Jump to content

ఫజల్ ఖురేషి

వికీపీడియా నుండి
ఫజల్ ఖురేషి
ప్రాంతము ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
సంగీత రీతి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, జజ్ ఫ్యూజన్
వృత్తి తబలా ప్లేయర్
వాయిద్యం తబలా, కంజీరా

ఫజల్ ఖురేషి (జననం 1961 ఫిబ్రవరి 13), ఒక భారతీయ తబలా వాద్యకారుడు. ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖా కుమారుడు అయిన ఫజల్ ఖురేషి తండ్రి మార్గదర్శకత్వంలో తబలా ప్లేయర్ గా ఎదిగాడు. తన సోదరుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ నుండి కూడా ఆయన ప్రేరణ పొందాడు.[1] ప్రపంచంలోని ఇతర సంగీత శైలులతో, ముఖ్యంగా జజ్ (Jazz), పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో నిమగ్నమై తన పరిధులను విస్తరించుకున్నాడు. ఆయన అనేక మంది ప్రసిద్ధ జజ్ సంగీతకారులతో ప్రదర్శన ఇచ్చాడు. ఆయన 16 సంవత్సరాల పాటు స్వీడన్ కు చెందిన ప్రపంచ సంగీత బ్యాండ్ మైంటాతో అనుబంధం కలిగి ఉన్నాడు. వారు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆరు ఆల్బమ్‌లను విడుదల చేసారు. అతను ముంబై దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలోని ఉస్తాద్ అల్లా రఖా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్‌లో విద్యార్థులకు తబలా నేర్పుతాడు..[2] [1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఫజల్ ఖురేషి, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, జానపద నృత్యరారిణి అయిన బిర్వాను వివాహం చేసుకున్నాడు.[3] వారికి కుమార్తె అలియా, కుమారుడు అజాన్ ఉన్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Alla Rakha | Indian musician". Encyclopedia Britannica.[better source needed]
  2. ↑ "Tabla maestro's music school set to reopen". 6 July 2012.
  3. 1 2 Hussain, Zakir (2018). Zakir Hussain : a life in music. Kabir, Nasreen Munni. Noida, Uttar Pradesh, India. ISBN 9789352770496. OCLC 1021880009.{{cite book}}: CS1 maint: location missing publisher (link)