Jump to content

ఫైరోజ్ నూరుద్దీన్ సైత్

వికీపీడియా నుండి
ఫైరోజ్ నూరుద్దీన్ సైత్

పదవీ కాలం
2008 – 2018
ముందు నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
తరువాత అనిల్ ఎస్. బెనకే
నియోజకవర్గం బెల్గాం ఉత్తర

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

ఫైరోజ్ నూరుద్దీన్ సైత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008 కర్ణాటక శాసనసభకు బెల్గాం ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఫైరోజ్ నూరుద్దీన్ సైత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బెల్గాం ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శంకర్‌గౌడ ఐ పాటిల్‌పై 3,373 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రేణు సుహాస్ కిల్లెకర్‌పై 18210 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[2][3] 2016లో కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[4]

ఫైరోజ్ నూరుద్దీన్ సైత్ 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బెల్గాం ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అనిల్ ఎస్. బెనకే చేతిలో 17267 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-06.
  3. "70 take oath, seven more to go" (in Indian English). The Hindu. 31 May 2013. Archived from the original on 16 May 2025. Retrieved 16 May 2025.
  4. "21 MLAs to head boards, corporations" (in Indian English). The Hindu. 2 November 2016. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  5. "Belgaum Uttar Constituency Election Results". The Times of India. 13 May 2023. Retrieved 16 May 2025.