ఫ్రాన్ కాపో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫ్రాన్ కాపో ఒక ప్రేరణాత్మక వక్త, సాహసికురాలు, హాస్యనటి, వాయిస్ ఓవర్ కళాకారిణి, రచయిత, అనేక రికార్డులు సాధించింది. ఫ్రాన్ కాపో న్యూ యార్క్ సిటీలోని గ్రీన్విచ్ విలేజ్ లో జన్మించింది. ఈమె తత్వశాస్త్రం, అకౌంటింగ్ లో బిఎ తో క్వీన్స్ కళాశాల నుంచి పట్టభద్రురాలైంది. ఫ్రాన్ కాపో ఒక సెకనులో 11 పదాలు మాట్లాడుతుంది, 200కి పైగా పదాలున్న "త్రీ లిటిల్ పిగ్స్" అనే చిన్న కథను కేవలం 15 సెకన్లలోనే చెప్పేస్తుంది. దీంతో ప్రపంచంలోనే వేగంగా మాట్లాడే మహిళగా ఈమె గిన్నిస్ రికార్డు సాధించింది. 1986లో ఫ్రాన్ కాపో ఓ ఎఫ్‌ఎంలో పనిచేస్తున్నప్పుడు వాతావరణం, ట్రాఫిక్ అనే రెండు అంశాలపై పేరడీ కథ వేగంగా చెప్పి శ్రోతలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్థానిక వార్తాపత్రిక చేసిన ఇంటర్వ్యూలో మీ లక్ష్యం ఏమిటి అన్న ప్రశ్నకు ‘‘వేగంగా మాట్లాడే మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించడమే’’ తన లక్ష్యమని చెప్పింది. దీంతో లారీకింగ్ లైవ్ షోలో ఆ రికార్డు బద్దలుకొట్టడానికి ప్రయత్నించాలని సీఎన్‌ఎన్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. అలాగే ఆ షోలో పాల్గొని రికార్డు సాధించింది. ఒక్క నిమిషంలో 585 పదాలు మాట్లాడి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించింది. తర్వాత 1990లో 54.2 సెకన్లలో 603 పదాలను మాట్లాడి తన రికార్డును తానే తిరగరాసింది.


మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 10-07-2014