ఫైటోథెరఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1990 -2007 వరకూ పబ్ మెడ్ జాబితాలో "ఫైటోథెరఫీ" అను పదం కలిగియుండి పొందుపరిచిన పరిశోధన పత్రాల వరస మొత్తము.

సహజసిద్ధంగా ఉత్పన్నమైన వాటినుండి వెలికి తీసిన పదార్థాలను ఓషధులుగా లేదా ఆరోగ్యం వృద్ధి చేసే కారకాలుగా ఉపయోగించడం అనే దాని పై చేసే అధ్యయనమే ఫైటోథెరఫీ (Phytotherapy).

తరచుగా ప్రాచీన ఫైటోథెరఫీ హెర్బలిజానికి పర్యాయపదంగా ఉపయోగించడం జరుగుతుంది. చాలా వరకు పాశ్చాత్య వైద్య విజ్ఞానం దీన్ని ప్రత్యామ్నాయ వైద్యంగా పరిగణించడం జరుగుతుంది.

క్లిష్టంగా జరిపినప్పుడు ఆధునిక ఫైటోథెరఫీ మూలికా ఓషధుల ప్రభావాలు, వైద్యపరంగా వాటి ఉపయోగం పై జరిపిన సహేతుకమైన అధ్యయనంగా పరిగణింపబడుతుంది.

ఫైటోథెరఫీ లో విచారించవలసిన అంశాలు[మార్చు]

ప్రమాణీకరణ[మార్చు]

మూలికా వైద్యశాస్త్రం లోప్రమాణీకరణ అను పదం స్పష్టీకరించిన ఒక మార్కర్ పదార్థం యొక్క స్పష్టీకరించిన గాఢతకు సరిపోయే వృక్ష పదార్థాన్ని తయారు చేసి అందించడాన్ని సూచిస్తుంది. కోఫాక్టర్స్ అందులో లేకుంటే శక్తివంతమైన పదార్థం యొక్క గాఢతలు అనేవి కేవలం తప్పుదారి పట్టించే గాఢతలుగా మాత్రమే అయ్యే అవకాశం ఉంది. ఇంకో సమస్య ఏమిటంటే చాలా సార్లు కీలక పదార్థం ఏమిటో తెలియకుండా పోవచ్చు. ఉదాహరణకి, సెయింట్ జాన్స్ ఔషధపు మొక్క తరచుగా యాంటి వైరల్ పదార్థం అయిన హైపెరిసిన్ స్థాయికి ప్రమాణీకరించడం జరుగుతూ ఉంటుంది.ఇప్పుడు అది యాంటిడిప్రెస్సంట్ గా ఉపయోగించే దానిలో ఒక శక్తి వంతమైన పదార్థం. ఇంకా మనకు తెలిసిన పదార్థాలు దాదాపు మరో 24 వరకు ఉన్నప్పటికీ ఇతర కంపెనీలు హైపర్ ఫోరిన్గా లేక రెండింటిగా ప్రమాణీకరించడం చేస్తున్నాయి. ప్రమాణీకరణ గుర్తులుగా ఉపయోగించే రసాయనాలలోచాలా తక్కువ సంఖ్యలో వాటిని మాత్రమే శక్తివంతమైన పదార్థాలుగా అంటారు. ప్రమాణీకరణ ఇంకా ప్రమాణీకరించబడలేదు: వివిధ కంపెనీలు వివిధ మార్కర్స్ ఉపయోగించడం లేదా అదే మార్కర్ ఐనప్పటికీ వివిధ అంతస్తులలోఉపయోగించడం లేదా మార్కర్ మిశ్రమ పదార్థాలను పరీక్షించేందుకు భిన్నమైన పరీక్షా పద్ధతులు ఉపయోగించడం చేస్తున్నాయి. మూలికా వైద్య శాస్త్రజ్ఞుడు మరియు ఉత్పత్తిదారుడు అయిన డేవిడ్ విన్ స్టన్ ఏమంటున్నారంటే ఎప్పుడైతే భిన్నమైన మొక్కలకు శక్తివంతమైన పదార్థాలుగా భిన్నమైన మిశ్రమ పదార్థాలు ఎంచుకోవడం జరుగుతుందో అప్పుడు సరఫరాదారులకు ప్రమాణీకరణకు దిగువన ఉన్న బాచ్ (రసాయనిక మార్కర్స్ పరంగా ) లభించి వారు దాన్నిప్రమాణతలో ఉన్నతమైన బాచ్ లో కలిపేసి వ్యత్యాసాన్ని పూడ్చుకునే అవకాశం ఉంది.[1]

నాణ్యత[మార్చు]

క్రూడ్ డ్రగ్స్ లేదా మూలిక ఔషధాల యొక్క నాణ్యత అనేక రకాల కారణాల పై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఉపయోగించే మొక్క స్పీసీ (లేదా స్పీసీలు) : మొక్క ఎదిగిన స్థితులు ( అనగా మట్టి, ఎండ, శీతోష్ణ స్థితి) ; పంట యొక్క కోట కాలం, కోత తర్వాత తయారీ మరియు భద్రపరచిన స్థితి కూడా ఉన్నాయి. కొన్ని మూలికఔషధాల నాణ్యత ఆర్గెనోలేప్టిక్ అంశాలు (అనగా ఇంద్రియాలతో గ్రహించగలిగే గుణాలు అయిన రుచి, రంగు, వాసన లేదా ఔషధం యొక్క స్పర్శ) ద్వారా లేదా చిన్న మోతాదులో మందును ఉపయోగించి ప్రభావాలని పరిశీలించడం ద్వారా గాని నిర్ణయించవచ్చు.

కల్ పెప్పర్స్ కంప్లీట్ హెర్బల్[2] లేదా షెన్ నాంగ్ లేక డివైన్ ఫార్మర్స్ మేటీరియా మెడికా వంటి ప్రాచీన ఔషధ సంబంధిత గ్రంథాలలో ఈ స్థితులు వివరించడం జరిగింది.[3] చాలా ఏళ్ళ వరకూ ఇదే ప్రమాణిత ఫార్మాకోగ్నోసి గ్రంథ సముదాయంగా కొనసాగడం జరిగింది.[ఉల్లేఖన అవసరం]

సేకరణ తర్వాత భద్ర పరచడం అనేది పరిశోధనా యోగ్యత కలిగిన అంశం; జపాన్ లోని నారాలో పరిశోధకులు కొద్ది పరిమాణంలో భద్రపరచిన జిన్సెంగ్ వేరు (పానాక్స్ జిన్సెంగ్), లికోరైస్ వేరు (గ్లిసిరిజా గ్లాబ్ర) మరియు రబర్బ్ వేరు (రియం ఎమోడి)1,200 ఏళ్ళుగా తమ శక్తివంతమైన గుణాలను నిలుపుకుని ఉన్నట్టు చూపబడింది.[4]

ఆధునిక కాలంలో కేవలం కొన్ని పదార్థాలు మాత్రమే గుర్తించబడడం, వాటిని కొలచడం అనేది సాధారణంగా జరుగుతూ ఉండే వాస్తవమే అయినా ప్రయోగశాలలో పరీక్షించడం అనేది ప్రవేశించడంతో జారవిడుచుకుంటున్న ప్రత్యేకతలు కూడా తక్కువ ప్రాధాన్యత గలవి మాత్రమేమి కావు.[ఉల్లేఖన అవసరం] HPLC ( హై పెర్ ఫార్మంస్ లిక్విడ్ క్రొమాటోగ్రాఫి, GC (గ్యాస్ క్రొమాటోగ్రాఫి), యువి/విఐఎస్ (అల్ట్రావయలెట్/విసిబిల్ స్పెక్ట్రో ఫోటోమెట్రి) లేక AA (అటామిక్ అబ్సార్ప్ షన్ స్పెక్త్రోస్కోపి) వంటి ప్రక్రియలు స్పీసీస్ ను గుర్తించడానికి, బ్యాక్టీరియా కాలుష్యం కొలిచేందుకు, గాఢత నిర్ణయించడానికి, చివరగా పదార్థం విశ్లేషణ కై ధ్రువీకరణ పత్రికలు సృష్టించేందుకు ఉపయోగించబడుతూ ఉన్నాయి.

మంచి ఉత్పదనా పద్ధతులు నిశ్చయించే అధికారులు లేక యుఎస్ FDA వారి ద్వారా నియంత్రణ ప్రాతినిధ్యం పొందిన వారిచే మాత్రమే నాణ్యత విచారణ లేదా తనిఖీ చెయ్యబడాలి. యునైటెడ్ స్టేట్స్ లో తరచుగా మూలికా ఔషధాలు క్రమపరచబడలేదనే వ్యాఖ్యానాలు కనిపిస్తూ ఉంటాయి. అయినా ఇది వాస్తవం కాదు, ఎందుకంటే అక్కడ FDA మరియు GMP నియమాలు ఉన్నాయి. జర్మనీలో ఐతే కమిషన్ ఇ నాణ్యతా ప్రమాణాలు మరియు జర్మన్ చట్ట-వైద్య నియమాలు పొందుపరుచుకున్న ఒక గ్రంథాన్ని వెలువరించడం జరిగింది.[5]

భద్రత[మార్చు]

అనేక ఔషధ మొక్కలు ప్రతికూల ప్రభావాలు కలిగిస్తాయని భావన.[6]

ఇంకా చెప్పాలంటే, "కల్తీ, యుక్తము కాని విధంగా వ్యక్తీకరించడం, మొక్కను గురించి మరియు ఔషధాలు ఒక దాని పై ఒకటి పని చేసే తీరుని గురించిన అవగాహనా లోపం ఒక్కోసారి ప్రాణాంతకమైన లేదా మరణాన్ని కూడా కలిగించే ప్రతికూల చర్యలకు దారి తీసాయి."[7] ఒక మొక్క వైద్యపరంగా ఉపయోగించవచ్చు అని సిఫారసు చేసేందుకు ముందు దాని భద్రత, సార్థకతలు నిర్ధారించుకోవడానికి సరైన డబుల్ బ్లయిండ్ క్లినికల్ శోధనలు అవసరం.[8] వినియోగదారులలో అనేకులు మూలికా ఔషధాలు "సహజమైనవి" కావడంవల్ల సురక్షితమైనవి అని భావించినప్పటికీ మూలికా ఔషధాలు సంయోజిత ఔషధాలపై పనిచేసి తద్వారా రోగికి విషతుల్యంగా పరిణమించవచ్చులేదా భద్రాతా భావన దృష్ట్యా కాలుష్యాన్ని కలిగి ఉండవచ్చు, ఇంకా సార్థకత రుజువు లేని మూలికా ఔషధాలు సార్థకత రుజువు గల ఔషధాలకు బదులుగా ఉపయోగించబడడం జరగవచ్చు.[9]

క్రూడ్ డ్రగ్స్ సురక్షత చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదాంశాలు వాటి సంభవనీయ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోకుండా సహజ ఔషధాలు "సురక్షితం" అనే అంశం నుండి అవి మనకు తెలియని అపరిచిత ప్రమాదాలు అనే అంశం వరకు ఉన్నాయి.[10]

ఎఫిడ్రాతో అనేక చెడ్డ ప్రభావాలు తెలుసుకోవడం జరిగింది. వీటిలో విపరీతమైన చర్మ సంబంధిత చర్యలు, విపరీతమైన కోపం, భయం, తల తిరగడం, వణుకు పుట్టడం, తల నొప్పి, నిద్ర లేమి, విపరీతంగా చెమట పట్టడం, నిర్జలీకరణం, చర్మం మరియు మాడు మీద చర్మం పై దురద, వాంతులు, శరీర ఉష్ణోగ్రత విపరీతంగా అధికం అవ్వడం, క్రమం తప్పి గుండె కొట్టుకోవడం, హార్ట్ అటాక్, స్ట్రోక్, అకస్మాత్తుగా వ్యాధికి గురి కావడం లేదా మరణం [[సంభవించడం కూడా ఇందులో ఉన్నాయి.[11]]]

కేవలం కొద్దిపాటి ఔషధ ప్రభావాలు మాత్రమే కలిగి ఉన్న విషపు మొక్కలు యునైటెడ్ స్టేట్స్ లో సాధారణంగా మెటీరియల్ డోసెస్ గా విక్రయించడం జరగదు, సుశిక్షితులైన వైద్యులకు మాత్రమే ఇవి లభ్యం,[ఉల్లేఖన అవసరం] వీటిలో ఇవి ఉన్నాయి:

 • ఎకోనైట్
 • ఆర్నికా
 • బెల్లడోన్న
 • బ్రయోనియా
 • దతూర
 • జెల్సిమియం
 • హెన్బేన్
 • మేల్ ఫెర్న్
 • ఫైటోలక్కా
 • పోడోఫిల్లం మరియు
 • వెరాట్రం

మరికొన్ని మొక్కలు, అవేమిటంటే లోబిలియా, ఎఫిడ్రా మరియు ఈనిమస్ వికారం, చమటలు మరియు వాంతులు కలిగిస్తాయని ప్రాచీన కాలం లోనే నిర్ణయించడం జరిగింది.[ఉల్లేఖన అవసరం]

హెపాటోటాక్సిక్ పైర్రోలిజిడిన్ ఆల్కలాయిడ్ పదార్థం కలిగి ఉన్న కారణంగా కొంఫ్రే [12][13] మరియు పెటాసైట్స్ మొక్కలు స్పష్టమైన విష తత్వాన్ని కలిగి ఉంటాయి.[14][15] ముందు జాగ్రత్త అవసరమైన మరికొన్ని మూలికా ఔషధాలు కూడా ఉన్నాయి, ముందు జాగ్రత్త లేకుంటే ఇవి ఇతర ఔషధాలతో చర్య జరుపుకునే ప్రమాదం ఉంది, వీటిలో సెయింట్ జాన్స్ ఔషధపు మొక్క మరియు గ్రేప్ ఫ్రూట్ కూడా ఉన్నాయి.[16]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఔషధశాస్త్రం
 • మూలికా శాస్త్రం
 • ప్రత్యామ్నాయ వైద్యం

సూచనలు[మార్చు]

 1. అలాన్ టిలోట్ సన్ గ్రోత్, మెచ్యురిటి, క్వాలిటి
 2. నికోలస్ కల్పెప్పర్ చే కల్పెప్పర్స్ కంప్లీట్ హెర్బల్ కేంసింగ్ టన్ ఆర్ట్ ప్రెస్ వారిచే 2003 లో పునర్ముద్రించ బడినది.
 3. డివైన్ ఫార్మర్స్ మెటీరియా మెడికా: యాంగ్ షౌఝాంగ్ మరియు బాబ్ ఫ్లాస్ (అనువాదకుడు)బ్లూ పాప్పి1998 లచే అనువదించబడిన షెన్ నాంగ్ బెన్ కావో( బ్లూ పాప్పీ చే గ్రేట్ మాస్టర్ సీరీస్.
 4. టిల్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హెల్త్ - పెరుగుదల, ఉత్పాదన, నాణ్యత
 5. మేకింగ్ సెన్స్ ఆఫ్ కమిషన్ ఇ , జోనాథన్ ట్రెజర్ చే విమర్శనము, 1999 - 2000.
 6. తలాలే పి. అండ్ తలాలే పి., "ది ఇమ్పార్టెన్స్ ఆఫ్ యూజింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపుల్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ మెడిసినల్ ఏజెంట్స్ ఫ్రం ప్లాంట్స్", అకాడమిక్ మెడిసిన్ , 2001 , 76 , 3 , పి238.
 7. ఎల్విన్-లూయిస్ ఎం., "షుడ్ వి బి కన్సెర్న్ద్ అబౌట్ హెర్బల్ రెమిడీస్," జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ 75 (2001)141 -164.
 8. Vickers AJ (2007). "Which botanicals or other unconventional anticancer agents should we take to clinical trial?". J Soc Integr Oncol. 5 (3): 125–9. doi:10.2310/7200.2007.011. PMID 17761132.
 9. Ernst E (2007). "Herbal medicines: balancing benefits and risks". Novartis Found. Symp. 282: 154–67, discussion 167–72, 212–8. doi:10.1002/9780470319444.ch11. PMID 17913230.
 10. [జేన్ బ్రోడి. టేకింగ్ స్టాక్ ఆఫ్ మిస్టరీస్ ఆఫ్ మెడిసిన్] ఎచ్ టి టి పి://క్వీరి.నిటైమ్స్.కామ్ /జి ఎస్ టి/ఫుల్ పేజ్.ఎచ్ టి ఎం ఎల్?ఆర్ ఇ ఎస్ =9ఏ05ఇఇడిసి1ఎఫ్౩ఇఎఫ్936ఎ35756సి౦ఎ 96ఇ958260 &సెక్=హెల్త్&స్పాన్=&పేజ్వాన్టడ్=2
 11. ఎఫిడ్రా ఇన్ఫర్మేషన్ ఫ్రం మెమోరియల్ స్లోన్ - కెట్టరింగ్ కేన్సర్ సెంటర్. ఏప్రిల్ 11, 2007 లో బేరీజు వేయబడినది.
 12. హిల్లర్ కే, లొఎ డి. 2009. సిమ్ ఫైటి రాడిక్స్. ఇన్ టీడ్రోజేన్ అండ్ ఫైటోఫార్మక, విచ్టిఎల్ఎమ్ (ఎడ్).విస్సెన్ స్కాఫ్ట్ లిక్ వర్లాగ్స్ జేస్సల్స్కాఫ్ట్ ఎంబిఎచ్ స్టట్గార్ట్: స్టట్గార్ట్;644 -646. ఇన్ టీడ్రోజన్ అండ్ ఫైటోఫార్మక, విచ్టిఎల్ఎం (ఎడ్) విస్సెన్ స్కాఫ్ట్లిక్ వర్లాగ్స్ జేస్సల్స్కాఫ్ట్ ఎంబిఎచ్ స్టట్గార్ట్: స్టట్గార్ట్;644 -646.
 13. బెనెడెక్, బి., జీగ్లర్, ఎ. అండ్ ఒట్టర్స్బాక్ , పి.(2010), ప్రత్యేకమైన సిమ్ఫైటం అఫ్ఫిసినాలే ఎల్.వెలికి తీసిన ద్రవం లో రివర్స్ బ్యాక్టీరియల్ మ్యుటేషన్ పరీక్షలో మ్యుటాజనిక్ ప్రభావాలు లేకపోవుట. ఫైటోథెరఫీ పరిశోధన,24 : 466 -468 . డోఇ:10 .1002 /పిటిఆర్.3000 - ఎచ్టిటిపి://ఆన్ లైన్ లైబ్రరీ.విలే.కామ్/డిఓఐ /10.1002/పిటిఆర్.౩౦౦౦/అబ్స్ ట్రాక్ట్
 14. మట్టాక్స్ ఎఆర్ 1986. కెమిస్ట్రీ అండ్ టాక్సి కాలోజి ఆఫ్ పైర్రోలిజిడిన్ ఆల్కలాఇడ్స్, అకాడమిక్ ప్రెస్: లండన్; 391 .
 15. కార్డెల్, జి.ఎ., క్విన్ - బియట్టి, ఎం. ఎల్. మరియు ఫారంస్వర్త్ , ఎన్. ఆర్.(2001), ఔషధాల ఆవిష్కరణ లో ఆల్కలాఇడ్స్ శక్యత. ఫైటోథెరపీ పరిశోధన, 15: 183-205. డిఓఐ: 10.1002/పిటిఆర్.890 - ఎచ్టిటిపి:/ఆన్ లైన్ లైబ్రెరి.విలే.కామ్/డిఓఐ/ 10.1002/పిటిఆర్.890/అబ్స్ ట్రాక్ట్
 16. [1] విన్స్టన్, డేవిడ్. మూలికా శాస్త్రం ఉపోద్ఘాతం