ఫైర్‌ అలారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్ట్రోబ్‌ లైట్ తో ఒక ఫైర్ అలారం నోటిఫికేషన్‌‌.

అగ్నిప్రమాదం సంభవించినప్పుడు దానిని పసిగట్టేలా ఆటోమేటిక్‌ ఫైర్‌ అలారం వ్యవస్థ‌ ని తయారుచేశారు. మంటలు, వేడి ‌వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను ఇది పర్యవేక్షిస్తుంది. సాధారణంగా ఫైర్ అలారంలను, ఆటోమేటిగ్గా పనిచేసేవి, మనం స్వయంగా ఆపరేట్‌ చేసేవి లేదా రెండు రకాలుగా పనిచేసేవిగా విభజించవచ్చు. అగ్నిప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో అక్కడున్నవారు దాన్ని గుర్తించేలా ఆటోమేటిక్ ఫైర్ అలారం వ్యవస్థలు ఉపయోగపడతాయి. అత్యవసర సేవలను పిలిచేలా జాగ్రత్తపరుస్తాయి. మంటలను, పొగను అదుపు చేయడానికి అక్కడి వ్యవస్థను సిద్దం చేస్తాయి.

రూపకల్పన[మార్చు]

సంబంధిత నమూనా భవంతి సంకేతం, బీమా సంస్థలు, ఇతర అధికారులచే తప్పనిసరి చేయబడిన కనిష్ఠ స్థాయి రక్షణను సూచిస్తూ అగ్నిమాపక రక్షణ లక్ష్యాలు తయారుచేయబడిన తరువాత - ఫైర్‌ అలారం రూపకర్త కావలసిన పరికరాలను, ఏర్పాట్లను మరియు ఈ పనులు పూర్తికావడానికి అవసరమైన చర్యలను తీసుకుంటాడు. ఇలాంటి అవసరాల కోసం ప్రత్యేకించి తయారుచేసిన వస్తువులు ఎంచుకోబడతాయి మరియు దీనిని రూపకల్పన చేసినప్పుడు ఉపయోగించడానికి వీలుగా ప్రామాణికమైన పద్ధతులను పొందుపరుస్తారు. అమెరికాలో NFPA 72, ది నేషనల్‌ ఫైర్ అలారం కోడ్‌ని ప్రవేశపెట్టారు. దీనిని విస్తృతంగా వాడుతున్నారు.

ప్రాథమిక కన్ఫిగరేషన్‌[మార్చు]

దస్త్రం:Honeywellfirepanel.JPG
ఎ హనీవెల్‌ డెల్టానెట్‌ FS90 ఫైర్‌ అలారం నియంత్రణ ఫలకం.
 • ఫైర్ అలారం కంట్రోల్‌ ప్యానల్‌ : ఈ వస్తువు, ఈ వ్యవస్థకు మూలమైనది. ఇన్‌పుట్స్‌ను, మరియు సిస్టమ్‌ ఇంటిగ్రిటీని పర్యవేక్షిస్తుంది. అవుట్ పుట్స్ మరియు ప్రసార సమాచారాన్ని నియంత్రిస్తుంది.
 • ప్రాథమిక పవర్ సప్లయ్‌ : సాధారణంగా నాన్‌స్విచ్చుడ్‌ 120 లేదా 240 వాట్ల ఆల్టర్నేటింగ్ కరెంట్‌కు సంబంధించిన సరఫరా, వాణిజ్యపరమైన విద్యుత్‌ నుంచి ఇస్తారు. గృహేతర అవసరాల్లో, బ్రాంచ్‌ సర్క్యూట్‌ని ఫైర్‌ అలారం వ్యవస్థకు, దానికి సంబంధించి పరికరాలకు అనుసంధానిస్తారు. ఒక పరికరానికి విడిగా విద్యుత్ సరఫరాను అందించే ఇండివిడ్యువల్ బ్రాంచ్ సర్క్యూట్సుతో, డెడికేటడ్ బ్రాంచ్ సర్క్యూట్సుకు తేడా రాకూడదు.
 • సెకండరీ (బ్యాకప్‌) పవర్ సప్లయ్స్‌ : ఇందులో సాధారణంగా సీల్డ్‌ లెడ్‌-యాసిడ్‌ స్టోరేజ్ బ్యాటరీలు ఉంటాయి. లేదా ప్రాథమిక విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినప్పుడు కరెంట్‌ ఉత్పత్తికి అత్యవసరంగా ఉపయోగించే జనరేటర్లవంటివి ఉంటాయి.
 • ఇనీషియేటింగ్ పరికరాలు‌ : ఫైర్‌ అలారం నియంత్రణ‌ యూనిట్‌కి ఈ వస్తువు ఇన్‌పుట్‌లా వ్యవహరిస్తుంది. మరియు ఇది మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. పుల్‌ స్టేషన్లు లేదా స్మోక్‌ డిటెక్టర్లను వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
 • నోటిఫికేషన్‌ అప్లయెన్సెస్‌ : ఇది ఫైర్‌ అలారం వ్యవస్థ నుంచి లేదా ఇంకా విద్యుత్‌ని ఉత్పత్తి చేసే దేని నుంచి అయినా వచ్చే శక్తిని ఉపయోగించుకుంటుంది. సాధారణంగా సంబంధిత వ్యక్తులు ముందే జాగ్రత్తపడేలా, సరైన చర్యలు తీసుకునేలా హెచ్చరిస్తుంది. ఫ్లాషింగ్‌ లైట్, స్ట్రోబ్‌ లైట్, ఎలక్ట్రో మెకానికల్ హార్న్‌, స్పీకర్‌ లేదా వీటి వేటి ద్వారా అయినా సరే ఈ హెచ్చరికలను అందిస్తుంది.
 • బిల్డింగ్‌ సేఫ్టీ ఇంటర్‌ఫేసెస్‌ : దీనివల్ల సరైన వాతావరణానికి సంబంధించిన నియంత్రణ చర్యలను తీసుకోవడానికి ఈ ఫైర్‌ అలారం వ్యవస్థ‌కి వీలవుతుంది. ఇంకా అగ్నిప్రమాదాల గురించి ముందే సన్నద్దం చేస్తుంది. దట్టమైన పొగలను, మంటలను, గాలి వల్ల ఆ మంటలు పెద్దవి కాకుండా చూడడంలోనూ, వాటిని నియంత్రించే విధానంలోనూ, మనుషులను ఒకచోటి నుంచి మరో చోటికి చేరవేయడంలోనూ మరియు వారిని బయటకు పంపడంలోనూ సహాయపడుతుంది.

ఇనీషియేటింగ్ పరికరాలు[మార్చు]

 • మనుషుల సహాయంతో పనిచేసే పరికరాలు: బయటకు వెళ్లాల్సిన ప్రదేశాలకు దగ్గరలో అద్దాలు పగలగొట్టేది, బటన్స్‌ మరియు మాన్యువల్‌ పుల్‌ స్టేషన్లను గుర్తించిన ప్రదేశాల్లో వాటిని నిర్మిస్తారు మరియు ఉపయోగిస్తారు.
 • అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎటువంటి భౌతిక మార్పులనైనా పసిగట్టే విధంగా ఆటోమేటికల్లి యాక్ట్యూయేటెడ్‌ పరికరాలు‌ చాలా రకాలుగా ప్రతిస్పందించగలవు: థర్మల్‌ ఎనర్జీ ద్వారా బదిలీ అయ్యేది; హీట్ డిటెక్టర్‌, ఉష్ణం ద్వారా ఉత్పత్తయ్యేవి; స్మోక్‌ డిటెక్టర్‌, రేడియంట్ ఎనర్జీ; ఫ్లేమ్‌ డిటెక్టర్‌, మంట పుట్టించే వాయువులు; కార్బన్‌ మోనాక్సైడ్‌ డిటెక్టర్‌ మరియు మంటలను ఆపడానికి ఉపయోగించేవి; వాటర్ ఫ్లో డిటెక్టర్‌. అగ్నిప్రమాద దృశ్యాలను విశ్లేషించడానికి కెమెరాలు మరియు కంప్యూటర్ అల్గర్‌థమ్స్‌ను నూతన ఆవిష్కరణలు ఉపయోగించగలవు. వాటి అసంబద్దమైన కదలికల కోసం లేదా ఇతర డిటెక్టివ్ మెథడ్స్‌కు సంబంధించిన వాటి కోసం వీటిని ఉపయోగించగలవు.

నోటిఫికేషన్‌ పరికరాలు‌[మార్చు]

దస్త్రం:Honeywellspeakerv33.JPG
ఎ హనీవెల్‌ స్పీకర్ అండ్‌ ఎ స్పేస్‌ ఏజ్‌ ఎలక్ట్రానిక్స్‌ V33 రిమోట్‌ లైట్‌.
 • నోటిఫికేషన్‌ పరికరాలు శబ్దపరమైన, దృశ్యపరమైన, స్పర్శపరమైన, సమాచారపరమైన లేదా వాసనను బట్టి ప్రతిస్పందిస్తూ (వాసనకు కారణమైనవి) యజమానులను హెచ్చరిస్తాయి.[1] ఇందులో శబ్దపరమైన లేదా దృశ్యపరమైన సంకేతాలు చాలా సాధారణం మరియు యజమానులను హెచ్చరించడానికి ప్రత్యక్ష లేదా ముందే నిక్షిప్తం చేసిన సూచనలను పంపించడానికి స్పీకర్లను ఉపయోగించుకుంటాయి. అచ్ఛం ఫైర్‌ అలారం వ్యవస్థలు ఇచ్చే సంకేతాల శబ్దాలనే కొన్ని ఇతర వస్తువులు ఇస్తాయి కనుక ఆ తికమకను పోగొట్టడానికి, అమెరికాలో అగ్నిప్రమాద హెచ్చరికలు ప్రామాణికమైన ఫోర్ కౌంట్ టెంపోరల్ నమూనా‌ని ఉపయోగించాల్సిన అవసరముంటుంది. కొన్ని ఇతర పద్ధతులు:
 • ఫైర్ అలారం వ్యవస్థలో శబ్ధపరమైన, సమాచారపరమైన వస్తువులు ఓ భాగంగా ఉంటాయి. ఇందులో ధ్వని అలారం సమాచార సామర్ధ్యాలు ఉంటాయి. అగ్ని ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితులను యజమానులు గుర్తించి సరైన చర్యలు తీసుకోవడానికి అత్యంత విశ్వసనీయమైన స్పీకర్లు ఉపయోగించబడతాయి. ఈ స్పీకర్లలో చాలా ఎక్కువ సదుపాయాలు ఉంటాయి. ఈ స్పీకర్ల నుండి వచ్చే సంకేతాలు యజమానులు ప్రతిస్పందించేలా ఉంటాయి. ఒక భవనంలో ఒకటి లేదా అంత కంటే ఎక్కువ చోట్ల నుండి వ్యవస్థను నియంత్రిస్తే దానిని ఫైర్ వార్దేన్స్ స్టేషన్స్ అని లేదా ఒక చోటు నుండే నియంత్రిస్తే దానిని బిల్డింగ్ ఫైర్ కమాండ్ సెంటర్ అని అంటారు. అగ్ని ప్రమాదం సంభవించినపుడు ఫైర్ అలారం వ్యవస్థలోని స్పీకర్లు వాటంతటవే పని చేస్తాయి. యజమానుల రక్షణ కోసం వాటిలో ముందే నిక్షిప్తం చేసిన ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సమాచార సంకేతాలను స్పీకర్లు వెలువరిస్తాయి. ఈ సంకేతాలు ఒకటి లేదా ఎక్కువ భాషలలో మళ్ళీ మళ్ళీ వెలువరిస్తాయి. సుశిక్షితులు అయిన సిబ్బంది ప్రత్యేకమైన మైక్రో ఫోన్ ద్వారా స్వయం చలిత సమాచారాన్ని నియంత్రించి సమయానికి అవసరమైన సమాచారాన్ని పంపడం సులభం అవుతుంది.[2]

భవన భద్రత వ్యవస్థ[మార్చు]

దస్త్రం:Couchpull.JPG
S.H. కోచ్‌ F5GX నాన్‌-కోడెడ్‌ ఫైర్‌ అలారం పుల్ స్టేషను‌ బిలో ఎ కోచ్‌ 10" బెల్‌.
 • పొగని నిలువరించే అయస్కాంత ద్వారాలు:అగ్ని మాపక భద్రత వ్యవస్థ నియంత్రణలో గోడ లేదా నేలలో అమర్చి ఉన్న సోలేనయిడ్లు లేదా విద్యుత్ అయస్కాంతాలు తెరచి ఉన్న ద్వారాలను స్ప్రింగ్ ఆధారిత స్వయంచాలిత పొగ నివారణ వ్యవస్థ ద్వారా వెంటనే మూసి వేస్తాయి. అయస్కాంత పద్ధతిలో తెరచి ఉంచిన ద్వారాలను అగ్ని మాపక వ్యవస్థ ఆదేశానుసారం లేదా విద్యుత్ అందనప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని ఆపి ద్వారాలు స్వయంచాలితంగా మూసుకునే విధంగా రూపొందించబడ్డాయి. శక్తిని యాంత్రిక రూపంలో లేదా భుఅకర్షణ పద్ధతిలో కానీ దాచి అవసరం వచ్చిన పిదప ద్వారాలను మూసి పొగను ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం లోకి వ్యాపించకుండా నిరోధిస్తుంది.తద్ఫలితంగా ద్వారాలకి ఇరువైపులా అగ్ని మాపక చర్యలు చేపట్టినప్పుడు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి సులభం అవుతుంది.
 • డక్ట్ మౌన్టేడ్ పొగ గుర్తింపు: ఎయిర్ కండిషన్లు లేదా ఇతరత్రా సాధనాల్లోకి ప్రాకృతిక గాలిని పంపించే గొట్టపు వ్యవస్థలో పొగ గుర్తింపు యంత్రాలు అమరుస్తారు. ఇవి ఫ్యాన్ యొక్క నియంత్రణ వ్యవస్థతో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ ఏర్పాటు వల్ల అగ్నిప్రమాద సమయంలో గాలిని ప్రవాహాన్ని, డ్యాంపర్లను మూసి విష వాయువులు మరియు విష ఆవిర్ల పునఃప్రవాహాన్ని కట్టడి చేస్తాయి.

UK ఫైర్ అలారం వ్యవస్థ విభాగాలు[మార్చు]

వివిధ భవనాలు, వినియోగాలకు అనుగుణంగా చాలా రకాల ఫైర్ అలారం వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఫైర్ అలారం వ్యవస్థల ఖరీదు మరియు పనితనాలలో మార్పు ఉంటుంది, చిన్న చిన్న ఫలకాలలో అమర్చిన శోధన మరియు ధ్వని యంత్రాల నుంచి పెద్ద పెద్ద సంస్థల్లో మాట్లాడగలిగే ఫైర్ అలారం వ్యస్థలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యస్వస్థలు భవనాలను మరియు అందులో నివసిస్తున్న వారిని రక్షించవలసి ఉంటుంది.

ఫైర్ అలారం వ్యవస్థలు L అయితే ప్రాణాలను కాపాడేవి, P అయితే భవనాలను కాపాడేవి మరియు M అయితే మానవ నిర్దేశిత వ్యవస్థలు అని వర్గీకరించబడ్డాయి.[3]

M మానవ నిర్దేశిత వ్యవస్థలు, ఉదాహరణకు చేతి గంటలు, ఝాఘంట, మొదలు అయినవి. ఇటువంటివి వ్యవస్థలు మానవ నిర్దేశానుసారంగా లేదా విద్యుత్ ఆధారితంగా పని చేస్తాయి. అవి భవనంలో నివసించే వారి మీద ఆధారపడతాయి. వారు అగ్నిని గుర్తించి ఈ వ్యవస్థల ద్వారా మిగతా వారిని హెచ్చరించవచ్చు. అటువంటి వ్యవస్థలు ప్రాథమికంగా నిద్ర అవసరం లేని చిన్న ఉద్యోగ సంస్థల్లో అమరుస్తారు.
P1 ఈ వ్యవస్థ భవనం మొత్తం అమరుస్తారు. దీని ముఖ్యోద్దేశం అగ్నిమాపక దళానికి త్వరితంగా సమాచారం ఇవ్వడం మరియు నష్టం అరికట్టడం. చిన్న చిన్న మరియు తక్కువ ప్రమాద స్థలాలు మరుగుదొడ్లు లేదా 1m² కంటే తక్కువ ఉన్న అలమారాలు మినహాయిస్తారు.
P2 ఈ వ్యవస్థలను భవనాల్లో అగ్ని అంటుకునే ప్రమాదం ఎక్కువున్న ప్రేదేశాలలో లేదా విలువైన సామాన్లు ఉన్న ప్రదేశంలో అమరుస్తారు. 2వ వర్గానికి చెందిన వ్యవస్థలు భవనంలో ప్రత్యేకమైన ప్రాంతాలలో ఎక్కడ అయితే ప్రమాద అవకాశం ఎక్కువ ఉంటుందో అక్కడ వ్యాపారానికి అవాంతరం కలగకుండా ఉండేందుకు అమరుస్తారు.
L1 L1 వర్గానికి చెందిన వ్యవస్థను ప్రాణాలను కాపాడడానికి రూపొందించారు. భవనం ప్రాంగణం అంతా అమరుస్తారు (పై కప్పు, ఖాళీ ప్రదేశాలలో కూడా) దీని ముఖ్యోద్దేశం త్వరిత గతిన హెచ్చరించబడడం. L1 వర్గానికి చెందిన వ్యవస్థలను నివాస ప్రాంతాలలో వాడతారు. ఖాళీ ప్రదేశాలలో కూడా ఈ వ్యవస్థలను ఉపయోగకరంగా అమర్చవలసి ఉంటుంది. 1వ వర్గానికి చెందిన వ్యవస్థను చిన్న చిన్న మినహాయింపులతో భవనం మొత్తం అమరుస్తారు.
L2 L2 వ్యవస్థను ప్రాణాలను కాపాడడానికి రూపొందించారు. ఇది స్వయం చలితంగా అపాయాన్ని గుర్తించి హెచ్చరిస్తుంది. వీటిని పలాయన మార్గాలకు అనుబంధంగా ఉన్న గదులలో లేదా ప్రమాద స్థాయి ఎక్కువ ఉండే ప్రాంతాలలో అమరుస్తారు. మధ్యస్తంగా ఉండే ప్రాంగణాలలో (పది మంది మించి ఉండని ప్రదేశం) ఈ L2 వ్యవస్థ అనుకూలం. ఈ ఫైర్ అలారం వ్యవస్థలు L3 వ్యవస్థలతో పోలి ఉంటాయి. ఈ వ్యవస్థలు ఎక్కువ ప్రమాద ప్రదేశాలు (ఉ.దా,.వంటగది) లేదా మనుషులకు ప్రమాదం ఎక్కువ ఉండే స్థలం (ఉ.దా,.నిద్రపోయే ప్రమాదం) లను గుర్తించే అదనపు ప్రమాద గుర్తింపు పరికరాలు ఉంటాయి.
L3 ఈ వర్గానికి చెందిన వ్యవస్థలు అందరిని హెచ్చరించే విధంగా రూపొందించబడ్డాయి. పరికరాలను అన్ని పలాయన మార్గాలు, గదులు, మరియు పలాయన మార్గాలకు ఆనుకుని ఉండే గదులకు అమర్చవలసి ఉంటుంది. 3వ వర్గానికి చెందిన పరికరాలు 4వ వర్గానికి చెందిన వాటికన్నా పెద్ద ప్రదేశాలలో వ్యాపిస్తాయి. దీని ముఖ్యోద్దేశం భవనంలో నివసించే వారిని అందరిని హెచ్చరించి పలాయన మార్గాలు ముసుకోక ముందే తొందరగా ఖాళీ చెయ్యడం.
L4 4వ వర్గానికి చెందిన పరికరాలు పలాయన మార్గాలను మరియు ప్రవాహ ప్రాంతాలలో మాత్రమే వినియోగిస్తారు. అందువల్ల ఈ పరికరాలను పలాయన మార్గాలలో అమరుస్తారు, అపాయ పరిస్థితిని బట్టి ఇవి అంత ఆమోదయోగ్యం కానప్పటికీ భవన వైశాల్యం మరియు జటిలత పైన ఆధారపడి పని చేస్తాయి. ఈ పరికరాలను భవనంలో వేరే ప్రదేశాలలో అమర్చినప్పటికి వాటి ముఖ్యోద్దేశం పలాయన మార్గాలను కాపాడటం మాత్రమే.
L5 ఈ వర్గం "మిగతా అన్ని పరిస్థితులకు", ఉ.దా., కంప్యుటర్ గదులు, స్వయం చలిత గుర్తింపు వ్యవస్థ నియంత్రణలో అగ్ని మాపక చర్యలు చేపడుతుంది. 5వ వర్గం "వాడకందారు నిర్దేశించిన" వర్గానికి చెందినవి మరియు ప్రత్యేక అవసరాల కోసం తయారు చేయబడ్డవి మరియు మిగతా ఏ వర్గానికి చెందినవి కావు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • చలితమైన అగ్ని రక్షణ
 • ఫైర్ అలారం నియంత్రణ ఫలకం
 • ఫైర్ అలారం సూచనా పరికరాలు
 • అగ్ని రక్షణ
 • అగ్ని భద్రతా సమతల వ్యవస్థ
 • బహుముఖ ఫైర్ అలారంలు
 • NFPA

సూచనలు[మార్చు]

 1. NFPA 805 Performance-Based Standard for Fire Protection for Light Water Reactor Electric Generating Plants. Chapter 3 Fundamental Fire Protection Program and Design Elements: National Fire Protection Association. 2001. Unknown parameter |standard= ignored (help); Unknown parameter |month= ignored (help); |first= missing |last= (help)
 2. Cote, Arthur E. (2000). Fire Protection Handbook eighteenth edition. National Fire Protection Association. pp. 5–8. ISBN 0-87765-377-1. Unknown parameter |month= ignored (help)
 3. ""Fire Alarm System Categories"". Sdfirealarms.co.uk. Retrieved 2009-07-15. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Fire protection