ఫొలిక్యులిటిస్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Folliculitis
వర్గీకరణ & బయటి వనరులు
Folliculitis on patient back
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 31367
m:en:MedlinePlus 000823
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}

ఒకటి, లేదా అంతకంటే ఎక్కువ హెయిర్‌ ఫొలికల్స్‌లో మంటే ఫొలిక్యులిటిస్‌ . ఈ పరిస్థితి చర్మంలో ఎక్కడైనా తలెత్తవచ్చు.

కారణాలు[మార్చు]

రాచకురుపులు, సెగ గడ్డలు, ఇతర ఫొలిక్యులిటిస్‌ కేసులు స్టాఫిలోకొకస్‌ ఆరెయస్‌ నుంచి తలెత్తుతాయి.

బట్టల రాపిడి, కీటకాలు కుట్టడం,[ఆధారం చూపాలి] ఫొలికల్స్‌ మూసుకుపోవడం, షేవింగ్‌, పుర్రెకు మరీ దగ్గరగా జడను గట్టిగా వేయడం వంటివాటి వల్ల నష్టం హెయిర్‌ ఫొలికల్స్‌కు జరిగినప్పుడు ఫొలిక్యులిటిస్‌ మొదలవుతుంది. చాలా ఫొలిక్యులిటిస్‌ కేసుల్లో నష్టం జరిగిన ఫొలిసిల్స్‌ బ్యాక్టీరియం స్టాఫిలోకొకస్‌ (స్టాఫ్‌) దాడికి గురవుతాయి.

ఇనుప ధాతు లోపం వల్ల వచ్చే రక్తహీనత కూడా కొన్నిసార్లు దీర్ఘకాలిక కేసుల్లో కారణంగా కన్పిస్తుంది.

శిలీంద్రం[మార్చు]

 • టినెయా బార్బే బార్బర్స్‌ ఇచ్‌కు దగ్గరగా ఉంటుంది. కానీ ఈ ఇన్ఫెక్షన్‌ ఫంగస్‌ టి.రుబ్రుమ్‌ వల్ల వస్తుంది.
 • గతంలో పిటీరోస్పోరమ్‌ ఫొలిక్యులిటిస్‌ గా పిలిచిన మలాసెజియా ఫొలిక్యులిటి స్‌ జెనస్‌ మలాసెజియా ఈస్ట్‌ (ఫంగస్‌లు) వల్ల వస్తుంది.

జీవాణుక్రిములు[మార్చు]

 • హాట్‌ ట్యూబ్‌ ఫొటిక్యులిటిస్‌ బ్యాక్టీరియం సూడోమొనస్‌ ఆరుగినోసా వల్ల వస్తుంది.[1] ఫొటిక్యులిటిస్‌ సాధారణంగా వాడకానికి ముందుగా సరిగా శుభ్రపరచని వేడి టబ్‌లో కూచోవడం వల్ల వస్తుంది. దీని లక్షణాలు వేడి టబ్‌లో ముందుగా ప్రవేశించి ఒంటి భాగాల్లో, ముఖ్యంగా కాళ్లు, తుండి, పిరుదులు, పరిసర ప్రాంతాల్లో మొదలవుతాయి. దీని లక్షణాలు ఆయా ప్రాంతాల చుట్టూ, ఇంకా తడి బట్టలు తాకే శరీర భాగాల్లో బాగా పెరుగుతాయి. అందుకే హాట్‌ ట్యూబులు వాడేవారు బట్టలేవీ లేకుండా అందులో కూచోవడం మేలని వైద్యులు గట్టిగా సిఫార్సు చేస్తారు. అప్పుడు బ్యాక్టీరియా చర్మానికి దగ్గరగా వచ్చినా ఒంటికి పెద్దగా నష్టం కలగకుండా నివారించుకోవచ్చు.[ఆధారం చూపాలి]
 • సైకోసిస్‌ వల్గరీస్‌, సైకోసిస్‌ బార్బే , లేదా బార్బర్స్‌ ఇచ్‌ కూడా ఒకరకంగా హెయిర్‌ ఫొలికల్‌కు సంబంధించిన స్టాఫికొకస్‌ ఇన్ఫెక్షనే. ఇది ముఖంలో గడ్డంతో నిండిన ప్రాంతంలో తలెత్తుతుంది. ఎక్కువగా మీసముండే పై పెదవిపై వస్తుంది. గడ్డం గీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.
 • గ్రామ్‌ నెగటివ్‌ ఫొటిక్యులిటిస్‌ యాంటీబయాటిక్స్‌ సాయంతో జరిగే దీర్ఘకాలిక ఏక్న్‌ చికిత్స తర్వాత రావచ్చు.[2]

వైరల్[మార్చు]

 • హెర్పెటిక్‌ ఫొలిక్యులిటిస్‌ హెయిరల్‌ ఫొలికల్స్‌ సమీపంలో, చాలాసార్లు నోటి చుట్టూ హెర్ప్‌స్‌ సింప్లెక్స్‌ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వ్యాపించడం వల్ల వస్తుంది.

నాన్‌ ఇన్ఫెక్టియస్‌[మార్చు]

 • జుత్తు వంకులు చర్మానికి తాకి, మంటకు దారి తీయడం వల్ల సూడోఫొలిక్యులిటిస్‌ బార్మే వస్తుంది.
 • వ్యాధి నిరోధక శక్తి దెబ్బ తిన్న వ్యక్తులకు ఎసినోఫిలిక్‌ ఫొలిక్యులిటిస్‌ రావచ్చు.
 • ఫొలిక్యులిటిస్‌ డికేల్వాన్స్‌, లేదా టఫ్టెడ్‌ ఫొలిక్యులిటిస్‌ పుర్రెపై ప్రభావం చూపుతుంది. ఒకే హెయిర్‌ ఫొలికల్‌ నుంచి చాలా వెండ్రుకలు పుట్టుకొస్తాయి. కాబట్టి విపరీతమైన జుత్తు ఊడటం సంభవించవచ్చు. దీనికి కారణం మాత్రం తెలియదు.
 • ఫొలిక్యులిటిస్‌ కెలోయిడలిస్‌ మెడ వెనక భాగంలో వస్తుంది. ముఖ్యంగా రింగుల జుత్తున్న మగవారికి ఈ బెడద మరీ ఎక్కువ.
 • ఆయిల్‌ ఫొలిక్యులిటిస్‌ ముఖ్యంగా ముంజేతులు, తొడలపై జుత్తును, అంటే హెయిర్‌ ఫొలికల్స్‌ను పలు నూనెలకు ఎక్స్‌పోజ్‌ చేయడం వల్ల వస్తుంది. రిఫైనరీ వర్కర్లు, రోడ్‌ పనివారు, మెకానిక్‌లు, గొర్ల కాపర్లు వంటి వారిలో ఇది బాగా కన్పిస్తుంది. చాలాసార్లు మేకప్‌ కూడా దీనికి దారి తీస్తుంది!
 • మలిగ్నన్సీ: మలిగ్నన్సీ కూడా రీకాల్‌సిట్రాంట్‌ కేసుల్లో కన్పించవచ్చు.[3]

లక్షణాలు[మార్చు]

 • పొక్కులు (చర్మం ఎర్రబారడం)
 • హెయిర్‌ ఫొలికల్‌ చుట్టూ మొటిమలు, లేదా ఫిస్టులాలు
  • క్రస్ట్‌ ఓవర్‌ కావచ్చు
  • మెడపై, పై దవడ ఎముక, గజ్జెల్లో రావచ్చు
  • జన్యు లెజియన్లుగా కూడా ఉండవచ్చు
 • చర్మం దురద ఉండవచ్చు
 • అసమంజసమైన యాంటీబయాటిక్స్‌ చికిత్స ద్వారా కాలి నుంచి చేతికి, అక్కడి నుంచి ఒంటికి సోకవచ్చు.

చికిత్స[మార్చు]

 1. చాలా కేసుల్లో టాపికల్‌ యాంటీసెప్టిక్‌ చికిత్స సరిపోతుంది
 2. మార్ఫిసిన్‌, ఆయింట్‌మెంట్‌ ఉండే నియోమైసిన్‌ వంటి టాపికల్‌ యాంటీబయాటిక్స్‌
 3. కొందరు రోగులకు సిస్టెమిక్‌ నారో స్పెక్ట్రమ్‌ పెన్సిలినేస్‌ రెసిస్టెంట్‌ పెన్సిలిన్స్‌ (యూఎస్‌లో డైక్లోక్సాసిలిన్‌, యూకేలో ఫ్లుక్లోక్సాసిలిన్‌) వంటివాటి వల్ల లబ్ధి కలగవచ్చు.
 4. యాంటీబయాటిక్స్‌ వల్ల ఫంగల్‌ ఫొలిక్యులిటిస్‌ విషమించవచ్చు. అందుకే ఫ్లుకొనాజోల్‌ వంటివాటిని నోటి గుండా యాంటీ ఫంగల్‌ను తీసుకోవాల్సి రావచ్చు. ఎకోనాజోల్‌ నైట్రేట్‌ వంటి టాపికల్‌ యాంటీఫంగల్స్‌ బాగా ఉపయోగపడవచ్చు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఇన్‌గ్రోన్‌ హెయిర్‌
 • బాయిల్‌

సూచికలు[మార్చు]

 1. మూస:MedlinePlus
 2. "Severe Acne: 4 types". American Academy of Dermatology. మూలం నుండి 2011-02-09 న ఆర్కైవు చేసారు. Retrieved December 15, 2010. Cite web requires |website= (help)
 3. ఫొలిక్యులిటిస్‌, ఫొలిక్యులర్‌ మ్యూసినోసిస్‌, పాపులర్‌ మ్యూసినోసిస్‌ యాజ్‌ అ ప్రజెంటేషన్‌ ఆఫ్‌ క్రానిక్‌ మైలోమోనోసిటిక్‌ లుకేమియా. రషీద్‌ ఆర్‌, హైమ్స్‌ ఎస్‌. డెర్మాటోల్‌ ఆన్‌లైన్‌ జే. 2009 మే 15;15(5):16.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Diseases of the skin and appendages by morphology మూస:Disorders of skin appendages మూస:Inflammation