కచ్చితత్వం సందేహాస్పదంగా ఉన్నప్పటికీ, ఒక నూతన తరం యంత్రాలు మరియు పరీక్షక పదార్థాలకు క్రమక్రమంగా ఆమోదం పెరుగుతోంది, ఇవి అందించే ఫలితాలు ప్రయోగశాలలో నిర్వహించే పరీక్షల ఫలితాలకు దాదాపుగా సమానంగా ఉండటంతో సర్వత్రా ఆమోదం లభిస్తుంది.[5]

ఒక రోచి కోయాగ్యుచెక్ ఎక్స్ఎస్.

ఒక విలక్షణ NPT అమరికలో ఒక చిన్న బల్లపై అమర్చే పరికరాన్ని ఉపయోగిస్తారు; ఉదాహరణకు రోచి కాగుచెక్ ఎస్, ఇంటర్నేషనల్ టెక్నిడైన్ కార్పొరేషన్ హెమోచ్రోన్ సిగ్నేచర్ లేదా మరింత ఇటీవల (2005) పరిచయం చేయబడిన హెమోసెన్స్ ఐఎన్‌రేషియో. కేశనాళిక రక్తం యొక్క ఒక చుక్కను స్వయంచాలకంగా వేలిపై సూదిని గుచ్చడం ద్వారా సేకరిస్తారు, ఈ స్వయంచాలక పద్ధతిలో దాదాపుగా ఎటువంటి నొప్పి లేకుండా రక్తాన్ని సేకరించవచ్చు. ఈ చుక్కను వాడి పారేసే పరీక్షా బద్దపై ఉంచుతారు, ఈ బద్ద పరీక్ష కోసం ఉపయోగించే యంత్రంలో భాగంగా ఉంటుంది. తత్ఫలితంగా వచ్చే INR కొన్ని సెకన్ల తరువాత తెరపై ప్రత్యక్షమవుతుంది. ఇటువంటి పరీక్షా పద్ధతులను మధుమేహ రోగులు ఇన్సులిన్ కోసం ఉపయోగిస్తారు, ఈ పద్ధతుల ఉపయోగాన్ని సులభంగా నేర్చుకోవడం మరియు ఆచరించడం సాధ్యపడుతుంది.

రోగి లేదా ఒక స్కంధన నిపుణుడు (నర్సు, సాధారణ సాధకుడు లేదా ఆస్పత్రి వైద్యుడు) ఫలితాన్ని వివరించడం మరియు ఔషధ మోతాదును నిర్ణయించడం చేయవచ్చా లేదా అనేది స్థానిక విధానం నిర్ణయిస్తుంది. జర్మనీలో, రోగులు ఔషధ మోతాదును సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది,[ఆధారం చూపాలి] ఇదిలా ఉంటే యునైటెడ్ కింగ్‌డమ్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన నిర్ణయం ఆరోగ్య సంరక్షణ నిపుణుల చేతిలో ఉంటుంది. ఉదాహరణకు, ఫిలిప్స్ ఐఎన్ఆర్ ఎట్ హోమ్ [1] వంటి పరికరాల సేవలను ఉపయోగిస్తున్న రోగులు వారి INR ఫలితాలపై ప్రతి వారం ఫోన్ చేస్తారు, ఈ సమాచారం వారి వైద్యుడికి బదిలీ చేయబడుతుంది, రోగులకు పరిధికి మించిన స్థాయిలు ఉన్నట్లయితే అప్పుడు వైద్యులు తక్షణ జోక్యం చేసుకోవడం లేదా ఔషధాల్లో సర్దుబాటును సూచించడం చేస్తారు.

ఇంటిలో పరీక్షల నిర్వహించుకోవడం వలన ఒక గణనీయమైన ప్రయోజనం ఏమిటంటే వైద్య మద్దతుతో రోగులు స్వయంగా పరీక్ష నిర్వహించుకోవడం మరియు రోగి స్వీయ-నిర్వహణ (దీనిలో రోగులు తమ ప్రతిస్కందక మోతాదును తమకుతామే సర్దుబాటు చేసుకుంటారు) ఫలితంగా ప్రతిస్కందక నియంత్రణ మెరుగుపడుతుంది. 14 పరీక్షలను సమీక్షించిన ఒక అధి విశ్లేషణలో ఇంటిలో పరీక్షలు నిర్వహించుకునే విధానం దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం (రక్తస్రావం మరియు రక్తం గడ్డకట్టడం) తగ్గడానికి తోడ్పడిందని వెల్లడైంది, ప్రతిస్కందక నియంత్రణలో ఒక పరోక్ష ప్రమాణమయిన, చికిత్సాధ్యయన స్థాయిలో సమయం మెరుగుపడిందని సూచించింది.[6]

NPT పద్ధతి యొక్క ఇతర ప్రయోజనాలు ఏమిటంటే ఇది బాగా వేగవంతమైనది మరియు అనుకూలమైనది, సాధారణంగా తక్కువ బాధాకరంగా ఉంటుంది, ఇంటిలో ఉపయోగించేందుకు అనువైన పరిస్థితులు కల్పించడం మరియు రోగులు వారి సొంత INRలను అవసరమైనప్పుడు కొలిచే సామర్థ్యాన్ని అందించడం చేస్తుంది. దీనికి సంబంధించిన సమస్యల్లో సరైన ప్రదేశానికి రక్తాన్ని అందించేందుకు చేతిని స్థిరంగా ఉంచాల్సిన అవసరం ఉంది, కొందరు రోగులు చేతి వేలిపై గుచ్చి రక్తాన్ని సేకరించే పద్ధతిని ఇబ్బందికరంగా భావిస్తారు, అంతేకాకుండా పరీక్షా బద్దల యొక్క వ్యయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. UKలో ఈ బద్దలను వైద్యుడి సిఫార్సుపై అందిస్తారు, అందువలన వృద్ధులు మరియు నిరుద్యోగులు వాటికి డబ్బు చెల్లించరు, ఇతరులు ప్రామాణిక ఔషధ నిర్ణయ ధరను మాత్రమే చెల్లిస్తారు, ఇది బద్దల యొక్క చిల్లర ధరలో సుమారుగా 20% మాత్రమే ఉంటుంది. USAలో యాంత్రిక హృదయ కవాటాలు ఉన్న రోగులకు ఇంటిలో నిర్వహించే NPTలకు ప్రస్తుతం మెడికేర్ ద్వారా తిరిగి డబ్బు చెల్లిస్తున్నారు, ప్రైవేట్ బీమా సంస్థలు ఇతర సూచనలకు బీమా కల్పిస్తున్నాయి.మెడికేర్ ప్రస్తుతం దీర్ఘకాల శరీరకుహర దడతో బాధపడుతున్న రోగులకు ఇంటిలో నిర్వహించే పరీక్షలకు బీమా కల్పిస్తుంది. ఇంటిలో పరీక్షలు నిర్వహించేందుకు ఒక వైద్యుడి నిర్ణయం అవసరమవుతుంది.

కొంరు రోగుల్లో NPT తక్కువ కచ్చితత్వం కలిగివుంటుందని ఆధారాలు ఉన్నాయి, ల్యూపస్ ప్రతిస్కందకం ఉన్నవారిలో దీని కచ్చితత్వం అనుమానాస్పదంగా ఉంది.[7]

మార్గదర్శకాలు[మార్చు]

2005లో నోటిద్వారా తీసుకునే ప్రతిస్కందకాలను ఇంటిలో ఉపయోగించడాన్ని పర్యవేక్షించేందుకు ఇంటర్నేషనల్ సెల్ఫ్-మోనిటరింగ్ అసోసియేషన్ ఫర్ ఓరల్ యాంటీకోయాగ్యులేషన్ అంతర్జాతీయ మార్గదర్శకాలను ప్రచురించింది.[8] అంతర్జాతీయ మార్గదర్శకాల అధ్యయనం ప్రకారం, రోగి స్వీయ-పరీక్ష మరియు రోగి స్వీయ-నిర్వహణ నోటిద్వారా తీసుకునే ప్రతిస్కందక చికిత్సకు సమర్థవంతమైన పద్ధతులుగా ఏకాభిప్రాయం కుదిరింది, ఈ పద్ధతులు వైద్యశాల ప్రతిస్కందక పరీక్షతో సాధించే ఫలితాలకు దాదాపుగా సమానమైన మరియు బహుశా మెరుగైన ఫలితాలు ఇస్తాయని అంగీకారానికి వచ్చారు. రోగులందరూ తగిన స్థాయిలో తప్పనిసరిగా శిక్షణ పొందాలని సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్వీయ-పరీక్షా/స్వీయ-నిర్వహణ పరికరాలు ప్రయోగశాల పరీక్షల్లో సేకరించే ఫలితాలకు దాదాపుగా సమానమైన INR ఫలితాలను ఇస్తాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువ మంది వ్యక్తులు ఇంటిలో INR పరీక్షల నిర్వహించడానికి వీలు కల్పించేందుకు INR గృహ పరీక్షా పరిధిని విస్తరించింది. మార్చి 19, 2008న విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికాయిడ్ సర్వీసెస్ (CMS) ఆరోగ్య సంరక్షణ పరిధిలోకి ఇంటిలో నిర్వహించే ప్రోథ్రాంబిన్ సమయ (PT) అంతర్జాతీయ సాధారణ నిష్పత్తి (INR) రక్త పరీక్షను తీసుకొచ్చేందుకు వార్ఫరిన్ మందును ఉపయోగిస్తున్న వారికి వీలు కల్పించింది, వార్ఫరిన్ ఒక ప్రతిస్కందక (రక్తాన్ని పలచగా చేసే కారకం) ఔషధం, దీనిని దీర్ఘకాల కర్ణిక సంబంధ దడ లేదా సిరలు మూసుకుపోవడం వంటి సమస్యలకు మందుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, దీర్ఘకాల కర్ణిక సంబంధ దడ లేదా సిరలు మూసుకుపోవడం వంటి సమస్యలకు సంబంధించిన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆరోగ్యసంరక్షణ లబ్ధిదారులు మరియు వారి వైద్యులు ఇంటిలో ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా గణనీయమైన స్థాయిలో లబ్ధి పొందుతారు.[9]

చరిత్ర[మార్చు]

ప్రోథ్రాంబిన్ సమయాన్ని డాక్టర్ ఆర్మాండ్ క్విక్ మరియు ఆయన సహచరులు 1935లో గుర్తించారు[10], ఒక ద్వితీయ పద్ధతిని డాక్టర్ పాల్ ఒవ్రెన్ ప్రచురించారు, [11], దీనిని పి అండ్ పిగా లేదా ప్రోథ్రాంబిన్ అండ్ ప్రోకాన్వెర్టిన్ పద్ధతిగా గుర్తిస్తారు. ప్రతిస్కందకాలు డికుమారోల్ మరియు వార్ఫరిన్ గుర్తించడంలో ఇవి సాయపడతాయి, [12] తరువాత చికిత్సా మార్గంలో ఉపయోగించినప్పుడు వార్ఫరిన్ యొక్క కార్యకలాపాన్ని కొలిచేందుకు దీనిని ఉపయోగించారు.

వివిధ ప్రోథ్రాంబిన్ సమయ నిర్ధారణ మాపనాల్లో గణనీయమైన స్థాయిలో వైవిధ్యాలను గుర్తించడంతో, INRను 1980వ దశకం ప్రారంభంలో పరిచయం చేశారు, థ్రాంబోప్లాస్టిన్ (కణజాల కారకం) సాంద్రత యొక్క స్వచ్ఛత విషయంలో సమస్యల కారణంగా ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి.[13] ప్రపంచవ్యాప్తంగా INRకు విస్తృత గుర్తింపు లభించింది, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదంతో ఇది విశేష ప్రాచుర్యం పొందింది.[14]

సూచనలు[మార్చు]

 1. ఫ్రిట్స్మా, జార్జి ఎ. "ఎవాల్యూషన్ ఆఫ్ హెమోస్టాసిస్." హెమటాలజీ: క్లినికల్ ప్రిన్సిపుల్స్ అండ్ అప్లికేషన్స్ . ఎడ్. బెర్నాడెట్ రోడాక్. డబ్ల్యూ.బి. సౌండర్స్ కంపెనీ: ఫిలడెల్ఫియా, 2002. 719-53. ఫ్రింట్
 2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 4. 4.0 4.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 5. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 7. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 8. Jack Ansell (10 March 2005). "Guidelines for implementation of patient self-testing and patient self-management of oral anticoagulation. International consensus guidelines prepared by International Self-Monitoring Association for Oral Anticoagulation". International Journal of Cardiology.
 9. "Medicare expands coverage for home blood testing of prothrombin time international normalized ratio". The Centers for Medicare and Medicaid Services. 19 March 2008.
 10. Quick AJ, Stanley-Brown M, Bancroft FW (1935). "A study of the coagulation defect in hemophilia and in jaundice". Am J Med Sci. 190: 501. doi:10.1097/00000441-193510000-00009.CS1 maint: Multiple names: authors list (link)
 11. Owren PA, Aas K (1951). "The control of dicumarol therapy and the quantitative determination of prothrombin and proconvertin". Scand. J. Clin. Lab. Invest. 3 (3): 201–8. doi:10.3109/00365515109060600. PMID 14900966.
 12. Campbell HA, Smith WK, Roberts WL, Link KP (1941). "Studies on the hemorrhagic sweet clover disease. II. The bioassay of hemorrhagic concentrates by following the prothrombin level in the plasma of rabbit blood". J Biol Chem. 138: 1–20.CS1 maint: Multiple names: authors list (link)
 13. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 14. Anonymous (1983). "33: Expert Committee on Biological Standardization. Requirements for thromboplastins and plasma used to control oral anticoagulant therapy". World Health Organ Tech Rep Ser. pp. 81–105.

మూస:Myeloid blood tests