ఫీడ్‌బర్నర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
FeedBurner
చిరునామా feedburner.google.com
సైటు రకం Web feed management
యజమాని Google (bought on June 3, 2007)
విడుదల తేదీ 2004
ప్రస్తుత పరిస్థితి Active

ఫీడ్‌బర్నర్ అనేది ఒక వెబ్‍ఫీడ్ మేనేజ్‍మెంట్ ప్రొవైడర్. దీనిని 2004లో ప్రారంభించారు.[1] ఫీడ్‌బర్నర్‌ని డిక్ కాస్టలో, ఎరిక్ లంట్, స్టీవ్ ఒలచోవ్‌స్కీ, మాట్‍‍షోబేలు ప్రారంభించారు. కాస్టలో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకున్నాడు. 2010లో ట్విట్టర్‌కు CEO అయ్యాడు. ఫీడ్‌బర్నర్ బ్లాగర్లకు, పాడ్ కాస్టర్లకు, ఇతర వెబ్ ఆధారిత విషయ ప్రచురణ కర్తలకు అవసరమైన అనుకూలీకృత RSS ఫీడ్స్‌ను, నిర్వహణా పరికరాలను అందిస్తుంది.

సేవలు[మార్చు]

ప్రచురణ కర్తలకు ట్రాఫిక్ విశ్లేషణ [2]తో పాటుగా, ఐచ్చిక ప్రకటనా వ్యవస్థ సేవలను అందిస్తుంది. RSS ఫార్మాట్ ప్రకటనలకు బాగా సరిపోతుందో లేదో మొదట తెలియనప్పటికీ,[3] ఇప్పుడు ఫీడ్‌బర్నర్ ఫీడ్‌లలోని మూడింట రెండు వంతుల ప్రకటనలు రచయితలు ఎంపిక చేసుకొని ప్రచురించిన వాటితో నిండిపోయాయి.[4] దీనితో యూజర్లు తమ ఫీడ్‌లను ఎంతమంది వినియోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఏ రకమైన సేవలను/కార్యక్రమాలను సబ్‌స్క్రైబ్ చేశారన్నదానిని కూడా తెలుసుకోవచ్చు.

దీని ద్వారా, ప్రచురించబడిన ఫీడ్‌లను అనేక రకాల పద్ధతులలో మార్చుకోవచ్చును. అంతే కాక ఇది Digg, del.icio.usలతో సంధానించి, అనేక ఫీడ్‌ల నుండి సమాచారాన్ని అందించే "కూడలి"లాగా పని చేస్తుంది.[5] ఫీడ్‌బర్నర్ అనేది సంక్లిష్టమైన వెబ్ 2.0 సేవ. ఇది అందిస్తున్న వెబ్ సేవ అనువర్తన కార్యక్రమ ఇంటర్‌ఫేస్‌లు (APIలు), ఇతర సాఫ్ట్‌వేర్‍లు తనతో పరస్పర ప్రభావం చూపడానికి అనుమతిస్తాయి. 2007, అక్టోబర్ 5 నాటికి ఫీడ్‌బర్నర్ 584,832 మంది ప్రచురణ కర్తలకు సంబంధించిన పదిలక్షలకు పైగా ఫీడ్‌లకు ఆతిథ్యమిచ్చింది. వీటితో పాటుగా14,534 మంది పాడ్‌క్యాస్ట్, వీడియోక్యాస్ట్ ఫీడ్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది. [6]

చరిత్ర[మార్చు]

2007, జూన్ 3న, గూగుల్ ఇంక్., ఫీడ్‌బర్నర్‌ను $100 మిలియన్లకు కొనుగోలు చేసిందని ఒక వదంతి ఉంది. [7] ఒక నెల తర్వాత, ప్రసిద్ధి పొందిన వారి "PRO" సేవలను (మైబ్రాండ్ మరియు టోటల్‌స్టాట్స్) యూజర్లందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు.[8]

2008,ఆగస్ట్15 నాటికి గూగుల్, ఫీడ్‌బర్నర్‌ను దాని సేవల సమూహం కిందకు మార్చింది.[ఆధారం కోరబడింది] మారడం పూర్తయిన ప్రచురణ కర్తలు, feedburner.google.com ద్వారా ఫీడ్‌బర్నర్‌లో ప్రవేశించవచ్చు.

సాంకేతిక సమస్యలు[మార్చు]

ఫీడ్‌బర్నర్‌లో తరచుగా తలెత్తిన సాంకేతిక సమస్య ఏమిటంటే, సేవలను ఉపయోగిస్తున్న బ్లాగుల విషయంలో నివేదిస్తున్న వినియోగదారుల సంఖ్య తగ్గించబడటమే. వాస్తవంగా ఇది ఫీడ్‌బర్నర్ వలన తలెత్తిన సమస్య కాదు. అయితే ఫీడ్‌బర్నర్ తన భాగస్తుల నుండి సమాచారాన్ని సేకరించడం, సరిచేసే పనులను చూస్తుండడం వలన, ఫీడ్ రీడర్లు, విషయాలను సేకరించే వ్యక్తులు, ఫీడ్‌బర్నర్‌కు వాటి గురించి ఫిర్యాదు చేసారు. సాధారణంగా ఇలాంటి సమస్య ఎవరో ఒక RSS పాఠకుడు లేదా కక్షిదారుకు మాత్రమే వస్తుంది. ఉదాహరణకు, 2009 ఏప్రిల్ ‍లో గూగుల్ ఫీడ్‌ఫెట్చర్ సర్వీసును ఉపయోగిస్తున్నపుడు ఫీడ్‌బర్నర్‌లో కొన్ని సమస్యలు వచ్చాయని ఫిర్యాదు చేసారు.[9]

సూచనలు[మార్చు]

  1. "Helping publishers, bloggers get the word out". Chicago Sun-Times. 2005-09-06. Retrieved 2006-08-10. 
  2. "Mining For Data In Blogs". TechWeb. 2006-07-17. Archived from the original on 2006-07-20. Retrieved 2006-08-10. 
  3. "Advertisers Muscle Into RSS". Wired News. 2004-11-18. Retrieved 2006-08-10. 
  4. "FeedBurner buys BlogBeat, expanding blog analysis". Reuters. 2006-07-17. Archived from the original on 2012-07-11. Retrieved 2006-08-10. 
  5. "The Feed Thickens". Flickr. 2004-07-14. Retrieved 2006-08-10. 
  6. "About FeedBurner". FeedBurner.com. Retrieved 2007-09-30. 
  7. "Techcrunch confirms Google buyout of FeedBurner". 
  8. "FreeBurner for Everyone". FeedBurner. Retrieved 2007-10-27. Beginning today, two of FeedBurner's previously for-pay services, TotalStats and MyBrand, will be free. 
  9. "Reduced subscribers reported by Google Feedfetcher". The Feedburner Status Blog. 2009-03-09. Retrieved 2009-04-16. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Google Inc.