ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
స్థాపన | 1973 |
---|---|
రకం | ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల నిర్వహణ |
ప్రధాన కార్యాలయాలు | సిరి ఫోర్ట్ ఆడిటోరియం కాంప్లెక్స్, న్యూఢిల్లీ |
సేవా ప్రాంతాలు | భారతదేశం |
డైరెక్టర్ | సెంథిల్ రాజన్ |
మాతృ సంస్థ | సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ |
ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ అనేది భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలను నిర్వహించే సంస్థ. ప్రతి సంవత్సరం జ్యూరీ ప్యానెల్స్‌లో సభ్యులను నియమించడానికి డైరెక్టరేట్ సహాయం చేస్తుంటుంది. ఏ సినిమాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఏ సినిమాలకు అవార్డులు ఇవ్వాలి అన్న విషయాల్లో ఈ సంస్థ ఎలాంటి జోక్యం చేసుకోదు.
ఏర్పాటు
[మార్చు]1973లో భారత ప్రభుత్వం ఈ సంస్థను స్థాపించింది, ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేస్తుంటుంది. డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది, ప్రస్తుతం సెంథిల్ రాజన్ డైరెక్టర్ గా ఉన్నాడు. భారతదేశంలో జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాలను నిర్వహించడానికి భారతదేశం ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఈ డైరెక్టరేట్ ఏర్పాటుచేయబడింది.[1]
ఇతర వివరాలు
[మార్చు]విదేశాలలో జరిగే చిత్రోత్సవాల్లో భారతదేశం పాల్గొనడానికి ఈ డైరెక్టరేట్ వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా భారతదేశంలో విదేశీ సినిమా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తుంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ Directorate of Film Festivals Archived 17 జూన్ 2008 at the Wayback Machine Ministry of Information and Broadcasting, Govt of India Official website.
బయటి లింకులు
[మార్చు]- డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, అధికారిక వెబ్సైట్
- నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియాలో డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అధికారిక వెబ్సైట్
- భారతీయ పనోరమా Archived 2021-06-14 at the Wayback Machine
- భారతీయ పనోరమా