Jump to content

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమీషనరేట్

వికీపీడియా నుండి
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు2025
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధిరంగారెడ్డి జిల్లా గ్రామీణ పరిధి మొత్తం, భారతదేశం
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమీషనరేట్ is located in Telangana
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమీషనరేట్
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమీషనరేట్ (Telangana)
చట్టపరమైన అధికార పరిధిరంగారెడ్డి జిల్లా
ప్రధాన కార్యాలయంకొంగరకలాన్, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఏజెన్సీ అధికారులు
మాతృ ఏజెన్సీతెలంగాణ పోలీసు

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ (Future City Police Commissionerate), తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాలు, నూతనంగా అభివృద్ధి చెందుతున్న "ఫ్యూచర్ సిటీ" (ముచ్చర్ల పరిసరాలు) ప్రాంతాల శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన పోలీస్ కమిషనరేట్. జిహెచ్ఎంసి (GHMC) పునర్వ్యవస్థీకరణ, నగర భౌగోళిక విస్తరణకు అనుగుణంగా పాత సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి దీనిని నూతనంగా ఏర్పాటు చేశారు.

ఈ కమిషనరేట్ తెలంగాణ రాష్ట్ర హోం (లీగల్) శాఖ ద్వారా 29 డిసెంబర్ 2025న జారీ చేసిన G.O.Ms.No.141 ఉత్తర్వుల ప్రకారం అధికారికంగా ఆవిర్భవించింది. దీనికి మొట్టమొదటి పోలీస్ కమిషనర్ (CP) గా సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ జి. సుధీర్ బాబు నియమితులయ్యారు.[1] చరిత్ర - ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యాలు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) పంపిన ప్రతిపాదనల (Letter No.229/Plg.-1/2025) మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. జీవో (G.O.Ms.No.141) లో పేర్కొన్న ప్రకారం దీని ప్రధాన ఉద్దేశాలు: పబ్లిక్ ఆర్డర్ (శాంతిభద్రతలు) సమర్థవంతంగా నిర్వహించడం. పోలీసింగ్ సామర్థ్యాన్ని (Policing efficiency) పెంచడం. నేరాల పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం. ప్రజల ఫిర్యాదులపై స్పందించే సమయాన్ని (Response time) మెరుగుపరచడం, లా అండ్ ఆర్డర్ వ్యవస్థను బలోపేతం చేయడం. చట్టపరమైన నేపథ్యం ఈ నూతన పోలీస్ కమిషనరేట్‌ను తెలంగాణ ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టమైన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023 (BNSS) లోని సెక్షన్ 7, సైబరాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ చట్టం, 2004 లోని సెక్షన్ 3(1) ల ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి.వి. ఆనంద్ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రధాన కార్యాలయం (హెడ్ క్వార్టర్స్) ఫ్యూచర్ సిటీ పరిధిలో సొంత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు, ఈ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం (సీపీ ఆఫీస్) రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగరకలాన్ లో ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (IDOC - కలెక్టరేట్) తాత్కాలికంగా పనిచేస్తోంది.

పరిపాలనా నిర్మాణం

[మార్చు]

పరిపాలనా సౌలభ్యం కోసం ఈ కమిషనరేట్‌ను 3 ప్రధాన జోన్లు (DCP Zones), సబ్-డివిజన్లుగా (ACP Divisions) వర్గీకరించారు. అధికారిక సమాచారం ప్రకారం దీని పరిధిలో మొత్తం 26 పోలీస్ స్టేషన్లు (22 లా అండ్ ఆర్డర్ + 4 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు) ఉన్నాయి. జోన్ల వారీగా పోలీస్ స్టేషన్ల జాబితా (Law & Order)

చేవెళ్ల జోన్

[మార్చు]
  • చేవెళ్ల డివిజన్
    • చేవెళ్ల
    • మోకిల
    • శంకర్‌పల్లి
  • మొయినాబాద్ డివిజన్
    • మొయినాబాద్
    • షాబాద్
    • శంషాబాద్ రూరల్

మహేశ్వరం జోన్

[మార్చు]
  • మహేశ్వరం డివిజన్
    • మహేశ్వరం
    • కందుకూర్
  • ఇబ్రహీంపట్నం డివిజన్
    • ఇబ్రహీంపట్నం
    • మంచాల్
    • యాచారం
    • హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ
  • ఆమనగల్లు డివిజన్
    • ఆమనగల్లు
    • మాడ్గుల
    • తలకొండపల్లి
    • కడ్తాల్

షాద్‌నగర్ జోన్

[మార్చు]
  • షాద్‌నగర్ డివిజన్
    • షాద్ నగర్
    • కొందుర్గ్
    • చౌదరిగూడెం
  • కొత్తూరు డివిజన్
    • నందిగామ
    • కొత్తూరు
    • కేశంపేట

ట్రాఫిక్ విభాగం

[మార్చు]

జాతీయ రహదారులు (NH-44 బెంగళూరు హైవే, NH-163 బీజాపూర్ హైవే, శ్రీశైలం హైవే), ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా 4 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

  • షాద్‌నగర్ ట్రాఫిక్ డివిజన్
    • చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
    • షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
  • మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్
    • ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
    • మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్

ప్రత్యేక విభాగాలు నేర పరిశోధన, సైబర్ క్రైమ్, ప్రత్యేక ఆపరేషన్ల కోసం మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ కేంద్రాలుగా ఈ క్రింది ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి: CCS (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) SOT (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) మహిళా భద్రతా విభాగం (Women Safety Wing)

పోలీస్‌ కమిషనర్‌లు

[మార్చు]
  1. జి. సుధీర్ బాబు, ఐపీఎస్ 30-12-2025 నుండి 30-04-2026 వరకు
  2. డా తరుణ్ జోషి, ఐపీఎస్ 01-05-2026 నుండి

పోలీస్

[మార్చు]
  1. "New face of Hyderabad police jurisdictions: TOI shares exclusive details". The Times of India. ISSN 0971-8257. Retrieved 2026-04-11.