ఫూజీఫిల్మ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫూజీఫిల్మ్ (ఆంగ్లం: Fujifilm) లేదా ఫూజీ జపాన్ కు చెందిన ఫోటోగ్రఫిక్ బహుళజాతీయ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం టోక్యోలో కలదు.

వ్యాపార పత్రాల పూరణం, వైద్యరంగం లో ఛాయాచిత్రాలు, రోగనిర్ధారణ యంత్రాలు, సౌందర్యసాధనాలు, ఔషధాలు, కణాలు, ఫిలిం, దానికి సంబంధిత దృశ్య సాధనాలు, ఫోటోకాపీ యంత్రాలు, ప్రింటర్లు, డిజిటల్ కెమెరాలు, ఫోటోగ్రఫిక్ కాగితం, ఫోటోగ్రఫిక్ రసాయనాలు, గ్రాఫిక్స్ ఫూజీఫిలిం యొక్క ప్రధాన లావాదేవిలు.

చరిత్ర[మార్చు]

జపాన్ దేశపు మొట్టమొదటి ఫిల్మ్[మార్చు]

జపాన్ దేశపు మొట్టమొదటి ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ ను ఉత్పత్తి చేసే సంస్థగా ఫూజీ ఫోటో ఫిలిం కంపెనీ లిమిటెడ్ 1934లో స్థాపించబడింది. తర్వాతి దశాబ్దంలో ఫిలిం తో బాటు మోషన్ పిక్చర్ ఫిలిం, ఎక్స్-రే ఫిలిం ను కూడా ఉత్పత్తి చేయటం మొదలుపెట్టింది. 1940ల నాటికి గాజు పలకలు, కటకాలలోకి కూడా ఫూజీఫిలిం విస్తరించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫూజీ వ్యాపారం మెడికల్ డయాగ్నసిస్, ముద్రణ, ఎలెక్ట్రానిక్ ఇమేజింగ్, ఆయస్కాంత ఉపకరణాలలో శాఖోపశాఖలుగా విస్తరించింది. 1962లో జిరాక్స్ సంస్థతో జాయింట్ వెంచర్ ద్వారా ఫూజీ జిరాక్స్ కో. లిమిటెడ్ ఏర్పడింది.

50వ దశకం నుండి అన్ని దేశాలలో విస్తరించిన ఫూజీఫిల్ం[మార్చు]

1950వ దశకంలో ఇతర దేశాలలో ఫూజీ తమ అమ్మకాల విస్తరణను వేగవంతం చేసింది. 1980వ దశకంలో తమ తయారీ రంగాన్ని కూడా ఫూజీ ఇతర దేశాలకు విస్తరించింది. ఫోటోగ్రఫీ, వైద్య, ముద్రణ రంగాలకు డిజిటల్ సాంకేతికతను అభివృద్ధి చేసింది.

జపాన్ లో ఫూజీఫిల్ం దే గుత్తాధిపత్యం. 1984 లో లాస్ ఏంజెలెస్ లో జరిగిన ఒలింపిక్స్ కి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించి, తక్కువ ధరకే అమెరికా లో ఫిలిం ను విక్రయించి, అక్కడ ఫిలిం ఫ్యాక్టరీ స్థాపించి ఫూజీఫిలిం అమెరికాలో తమదైన ముద్ర వేసింది. కానీ కొడాక్ మాత్రం జపాన్ లో ఫూజీఫిలిం ను ఢీ కొట్టలేకపోయింది.

ఫూజీఫిలిం తో కొడాక్ వైరం[మార్చు]

మే 1995 లో ఫూజీ అవలంబిస్తోన్న వ్యాపార విధానాలు జపాన్ లో తమ ఫిలిం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోన్నాయని కొడాక్ అమెరికా వాణిజ్య విభాగానికి మొర పెట్టుకొంది. జనవరి 1998 లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ వాదాన్ని కొట్టి వేయటంతో కొడాక్ కు గట్టి దెబ్బ తగిలింది.

21వ శతాబ్దం/డిజిటైజేషన్[మార్చు]

కొత్త శతాబ్దం డిజిటల్ పుంతలు త్రొక్కటంతో డిజిటల్ కెమెరాల వాడకం పెరిగింది. ఫలితంగా ఫిలిం అమ్మకాలు తగ్గాయి. ఈ మార్పుకు అనుగుణంగా, ఫూజీ తమ వ్యాపారంలో ప్రక్షాళనలు మొదలుపెట్టింది. 1980 నాటికే డిజిటల్ ఫోటోగ్రఫీ తెచ్చే మార్పులు ఊహించిన ఫూజీ, తమ మూడు అంగల వ్యాపార పద్ధతుల ద్వారా ఈ మార్పును జయప్రదంగా అధిగమించింది. అవి:

 • ఫిలిం వ్యాపారంలో అత్యధిక లాభాలను గడించటం
 • ఫిలిం నుండి డిజిటల్ మార్పుకు సిద్ధంగా ఉండటం
 • సరిక్రొత్త వ్యాపార రంగాలను వెదికి పట్టుకోవటం

ఈ మార్పును ఎదుర్కోవటంలో ఫూజీ ఫలించినంతగా కొడాక్ ఫలించలేకపోవటం గమనార్హం.

ఉత్పత్తులు[మార్చు]

ఫిలిం[మార్చు]

 • కలర్ రివర్సల్ ఫిలిం
  • వెల్వియా
  • ప్రోవియా
  • ఆస్టియా
  • సెన్సియా
  • ఫోర్టియా
 • కలర్ నెగిటివ్ ఫిలిం
  • ఫూజీ కలర్ ప్రో
  • రియాలా
  • సుపీరియా
  • ప్రెస్
 • బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్
  • నియోపాన్ ఎస్ ఎస్
  • నియోపాన్ ఆక్రోస్
  • నియోపాన్ ప్రెస్టో
  • నియోపాన్ సూపర్ ప్రెస్టో

కెమెరాలు[మార్చు]

వివిధ రకాలు డిజిటల్ ఎస్ ఎల్ ఆర్/పాయింట్ అండ్ షూట్ కెమెరాలు, రేంజ్ ఫైండర్, ఇన్స్టంట్ కెమెరాలు

ఇతరాలు[మార్చు]

ఫోటోగ్రఫిక్ కాగితం

ఇవి కూడా చూడండి[మార్చు]