ఫీలే ల్యాండర్

వికీపీడియా నుండి
(ఫీలే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఫీలే
ఫీలే తోకచుక్కను సమీపిస్తున్నట్లుగా చూచిస్తున్న దృష్టాంతచిత్రము
మిషన్ రకంతోకచుక్క లాండర్
ఆపరేటర్యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
COSPAR IDPHILAE
మిషన్ వ్యవధి1–6 వారాలు (ప్రణాళిక)
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి100 కి.గ్రా. (220 పౌ.)[1]
పే లోడ్ ద్రవ్యరాశి21 కి.గ్రా. (46 పౌ.)[1]
కొలతలు1 × 1 × 0.8 మీ. (3.3 × 3.3 × 2.6 అ.)[1]
శక్తి3 ఆస్ట్రోనామికల్ యూనిట్ (AU) వద్ద 32 వాట్స్[2]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2 March 2004, 07:17 (2004-03-02UTC07:17Z) UTC
రాకెట్అరైన్ 5G+ V-158
లాంచ్ సైట్గుయానా స్పేస్ సెంటర్ ELA-3
కాంట్రాక్టర్ఏరియానిస్పేస్
67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో ల్యాండర్
ల్యాండింగ్ తేదీ12 నవంబరు 2014
15:35 UTC
Instruments
APX Alpha: Alpha Particle X-ray Spectrometer
ÇIVA: Comet nucleus Infrared and Visible Analyzer
CONSERT COmet Nucleus Sounding Experiment by Radiowave Transmission
COSAC: COmetary SAmpling and Composition
MUPUS: Multi-Purpose Sensors for Surface and Subsurface Science
PTOLEMY: gas chromatograph and medium resolution mass spectrometer
ROLIS: ROsetta Lander Imaging System
ROMAP: ROsetta lander MAgnetometer and Plasma monitor
SD2: Sample and Distribution Device
SESAME: Surface Electric Sounding and Acoustic Monitoring Experiment
 

తోకచుక్కపై దిగిన తొలి ల్యాండర్ ఫీలే ల్యాండర్. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) కు చెందిన రోసెట్టా వ్యోమనౌక 2004లో నింగిలోకి వెళ్లి పదేళ్లుగా ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ 2014 సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి దాని చుట్టూ తిరుగుతూ నవంబరు 12, 2014 న ఈ ల్యాండర్ ను తోకచుక్కపై జారవిడిచింది. ఖగోళ చరిత్రలో తొలిసారిగా తోకచుక్కను చేరుకున్న ఈ ఘటన ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతం అయింది. ఈ ఘటనతో ఒక తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను చేర్చిన ఘనతను ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) సొంతం చేసుకుంది. 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు తోకచుక్కలపై అధ్యయనం సహకరిస్తుందని ఈసా సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న 67పీ తోకచుక్క సెకనుకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకు ఒకసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. 67పీ తోకచుక్కపై ల్యాండర్ ను దించడానికి రోసెట్టా వ్యోమనౌక దాని చుట్టూ తిరుగుతూనే తోకచుక్క సమీపానికి వెళ్లి ఈ ల్యాండర్ ను జారవిడిచింది. తోకచుక్కను చేరుకున్న ఈ ల్యాండర్ తోకచుక్కపై తన మరలను దించి గట్టిగా పట్టుకున్నది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 13-11-2014 - (తోకచుక్కపై తొలి అడుగు!)
  1. 1.0 1.1 1.2 "PHILAE". National Space Science Data Center. Retrieved 28 January 2014.
  2. "Philae lander fact sheet". DLR. Archived from the original (PDF) on 25 డిసెంబరు 2018. Retrieved 28 January 2014.