ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా
![]() | |
| సంకేతాక్షరం | ఎఫ్.ఎస్.ఐ (FSI) |
|---|---|
| Predecessor | ప్రీ-ఇన్వెస్ట్‌మెంట్ సర్వే ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ (PISFR), 1965లో స్థాపించబడింది |
| అవతరణ | 1 June 1981 |
| కేంద్రస్థానం | డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, భారతదేశం |
| సేవలందించే ప్రాంతం | భారతదేశం |
| డైరెక్టర్ జనరల్ | సంతోష్ తివారీ, ఐ.ఎఫ్.ఎస్[1] |
| Parent organisation | పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం |
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) 1981 జూన్‌లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరంలో ఉంది. ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంస్థ. ఇది దేశంలో భూమి, అటవీ వనరుల మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ సర్వేలు, అధ్యయనాలు, పరిశోధనలు నిర్వహిస్తుంది. జాతీయ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ, అటవీ వనరుల స్థిరమైన నిర్వహణ, సామాజిక అటవీ ప్రాజెక్టుల అమలు కోసం అవసరమైన సమాచారాన్ని ఇది అందిస్తుంది.[2][3][4]
చరిత్ర
[మార్చు]1981లో స్థాపించబడిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, "ప్రీ-ఇన్వెస్ట్‌మెంట్ సర్వే ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్" (PISFR) కు వారసత్వ సంస్థ. PISFR ను 1965లో భారత ప్రభుత్వం, ఆహార, వ్యవసాయ సంస్థ (FAO), ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సహకారంతో ప్రారంభించింది. 1976లో జాతీయ వ్యవసాయ కమిషన్ (NCA) తన నివేదికలో దేశవ్యాప్తంగా అటవీ వనరులను క్రమం తప్పకుండా, సమగ్రంగా సర్వే చేయడానికి ఒక జాతీయ అటవీ సర్వే సంస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇది అదే సంవత్సరంలో ఎఫ్.ఎస్.ఐ ఆవిర్భావానికి దారితీసింది.[5][6][7]
సంస్థాగత నిర్మాణం
[మార్చు]ఎఫ్.ఎస్.ఐ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో విశ్లేషించి దేశ అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేస్తుంది. ఈ ఫలితాలను 'స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్' (SFR) పేరుతో ద్వైవార్షిక నివేదికలో ప్రచురిస్తుంది. 1987 నుండి ఇప్పటివరకు 16 SFRలు వెలువడ్డాయి. 2004 నుండి ఎఫ్.ఎస్.ఐ మోడిస్ (MODIS), జిఐఎస్ (GIS) ఆధారిత సాంకేతికతను ఉపయోగించి దేశవ్యాప్తంగా అడవి మంటలను పర్యవేక్షిస్తోంది.[8][9][7]
శిక్షణ
[మార్చు]భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ సిబ్బందికి ఎఫ్.ఎస్.ఐ శిక్షణ అందిస్తుంది.[7]
ప్రచురణలు
[మార్చు]ఎఫ్.ఎస్.ఐ ద్వైవార్షిక "ది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్", ప్రాంతాల వారీగా "ది రిపోర్ట్స్ ఆన్ ఇన్వెంటరీ అండ్ వుడ్ కన్సప్షన్ స్టడీస్" నివేదికలను ప్రచురిస్తుంది.[7]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FRI)
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)
- ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ (IGNFA)
- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)
- బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (IIFM)
- అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AFRI)
- వన విజ్ఞాన కేంద్ర (VVK) ఫారెస్ట్ సైన్స్ సెంటర్స్
- వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)
మూలాలు
[మార్చు]- ↑ "Forest Survey of India. Who's who". fsi.nic.in. Retrieved 13 June 2024.
- ↑ "Forest Survey of India, Dehradun". Ministry of Environment and Forests, Government of India. Archived from the original on 8 మే 2013. Retrieved 6 ఏప్రిల్ 2008.
- ↑ Kailash Chandra Bebarta, 2007, Forest Planning at Landscape Level: A Case Study of Working Plan.
- ↑ Prodyut Bhattacharya, 2017, Redefining Forestry for Effective Livelihoods.
- ↑ Berthold Ribbentrop, 1989, Forestry in British India.
- ↑ "Brief History". About Us. orest Survey of India. Retrieved 6 April 2008.
- ↑ 7.0 7.1 7.2 7.3 India 2014 Concise, p105.
- ↑ "Objectives of FSI". About Us. orest Survey of India. Retrieved 6 April 2008.
- ↑ P.R. Shukla, 2003, Climate Change and India: Vulnerability Assessment and Adaptation.
