ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ
ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ సొసైటీ (FRS, ForMemRS, HonFRS) అనేది "గణితం, ఇంజనీరింగ్, వైద్యశాస్త్రాలతో సహా సహజ జ్ఞానం యొక్క అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన" వ్యక్తులకు రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ సభ్యులు అందజేసే పురస్కారం.[1]
సారాంశం
[మార్చు]నిరంతర ఉనికిలో ఉన్న అత్యంత పురాతన శాస్త్రీయ అకాడమీ అయిన రాయల్ సొసైటీ అందించే ఫెలోషిప్ ఆఫ్ ది సొసైటీ ఒక ముఖ్యమైన గౌరవం. ఐజాక్ న్యూటన్ (1672) బెంజమిన్ ఫ్రాంక్లిన్ (1756) చార్లెస్ బాబేజ్ (1816) [1) మైఖేల్ ఫెరడే (1824) చార్లెస్ డార్విన్ (1839) ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ (1903] ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1921) పాల్ డిరాక్ (1930) స్టీఫెన్ హాకింగ్ (1974) ఎలిజబెత్ బ్లాక్బర్న్ (1992) టిమ్ బెర్నర్స్-లీ (2001) ఎలోన్ మస్క్ (2018) మొదలైన ప్రముఖులు ఈ గౌరవాన్ని పొందారు. 2018 అక్టోబర్ నాటికి , సుమారు 1,689 మంది జీవించి ఉన్న సభ్యులు, విదేశీ సభ్యులు, గౌరవ సభ్యులు ఉన్నారు, వీరిలో 85 మంది నోబెల్ గ్రహీతలు.[2]

రాయల్ సొసైటీ ఫెలోషిప్‌ను ది గార్డియన్ "జీవితకాల సాధన ఆస్కార్ కు సమానమైనది" గా అభివర్ణించింది.[3][4][5][6][7][8][9][10]
ఫెలోషిప్‌లు
[మార్చు]ప్రతి సంవత్సరం సుమారు 700 మంది ప్రతిపాదిత అభ్యర్థుల నుండి 60 మంది కొత్త సభ్యులు ఎన్నుకోబడతారు.[11] ప్రతి సంవత్సరం, యునైటెడ్ కింగ్డమ్, మిగిలిన కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండ్ నుండి 52 మంది కొత్త సభ్యులు ఎన్నికవుతారు[12][13] ప్రతి అభ్యర్థి వారి యోగ్యత ఆధారంగా, విజ్ఞాన శాస్త్రంలో వారి కృషి ఆధారంగా సభ్యులు జీవితాంతం ఎన్నుకోబడతారు. వారి పేరు తరువాత FRS అక్షరాలను ఉపయోగించడానికి అర్హులు.[1]ఈ విధానంలోనే 10 విదేశీ ఫెలోలను ఎన్నుకుంటారు. వీరు తమ పేరు తరువాత ForMemRS ను ఉపయోగించడానికి అర్హులు.[14] ఫెలోగా లేదా విదేశీ ఫెలోగా ఎంపిక కావడానికి అవసరమైన అర్హత లేకపోయినా విజ్ఞాన శాస్త్రానికి విశిష్ట సేవ చేసిన అభ్యర్థులకు గౌరవ ఫెలోషిప్ అనేది ప్రదానం చేస్తారు. వీరు తమ పేరు చివర Hon. F. R. S. అనే అక్షరాలను ఉపయోగించుకునే హక్కు ఉంది. [15]వీరినే కాకుండా రాయల్ సొసైటీ బ్రిటిష్ రాజ కుటుంబ సభ్యులను రాయల్ ఫెలోగా ఎన్నుకుంటుంది.
పరిశోధన ఫెలోషిప్‌లు, ఇతర పురస్కారాలు
[మార్చు]రాయల్ సొసైటీ (FRS, ForMemRS, HonFRS) యొక్క ప్రధాన ఫెలోషిప్లతో పాటు ఇతర ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎన్నికల ద్వారా కాకుండా వ్యక్తులు దరఖాస్తు చేస్తారు. ఈ ఫెలోషిప్లు పొందినవారిని రాయల్ సొసైటీ రీసెర్చ్ ఫెలోస్ అని పిలుస్తారు.[16] ఇవి
- విశ్వవిద్యాలయ పరిశోధన ఫెలోషిప్‌లు (URFs)
- రాయల్ సొసైటీ లివర్‌హుల్మ్ ట్రస్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు [17]
- న్యూటన్ అడ్వాన్స్డ్ ఫెలోషిప్‌లు .[18]
- ఇండస్ట్రీ ఫెలోషిప్‌లు [19]
- డోరతీ హోడ్కిన్ ఫెలోషిప్‌లు .[20]
భారతీయుల జాబితా
[మార్చు]
ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన భారతీయులు, భారతీయ సంతతికి చెందినవారి పాక్షిక జాబితా:
- రోనాల్డ్ రాస్ (1901)
- శ్రీనివాస రామానుజన్ (1918)
- జగదీశ్ చంద్ర బోస్ (1920)
- కె శ్రీనివాస కృష్ణన్ (1940)
- శాంతి స్వరూప్ భట్నాగర్ (1943)
- సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (1944)
- ప్రశాంత చంద్ర మహలనోబిస్ (1945)
- సత్యేంద్రనాథ్ బోస్ (1958)
- టి. ఆర్. శేషాద్రి (1960)
- ఎం. జి. కె. మేనన్ (1970)
- హరీశ్ చంద్ర (1973)
- అశోకె సేన్ (1998)
- రఘునాథ్ అనంత్ మషెల్కర్ (1998)
- శ్రీనివాస్ వరదన్ (1998)
- వెంకటరామన్ రామకృష్ణన్ (2003)
- అజయ్ కుమార్ సూద్ (2015)
- ప్రతిభా గై (2016)
- సుభాష్ ఖోట్ (2017)
- మంజుల్ భార్గవ (2019)
- విక్రమ్ దేశ్‌పాండే (2020)
- ఉషా గోస్వామి (2022)
- మోహన్ మదన్ బాబు (2023)
- రాజీవ్ కుమార్ వర్ష్నే (2023)
- సౌరవ్ చటర్జీ (2023)
- అంజలి గోస్వామి (2024)
- చెన్నుపాటి జగదీశ్ (2025)
- ప్రకాష్ పనంగడెన్ (2025)
- బల్జీత్ ఎస్.ఖక్ (2025)
- మల్లికార్జున్ తాటిపాముల (2025)
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Elections". London: Royal Society. Archived from the original on 2015-09-06.
- ↑ "Fellows". The Royal Society. Archived from the original on 29 April 2016. Retrieved 7 March 2023.
- ↑ Blackstock, Colin (2004). "Fellows keep Susan Greenfield off Royal Society list". The Guardian. London. Archived from the original on 2015-09-13.
- ↑ "Eminent cancer researchers elected to Royal Society Fellowship". London: Institute of Cancer Research. 2016. Archived from the original on 2016-05-25.
- ↑ "Royal Society Fellowship for Crick scientist". London: Francis Crick Institute. 29 April 2016. Archived from the original on 2016-05-25.
- ↑ "Manchester scientists elected as Fellows of Royal Society". Manchester: University of Manchester. 29 April 2016. Archived from the original on 2016-05-07.
- ↑ "Royal Society Fellows". London: Imperial College London. 2016. Archived from the original on 2016-04-15.
- ↑ "Three University of Aberdeen researchers elected to Royal Society". Aberdeen: University of Aberdeen. 29 April 2016. Archived from the original on 2016-05-25.
- ↑ "The Royal Society announces election of new Fellows 2015". Cambridge: University of Cambridge. 29 Apr 2016. Archived from the original on 2016-04-24.
- ↑ "Seven Oxford academics elected Fellows of the Royal Society". Oxford: University of Oxford. 2016. Archived from the original on 2016-04-30.
- ↑ . "Three Hundred Fifty Years of the Royal Society".
- ↑ Council of the Royal Society (29 January 2015). "Statutes of the Royal Society" (PDF). London: Royal Society. Archived (PDF) from the original on 7 March 2023. Retrieved 29 March 2021.
- ↑ "Fellowship of the Royal Society – a window on the election process" (PDF). London: Royal Society. October 2007. Archived (PDF) from the original on 5 April 2016. Retrieved 29 March 2021.
- ↑ . "János Szentágothai 31 October 1912 – 8 September 1994: Elected ForMemRs 20 April 1978".
- ↑ "Fellows Directory". Archived from the original on 5 September 2015. Retrieved 9 May 2018.
- ↑ "Research Fellows directory". Archived from the original on 2016-05-03.
- ↑ "Royal Society Leverhulme Trust Senior Research Fellowship". Royal Society. Archived from the original on 2016-01-18.
- ↑ "Newton Advanced Fellowships". London: Royal Society. Archived from the original on 2016-05-15.
- ↑ "Industry Fellowships". royalsociety.org. Archived from the original on 2016-04-10.
- ↑ "Dorothy Hodgkin Fellowship". London: royalsociety.org. Archived from the original on 2015-09-06.