Jump to content

ఫ్రిదా టోప్నో

వికీపీడియా నుండి
ఫ్రిదా టోప్నో

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1991
నియోజకవర్గం సుందర్‌గఢ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1996

పదవీ కాలం
1998  2002

వ్యక్తిగత వివరాలు

జననం 1925 సెప్టెంబర్ 20
మరణం 2018 ఫిబ్రవరి 6(2018-02-06) (వయసు: 92)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకురాలు

ఫ్రిదా టోప్నో (20 సెప్టెంబర్ 1925 - 6 ఫిబ్రవరి 2018) ఒడిశాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఒకసారి రాజ్యసభ సభ్యురాలిగా, సుందర్‌గఢ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఫ్రిదా టోప్నో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 ఒడిశా శాసనసభ ఎన్నికలలో రఘునాథ్‌పాలి శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీ అభ్యర్థి మంగళ కిసాన్ పై 38070 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

ఫ్రిదా టోప్నో 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి జార్జ్ టిపై 13,073 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 1998 నుండి 2002 వరకు ఒడిశా నుండి రాజ్యసభకు ఎన్నికైంది.

మరణం

[మార్చు]

ఫ్రిదా టోప్నో 92 సంవత్సరాల వయస్సులో భువనేశ్వర్‌లో 2018 ఫిబ్రవరి 06న మరణించింది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Odisha: Gender equality elusive as parties play it safe in Sundargarh" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 April 2024. Retrieved 20 June 2025.
  2. "RS mourns death of former member Frida Topno". Business Standard. 8 February 2018. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.
  3. "Odisha: Veteran Congress leader and former MP Frida Topno passes away" (in ఇంగ్లీష్). The New Indian Express. 7 February 2018. Retrieved 20 June 2025.
  4. "Odisha Congress leader Frida Topno passes away". Business Standard. 6 February 2018. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.