ఫ్రాంక్ లాంపార్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

| nationalyears1 = 1997–2000 | nationalyears2 = 1999– | nationalyears3 = | nationalteam1 = England U21 | nationalteam2 = England | nationalcaps1 = 16 | nationalcaps2 = 77 | nationalgoals1 = 9 | nationalgoals2 = 20 | pcupdate = 19:02, 27 March 2010 (UTC) | ntupdate = 18:22, Sunday 7 March 2010 (UTC) }}--> ఫ్రాంక్ జేమ్స్ లాంపార్డ్ (జననం జూన్ 20, 1978) ఒక ఇంగ్లీష్ పుట్‌బాల్ ఆటగాడు, అతను ప్రస్తుతం ప్రీమియర్ లీగ్ క్లబ్ చెల్సియా తరపున క్లబ్ ఫుట్‌బాల్, అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టులో ఆడుతున్నాడు. అతను తరచుగా బాక్స్-టు-బాక్స్ మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతుంటాడు, దీనికి ముందువైపు ఉండే అటాకింగ్ మిడ్‌ఫీల్డ్‌లో కూడా తన సత్తా నిరూపించుకున్నాడు.

తన తండ్రి మాజీ క్లబ్ వెస్ట్ హామ్ యునైటెడ్ ఫుట్‌బాల్ జట్టుతో లాంపార్డ్ తన క్రీడా జీవితం ప్రారంభించాడు. 1997-98 సీజన్‌నాటికి అతను మొదటి జట్టులో స్థానం సంపాదించాడు, తరువాతి ఏడాది ప్రీమియర్ లీగ్‌లో తన జట్టు 5వ స్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు, అతని జట్టుకు ప్రీమియర్ లీగ్‌లో అప్పటి వరకు ఇదే అత్యుత్తమ స్థానం కావడం గమనార్హం. 2001లో అతను ప్రత్యర్థి లండన్ క్లబ్ చెల్సియాకు మారాడు, ఈ క్లబ్ అతడిని ఆ ఏడాది £11 మిలియన్లకు కొనుగోలు చేసింది.

చెల్సియాలో ఆరంగేట్రం చేసిన తరువాత ఆ క్లబ్ మొదటి జట్టులో అతను లేని సందర్భం లేదు, ప్రీమియర్ లీగ్‌లో వరుసగా 164 మ్యాచ్‌లు ఆడి అతను రికార్డు కూడా సృష్టించాడు. ఈ పశ్చిమ లండన్ క్లబ్‌లో అద్భుతమైన స్కోరర్‌గా తన స్థానాన్ని అతను పదిలపరుచుకున్నాడు, వరుసగా 2004-05 మరియు 2005-06 ప్రీమియర్ లీగ్ టైటిళ్లు మరియు 2007లో డొమెస్టిక్ కప్ డబుల్ గెలుచుకున్న జట్లలో అతను కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు. 2008లో అతను కొత్త కాంట్రాక్టుపై సంతకం చేశాడు, కొత్త కాంట్రాక్టు ద్వారా అత్యధిక పారితోషికం పొందుతున్న ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ ఆటగాడిగా అతను పేరు పొందాడు, [1] మరియు అదే ఏడాది తన తొలి ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో కూడా స్కోరు చేశాడు. 2009లో అతను జట్టుకు రెండో FA కప్‌ను సాధించిపెట్టాడు, ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ గోల్ చేయడం ద్వారా ఈ విజయంలో అతను కీలకపాత్ర పోషించాడు. డిసెంబరు 23, 2009న, అధికారిక గణాంకాల ప్రకారం.. అతను ప్రీమియర్ లీగ్ యొక్క దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు.[2]

చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా లాంపార్డ్ మూడుసార్లు గెలుచుకున్నాడు, చెల్సియా ఆల్‌టైమ్ గోల్‌స్కోరర్ల జాబితాలో మొత్తం మ్యాచ్‌లలో 151 గోల్స్ చేసిన లాంపార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు, వీటిలో 100 గోల్స్ లీగ్ మ్యాచ్‌ల్లో చేయడం గమనార్హం, క్లబ్ చరిత్రలో ఒక మిడ్‌ఫీల్డర్ చేసిన అత్యధిక గోల్స్ ఇవే కావడం గమనార్హం. 124 లీగ్ గోల్స్‌తో ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిడ్‌ఫీల్డర్‌గా అతను ఖ్యాతిగాంచాడు [3] మరియు లీగ్ ఆల్‌టైమ్ అసిస్ట్ (మరో ఆటగాడు విజయవంతంగా గోల్ చేసేందుకు సహకరించే ఆటగాడు) జాబితాలో 149 గోల్స్‌తో అతను మూడో స్థానంలో ఉన్నాడు.[3] 2005లో, లాంపార్డ్ PFA ఫాన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మరియు FWA ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నికయ్యాడు, 2005 FIFA వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మరియు 2005 బాలోన్ డోర్ రెండింటిలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడిగా అతను పరిగణించబడుతున్నాడు[4][5][6][7].

అక్టోబరు 1999లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన లాంపార్డ్ తరువాత ఇంగ్లండ్ జట్టు తరపున 77 మ్యాచ్‌లు ఆడాడు, వీటిలో అతను 20 గోల్స్ చేశాడు. వరుసగా 2004 మరియు 2005 సంవత్సరాల్లో అతను ఇంగ్లండ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. UEFA యూరో 2004లో అతను ఆడాడు, ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్ చేసిన అతడిని తరువాత టోర్నమెంట్ జట్టుకు ఎంపిక చేశారు. 2006 ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ (అర్హత) పోటీల్లో పాల్గొన్న ఇంగ్లండ్ జట్టులో అతను అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలవడంతోపాటు, 2006 ప్రపంచ కప్‌లో ఆడాడు. 2010 ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ పోటీల్లో లాంపార్డ్ నాలుగు గోల్స్ చేశాడు, తద్వారా దక్షిణాఫ్రికాలో జరిగే ఈ టోర్నీకి ఇంగ్లండ్ అర్హత సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు.

క్లబ్ క్రీడా జీవితం[మార్చు]

వెస్ట్ హామ్ యునైటెడ్[మార్చు]

1995–2001[మార్చు]

తన తండ్రి యొక్క మాజీ క్లబ్ వెస్ట్ హామ్ యూనైటెడ్ జట్టులో లాంపార్డ్ క్లబ్ క్రీడా జీవితం ప్రారంభమైంది. 1994లో అతను క్లబ్ యువ జట్టులో చేరాడు, 1997-98 సీజన్‌నాటికి క్లబ్ మొదటి జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. 1998-99 సీజన్ ప్రీమియర్ లీగ్‌లో తన క్లబ్ జట్టు అత్యుత్తమ స్థానం సంపాదించడంలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. తరువాతి సీజన్‌లో లాంపార్డ్ మిడ్‌ఫీల్డ్‌లో ఆడుతూ అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 14 గోల్స్ చేశాడు. వెస్ట్ హామ్ జట్టులో తన పురోగతి మందగించడంతో, అతను 2001లో £11 మిలియన్ల కాంట్రాక్టుపై ప్రత్యర్థి లండన్ క్లబ్ చెల్సియాకు మారాడు.

చెల్సియా[మార్చు]

2001–2004[మార్చు]

చెల్సియా కోసం సన్నద్ధమవుతున్న లాంపార్డ్

చెల్సియా తరపున ప్రీమియర్ లీగ్‌లో లాంపార్డ్ ఆరంగేట్రం ఆగస్టు 19, 2001న జరిగింది, ఆ రోజు న్యూకాస్టిల్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్‌తో డ్రాగా ముగిసింది, సెప్టెంబరు 16న టోటెన్హామ్ హాట్‌స్పౌర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంపార్డ్ తొలిసారి రెడ్ కార్డ్ అందుకున్నాడు.

2001-02 సీజన్‌లో చెల్సియా ఆడిన లీగ్ మ్యాచ్‌లన్నింటిలో ఆడిన లాంపార్డ్ మొత్తం ఎనిమిది గోల్స్ చేశాడు. చార్ల్‌టన్ అథ్లెటిక్‌పై జరిగిన చెల్సియా యొక్క 2002-03 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో అతను మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

తరువాతి సీజన్ సందర్భంగా, సెప్టెంబరు 2003లో అతను బార్క్లేస్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు, అక్టోబరులో PFA ఫాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కూడా నిలిచాడు. 2003-04 ప్రీమియర్ లీగ్‌లో ఆర్సెనాల్ కప్‌ను తిరిగి దక్కించుకోగా, చెల్సియా రెండో స్థానంలో నిలిచింది, ఈ సీజన్‌లో తన కెరీర్‌లో తొలిసారి లీగ్ గోల్స్‌ను (10) రెండంకెల్లోకి చేర్చడంతోపాటు, పద్నాలుగు UEFA ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్ చేసి చెల్సియా సెమీ-ఫైనల్స్‌కు చేరుకోవడంలో సాయపడిన లాంపార్డ్ 2004 PFA టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో చోటు దక్కించుకున్నాడు. మొనాకోతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతను మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, చెల్సియా 5-3తో పరాజయం పాలైంది.[8]

2004–2007[మార్చు]

2007లో లాంపార్డ్

వరసగా మూడో సీజన్‌లో, అంటే 2004-05లో కూడా లాంపార్డ్ ముప్పై-ఎనిమిది ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లన్నింటిలో ఆడాడు. ఈ సీజన్‌లో అతను 13 గోల్స్ (మొత్తం మ్యాచ్‌ల్లో 19) చేశాడు, అంతేకాకుండా, 16 గోల్స్‌తో లీగ్ అసిస్ట్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.[9]

2004 ప్రీమియర్ లీగ్‌లో క్రిస్టల్ ప్యాలస్‌పై జరిగిన మ్యాచ్‌లో 25 యార్డ్‌ల దూరం నుంచి అతను గోల్ చేసి ఆశ్చర్యపరిచాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 4-1[10]తో విజయం సాధించింది. బోల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను రెండు గోల్స్ చేశాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 2-0తో విజయం సాధించింది, ఈ విజయంతో చెల్సియాకు ప్రీమియర్ లీగ్ టైటిల్ లభించింది[11], ఇది లాంపార్డ్‌కు తన క్రీడా జీవితంలో తొలి ప్రధాన ట్రోఫీ కావడంతోపాటు, గత యాభై ఏళ్లలో చెల్సియా జట్టు గెలుచుకున్న మొదటి ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కూడా ఇదే కావడం గమనార్హం, చెల్సియా దీనిని పన్నెండు పాయింట్ల తేడాతో గెలుచుకుంది. లాంపార్డ్ బార్క్లేస్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికయ్యాడు[12]. బేయెర్న్ మ్యూనిచ్‌తో జరిగిన 2004-05 ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో అతను ఆట రెండు భాగాల్లో మూడు గోల్స్ చేశాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 6-5 గోల్స్ తేడాతో విజయం సాధించింది, ఆట మొదటి పాదంలో అతను చేసిన రెండో గోల్ అందరినీ ఆశ్చర్యపరిచింది; మెకాలెలే క్రాస్‌ను తన ఛాతీతో నియంత్రించిన లాంపార్డ్ తరువాత కీలుపై తిరిగి లెఫ్ట్-ఫూట్ హాఫ్ వాలీతో దూరంగా ఉన్న పోస్ట్‌లోకి బంతిని పంపించాడు[13][14]. ప్రీమియర్ లీగ్ ప్రత్యర్థి లివర్‌పూల్ చేతిలో పరాజయంతో ఛాంపియన్స్ లీగ్ సెమీ-ఫైనల్స్ నుంచి చెల్సియా ఇంటిముఖం పట్టినప్పటికీ, ఈ జట్టు స్వదేశంలో జరిగే ఫుట్‌బాల్ లీగ్ కప్‌పై దృష్టి పెట్టింది, దీనిలో లాంపార్డ్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ చేశాడు, వీటిలో మాంచెస్టెర్ యునైటెడ్‌తో జరిగిన లీగ్ కప్ సెమీ ఫైనల్‌లో అతను చేసిన ప్రారంభ గోల్ కూడా ఉంది, ఈ మ్యాచ్‌లో చెల్సియా 2-1తో విజయం సాధించింది. అతను తరువాత ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ ద్వారా తొలి వ్యక్తిగత అవార్డును పొందాడు.[15] ఫుట్‌బాల్ దిగ్గజం జోహాన్ క్రుయిఫ్ అతడిని "ఐరోపాలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌గా" అభివర్ణించాడు.

2005-06 అతడికి తన కెరీర్‌లో అత్యధిక గోల్స్ సాధించిన సీజన్‌గా నిలిచింది, ఈ సీజన్‌లో అతను 16 గోల్స్ చేశాడు, వరుసగా ఐదో సీజన్ లీగ్ మ్యాచ్‌లు ఆడిన లాంపార్డ్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడంతోపాటు, ఒకే సీజన్‌లో అథ్యధిక గోల్స్ చేసిన మిడ్‌ఫీల్డర్‌గా ఒక ప్రీమియర్ లీగ్ రికార్డు సృష్టించాడు. సెప్టెంబరు 2005లో, లాంపార్డ్ ప్రారంభ FIFPro వరల్డ్ XI జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యాడు.[16] మాంచెస్టెర్ సిటీపై జరిగిన ఒక మ్యాచ్‌ను అనారోగ్యం కారణంగా ఆడలేకపోవడంతో, వరుసగా 164 ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు ఆడి అతను సృష్టించిన రికార్డు డిసెంబరు 28, 2005న ఆగిపోయింది (అంతకుముందు ఈ రికార్డును డేవిడ్ జేమ్స్ కలిగివున్నాడు, అతని కంటే లాంపార్డ్ ఐదు మ్యాచ్‌లు ఎక్కువ ఆడాడు).[17] అతని ఈ పరంపర క్లబ్‌తో తన తొలి సీజన్ సందర్భంగా, అక్టోబరు 13, 2001న ప్రారంభమైంది, ఆ తరువాత అతను రెండు రెట్లు మెరుగుపడ్డాడు[18]. బాలోన్ డోర్ మరియు FIFA వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు రొనాల్డినోతో జరిగిన పోటీలో అతనికి రన్నరప్ స్థానం దక్కింది.[19][20]. బ్లాక్‌బర్న్ రోవర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను రెండు గోల్స్ చేశాడు, ఈ మ్యాచ్‌లో జట్టు 4-2తో విజయం సాధించింది, అతను ఈ సందర్భంగా చేసిన గోల్స్‌లలో 25 యార్డుల దూరం నుంచి కొట్టి ఫ్రీ-కిక్ కూడా ఉంది. మ్యాచ్ మేనేజర్ జోస్ మౌరినో తరువాత లాంపార్డ్‌ను ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా అభివర్ణించాడు[21]. చెల్సియా ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను రెండోసారి గెలుచుకున్నప్పుడు కూడా లాంపార్డ్ జట్టులో ముఖ్యపాత్ర పోషించాడు, అతను 16 లీగ్ గోల్స్‌తో చెల్సియా టాప్-స్కోరర్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ లీగ్ గ్రూపు దశల్లో, ఆండెర్లెక్ట్ జట్టుతో జరిగిన ఒక మ్యాచ్‌లో అతను ఫ్రీ-కిక్ కొట్టాడు, తద్వారా చెల్సియా తొలి నాకౌట్ రౌండులోకి అడుగుపెట్టింది, అయితే ఇక్కడ బార్సెలోనా ఆ జట్టును ఇంటిముఖం పట్టించింది.

జాన్ టెర్రీ వెన్ను గాయంతో బాధపడుతూ జట్టు సారథ్య బాధ్యతలకు అందుబాటులో లేకపోవడంతో, లాంపార్డ్ 2006-07 సీజన్‌లో ఎక్కువ భాగం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ చేసి అతను సత్తా చాటాడు, ఫుల్హామ్‌పై 2-0 విజయంలో రెండు గోల్స్ చేసింది అతనే కావడం గమనార్హం, డిసెంబరు 17న చెల్సియా జట్టు ఎవెర్టాన్‌పై సాధించిన 3-2 విజయంలో లాంపార్డ్ చాలా దూరం నుంచి కొట్టిన గోల్ కూడా ఉంది, ఈ సీజన్‌లో చెల్సియా తరపున అత్యధిక గోల్స్ చేసిన మిడ్‌ఫీల్డర్‌గా డెన్నిస్ వైజ్ పేరిట ఉన్న రికార్డును అతను అధిగమించాడు.[22]. తరువాత UEFA ఛాంపియన్స్ లీగ్ గ్రూపు దశలో బార్సిలోనాతో జరిగిన ఒక మ్యాచ్‌లో అతను బాగా కఠినమైన కోణం నుంచి ఒక గోల్ కొట్టాడు, ఈ మ్యాచ్ క్యాంప్ నౌలో జరిగింది, ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది [23]. అన్ని టోర్నీల్లో కలిపి లాంపార్డ్ మొత్తం 21 గోల్స్ చేశాడు, ఈసారి తన క్రీడా జీవితంలో అత్యధికంగా ఆరు FA కప్ గోల్స్ చేశాడు; మొదటి పదకొండు సీజన్ల మొత్తం మీద అతను ఏడు కప్ గోల్స్ సాధించాడు. జనవరి 6, 2007న మాక్లెస్‌ఫీల్డ్ టౌన్‌పై జరిగిన మూడో-రౌండు టైలో అతను తొలిసారి చెల్సియా తరపున హ్యాట్రిక్‌ను సాధించాడు. అతను 3-1తో వెనుకబడి ఉన్న తన జట్టుకు రెండు గోల్స్ అందించడంతో, టోటెన్హామ్ హాట్‌స్పౌర్‌తో చెల్సియా క్వార్టర్-ఫైనల్‌ను డ్రా చేసుతుంది, అతని ప్రదర్శనకు గుర్తుగా FA కప్ ప్లేయర్-ఆఫ్-ది-రౌండ్ అవార్డు లభించింది.[24]. 2007 FA కప్ ఫైనల్‌లో డిడైర్ డ్రోగ్బా విన్నింగ్ గోల్ చేయడంలో అతను సాయం అందించాడు, అదనపు సమయంలోకి వెళ్లిన ఈ మ్యాచ్‌లో చెల్సియా 1-0తో విజయం సాధించింది. మాంచెస్టెర్ యూనైటెడ్‌పై FA కప్ ఫైనల్ మ్యాచ్‌లో చెల్సియా విజయం తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలో లాంపార్డ్ మాట్లాడుతూ.. తానెప్పటికీ చెల్సియా క్లబ్‌తోనే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు.[25]

2007–2009[మార్చు]

మ్యాచ్-డే కార్యక్రమంలో పాడుతున్న లాంపార్డ్

లాంపార్డ్ యొక్క 2007-08 సీజన్ గాయాలమయమైంది, ఈ సీజన్‌లో అతను 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, వీటిలో 24 లీగ్ మ్యాచ్‌లు ఉన్నాయి-1996-97 సీజన్ తరువాత అతను అతి తక్కువ మ్యాచ్‌లు ఆడిన సీజన్ ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరి 16, 2008న, లాంపార్డ్ చెల్సియా తరపున 100 గోల్స్ చేసిన ఎనిమిదో క్లబ్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు, హడెర్స్‌ఫీల్డ్ టౌన్‌తో జరిగిన FA కప్ ఐదో-రౌండు మ్యాచ్‌లో చెల్సియా 3-1తో విజయం సాధించింది, ఈ మ్యాచ్‌లోనే అతను ఈ ఘనత సాధించాడు.[26] తుది విజిల్ తరువాత, లాంపార్డ్ తన జెర్సీని తీసివేసి, ముందువైపు "100 నాటౌట్, దే ఆర్ ఆల్ ఫర్ యు, థాంక్స్" అనే సందేశం ఉన్న టి-షర్ట్‌ను ధరించి చెల్సియా అభిమానులకు ప్రదర్శించాడు.[27]. యాన్‌ఫీల్డ్‌లో లివర్‌పూల్‌తో జరిగిన ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ను ఒక పెనాల్టీని స్కోరుగా మలిచి అతను 1-1తో డ్రా చేశాడు. మార్చి 12న, చెల్సియా జట్టు డెర్బీ కౌంటీపై సాధించిన 6-1 విజయంలో అతను నాలుగు గోల్స్ చేశాడు. తరువాత ఫెనెర్‌బాహ్సెతో జరిగిన ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లాంపార్డ్ రెండో పాదంలో మ్యాచ్ విజయాన్ని నిర్ణయించే గోల్ చేశాడు, 87వ నిమిషంలో అతను చేసిన ఈ గోల్‌తో చెల్సియా ఈ మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించింది[28]. ఏప్రిల్ 30న, అంటే తన తల్లి మరణానికి వారం రోజుల తరువాత, లివర్‌పూల్‌పై ఛాంపియన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న చెల్సియా తరపున ఆట రెండో పాదంలో బరిలో దిగాలని లాంపార్డ్ నిర్ణయించుకున్నాడు, అదనపు సమయంలో అతను పూర్తి ఆత్మవిశ్వాసంతో పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 4-3తో లివర్‌పూల్‌పై విజయం సాధించింది.[29] మాంచెస్టెర్ యునైటెడ్‌పై జరిగిన ఫైనల్‌లో 45వ నిమిషంలో అతను ఒక గోల్ చేసి స్కోర్లను సమం చేశాడు, మైకెల్ ఎసియెన్ కొట్టిన బంతి దారితప్పి అతనికి దొరకడంతో, అతను దానిని తనదైన శైలి పరుగుతో బాక్స్ వద్దకు తీసుకెళ్లి, ఎడమకాలితో గోల్ చేశాడు. అదనపు సమయం ముగిసిన తరువాత కూడా మ్యాచ్ 1-1తో డ్రాగా నిలిచిపోయింది, తరువాత చెల్సియా 6-5 పెనాల్టీల తేడాతో పరాజయం చవిచూసింది. అతను తరువాత UEFA క్లబ్ మిడ్‌ఫీల్డర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.

ఆగస్టు 13, 2008న, చెల్సియా జట్టుతో లాంపార్డ్ కొత్తగా ఐదేళ్ల కాంట్రాక్టుపై సంతకం చేశాడు, దీని విలువ £39.2 మిలియన్లు, ఈ కాంట్రాక్టు ద్వారా అతను అత్యధిక నగదు అందుకునే ప్రీమియర్ లీగ్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[1][30] ఆడిన మొదటి పదకొండు లీగ్ మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ చేసి అతను తన 2008-09 సీజన్‌ను ప్రారంభించాడు. ప్రీమియర్‌ లీగ్‌లో మాంచెస్టెర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో ఒక గోల్ చేసిన అతను తన క్లబ్ క్రీడా జీవితంలో 150వ గోల్‌ను సాధించాడు. తరువాత ప్రీమియర్ లీగ్‌లో హల్ సిటీపై జరిగిన మరో మ్యాచ్‌లో ఎడమ కాలితో అతను ఒక అద్భుతమైన గోల్ చేశాడు; గోల్‌-కీపర్‌ను తికమకకు గురిచేసి కీలుపై తిరుగుతూ 20 యార్డుల దూరం నుంచి అతను బంతిని నెట్‌లోకి పంపించాడు, ప్రపంచ కప్ విన్నింగ్ కోచ్ లూయిజ్ ఫెలిప్ స్కోలారీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ: "నేనిప్పటి వరకు చూసినవాటిలో ఇది అత్యుత్తమైన గోల్, నా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఓటు అతనికే వేస్తాను, మేధాశక్తి ఉన్న ఆటగాడు మాత్రమే ఇటువంటి గోల్ సాధించగలడని అతడిని ప్రశంసించాడు"[31]. అతను తన వందొవ కెరీర్ ప్రీమియర్ లీగ్ గోల్‌ను నవంబరు 2న సుండర్‌ల్యాండ్‌పై చెల్సియా 5-0 విజయం సాధించిన మ్యాచ్‌లో సాధించాడు.[32] లాంపార్డ్ యొక్క వంద గోల్స్‌లో పద్దెనిమిది పెనాల్టీలు ఉన్నాయి.[33]

చెల్సియా తరపున ఆడున్న లాంపార్డ్

అక్టోబరులో అతను తన క్రీడా జీవితంలో మూడోసారి ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు.[34]

ఎటువంటి స్కోరు లేకుండా కొన్ని మ్యాచ్‌లు జరిగిన తరువాత, లాంపార్డ్ రెండు రోజుల వ్యవధిలో మూడు గోల్స్ చేశాడు, వీటిలో మొదటి గోల్ వెస్ట్ బ్రోమ్‌విచ్ అల్బియాన్ జట్టుపై, చివరి రెండు గోల్స్‌ను ఫుల్హామ్‌పై సాధించాడు.[35][36] జనవరి 17, 2009న స్టోక్ సిటీపై జరిగిన మ్యాచ్ ద్వారా చెల్సియా తరపున 400వ మ్యాచ్ ఆడాడు, ఇందులో ఆట ముగిసే సమయంలో విజయాన్ని అందించే గోల్ కొట్టాడు. అతను తరువాత కూడా ఆట ముగిసే సమయంలో మరో గోల్ కొట్టాడు, ఈసారి వీగాన్ అథ్లెటిక్ అతని ప్రత్యర్థి జట్టుగా ఉంది. తరువాత FA కప్ 4వ రౌండులో, ఐప్స్‌విచ్ టౌన్‌పై జరిగిన మ్యాచ్‌లో అతను 35 యార్డుల దూరం నుంచి ఫ్రీ-కిక్ కొట్టాడు. ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రెండో పాదంలో అతను రెండు గోల్స్ కొట్టాడు, దీంతో మ్యాచ్ నిర్ణీత సమయంలో 4-4తో సమంగా నిలిచింది, ఈ మ్యాచ్‌లో చివరకు చెల్సియా 7-5తో విజయం సాధించింది. తరువాత ఆర్సెనాల్‌పై జరిగిన FA కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతను రెండు గోల్స్ చేయడంలో మరో ఆటగాడికి సాయపడ్డాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. లాంపార్డ్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ను 12 గోల్స్‌తో ముగించాడు, అంతేకాకుండా మరో 10 గోల్స్ చేయడానికి సాయపడ్డాడు, 2009 చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. మాంచెస్టెర్ యునైటెడ్ మేనేజర్ సర్ అలెక్స్ ఫెర్గ్యూసన్ అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతూ: "ఫ్రాంక్ లాంపార్డ్ ఒక అరుదైన ఆటగాడు- చెల్సియాకు అతనొక పెద్ద ఆస్తి, మిడ్‌పీల్డ్ నుంచి గోల్స్ సాధించే ఆటగాళ్లకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తారు, అతను ప్రతి సీజన్‌కు సగటున 20 గోల్స్ చేశాడని కీర్తించాడు.అతను చెత్త వ్యూహాలు అమలు చేయడం లేదా చవకబారు వివాదాల్లో చిక్కుకోవడం వంటివి మీరు చూడలేదు. బార్సిలోనా చేతిలో పరాజయంతో ఛాంపియన్స్ లీగ్ నుంచి చెల్సియా తప్పుకోవాల్సి వచ్చిన తరువాత కూడా అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఆండ్రెస్ ఇనీస్టాతో చెక్కాలు మార్చుకున్న సంఘటనను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు."

సీజన్‌లో లాంపార్డ్ తన 20వ గోల్‌ను ఎవెర్టన్‌తో జరిగిన FA కప్ ఫైనల్ మ్యాచ్‌లో సాధించాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియాకు విజయాన్ని అందించిన గోల్ కూడా ఇదే, ఎడమకాలితో చాలా దూరం నుంచి అతను ఈ గోల్ కొట్టాడు. 1980 FA కప్ సెమీ-ఫైనల్‌లో విన్నింగ్-గోల్ కొట్టిన తరువాత తన తండ్రి చేసిన కార్నర్ ఫ్లాగ్ వేడుకను ఎవెర్టన్‌పై ఇప్పుడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆట రెండో-పాదంలో అతను పునరావృతం చేశాడు. తాజా సీజన్‌తో కలిసి అతను వరుసగా నాలుగు సీజన్‌లలో 20 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేశాడు. తరువాత అతను మూడోసారి చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.

2009 నుంచి ఇప్పటివరకు[మార్చు]

కమ్యూనిటీ షీల్డ్‌లో మాంచెస్టెర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంపార్డ్ 72వ నిమిషంలో ఒక గోల్ చేశాడు, దీంతో మ్యాచ్‌లో రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి, తరువాత లాంపార్డ్ ఫెనాల్టీ షూటౌట్‌లో స్కోరు చేయడంతో, చెల్సియా ఈ మ్యాచ్‌లో 4-1తో విజయం సాధించింది.ఆగస్టు 18, 2009న, లాంపార్డ్ సుండర్‌ల్యాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టుకు రెండో గోల్ సాధించిపెట్టాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అక్టోబరు 21, 2009న అట్లెటికో మాడ్రిడ్‌తో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో చెల్సియా తరపున అతను తన 133 గోల్ చేశాడు, దీంతో అతను క్లబ్ ఆల్-టైమ్ గోల్‌స్కోరర్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. అయితే అతను ముందు సీజన్‌లలో సాధించిన స్థాయిలో గోల్స్ చేయడానికి ఈసారి ఇబ్బందిపడ్డాడు, అయితే ఈ పరిస్థితిని అతను త్వరగానే అధిగమించాడు, అక్టోబరు 24 2009న బ్లాక్‌బర్న్ రోవర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను రెండు గోల్స్ చేశాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 5-0తో విజయం సాధించింది. అక్టోబరు 30న, అతను వరుసగా ఆరో ఏడాది FIFA వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.[37]. అతను తరువాత హాలోవీన్ రోజున బోల్టోన్‌తో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ గోల్ చేశాడు, అయితే చెల్సియా ఈ మ్యాచ్‌లో 4-0తో పరాజయం పాలైంది. డిసెంబరు 5న మాంచెస్టెర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో లాంపార్డ్ 82వ నిమిషంలో పెనాల్టీ గోల్ చేయడంలో విఫలమయ్యాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 2-1 తేడాతో పరాజయం చవిచూసింది. డిసెంబరు 16న, పోర్ట్‌స్మౌత్‌పై లాంపార్డ్ ఒక పెనాల్టీ ద్వారా ఆట 79వ నిమిషంలో పెనాల్టీ నుంచి ఒక కీలకమైన గోల్ చేశాడు, డిసెంబరు 20న, వెస్ట్ హామ్ యునైటెడ్‌పై కూడా లాంపార్డ్ ఒక పెనాల్టీ గోల్ చేశాడు, అయితే ఆటగాళ్లు బాక్స్‌లోకి ముందుగానే పరిగెత్తుతుండటంతో అతను తన స్పాట్-కిక్‌ను మూడుసార్లు తీసుకోవాల్సి వచ్చింది, అతను మూడు సార్లు కూడా స్కోర్ చేశాడు, తరువాత అతను కిక్-ఆఫ్‌కు ముందు పశ్చిమంవైపు స్టాండ్‌లోని హామెర్స్ అభిమానుల ముందు తన పిడికిలిని ముద్దు పెట్టుకున్నాడు. FA కప్ మూడో రౌండులో వాట్‌ఫోర్డ్‌పై లాంపార్డ్ ఒక అద్భుతమైన స్ట్రైక్‌తో గోల్ సాధించాడు. సుండర్‌ల్యాండ్‌ను చెల్సియా 7-2 గోల్స్ తేడాతో ఓడించడంలో కూడా లాంపార్డ్ కీలకపాత్ర పోషించాడు, దీనిలో అతను రెండు గోల్స్ చేశాడు. జనవరి 27, 2010న ప్రీమియర్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ సిటీపై జరిగిన మ్యాచ్‌లో లాంపార్డ్ మరోసారి రెండు గోల్స్ చేశాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 3-0తో విజయం సాధించింది. ఫిబ్రవరి 27న మాంచెస్టెర్ సిటీపై సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అతను రెండు గోల్స్ చేశాడు, అయితే చెల్సియా ఈ మ్యాచ్‌లో 4-2తో ఓటమి చవిచూసింది, దీంతో చెల్సియాకు తన సొంత మైదానంలో 38 మ్యాచ్‌ల తరువాత పరాజయం ఎదురైంది. స్టోక్ సిటీతో జరిగిన FA క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను మొదటి గోల్ చేయడంతోపాటు, జాన్ టెర్రీ మరో గోల్ చేయడంలో సాయపడ్డాడు, ఈ మ్యాచ్‌లో చెల్సియా 2-0తో విజయం సాధించింది. మాంచెస్టెర్ సిటీ ప్రస్తుతం అతడిని 39 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచింది. పోర్ట్‌స్మౌత్‌పై జరిగిన మ్యాచ్‌లో లాంపార్డ్ ఒక చేయడంతో సీజన్‌లో అతను సాధించిన గోల్స్ సంఖ్య 17కు చేరుకుంది.[38] మార్చి 27, 2010న ఆస్టోన్ విల్లాతో జరిగిన మ్యాచ్‌లో లాంపార్డ్ తన క్రీడా జీవితంలో రెండోసారి నాలుగు గోల్స్ కొట్టాడు, దీంతో అతను వరుసగా ఐదో సీజన్‌లో కూడా 20 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ సాధించినట్లయింది. ఈ మ్యాచ్ అతనికి 100వ చెల్సియా ప్రీమియర్ లీగ్ గోల్‌ను సాధించిపెట్టడంతోపాటు, చెల్సియా తరపున అతను చేసిన మొత్తం గోల్స్ సంఖ్యను 150కి చేర్చింది, అంతేకాకుండా క్లబ్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అతడిని మూడో స్థానంలో నిలిపింది.[39]

అంతర్జాతీయ క్రీడా జీవితం[మార్చు]

లాంపార్డ్‌లో ప్రతిభను మొదటిసారి ఇంగ్లండ్ అండర్-21 మేనేజర్ పీటర్ టేలర్ గుర్తించాడు, అతను నవంబరు 13, 1997న గ్రీసుపై అండర్-21 ఆరంగేట్రం చేశాడు. నవంబరు 1997 నుంచి జూన్ 2000 వరకు అతను అండర్-21 జట్టు తరపున ఆడాడు, ఈ జట్టు తరపున అతను తొమ్మిది గోల్స్ చేశాడు, దీనిని అలెన్ షియరెర్ మరియు ఫ్రాన్సిస్ జెఫెర్స్ మాత్రమే అధిగమించగలిగారు.

అక్టోబరు 10, 1999న అతను ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు, ఆ రోజు బెల్జియంతో జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది, క్రొయేషియాపై ఆగస్టు 20, 2003న జరిగిన మ్యాచ్‌లో అతను తన తొలి గోల్ సాధించాడు, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3-1తో గెలుపొందింది. యూరో 2000 మరియు 2002 ప్రపంచ కప్ పోటీల్లో అతడికి ఆడే అవకాశం లభించలేదు, దీంతో తొలి అంతర్జాతీయ టోర్నీలో ఆడేందుకు లాంపార్డ్ యూరో 2004 వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. అతను నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్ చేయడంతో ఇంగ్లండ్ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది, పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో 112వ నిమిషంలో అతను గోల్ చేసి ఇరుజట్ల స్కోర్లను 2-2తో సమం చేశాడు, అయితే ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో పెనాల్టీలతో పరాజయం పాలైంది. UEFA చేత టోర్నమెంట్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకున్నాడు.[40] పాల్ షూలెస్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతను జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు, 2004, 2005 సంవత్సరాల్లో అభిమానులచే అతను ఇంగ్లండ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.[41][42]

ఇంగ్లండ్ యొక్క 2006 ప్రపంచ కప్ అన్ని మ్యాచ్‌లను లాంపార్డ్ ఆడినప్పటికీ, అతను ఈ టోర్నీలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు, క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్ చేతిలో పెనాల్టీలపై పరాజయం పాలైన ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.[43] జర్మనీతో జరిగిన స్నేహపూరిత మ్యాచ్‌లో అతను ఒక గోల్ చేశాడు, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1తో పరాజయం పాలైంది. ఈస్టోనియాతో అక్టోబరు 13, 2007న జరిగిన ఇంగ్లండ్ యూరో 2008 క్వాలిఫైయింగ్ మ్యాచ్ ద్వితీయార్ధ భాగంలో లాంపార్డ్ ప్రత్యామ్నాయ ఆటగాడిలో అడుగుపెట్టడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తపరిచారు, [44] ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో అతను ఒక గోల్ చేశాడు (నవంబరు 21న క్రొయేషియా చేతిలో ఇంగ్లండ్ 3-2 తేడాతో పరాజయం పాలైంది), ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైంది. మార్చి 2009లో స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌లో అతను గత రెండేళ్ల కాలంలో తొలి అంతర్జాతీయ గోల్ చేశాడు, అంతేకాకుండా వాయ్నే రూనీ మరో గోల్ చేసేందుకు అతను సాయపడ్డాడు. లాంపార్డ్ చేసిన ఈ గోల్ వెంబ్లీలో ఇంగ్లండ్ చేసిన 500వ గోల్‌గా గుర్తింపు పొందింది.[45] సెప్టెంబరు 9, 2009న, క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అతను రెండు గోల్స్ చేశాడు, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5-1తో విజయం సాధించడంతోపాటు, 2010 ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకుంది.[46]

వ్యక్తిగత జీవితం[మార్చు]

2000లో, లాంపార్డ్, పెర్డినాండ్ మరియు కీరాన్ డైయర్ ఒక సెక్స్ వీడియోలో కనిపించారు, సైప్రస్‌లోని ఐయా నేపా హాలిడే రిసార్ట్‌లో ఇది చిత్రీకరించబడింది. ఛానల్ 4 ఈ వీడియోలో కొద్ది భాగాన్ని వారి యొక్క 2004 డాక్యుమెంటరీ సెక్స్, ఫుట్‌బాలర్స్ అండ్ వీడియోటేప్‌లో భాగంగా చేర్చింది, ప్రేక్షకుడికి ఇది నిజ జీవితం ఆధారంగా రూపొందించబడిందని గుర్తు చేసేందుకు తాము దీనిని ఉపయోగించామని ఆ ఛానల్ పేర్కొంది.[47]

సెప్టెంబరు 23, 2001న, లాంపార్డ్ మరియు మరో ముగ్గురు చెల్సియా ఆటగాళ్లకు రెండు వారాల జీతాన్ని క్లబ్ జరిమానాగా విధించింది, సెప్టెంబరు 12న మద్యం సేవించి విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు లాంపార్డ్‌పై ఈ జరిమానా విధించారు. సెప్టెంబరు 11, 2001 తీవ్రవాద దాడులు జరిగిన 24 గంటల తరువాత తీవ్ర విచారంలో ఉన్న అమెరికా పర్యాటకులను ఒక హిత్రూ హోటల్ వద్ద లాంపార్డ్ మరియు ఇతరులు వేధింపులకు గురిచేశారు. హోటల్ మేనేజర్ చాలా దారుణంగా ప్రవర్తించారని తెలిపాడు. అమెరికాలో జరిగిన విషయాన్ని వారు అసలు పట్టించుకోనట్లు ప్రవర్తించారని పేర్కొన్నాడు".[48]

లాంపార్డ్ సుర్రేలో నివసిస్తున్నాడు, గతంలో పెళ్లాడాలనుకున్న మహిళ ఎలెన్ రీవ్స్‌తో అతడికి ఇద్దరు పిల్లలు జన్మించారు, వారి పేర్లు లూనా (జననం ఆగస్టు 22, 2005) మరియు ఇస్లా (జననం మే 20, 2007).[49] అతని స్వీయచరిత్ర, టోటల్లీ ఫ్రాంక్, ఆగస్టు 2006న ప్రచురించబడింది. ఫిబ్రవరి 2009 మధ్యకాలంలో, లాంపార్డ్ మరియు రీవ్స్ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి, లాంపార్డ్ యొక్క మొత్తం £32m నికర విలువ ఉన్న ఆస్తిలో రీవ్స్ £1m నుంచి £12.5m ఆస్తిని తీసుకున్నట్లు సమాచారం.[50][51]

తన తల్లి మరణించిన ఏడాది తరువాత, ఏప్రిల్ 24, 2009న, లాంపార్డ్ లండన్ రేడియో స్టేషను LBC 97.3లో జేమ్స్ ఓ'బ్రియాన్‌తో రేడియో సవాలుకు దిగాడు.[52] లాంపార్డ్‌తో విడిపోయిన తరువాత రీవ్స్ మరియు వారి పిల్లలు ఆమెతోపాటే ఒక చిన్న ప్లాటులో నివసిస్తున్నట్లు, లాంపార్డ్ మాత్రం వారి కుటుంబ నివాసాన్ని ఒక బ్యాచులర్ ప్యాడ్‌గా (విలాసవంతమైన బ్రహ్మచారి నివాసం) మార్చినట్లు పత్రికలు వార్తలు ప్రచురించాయి. తన పిల్లలను హీనమైన పరిస్థితుల్లో నివసించేందుకు కారణమైన నీచుడనే నిందను లాంపార్డ్ ఫోన్‌లో ఖండించాడు, తన కుటుంబాన్ని కలిపి ఉంచేందుకు శాయశక్తులా కృషి చేశానని చెప్పకొచ్చాడు.[53]

చెల్సియా వైద్యుడు, బ్రయాన్ ఇంగ్లీష్ నిర్వహించిన ఒక నాడీకణ పరిశోధన సందర్భంగా లాంపార్డ్ అధిక IQ స్కోరును కలిగివున్నట్లు తేలిందని బ్రిటీష్ మీడియా వెల్లడించింది. కంపెనీ పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా నమోదయిన అన్ని మార్కుల కంటే అత్యధిక మార్కులను ఫ్రాంక్ లాంపార్డ్ నమోదు చేశాడని ఇంగ్లీష్ పేర్కొన్నాడు.[54]

లాంపార్డ్ తాను కన్జర్వేటివ్ పార్టీ మద్దతుదారుడినని ప్రకటించుకున్నాడు.[55]

అంతర్జాతీయ FIFA 10 ఫుట్‌బాల్ గేమ్ ప్యాక్ కవర్‌పై ఉన్న ముగ్గురు ఫుట్‌బాల్ స్టార్లలో ఒకడిగా EA స్పోర్ట్స్ లాంపార్డ్‌ను ఎంపిక చేసింది, దీనికి ఎంపికైన మిగిలిన ఇద్దరు థియో వాల్కాట్ మరియు వాయ్నే రూనీ.[56]

క్రీడా జీవిత గణాంకాలు[మార్చు]

శనివారం, మార్చి 27, 2010నాటికి ఇవి కచ్చితమైనవి

మూస:Football player statistics 1 |- !colspan="3"|England

LeagueFA Cup League Cup Europe Total

|- |1995-96||స్వాన్సీ సిటీ||సెకండ్ డివిజన్||9||1||0||0||0||0||0||0||9||1 |- |1995-96||rowspan="6"|వెస్ట్ హామ్ యునైటెడ్||rowspan="6"|ప్రీమియర్ లీగ్||2||0||0||0||0||0||0||0||2||0 |- |1996-97||13||0||1||0||2||0||0||0||16||0 |- |1997-98||31||5||6||1||5||4||0||0||42||9 |- |1998-99||38||5||1||0||2||1||0||0||41||6 |- |1999-00||34||7||1||0||4||3||10||4||49||14 |- |2000-01||30||7||4||1||3||1||0||0||37||9 |- |2001-02||rowspan="9"|చెల్సియా||rowspan="9"|ప్రీమియర్ లీగ్||37||5||8||1||4||0||4||1||53||7 |- |2002-03||38||6||5||1||3||0||2||1||48||8 |- |2003-04||38||10||4||1||2||0||14||4||58||15 |- |2004-05||38||13||2||0||6||2||12||4||58||19 |- |2005-06||35||16||5||2||1||0||9||2||50||20 |- |2006-07||37||11||7||6||6||3||12||1||62||21 |- |2007-08||24||10||1||2||3||4||12||4||40||20 |- |2008-09||37||12||8||3||2||2||11||3||53||20 |- |2009-10||30||17||4||2||1||0||6||1||42||21

మూస:Football player statistics 3148||24||13||2||16||9||10||4||196||38 మూస:Football player statistics 3314||100||42||17||28||18||82||22||470||151 మూస:Football player statistics 5463||124||54||21||44||21||92||26||666||192 |}

ఈ గణాంకాల్లో FA కమ్యూనిటీ షీల్డ్ వంటి అదనపు పోటీలు కూడా చేర్చబడ్డాయి.

ఫ్రాంక్ లాంపార్డ్: అంతర్జాతీయ గోల్స్
గోల్ తేదీ వేదిక ప్రత్యర్థి స్కోరు ఫలితం పోటీ
1 ఆగస్టు 20, 2003 పోర్ట్‌మాన్ రోడ్, ఇప్స్‌విచ్  Croatia 3-1 విజయం స్నేహపూర్వక మ్యాచ్
2 జూన్ 5, 2004. సిటీ ఆఫ్ మాంచెస్టెర్ స్టేడియం, గ్రేటర్ మాంచెస్టెర్  Iceland 6-1 విజయం స్నేహపూర్వక మ్యాచ్
3 జూన్ 13, 2004 ఎస్టాడియో డా లజ్, లిస్బాన్  France 1-2 పరాజయం UEFA యూరో 2004
4 జూన్ 21, 2004 ఎస్టాడియో డా లజ్, లిస్బాన్  Croatia 4-2 విజయం UEFA యూరో 2004
5 జూన్ 24, 2004 ఎస్టాడియో డా లజ్, లిస్బాన్  Portugal 2-2 డ్రా UEFA యూరో 2004
6 సెప్టెంబరు 4, 2004 ఎర్నెస్ట్ హాపెల్ స్టేడియం, వియన్నా  Austria 2-2 డ్రా ప్రపంచ కప్ 2006 క్వాలిఫైయర్స్
7 అక్టోబరు 9, 2004 ఓల్డ్ ట్రాఫోర్డ్  Wales 2-0 విజయం ప్రపంచ కప్ 2006 క్వాలిఫైయర్స్
8 మార్చి 26, 2005 ఓల్డ్ ట్రాఫోర్డ్  Northern Ireland 4-0 విజయం ప్రపంచ కప్ 2006 క్వాలిఫైయర్స్
9 అక్టోబరు 8, 2005 ఓల్డ్ ట్రాఫోర్డ్  Austria 1-0 విజయం ప్రపంచ కప్ 2006 క్వాలిఫైయర్స్
10 అక్టోబరు 12, 2005 ఓల్డ్ ట్రాఫోర్డ్  Poland 2-1 విజయం ప్రపంచ కప్ 2006 క్వాలిఫైయర్స్
11 జూన్ 3, 2006 ఓల్డ్ ట్రాఫోర్డ్  Jamaica 6-0 విజయం స్నేహపూర్వక మ్యాచ్
12 ఆగస్టు 16, 2006 ఓల్డ్ ట్రాఫోర్డ్, గ్రేటర్ మాంచెస్టెర్  గ్రీసు 4-0 విజయం స్నేహపూర్వక మ్యాచ్
13 ఆగస్టు 22, 2007 వెంబ్లీ స్టేడియం, లండన్  Germany 1-2 పరాజయం స్నేహపూర్వక మ్యాచ్
14 నవంబరు 21, 2007 వెంబ్లీ స్టేడియం, లండన్  Croatia 2-3 పరాజయం యూరో 2008 క్వాలిఫైయర్స్
15 మార్చి 28, 2009 వెంబ్లీ స్టేడియం, లండన్  Slovakia 4-0 విజయం స్నేహపూర్వక
16 జూన్ 6, 2009 అల్మేటీ సెంట్రల్ స్టేడియం, అల్మేటీ  Kazakhstan 4-0 విజయం ప్రపంచ కప్ 2010 క్వాలిఫైయర్స్
17 జూన్ 10, 2009 వెంబ్లీ స్టేడియం, లండన్  Andorra 6-0 విజయం ప్రపంచ కప్ 2010 క్వాలిఫైయర్స్
18 సెప్టెంబరు 5, 2009 వెంబ్లీ స్టేడియం, లండన్  Slovenia 2-1 విజయం స్నేహపూర్వక
19 సెప్టెంబరు 9, 2009 వెంబ్లీ స్టేడియం, లండన్  Croatia 5-1 విజయం ప్రపంచ కప్ 2010 క్వాలిఫైయర్స్
20 సెప్టెంబరు 9, 2009 వెంబ్లీ స్టేడియం, లండన్  Croatia 5-1 విజయం ప్రపంచ కప్ 2010 క్వాలిఫైయర్స్

గౌరవాలు[మార్చు]

వెస్ట్ హామ్ యునైటెడ్[మార్చు]

చెల్సియా[మార్చు]

చెల్సియా తరపున కలిసి అనేక ట్రోఫీలు గెలిచిన లాంపార్డ్ మరియు జాన్ టెర్రీ

విజేతలు

ద్వితీయ స్థానం

వ్యక్తిగత గౌరవాలు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 స్ట్రైకింగ్ ఇట్ రిచ్ - ఫుట్‌బాల్స్ టాప్ టెన్ హైయెస్ట్ ఎర్నర్స్ ఆర్ రివీల్డ్ ది డైలీ మెయిల్ (2 మార్చి 2009) సేకరణ తేదీ: మార్చి 11, 2009
 2. 2.0 2.1 లాంప్స్ ఈజ్ స్టార్ ఆఫ్ ది డెకేడ్ ది సన్
 3. 3.0 3.1 ప్రీమియర్ సాకర్ స్టాట్స్
 4. ఫ్రాంక్ లాంపార్డ్ వరల్డ్ కప్ సాకర్
 5. లాంపార్డ్స్ వరల్డ్ బిడ్ ది సన్
 6. లాంప్స్ లైట్స్ అప్ ఓవెన్ ది సన్
 7. హల్ సిటీ 0 చెల్సియా 3 ది సన్
 8. చెల్సియా 2-2 మొనాకో BBC స్పోర్ట్, మే 5, 2004
 9. "Premier League - Statistics". Premier League. 7 July 2008. Retrieved 7 July 2008. Cite news requires |newspaper= (help)
 10. చెల్సియా 4 క్రిస్టల్ ప్యాలస్ 1 ది సన్
 11. చెల్సియా ఛాంపియన్స్ ది సన్
 12. ఫ్రాంక్ లాంపార్డ్ 4thegame.com
 13. స్టైలిష్ చెల్సియా సీజ్ కమాండ్ uefa.com, ఏప్రిల్ 6, 2005
 14. చెల్సియా 4 బేయార్న్ మ్యూనిచ్ 2 ది సన్
 15. "Chelsea's Lampard is writers' player of the year". Yahoo!. 6 May 2005. Retrieved 6 January 2007. Cite news requires |newspaper= (help)
 16. "Lamps and Terry honoured". Football Association. 20 December 2005. Retrieved 9 December 2006. Cite news requires |newspaper= (help)
 17. "Lampard 164 and out". The Guardian. 29 December 2005. Retrieved 9 December 2006. Cite news requires |newspaper= (help)
 18. ఫ్రైడెల్ హానర్డ్ విత్ బార్క్లేస్ మెరిట్ అవార్డ్ ప్రీమియర్ లీగ్ అధికారిక వెబ్‌సైట్
 19. "Ronaldinho scoops European award". BBC Sport. 28 November 2005. Retrieved 9 December 2006. Cite news requires |newspaper= (help)
 20. "Ronaldinho wins world award again". BBC Sport. 19 December 2005. Retrieved 9 December 2006. Cite news requires |newspaper= (help)
 21. చెల్సియా 4 బ్లాక్‌బర్న్ 2 ది సన్, అక్టోబరు 29, 2005
 22. "Match Report: Everton 3 Chelsea 2". Chelsea FC. 17 December 2006. Retrieved 17 December 2006. Cite news requires |newspaper= (help)
 23. బార్సిలోనా 2 చెల్సియా 2 ది సన్
 24. "Lampard triumphs in FA Cup award". BBC Sport. 30 March 2007. Retrieved 9 April 2007. Cite news requires |newspaper= (help)
 25. "Mourinho proud of Chelsea players". Eurosport. 20 May 2007. Retrieved 20 May 2007. Cite news requires |newspaper= (help)
 26. "Frank and the Full 100 Club". Chelsea FC. 17 February 2008. Retrieved 17 February 2008. Cite news requires |newspaper= (help)
 27. Barlow, M. (17 February 2008). "A ton of thanks - Lampard's salute after reaching Chelsea milestone". Daily Mail. Retrieved 15 November 2008. Cite news requires |newspaper= (help)
 28. చెల్సియా 2 పెనెర్‌బాహ్సే 0 - లాంపార్డ్ హెల్ప్స్ చెల్సియా ఇన్‌టు ఛాంపియన్స్ లీగ్ సెమీ-ఫైనల్ ది సన్
 29. ఛాంపియన్స్ లీగ్ సెమీ-ఫైనల్: చెల్సియా 3 లివర్‌పూల్ 2 aet ది సన్
 30. "Lamps signs mega deal". Malaysian Star Online. 13 August 2008. Retrieved 13 August 2008. Cite web requires |website= (help)
 31. ఫ్రాంక్ లాంపార్డ్ అండ్ చెల్సియా పుట్ ఎ స్టాప్ టు హల్స్ కాపిటల్ గెయిన్స్ ది టెలిగ్రాఫ్, అక్టోబరు 29, 2008
 32. PA Sport (2 November 2008). "Scolari hails centurion Lampard". The World Game. Retrieved 3 November 2008. Cite news requires |newspaper= (help)
 33. "THE LAMPARD 100 GOAL PUZZLE - PART TWO". Chelsea FC. 6 November 2008. Retrieved 10 November 2008. Cite news requires |newspaper= (help)
 34. "Rafa and Lamps claim Prem gongs". TeamTalk. 15 November 2008. Retrieved 15 November 2008. Cite news requires |newspaper= (help)
 35. "Drogba, Lampard See Chelsea Past West Brom". IBN Live. Retrieved 3 January 2009. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 36. David Smith (29 December 2008). "Lampard rallies team-mates after Chelsea's title bid falters at Fulham". Daily Mail. Retrieved 3 January 2009. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 37. ఇంగ్లండ్ స్టార్స్ వాయ్నే రూనీ, స్టీవెన్ గెరార్డ్, ఫ్రాంక్ లాంపార్డ్ అండ్ జాన్ టెర్రీ ఆన్ షార్ట్ లిస్ట్ ఫర్ FIFA వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మెయిల్ ఆన్‌లైన్, అక్టోబరు 30, 2009
 38. http://soccernet.espn.go.com/report?id=269840&league=ENG.1&cc=5901
 39. "Chelsea 7 - 1 Aston Villa". BBC Sport. 2010-03-27. http://news.bbc.co.uk/sport2/hi/football/eng_prem/8587517.stm. Retrieved 2010-03-28. 
 40. Chris Hatherall (5 July 2004). "Four All-Star Lions". The Football Association. Retrieved 12 April 2007. Cite news requires |newspaper= (help)
 41. "And the winner is." The Football Association. 20 January 2005. Retrieved 7 December 2008. Cite news requires |newspaper= (help)
 42. "And the winner is..." The Football Association. 1 February 2006. Retrieved 7 December 2008. Cite news requires |newspaper= (help)
 43. "Frank Lampard". ESPNsoccernet. Retrieved 9 December 2006. Cite news requires |newspaper= (help)
 44. "Barnes angered by Lampard booing". BBC Sport. 14 October 2007. Retrieved 18 October 2007. Cite news requires |newspaper= (help)
 45. "England cruise to victory". The Football Association. 28 March 2009. Retrieved 29 March 2009. Cite news requires |newspaper= (help)
 46. ఇంగ్లండ్ 5 1 క్రొయేషియా ఇంగ్లండ్ రీక్రియేట్ మ్యాజిక్ ఆఫ్ మ్యూనిచ్ goal.com
 47. Stephen Naysmith (15 August 2004). "Channel 4 to show alleged Premiership sex video". CBS Interactive Inc. Retrieved 23 November 2008. Cite news requires |newspaper= (help)
 48. చెల్సియా ఫోర్ ఫైన్డ్ ఫర్ డ్రంకన్ అబ్యూజ్ ది టెలిగ్రాఫ్
 49. "Rives gives birth to footballer's second daughter". nowmagazine.co.uk. Retrieved 3 July 2007. Cite news requires |newspaper= (help)
 50. ఫ్రాంక్ లాంపార్డ్ టు లూజ్ £1m ఆఫ్టర్ స్ప్లిట్ ఫ్రమ్ ఎలెన్ రీవ్స్ Wags Blog మార్చి 12, 2009న సేకరించారు
 51. ఫ్రాంక్ లాంపార్డ్ అండ్ ఎలెన్ రీవ్స్ హామెర్ అవుట్ డీల్ ఆఫ్టర్ స్ప్లిట్ ది సన్ సేకరణ తేదీ మార్చి 12, 2009
 52. "Lampard vents anger at 'heartless' comments live on radio". The Independent. 24 April 2009. Retrieved 25 April 2009. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 53. "Frank Lampard's call to LBC: The full transcript". The Independent. 24 April 2009. Retrieved 25 April 2009. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 54. "Footballer Frank Lampard reported to have a high IQ". Retrieved 12 March 2009. Cite news requires |newspaper= (help)
 55. http://www.dailymail.co.uk/sport/football/article-492252/Lampard-confirms-place-right-wing.html
 56. లాంపార్డ్ జాయిన్స్ రూనీ ఆన్ FIFA 10 గ్లోబల్ ప్యాక్ గేమ్స్ గురు, ఆగస్టు 25, 2009

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:Chelsea F.C. squad