ఫరీద్‌కోట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Districts of Punjab along with their headquarters

పంజాబులోని 24 జిల్లాలలో ఫరీద్‌కోట్ జిల్లా (పంజాబీ: ਫਰੀਦਕੋਟ) ఒకటి. ఆగ్నేయ ఆసియాలో ఫరీద్‌కోట్ అతిపెద్ద కాటన్ మార్కెట్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో భవంతుడిని చూడాలని భగవద్భక్తుడైన ఫరీద్‌బాబా నివసించిన కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరువచ్చింది. బ్రిటిష్ పాలనాకాలంలో ఫరీద్‌కోట రాజసంస్థానంలో భాగంగా ఉంటూ వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో ఇది పంజాబు రాష్ట్రంలో భాగంగా ఉంది. మోగ, ముక్త్‌సర్ జిల్లాల నుండి కొంతభాగం వేరుచేసి ఫరీద్‌కోట్ జిల్లా రూపొందించబడింది.

చరిత్ర[మార్చు]

స్వాతంత్ర్యానికి ముందు జిల్లాలోని అధిక భూభాగం ఫరీద్‌కోట్ మహారాజా ఆధీనంలో ఉండేది. తరువాత 1948లో ఈ ప్రాంతం పాటియాలా & తూర్పు పంజాబు రాష్ట్ర యూనియన్ ప్రాంతంలో భాగం అయింది. బతిండా జిల్లాలోని ఫరీద్‌కోట్ తాలూకా, ఫిరోజ్‌పూర్ మోగ తాలూకా, ముక్త్‌సర్ తాలూకాలను కలిపి 1972 ఆగస్టు 7న ఫరీద్‌కోట్ జిల్లా ఏర్పాటు చేయబడింది. తరువాత 1995లో ఫరూద్‌కోట్ జిల్లాలోని మోగ, ముక్త్‌సర్ ప్రాంతాలకు జిల్లా అంతస్తు ఇవ్వబడింది.

ఫరీద్‌కోట్ జిల్లా వాయవ్య సరిహద్దులో ఫిరోజ్‌పూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో ముక్త్‌సర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బతిండా జిల్లా, పశ్చిమ సరిహద్దులో మోగ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1469 చ.కి.మీ. ఇది రాష్ట్ర వైశాల్యంలో 2.92% ఉంది. జిల్లా జనసంఖ్య 552,466 రాష్ట్ర జనసంఖ్యలో ఇది 2.27%. జిల్లా 2 ఉపవిభాగాలుగా ( ఫరీద్‌కోట్, జైతో) విభజించబడింది. అదనంగా 2 ఉపతాలూకాలుగా విభజించవడింది. కోతక్‌పురా, సాదిగ్. 171 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 2 డెవెలెప్మెంటు బ్లాకులు (ఫరీద్‌కోట్, కోతక్‌పురా) ఉన్నాయి.

వివరణలు[మార్చు]

ఫరీద్‌కోట జిల్లాలో పలు చిన్నపట్టణాలు ఉన్నాయి. వీటిలో 7 గ్రామాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. విద్యాకేంద్రంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. బాబా ఫరీద్ పేరుతో మెడికల్ యూనివర్శిటీలో మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఫరీద్‌కోట్‌లో జాట్ ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 618,008, [1]
ఇది దాదాపు. సొలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 519వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 424 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.18%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 889:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.6%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est. line feed character in |quote= at position 16 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Vermont 625,741 line feed character in |quote= at position 8 (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]