Jump to content

ఫోకాల్ట్ లోలకం

వికీపీడియా నుండి

1851లో, భూమి తన అక్షంపై తనచుట్టూ తాను తిరిగే పరిభ్రమణాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించాడు. ఈ ప్రయోగపు పద్ధతిని 1661లోనే విన్సెంజో వివియానీ ఉపయోగించాడు, కానీ ఇది ఫోకాల్ట్ పరిశోధనల ద్వారానే ప్రాచ్యుర్యం పొందింది. ఫోకాల్ట్ ఈ ప్రయోగ ప్రదర్శనకోసం పారిస్లోని పాంథియాన్ పైకప్పు నుండి ఒక బరువైన లోలకాన్ని పొడవైన తాడు వేలాడదీసి, దాని డోలావర్తన సమతలం చుట్టూ తిరగటం ద్వారా భూమి పరిభ్రమణాన్ని నిరూపించాడు. ఈ ప్రయోగం పండితలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కలకలం రేపింది. తత్ఫలితంగా ఐరోపా, అమెరికా లోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ ఫోకాల్ట్ లోలకాలని వేలాడదీసి ప్రదర్శించారు. ఈ ప్రదర్శలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఆ తరువాత సంవత్సం ఇదే విషయాన్ని మరింత సులువుగా నిరూపించడానికి గైరోస్కోప్ అనే పరికరాన్ని తయారుచేశాడు. 1855లో, అత్యద్భుతమైన ప్రయోగ పరిశోధనలకుగాను రాయల్ సొసైటీ కోప్లీ మెడల్ అందుకున్నాడు. అదే సంవత్సంలో దీనికి కొంతకాలం ముందు పారిస్ ఇంపీరియల్ అబ్సర్వేటరీలో భౌతికశాస్త్రజ్ఞునిగా నియమించబడ్డాడు.

ఫూకోవ్ 1855 సెప్టెంబరులో, రాగి డిస్కును దాని రిమ్‌ను రెండు అయస్కాంత ధృవాల మధ్యన ఉంచి గుండ్రగా త్రిప్పితే, దాన్ని త్రిప్పటానికి కావలసిన బలం హెచ్చుతుందని, అదే సమయంలో లోహంలో జనించిన ఎడ్డీ కరెంటు లేదా ఫోకాల్ట్ కరెంటు వల్ల డిస్కు వేడెక్కుతుందని కనుగొన్నాడు.

చార్లెస్ వీట్‌స్టోన్ భ్రమణ దర్పణాన్ని ఉపయోగించి, ఫోకాల్ట్ 1862లో కాంతి వేగాన్ని 298,000 కి.మీ.లు/సెకండుగా నిర్ధారించాడు (దాదాపు 185,000 మైళ్ళు/సెకను) - ఈ అంచనా అంతకుమునుపు జరిపిన పరిశోధనల ద్వారా అంచనా వేసిన వేగం కంటే 10,000 కి.మీ/సె తక్కువ, ప్రస్తుతం విరివిగా అంగీకరించబడిన కాంతివేగం కంటే ఈ నిర్ధారణలో కేవలం 0.6% వ్యత్యాసం మాత్రమే ఉంది.

మూలాలు

[మార్చు]