ఫేస్/ఆఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Face/Off
దస్త్రం:Face off movie.jpg
Promotional film poster
దర్శకత్వంJohn Woo
నిర్మాతDavid Permut
Barrie M. Osborne
Terence Chang
రచనMike Werb
Michael Colleary
నటులుJohn Travolta
Nicolas Cage
Joan Allen
Alessandro Nivola
సంగీతంJohn Powell
Michael A. Reagan (source music)
ఛాయాగ్రహణంOliver Wood
కూర్పుSteven Kemper
Christian Wagner
పంపిణీదారుNorth America:
Paramount Pictures
International:
Touchstone Pictures
విడుదల
June 27, 1997
నిడివి
141 min.
దేశంU.S.A.
భాషEnglish
ఖర్చు$80 million
బాక్సాఫీసు$245,676,146 [1]

ఫేస్/ఆఫ్ అనేది 1997లోని జాన్ వూ, దర్శకత్వం వహించిన, జాన్ ట్రవోల్ట మరియు నికోలస్ కేజ్ నటించిన పోరాట ప్రాధాన్యత కలిగిన చలన చిత్రం. వీరు ఇరువురు రెండు పాత్రలలోనూ, అనగా FBI ఏజెంట్ గా మరియు తీవ్రవాదిగా, ఒకరి శరీరాకృతిని మరొకరు ఆవహించియుండునట్టి పరస్పర ప్రమాణం చేసుకొన్న విరోధులుగా నటించారు.

గన్ ఫు మరియు హీరోఇక్ బ్లడ్షడ్ వంటి సృజనాత్మక ప్రయత్నాల యొక్క నటశ్రేణికి ఉదాహరణగా నిలిచిన ఈ చిత్రంలో ట్రవోల్ట మరియు కేజ్‌లు ఇరువురూ, చెరి రెండు పాత్రలను పోషించారు. జాన్ వూకి పూర్తి సృజనాత్మక నియంత్రణ ఇవ్వబడినట్టి ఈ మొట్టమొదటి హాలీవుడ్ చిత్రం, ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తద్వారా $245 మిలియన్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఆర్జించిన ఫేస్/ఆఫ్ ఆర్థికంగా విజయాన్ని సాధించింది.[2]

కథాంశం[మార్చు]

స్వతంత్ర తీవ్రవాది కాస్టర్ ట్రాయ్ (నికోలస్ కేజ్) ని FBI ప్రత్యేక ఏజెంట్ సీన్ ఆర్చర్ (జాన్ ట్రవోల్ట) నిర్దాక్షిణ్యంగా వెంట తరుముతుంటారు. దీనికి కొన్ని ఏళ్ళ క్రిందట, ఆర్చర్‌ని హత్య చేసే ప్రయత్నంలో, అనుకోకుండా ఆర్చర్ యొక్క చిన్న కొడుకు, మైఖేల్‌ని కాస్టర్ చంపేస్తాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య రగులుకున్న వైషమ్యాలు వారి స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు.

కాస్టర్ యొక్క సోదరుడు పొలక్స్ (అలెస్సాండ్రో నివోల), లాక్స్ విమానాశ్రయంలో ఒక విమానాన్ని అద్దెకు తీసుకున్నాడనే సమాచారం FBI అందుకుంటుంది. కాస్టర్ లేకుండా పోలక్స్ విమానంలో విహరించడని తెలిసిన ఆర్చర్, FBI బృందంతో ఆ విమానాన్ని వెంబడించగా, అది విమానాలను నిలిపి ఉంచే స్థలంలో కూలిపోతుంది. ఈ హఠాత్పరిణామం సృష్టించిన గందరగోళంలో, పోలక్స్ ని FBI నిర్బంధిస్తుంది మరియు ఆర్చర్ కి తాను పెట్టిన బాంబ్ లాస్ ఏంజెల్స్‌ని నాశనం చేస్తుందని గొప్పలు పలికిన కాస్టర్ ప్రమాదవశాత్తూ తగిలిన దెబ్బ కారణంగా స్పృహ కోల్పోతాడు.

ఆర్చర్ కి బాంబుని పెట్టు తారీఖు తెలిసినప్పటికీ, దాన్ని ఉంచేటటు వంటి ప్రదేశం గూర్చిన ఎటువంటి సమాచారం అతను తెలుసుకోలేకపోతాడు. కేవలం పోలక్స్ నుంచి మాత్రమే ఆ ప్రదేశాన్ని గురించి తెలుసుకొను మార్గం ఉందనీ; మరియు పోలక్స్ ఆ ప్రదేశాన్ని కేవలం కాస్టర్‌కి మాత్రమే వెల్లడి చేస్తాడని, ఆర్చర్ యొక్క సహోద్యోగులు అతనిని ఒక రహస్య బృహత్కార్యంలోకి ప్రవేశపెడతారు: అతనికి ప్రయోగాత్మక శస్త్ర వైద్య ప్రక్రియ చేసి కాస్టర్ యొక్క ముఖాన్ని ఆర్చర్ పుర్రెకి తాత్కాలికంగా అంటించి, పోలక్స్‌ని నిర్బంధించిన చెరసాలలోకి కొంచెం కొంచెంగా జొరబడేటట్టు చేసి, బాంబుని ఉంచిన ప్రదేశం తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు.

పొలక్స్ తోపాటు ఆర్చర్ ని (కాస్టర్ లాగా) ఖైదులో పెట్టుటకు ఏర్పాట్లు జరుగుతాయి. చెరలోకి వెళ్ళిన వెంటనే బాంబు ఉంచిన ప్రదేశాన్ని తెలుసుకొంటాడు. ఇంతలోనే, కాస్టర్ ఊహించని విధంగా స్పృహలోకి వచ్చి జరిగిన సంగతిని గ్రహించి, అతని అనుచరులను పిలిచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడిని అపహరించి తీసుకురమ్మంటాడు. వైద్యుడిని ఆర్చర్ యొక్క ముఖం తనకు తెప్పించమని బలవంతం చేస్తాడు.

కాస్టర్ (ఆర్చర్ లా ఉన్న) ఖైదులోనున్న ఆర్చర్ ని చూడటానికి వెళ్లి, ఆర్చర్ యొక్క రాయబారాన్ని గురించి తెలిసిన వారందరినీ తాను చంపేసి, అన్ని సాక్ష్యాలను నాశనం చేసానని చెబుతాడు. ఈ అవకాశం చేజిక్కించుకున్న కాస్టర్, ఆర్చర్ యొక్క ఉద్యోగం మరియు కుటుంబంతో అతను చేయబోవు పన్నుగడల గురించి ఆర్చర్ కి చెప్పి వెళ్లిపోతాడు. పోలక్స్ బాంబ్ ఉంచిన ప్రదేశాన్ని వెల్లడి చేసిన దానికి ప్రత్యుపకారంగా, అతనిని విడుదల చేయాలని FBI పోలక్స్ తో చర్చలు జరిపి ఒక బేరానికి వచ్చునట్లు కాస్తర్ చేస్తాడు. అంతట బాంబునుని నిర్వీర్యం చేసినందుకు కాస్టర్‌ని ఆర్చర్ యొక్క సహోద్యోగులు మరియు ప్రసార మాధ్యమాలు ప్రశంసలతో ముంచెత్తుతాయి.

కాస్టర్ బాంబ్ ని నిర్వీర్యం చేసిన తరువాత, ఆర్చర్ తప్పించుకొనే ప్రయత్నాలు మొదలు పెడతాడు. చెరసాలలోని రక్షక భటులతో జరిపిన భయంకరమైన యుద్ధం తరువాత, ఆర్చర్ తప్పించుకుంటాడు. తరువాత కాస్టర్ యొక్క బృందంలోకి వెళ్ళిన ఆర్చర్, వారు తనని నిజమైన కాస్టర్ అని భావించేటట్లు విజయవంతంగా మోసపుచ్చుతాడు. అంతట ఆర్చర్ వారిని "ఆర్చర్"ని చంపమని కోరతాడు.

మరొక వైపు, కాస్టర్ ఆర్చర్ యొక్క భార్య ఈవ్ (జోఆన్ అల్లెన్)తో సరాసాలాడుట మరియు ఆర్చర్ యొక్క యవ్వనంలోనున్న కుమార్తె జేమీ (డొమినిక్ స్వైన్)తో బంధం పెంచుకుంటాడు. మధ్యకాలంలో, కాస్టర్ యొక్క బృందాన్ని మురిపించుటకు ఆర్చర్ మాదకద్రవ్యాలు తీసుకొనవలసి వస్తుంది. వీరిలో సాషా హాస్లేర్ (గీనా గెర్షోన్), కాస్టర్ యొక్క మాజీ ప్రియురాలు మరియు వారి యొక్క కొడుకు కూడా ఉంటారు. అంతకు పూర్వం, ఆర్చర్ ఆమె కొడుకుని ఫోస్టర్ కేర్ (ధ్రువీకరించిన సంరక్షుకుల దగ్గర కౌమార దశలోని వారిని వదిలే పద్ధతి)లో పెట్టమని బెదిరిస్తాడు. అతను ఇప్పుడు, ఆమె ఆడంని ఈ నేర జీవితానికి దూరంగా ఉంచుటకు ప్రయత్నిస్తున్న ఒక అంకిత భావం ఉన్న తల్లిగా గుర్తిస్తాడు. ఆర్చర్ ఆమెని ఇంకెప్పుడూ బాధపెట్టడని ఆర్చర్ (కాస్టర్ లా ఉన్న) ఆమెకి వాగ్దానం చేస్తాడు.

కాస్టర్ యొక్క పాత రహస్య స్థావరాన్ని పరిశీలించిన పోలక్స్, ఆర్చర్ యొక్క రాకని కాస్టర్ కి చేరవేస్తాడు. కాస్టర్ FBI బృందాన్ని అందులోకి పంపిస్తాడు. అప్పుడు జరిగిన గన్ (మారణాయుధం) లతో చేసిన యుద్ధంలో, కాస్టర్ యొక్క బృందంలోని పలువురు చనిపోగా, సాషా మరియు ఆడం ఆర్చర్ యొక్క సహాయంతో తప్పించుకుంటారు. తనకి తాను తప్పించుకొనే ప్రయత్నంలో, ఆర్చర్ పోలక్స్ ని పట్టుకొని అపార్ట్ మెంట్ స్కైలైట్ (సూర్యకాంతి ప్రసరిం చుటకు పై కప్పులో వదిలిన కిటికీ) నుంచి పడేసి చంపేస్తాడు.

తరువాత, రహస్య స్థావరంలో జరిగిన అనవసర కిరాతక చర్యను నిరసిస్తూ, FBI డైరెక్టర్ (నిర్దేశకుడు) కాస్టర్‌ని తీవ్రంగా నిందిస్తాడు. కాస్టర్ తన నిజ స్వరూపం ఒప్పుకొని అతనిని చంపేసి, అతను గుండెపోటుతో మరణించాడని నిష్టూరాలాడతాడు. ఫలితంగా, కాస్టర్‌ని FBI డైరెక్టర్‌గా పదోన్నతి పొందుతాడు. మధ్యలో ఆర్చర్ తన ఇంటికి తిరిగి వచ్చి తాను నిజమైన ఆర్చర్‌నని ఈవ్‌ని ఒప్పించుటకు ప్రయత్నం చేస్తాడు; వారి మొదటి ముద్దును గూర్చిన కథను అతను ఆమెకి చెప్పగా ఆమె నమ్ముతుంది.

కొంతకాలం తరువాత, సాషా మరియు ఆర్చర్, కాస్టర్‌ని మాజీ డైరెక్టర్ యొక్క అంత్య క్రియలు జరిపిన చోటు ద్వారా జాడ తెలుసుకోగా, అక్కడే కాస్టర్, ఈవ్ మరియు జైమ్‌లు తన ఆధీనంలో ఉన్నట్లు వెల్లడి చేస్తాడు. అప్పుడు జరిగిన తుపాకీ పోరాటంలో సాషా మరియు కాస్టర్ యొక్క బృందం చనిపోతారు. కాస్టర్ మరియు ఆర్చర్, పలు గన్ యుద్ధాలకు మరియు చేతులతో చేయు పెనుగులాటలకు పూనుకొంటారు. దీని ఫలితంగా జరిగిన సంఘటనలలో, కాస్టర్ ఒక స్పీడ్ బోటు (వేగంగా పోవు పడవ)ని దొంగిలించగా ఆర్చర్ అతన్ని వెంబడిస్తాడు. చాల సేపు జరిగిన తరుములాట తరువాత, పడవలు రెండూ ఒక దానితో మరొకటి కొట్టుకొనుట వలన పుట్టిన విస్ఫోటంలో కాస్టర్ మరియు ఆర్చర్ ఇరువురూ ఒడ్డుకి విసిరేయబడతారు. వీరిద్దరి నడుమ జరిగిన అంత్యపోరులో, ఆర్చర్, కాస్టర్ ని స్పీర్ గన్ తో చంపేస్తాడు. తరువాత, ఈవ్ FBI కి మొత్తం పరిస్థితినిని వివరించి, విజయవంతంగా ఆర్చర్ యొక్క నిజ స్వరూపాన్ని రుజువు చేస్తుంది. అంతట ఆర్చర్‌ని ఆసుపత్రికి తీసుకు వెళ్లి అతని ముఖాన్ని అతనికి తిరిగి రాబడతారు.

కొంతకాలం తరువాత, ఆడంని నేరస్థుడిగా పెరగనివ్వనని సాషాకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు, ఆడంని ఇంటికి తీసుకు వచ్చిన ఆర్చర్, అతనిని వారి కుటుంబంలోకి చేర్చుకుంటాడు.

నటీనటవర్గం[మార్చు]

ఉత్పత్తి[మార్చు]

ఫేస్/ఆఫ్ అనే స్పెక్ స్క్రిప్ట్ని (బహిరంగంగా విక్రయించు చిత్రానుకరణ) మైక్ వెర్బ్ మరియు మైఖేల్ కల్లెరి వంటి రచయితలు 1990 ఆరంభం నించి స్తూడియోలకు అమ్ముటకు ప్రయత్నించారు. ఈ చిత్ర కథానుకరణ పలు స్టూడియోలను, నిర్మాతలను, మరియు అనువాద మార్పులను తీసుకొని, చాలా ఏళ్ళ తరువాత జాన్ వూతో ఒప్పందం కుదిరింది.[3]

మొదట ఈ చిత్రాన్ని ఆర్నోల్డ్ ష్వార్జ్నెగ్గర్ మరియు సిల్వెస్టర్ స్టాల్లోన్[ఉల్లేఖన అవసరం]లు ప్రధాన పాత్రలలోనూ మరియు బహుదూర భవిష్యత్తులో నిర్మించుటకు యోచించారు. పరిగణించిన ఇతర జోడీలలో హర్రిసన్ ఫోర్డ్ మరియు మైఖేల్ దగ్లస్[4] అదే విధంగా ఆల్ పాసినో మరియు రాబర్ట్ డే నిరో[ఉల్లేఖన అవసరం] కూడా ఉన్నారు. తదనంతరం చేసిన చిత్రం లో దగ్లస్ నియోగిత నిర్మాతగా (ఎక్సిక్యూటివ్ ప్రొడ్యుసర్) ఉన్నాడు. వైట్ హీట్ (1949) మరియు సెకండ్స్ (1966) ల ప్రభావం ఈ చిత్ర కథాంశం మీద ఉందని వెర్బ్ మరియు కల్లేరి ప్రకటించారు.[3]

జాన్ వూకి దర్శకత్వం చేసే అవకాశం లభించినా అతని పూర్వ అమెరికన్ చిత్రాలకు భిన్నంగా పూర్తి సృజనాత్మక నిర్దేశకత్వం చేసే అవకాశం స్టూడియో ఇచ్చినపుడే దర్శకత్వం చేయుటకు అంగీకరీంచాడు. అంతకు మునుపు ట్రావోల్టా, వూ యొక్క బ్రోకెన్ యార్రో చిత్రం లో నటించాడు (వూ యొక్క తదుపరి చిత్రం విండ్ టాకర్స్ లో కేజ్ నటించాడు). జాన్ వూ ఈ చిత్రాన్ని సోదాహరణగా సమర్పించుటకు, ఇద్దరి మధ్య ఘర్షణ, ఆ వ్యక్తుల యొక్క సంబంధీకులలో (ఉదాహరణకు సాషా మరియు ఆడం మరియు ఆర్చర్ యొక్క కుటుంబం) ఎట్టి మార్పులను తెస్తుందో చూపుటకు జాన్ వూ చిత్ర కథను మనోతత్వ మూలసూత్రాల మీద కేంద్రీకరించాడు.

కాస్టర్ మరియు పొలక్స్ పేర్లు ట్రోయ్ నగరాన్ని కలిగి ఉన్న గ్రీక్ పురాణాలలోని కవలలైన అన్నదమ్ముల పేర్ల నుంచి తీసుకోబడింది. ఆ కథలో ఆర్చర్ మరియు ట్రోయ్‌ల నడుమ ఉన్న ద్వేషం, ట్రోజాన్ యుద్ధంలోని హెక్టర్ మరియు ఆచిల్లెస్ మధ్య జరిగిన పోరుని పోలి ఉంటుంది. కాస్టర్ మరియు పొలక్స్ జెమిని నక్షత్ర రాసిని ఏర్పరచిన అన్నదమ్ములలోని వారు కూడా. అర్చర్ కూడా ఒక నక్షత్ర సముదాయం.

పొలక్స్‌ని ఎరేహ్వాన్ చెరసాల (తీవ్ర వాదులను ఉంచు రహస్య ఖైదు)లో నిర్బంధించారు. బందీలకు వారు దేశంలోని ఏ ప్రాంతం లో ఉన్నారో కూడా తెలియదు. ఎరేహ్వాన్"ని తిప్పి చూస్తే "నో వేర్" (ఇంగ్లీష్ లోనున్న ఈ మాటలు) అని వస్తుంది. సామ్యుల్ బుట్లేర్ యొక్క అల్లెగోరికాల్ నోవెల్ (రూపకాలంకారమైన నవల) పేరు నుంచి ఈ పేరు తిప్పి దాని పేరు తీసుకోబడింది.

నాశనం చేయబడిన మతపరమైన సహజసిద్ధం కాని వాటి చుట్టూ తిరిగే పావురాలను కలిగి ఉన్న చర్చిలో జరిగిన యుద్ధం, 1989లోని జాన్ వూ యొక్క సనాతన చిత్రం ది కిల్లర్ ‌లోని తుది ముఖాముఖీ పోరుని పోలి ఉంటుంది.

ఫేస్/ఆఫ్ లో $80 మిలియన్ల వ్యయంతో తయారు చేసిన భారీ పోరాట సెట్టింగులలో చాలా సాహసోపేతమైన మారణాయుధాలతో కూడిన యుద్ధ సన్నివేశాలు మరియు పడవలలో వెంట తరుములాటలు ఇమిడి ఉన్నాయి. లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించారు.[5][6]

1990ల చివరలో నికోలస్ కేజ్ నటిస్తున్న మూడు చిత్రాలలో ఇది ఒకటి కాగా, పారామౌంట్ పిక్చర్స్ మరియు టచ్స్టోన్ పిక్చర్స్, వారి సహనిర్మాణంలో వచ్చిన స్నేక్ ఐస్ (1998) మరియు బ్రింగింగ్ అవుట్ ది డెడ్ (1999) చిత్రాలు అతను నటించిన మిగతా రెండు.

విడుదల[మార్చు]

ఫేస్/ఆఫ్ చిత్రం 1997 జూన్ 27న నార్త్ అమెరికా లో విడుదలైనది, మరియు విడుదలైన మొదటి వారాంతంలోనే $23 మిలియన్లను ఆర్జించింది. 1997లోని చిత్రాలలో ఇది స్వదేశంలో 11వ అత్యున్నత మొత్తాలనార్జించిన చిత్రం గానూ, మరియు ప్రపంచవ్యాప్తంగా 14వ స్థానానికి ఎదుగుతూ, స్వదేశంలో $112,276,146లను ఆర్జించి, ఖండాంతరాలలో $133,400,000లను, ప్రపంచ వ్యాప్తంగా వీటి యొక్క మొత్తం $245,676,146 లను ఆర్జించింది.[5][7]

1998 అక్టోబర్ 7న విడుదలైన ఫేస్/ఆఫ్ యొక్క రీజియన్ 1 DVD, ఈ ఫార్మాట్ (పద్ధతి) లో విడుదలైన మొదటి చిత్రాలలో ఒక చిత్రం.[8] సంయుక్త రాష్ట్రాలలో 2007 సెప్టెంబర్ 11న, 10వ యానివర్సరి కలక్టర్స్ ఎడిషన్ (10వ వార్షికోత్సవ సముదాయక కూర్పు) ని DVD లుగా విడుదలైనది మరియు 2007 అక్టోబర్ 30న HD DVD లో విడుదలైనది.[9] ఈ కొత్త DVD 2 డిస్క్ లలో 7 తీసివేయబడ్డ సన్నివేశాలను, వేరొక ముగింపును మరియు అనేక ఇతర ఆకర్షణలను కలిగి ఉంది.[10]

ఈ చిత్రం బ్లూ-రే (Blu-ray)డిస్క్ రూపంలో సంయుక్త రాజ్యంలో 1 అక్టోబరున బ్యూన విస్టా ద్వారా మరియు సంయుక్త రాష్ట్రాలలో లో 20 మే పారామౌంట్ పిక్చర్స్[11] ద్వారా విడుదల చేయబడింది.

ఆదరణ[మార్చు]

చాలా మంచి సమీక్షణల పొందాక మరియు బాక్స్ ఆఫీసు దగ్గర మంచి లాభాల ఆర్జనలను కలుపుకొని, ఈ చిత్రం ఆర్థికపరమైన మరియు కీలక విజయాన్ని సాధించింది. ట్రావోల్టా మరియు కేజ్ ల నడుమ జరిగిన పాత్రలను తిరగ మార్చిన ప్రక్రియ, అదే విధంగా వారిరువురి మధ్య చూపిన వినూత్నమైన ప్రచండ పోరాట పరిణామాలు, ప్రశంసలను అందుకొన్న విషయాలు. చికాగో సన్-టైమ్స్ యొక్క విమర్శకుడు రోగెర్ ఎబెర్ట్ ఇలా వ్యాఖ్యానించాడు "ఇందులో, నటింపజేసిన అతి పెద్ద తారాగణం చేత, ఒకరి పాత్రలను మరొకరు పోషించు కొన్ని పోరాట సన్నివేశాల యొక్క సందర్భాలలో వారిద్దరిని పోల్చినపుడు అద్భుతమైన తారతమ్యాలను, వూ మరియు అతని రచయితలు చూపగలిగారు. చిత్రం మొత్తం మీద ప్రతి సన్నివేశంలోనూ, 'మరియొక' పాత్ర దీన్ని 'నిజంగా' పోషిస్తున్నది అనే స్ఫురణకి వచ్చి మనకి మనం తెలుసుకొనేటట్లుగా తీయబడినది."[12] రొల్లింగ్ స్టోన్స్ ' చిత్రం యొక్క పీటర్ ట్రావేర్స్ ఈ చిత్రాన్ని గురించి చెబుతూ, "ఈ చిత్రం యొక్క మొదలు లేక తుది అర్ధం కాకపోయినా, ట్రావోల్టా మరియు కేజ్ ల పాత్రల యొక్క హాస్య మరియు మనోతత్వ కోణాలు, మరియు వారి స్వీయ నడతలు ఫేస్/ఆఫ్ చిత్రానికి అడ్డు లేకుండా చేసింది. మీరు చూడబోయేది అదే."[13] టైం మాగజైన్కి చెందిన రిచర్డ్ కర్లిస్స్ చెప్పిన ప్రకారం, ఈ చిత్ర దర్శకులు ప్రేక్షకులను భయపెట్టుటకు చిత్రంలో ఇమిడ్చిన ఉద్వేగసన్నివేశాలు "ఉత్కంఠభరిత సవారి మాత్రమె కాదు, ఇది ఉత్కంఠభరిత గతం లోకి రాకెట్లాగ దూసుకుపోతాయి."[14]

కొంత మంది విమర్శకులు చిత్రంలో హింస ఎక్కువగా వున్నది మరియు పోరాట సన్నివేశాలు సుదీర్ఘముగా వున్నాయని భావించారు. సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినెర్ చెందిన బార్బరా షుల్గాసేర్, ఈ చిత్రాన్ని "పిచ్చి చిత్రం"గా పేర్కొని, "మంచి దర్శకుడు 6 విధాలలో నుంచి ఉత్తమమైన దానిని ఎన్నుకొని తన చిత్రం లో చూపెడతాడు. కానీ వూ 6 విధాలనూ చూపెట్టారు. వూ చిత్రం చూస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని, ప్రతి 6 నిమిషాలకు కనులు తెరచినచో, ఆహ్లాదకరమైన చక్కని సాయంత్రాన్ని చూడడానికి ఎంత అవసరమో అంత ఈ చిత్రంలో చూడవచ్చు" అని వాదించారు.[15]

ఫేస్/ఆఫ్, రోటెన్ టొమాటోస్ 56 సమీక్షణలలో 54 మంచి సమీక్షణల ద్వారా 93% "ఫ్రెష్" రేటింగ్ ను మరియు మెటాక్రిటిక్ వారి 25 సమీక్షణలలో 82 మార్కులను సాధించింది.[16][17] ఈ చిత్రం 70వ అకాడెమి అవార్డ్స్ లో సౌండ్ ఎడిటింగ్ లో అకాడెమి అవార్డుకు ఎంపిక చేయబడి టైటానిక్ చేతిలో పరాజయం పొందినది. ఫేస్/ఆఫ్ ఉత్తమ దర్శకత్వం మరియు రచనకు సాటర్న్ అవార్డ్స్‌ను, మరియు ఉత్తమ పోరాట సన్నివేశంకు (స్పీడ్ పడవ వెంటపడు) MTV మూవీ అవార్డ్స్ను మరియు ఉత్తమ ద్వయం ట్రవోల్ట మరియు కేజ్‌ల [18] కొరకు పొందినది.

సౌండ్‌ట్రాక్[మార్చు]

Face/Off: Original Soundtrack Music By John Powell
దస్త్రం:Off Soundtrack Cover.jpg
John Powell స్వరపరచిన Soundtrack
విడుదలJuly 1, 1997
రికార్డింగు1997
సంగీత ప్రక్రియScore
నిడివి41:42
రికార్డింగ్ లేబుల్Hollywood Records
నిర్మాతHans Zimmer
ట్రాక్ వరుస
 1. "ఫేస్ ఆన్" – (4:57)
 2. "80 ప్రూఫ్ రాక్" – (4:29)
 3. "ఫర్నిచర్ " – (7:12)
 4. "ది గోల్డెన్ సెక్షన్ డెర్మ లిఫ్ట్ " – (3:15)
 5. "థిస్ రిడిక్యులస్ చిన్" (– 6:51)
 6. "నో మోర్ డ్రగ్స్ ఫర్ దట్ మాన్" – (7:27)
 7. "హన్స్' లాఫ్ట్ " (– 3:37)
 8. "రెడీ ఫర్ ది బిగ్ రైడ్‚ బుబ్బ" – (3:54)
ఆల్బం ఘనత
 • వాయిద్యబృందం (ఆర్ర్కేస్త్ర) నిర్వహించినది: లుకాస్ రిచ్మన్
 • వాయిద్యబృంద (ఆర్ర్కేస్త్ర) సభ్యులు: బ్రూస్ ఫ్లోర్, స్టీవెన్ ఫ్లోర్, వాల్ట్ ఫ్లోర్, య్వొనే ఎస్. మొరియార్తి, లాడ్ మేకలన్తోష్ మరియు లుకాస్ రిచ్మన్

అదనపు సంగీతం[మార్చు]

చలన చిత్రంలో ఉపయోగించిన చాలా రకాలైన పాటలు మరియు సంగీతపు భాగాలు సౌండ్ ట్రాక్స్‌లో ఇవ్వలేదు.[19] వాటిలో కొన్ని:

సూచనలు[మార్చు]

 1. http://www.boxofficemojo.com/movies/?id=faceoff.htm
 2. Yabroff, Jennie (1997-06-27?). "Gentleman with a gun". Salon.com. Retrieved 2007-06-06. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 3. 3.0 3.1 క్రిస్తోఫేర్ హేర్డ్. ' టెన్ థౌజండ్ బుల్లెట్స్: ది సినిమా అఫ్ జాన్ వూ /0}. లాస్ ఎంజెల్స్: లొనే ఈగిల్ పబ్ల్, 2000. ISBN 0-262-08150-4
 4. ఎంపైర్ - స్పెషల్ కల్లెక్టర్స్' ఏడిషన్ - ది గ్రేటెస్ట్ యాక్షన్ మూవీస్ ఎవెర్ (పబ్లిషిడ్ ఇన్ 2001)
 5. 5.0 5.1 "Face/Off". Box Office Mojo. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 6. "Filiming locations for Face/Off". IMDB. Retrieved 2007-06-06. Cite web requires |website= (help)
 7. "Release dates for Face/Off". IMDB. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 8. "DVD details for Face/Off". IMDB. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 9. Perenson, Melissa J. (2007-01-18). "New HD Disc Titles, New HD Disc Technology". PC World. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 10. ఫేస్/ఆఫ్ (US - DVD R1 | HD | BD RA) ఇన్ న్యూస్ > రిలీజెస్ ఎట్ డివిడి యాక్టివ్
 11. బ్రేకింగ్: పారామౌంట్ అన్ లీవ్స్ బ్లూ-రే (Blu-ray) లాన్చ్ ప్లాన్స్ | హై-డెఫ్ (High-Def)డైజెస్ట్
 12. Ebert, Roger (1997-06-27). "Face/Off". Chicago Sun-Times. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 13. Travers, Peter (2001-02-09). "Face/Off". Rolling Stone. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 14. Corliss, Richard (1997-06-30). "ONE DUMB SUMMER: Reviews". Time Magazine. Retrieved 2008-11-20. Cite web requires |website= (help)
 15. Shulgasser, Barbara (1997-06-27). "Trading Faces". San Francisco Examiner. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 16. "Face/Off". Rotten Tomatoes. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 17. "Face/Off". Metacritic. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)
 18. "Face/Off awards". IMDb. Retrieved 2007-06-08. Cite web requires |website= (help)
 19. "Soundtracks for Face/Off". IMDB. Retrieved 2007-06-05. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:John Woo

"https://te.wikipedia.org/w/index.php?title=ఫేస్/ఆఫ్&oldid=2563070" నుండి వెలికితీశారు