ఫోనోగ్రాఫ్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఫోనోగ్రాఫ్ లేదా గ్రామఫోన్ అనేది రికార్డు చేయబడిన ధ్వనులను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది 1870 నుండి 1980ల వరకు రికార్డు చేయబడిన సంగీతాన్ని ప్లే చేయటం కోసం ఉపయోగించిన అత్యంత సాధారణ పరికరం. దీనిని థామస్ ఎడిసన్ కనిపెట్టారు. ప్రారంభ ఫోనోగ్రాఫ్‌లు ధ్వని ప్లే చేయడానికి అదనంగా సిలిండర్లపై ధ్వనులు రికార్డు చేయబడినవి. ఫోనోగ్రాఫ్ వినైల్ రికార్డు నుండి శబ్దాలు ప్లే చేస్తుంది. ఈ రికార్డు టర్న్‌టేబుల్ లో ఉంటుంది. టర్న్‌టేబుల్ రికార్డు తిరుగుతున్నప్పుడు వినైల్ లో చిన్న గాడుల మధ్య అడుగున చిన్న సూదితో ఉన్న ఒక మీట గీరుతుంటుంది. ఇలా జరిగినప్పుడు ఈ పరికరం నుంచి సంగీతం ప్లే అవుతుంది. నేటి యంత్రాలు రికార్డు చేయటం లేదు. వీటి రికార్డులు కర్మాగారాలలో తయారవుతాయి.