ఫిలిప్పీన్స్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిలిప్పీన్స్‌లో హిందూమతం
ఓమ్
గ్రంథాలు
భగవద్గీత, మహాభారతం, ఉపోనిషత్తులు
భాషలు
సంకృతం, హిందీ, సింధీ
భుటువానన్, ఇంగ్లీషు, ఇబనాగ్, కపాంపంగన్, పంగాసినెన్స్, స్పానిష్, టగలాగ్, విసాయన్

ఫిలిప్పీన్స్‌లో హిందూమతానికి కొంత సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ మతపరమైన ప్రభావం ఉందని ఇటీవల లభించిన పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. వీటిలో 1989లో కనుగొనబడిన 9వ శతాబ్దపు లగునా తామ్రఫలక శాసనం ఒకటి. ఇది సంస్కృత పదాలతో, కావి లిపి (పల్లవ లిపి నుండి వచ్చినది)లో ఉన్నట్లుగా 1992 లో గుర్తించారు. [1] 1917లో ఫిలిప్పీన్స్‌లోని మరొక ప్రాంతంలో కనుగొన్న బంగారు అగుసన్ విగ్రహం (బంగారు తార) కూడా హిందూమతంతో ముడిపడి ఉంది.

నేడు హిందూమతం[మార్చు]

చాలా దేవాలయాలు అదే సమూహాలకు సేవలందిస్తున్నప్పటికీ, ఈ మధ్య కాలంలో మతంలో కొంత పెరుగుదల కనిపిస్తోంది. హిందూమత అనుయాయులు ఎక్కువగా స్థానిక ప్రజలు, ప్రవాసులు, కొత్తగా మతం మారినవారూ ఉంటారు. అనేక ఇస్కాన్ సమూహాలు, ప్రముఖ హిందూ వ్యక్తులైన సత్యసాయి బాబా, పరమహంస యోగానంద ( SRF ), ప్రభాత్ రంజన్ సర్కార్ ( ఆనంద మార్గ ) ల అనుచరుల సమూహాలు ఉన్నాయి. రామకృష్ణ మఠం ఫిలిప్పీన్స్‌లో ప్రముఖ వేదాంత సమాజం. [2] యోగా, ధ్యానం వంటి హైందవ అభ్యాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రామాయణ మహాభారతాల్లో "కోదండ విలువిద్యా కేంద్రం" (రాముడి విల్లు పేరు కోదండం), "గాండీవ విలువిద్య" (అర్జునుడి విల్లు పేరు గాండీవం) అనే పేర్లతో విలువిద్యా కేంద్రాలు కూడా ఉన్నాయి.

2008లో ఫిలిప్పీన్స్‌లో 1,50,000 మంది భారతీయు లున్నారని ఒక సంస్థ అంచనా వేసింది. వీరిలో ఎక్కువ మంది హిందువులు, క్రైస్తవులు.

ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో హిందువులలో వలస వచ్చిన భారతీయులే ఎక్కువ. అయితే దేశంలోని చాలా ప్రాంతాలలో సాంప్రదాయిక మత విశ్వాసాల్లో హిందూ, బౌద్ధ ప్రభావాలు బలంగా ఉన్నాయి.

గత మూడు దశాబ్దాలుగా, పెద్ద బ్యాంకుల్లోను, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు లోను, BPO సెక్టార్‌లలోనూ పనిచేసే భారతీయులు పెద్ద సంఖ్యలో ఫిలిప్పీన్స్‌కు, ముఖ్యంగా మనీలాకు, వలస వచ్చారు. భారతీయ ఫిలిపినోలు, భారతీయ ప్రవాసులలో ఎక్కువ మంది హిందువులు, సిక్కులు లేదా ముస్లింలు. వాళ్ళు ఫిలిపినో సంస్కృతిలో కలిసిపోయారు. ఈ సమాజం క్రమం తప్పకుండా మహావీర్ ఫౌండేషన్, ది సేవా ఫౌండేషన్, సత్యసాయి సంస్థ వంటి సంస్థల ద్వారా దాతృత్వ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. హిందూ దేవాలయం (మహాత్మా గాంధీ స్ట్రీట్, పాకో, మనీలా), ఇండియన్ సిక్కు దేవాలయం (యునైటెడ్ నేషన్స్ అవెన్యూ, పాకో, మనీలా), రాధా సోమీ సత్సంగ్ బియాస్ సెంటర్ (అలబాంగ్, ముంటిన్‌లుపా, మెట్రో మనీలా) లలో హిందువులు చేరి సామాజిక సాంస్కృతిక, మత కార్యక్రమాల్లో పాల్గొంటూంటారు. హిందూ దేవాలయానికి చెందిన దివంగత "పూజారి" (సింధీ, గురుముఖిలో గ్రంథాల పాఠకుడు), జ్ఞాని జోగిందర్ సింగ్ సేథీ మతాంతర వ్యవహారాలలో చురుకుగా ఉండేవాడు. పాఠశాల విద్యార్థులు సందర్శించేందుకు అనుమతించేవాడు. గురునానక్ రాసిన జాప్ జీ ని ఫిలిపినో లోకి అనువాదం చేయించాడు. దీన్ని ఉషా రాంచందాని అనువదించగా, శామ్యూల్ సాల్టర్ ఎడిట్ చేశాడు. (2001లో దీన్ని ప్రచురించారు).

చరిత్ర[మార్చు]

ఆగ్నేయాసియాలో హిందూ మతం విస్తరణ.
1989లో కనుగొనబడిన లగునా తామ్రపత్ర శాసనం (పైన) ఫిలిప్పీన్స్‌లో 9వ శతాబ్దం AD చివరి నాటికి, ఇండోనేషియాలోని హిందూమతం ద్వారా, 16వ శతాబ్దంలో యూరోపియన్ వలస సామ్రాజ్యాల రాకకు ముందు భారతీయ సాంస్కృతిక ప్రభావాన్ని సూచిస్తుంది.
అగుసాన్ చిత్రం, హిందూ-బౌద్ధ దేవత, తారా, 1000–1200 CE బంగారు విగ్రహం.

ఆగ్నేయాసియాలోని ద్వీపసమూహాలు మలయ్-ఇండోనేషియా దీవుల ఓడరేవుల ద్వారా హిందూ ఒడిషా, ఇండోనేషియా వ్యాపారుల ప్రభావానికి లోనయ్యాయి. భారతీయ మతాలు, బహుశా హిందూ-బౌద్ధాల సమ్మేళనంగా 1వ సహస్రాబ్దిలో శ్రీవిజయ ద్వారా, ఆ తరువాత మజాపహిత్ ద్వారా ఫిలిప్పీన్స్ ద్వీపసమూహానికి చేరుకున్నాయి. భారతదేశాంతో పురాతన ఆధ్యాత్మిక ఆలోచనల పరస్పర కలబోత జరిగిందనే దానికి, 1.79 కిలోగ్రాముల, 21 క్యారెట్ల బంగారు హిందూ దేవత అగుసాన్ ప్రతిమ పురాతత్వ ఆధారంగా నిలిచింది. దీన్ని 1917 లో మిండానావోలో, ఒకసారి తుఫాను, వరదలు వచ్చి వెలిసాక బయటపడింది. [3] ఈ విగ్రహం ఇప్పుడు చికాగోలోని ఫీల్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉంది. ఇది 13 - 14 శతాబ్దాల కాలం నాటిది.

బంగారు అగుసాన్ విగ్రహం జావాలో కనిపించే శివ-బుద్ధ ( భైరవ ) సంప్రదాయానికి చెందిన శక్తి దేవతకు ప్రాతినిధ్యం వహించవచ్చని జువాన్ ఆర్. ఫ్రాన్సిస్కో భావిస్తున్నాడు. నేటి అగుసాన్ డెల్ నోర్టే, బుటువాన్ సిటీలలో ఉన్న రాజహ్నేట్ ఆఫ్ బుటువాన్, స్వదేశీ లుమాడ్ ప్రకృతి-ఆరాధనలతో పాటు హిందూ మతాన్ని ప్రధాన మతంగా ఉపయోగించారు. సెబూ రాజహ్నాట్ ను ఒక హిందూ తమిళ రాజు పాలించాడని కూడా ఒక రికార్డు ఉంది. [4]

మరొక బంగారు వస్తువు, పలవాన్నుం దీవిలో టాబోన్ గుహల్లో లభించిన గరుడ బొమ్మ. టాబోన్ గుహలలో లభించిన అధునాతన హిందూ చిత్రాలు, బంగారు కళాఖండాలు దక్షిణ వియత్నాంలోని మెకాంగ్ డెల్టాలో ఓక్ ఇయో లో లభించిన వాటితో ముడిపడి ఉంది. [5] ఈ పురావస్తు ఆధారాలు భారతదేశం, ఫిలిప్పీన్స్, వియత్నాం, చైనా తీర ప్రాంతాల మధ్య అనేక ప్రత్యేకమైన వస్తువులు, బంగారాల వాణిజ్యం చురుగ్గా జరిగేదని సూచిస్తున్నాయి. ఇప్పటివరకు కనుగొనబడిన బంగారు ఆభరణాలలో ఉంగరాలు - కొన్నిటిపై నంది చిత్రాలు ఉన్నాయి - లింక్డ్ చెయిన్‌లు, లిఖించబడిన బంగారు పలకలు, హిందూ దేవతల ప్రతిరూపాలతో అలంకరించబడిన బంగారు ఫలకాలు ఉన్నాయి. [5] [6]

1989 లో, లుంబన్ లోని బరాంగే వావా లో, లగున డి బే కి దగ్గరలో, లుంబాంగ్ నది ముఖద్వారం వద్ద ఒక ఇసుక గని కార్మికుడికి ఒక రాగి పళ్ళెము కనబడింది. [3] దీన్ని ఇప్పుడు పండితులు లగునా తామ్ర శాసనం అని పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్‌లో లభించిన మొట్టమొదటి లిఖిత పత్రం. ఇది 9వ శతాబ్దం నాటిది. డచ్ మానవ శాస్త్రవేత్త ఆంటోన్ పోస్ట్‌మా 1992లో దీన్ని చదివాడు. [1] జావానీస్ మెడాంగ్ రాజ్యం, శ్రీవిజయ సామ్రాజ్యం, భారతదేశంలోని హిందూ-బౌద్ధ రాజ్యాలతో ఫిలిప్పీన్స్‌లోని తగలోగ్ ప్రజల మధ్య విలసిల్లిన ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ఈ తామ్ర శాసనం సూచిస్తోంది. అరేబియా నుండి వ్యాపారులు ఇస్లాంను ప్రవేశపెట్టినప్పుడు దేశంలో హిందూ మతం క్షీణించింది. ఆ తర్వాత స్పెయిన్ నుండి క్రైస్తవ మతం వచ్చింది. [3] 1వ సహస్రాబ్ది నుండి, అంతకు ముందూ ఫిలిప్పైన్ చరిత్ర స్థాయి, లోతు గురించి చాలా తక్కువగా తెలిసినందున ఇది చురుకైన పరిశోధనాంశంగా ఉంది.

జానపదం, కళలు, సాహిత్యం[మార్చు]

ఫిలిపినో సంస్కృతిలోని అనేక కల్పిత కథలు గాథలు భారతీయ కళలతో ముడిపడి ఉన్నాయి. కోతి, తాబేలు కథ, తాబేలు కుందేలుల పరుగుపందెం, గద్ద కోడి కథలు కొన్ని ఉదాహరణలు. అదేవిధంగా, ఫిలిప్పీన్స్‌లోని ప్రధాన ఇతిహాసాలు, జానపద సాహిత్యం మహాభారతం రామాయణంలో వచ్చే ఇతివృత్తాలు, ప్లాట్లు, క్లైమాక్సులను, భావనలనూ చూపుతాయి.

ఇండాలజిస్టులు జువాన్ ఆర్. ఫ్రాన్సిస్కో, జోసెఫిన్ అకోస్టా పస్రిచా ప్రకారం, దాదాపు సా.శ. 9 నుండి 10వ శతాబ్దం నాటికి హిందూ ప్రభావాలు, హిందూ జానపద కథలూ ఫిలిప్పీన్స్‌ చేరుకున్నాయి. మారనావో వెర్షన్ మహారాడియా లవనా (రామాయణం లోని రావణుడు). [7]

తగలోగ్[మార్చు]

 • సంస్కృత బోధి నుండి బుధి
 • సంస్కృత భట్టార నుండి బాతల
 • దేవుడు శివుడు " సంస్కృతంలో Bhattara నుండి
 • సంస్కృత ధరిత నుండి దలిటా (దళితుడు )
 • సంస్కృతం దుఃఖ నుండి దుక్ఖ
 • సంస్కృత గురువు నుండి గురో
 • <i id="mwwQ">సంస్కృత సంప్రత్యయ</i> నుండి సంపలాతయ ("విశ్వాసం")
 • సంస్కృత ముఖ నుండి ముఖ
 • సంస్కృత రాహువు నుండి లాహో ("గ్రహణం", "అదృశ్యం")
 • సంస్కృత మహర్దిక్కా నుండి మహర్లికా
 • సారంగ్గోల "గాలిపటం" సంస్కృత లయాంగ్ గులా నుండి
 • తమిళ వగాయ్‌ నుండి బగాయ్ ("విషయం" )
 • సంస్కృత తార <i id="mw1A">నుండి</i> తలా ("నక్షత్రం")
 • పుటో, ఒక సాంప్రదాయ రైస్ పేస్ట్రీ, తమిళ పుట్టు నుండి
 • తమిళ మురుంగై నుండి మాలుంగ్గే
 • సంస్కృత "సాక్షి" <i id="mw4A">నుండి</i> <i id="mw4A">సాక్సీ</i>

కపంపంగన్[మార్చు]

 • సంస్కృత కర్మ నుండి కల్మ "విధి"
 • డమ్లా సంస్కృత ధర్మం నుండి "దైవిక చట్టం"
 • మంతల - సంస్కృత మంత్రం నుండి "మేజిక్ సూత్రాలు"
 • సంస్కృత ఉపాయ నుండి ఉపాయ
 • సంస్కృత రూపా నుండి లూపా
 • సంస్కృత సర్వ నుండి సబ్లా
 • సంస్కృత రాహు నుండి లావు ("గ్రహణం")
 • సంస్కృత గరుడ నుండి గలురా
 • సంస్కృతం "దక్షిణ" నుండి లక్సిన
 • సంస్కృత లక్ష్మణ నుండి "అడ్మిరల్"

సెబువానో[మార్చు]

 • బుదయ సంస్కృతం లోని "సంస్కృతి" నుండి
 • బలిటా సంస్కృత వార్త నుండి ("వార్తలు")
 • బయ సంస్కృతం లోని భయ నుండి
 • సంస్కృత దేవత నుండి దివాటా ("దేవత")
 • సంస్కృత అసుర నుండి అసువాంగ్ ("రాక్షసుడు")
 • <i id="mwASQ">సంస్కృత గజా</i> నుండి గద్య ("ఏనుగు")
 • పుఅస సంస్కృత "ఉపవాసం" నుండి
 • సాక్సి ("సాక్షి") సంస్కృత పదం సాక్షి నుండి

తౌసుగ్[మార్చు]

 • సుఅర్గ "స్వర్గం"; ఆధునిక ఇండోనేషియాలో సోర్గాను పోలుతుంది
 • ఆగమ "మతం"

ఇబానాగ్[మార్చు]

 • కరాహే అనే ఒక వంట పాత్ర, సంస్కృత పదం కరాహి నుండి వచ్చింది
 • తురా (అంటే "రాయడం") అనే పదం సంస్కృత సూత్ర నుండి వచ్చింది, దీని అర్థం సాహిత్యం లేదా గ్రంథం
 • కాపో అనే పదం సంస్కృత కెర్పాస్ నుండి వచ్చింది. దీని అర్థం పత్తి

అనేక ఫిలిప్పైన్ భాషల్లో ఉమ్మడిగా ఉండేవి[మార్చు]

 • సంస్కృత సూత్రం నుండి సుత్లా ("పట్టు")
 • కపాస్ సంస్కృత పదం కెర్పాస్ నుండి ("పత్తి")
 • సంస్కృత పదం నాగ నుండి నాగ ("డ్రాగన్" లేదా "పాము")

హిందూ దేవాలయాలు[మార్చు]

మనీలా నగరంలో హరి రామ్ ఆలయం (పాకో), సాయా ఔర్ దేవి మందిర్ ఆలయం (పాకో)తో వంటి హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లోని సెబు సిటీలో "ఇండియన్ హిందూ టెంపుల్" అనే హిందూ దేవాలయం ఉంది. ఫిలిప్పీన్స్‌లోని బగుయో సిటీలో "బగుయో హిందూ దేవాలయం" అని పిలువబడే హిందూ దేవాలయం ఉంది.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Postma, Antoon. (1992), The Laguna Copper-Plate Inscription: Text and Commentary, Philippine Studies, 40(2):183–203
 2. http://www.belurmath.org/branch-centres/
 3. 3.0 3.1 3.2 Golden Tara Archived 2014-11-02 at the Wayback Machine Government of the Philippines
 4. Juan Francisco (1963), A Note on the Golden Image of Agusan, Philippine Studies vol. 11, no. 3 (1963): 390—400
 5. 5.0 5.1 Anna T. N. Bennett (2009), Gold in early Southeast Asia, ArcheoSciences, Volume 33, pp 99–107
 6. Dang V.T. and Vu, Q.H., 1977. The excavation at Giong Ca Vo site. Journal of Southeast Asian Archaeology 17: 30–37
 7. Manuel, E. Arsenio (1963), A Survey of Philippine Folk Epics, Asian Folklore Studies, 22, pp 1–76