ఫ్లిప్‌కార్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్లిప్‌కార్ట్
Flipkart india.png
వ్యాపార వర్గంPrivate
సైటు రకంOnline shopping
Available inEnglish
స్థాపించింది2007 (2007)
ప్రాంతీయ కార్యాలయాల సంఖ్యబెంగుళూరు
Area servedభారత్
కనుగొన్నవారు
ముఖ్యమైన వ్యక్తులుSachin Bansal & Manish Verma
పరిశ్రమఇంటర్నెట్, Online retailing
ఉత్పత్తులుFlipkart.com, Electronic Wallet, Mime360.com, Chakpak.com
సేవలుఈ-కామర్స్
ఆదాయంIncrease INR1180 కోట్లు (US$) (FY 2012-13)[1]
ఉద్యోగులు10000[2]
వెబ్ సైటుFlipkart.com
అలెక్సా ర్యాంకుPositive decrease 143; 10: India (April 2014)[3]
ప్రకటనలుyes
నమోదుOptional (required for buying Digital Content)
ప్రారంభం2007; 13 years ago (2007)
ప్రస్తుత స్థితిOnline

ఫ్లిప్‌కార్ట్ అనేది బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారతీయ అంతర్జాల వాణిజ్య వేదిక. దీన్ని 2007 వ సంవత్సరంలో అమెజాన్.కామ్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ప్రారంభించారు. ఈ సంస్థ ప్రవేశంతో భారతదేశంలో ఆన్‌లైన్ వ్యాపారం జోరందుకుంది.[4][5] అలెక్సా ర్యాంకుల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైటు భారతదేశంలో మొట్టమొదటి పది స్థానాల్లో నిలిచింది.[3] ఫ్లిప్‌కార్ట్ డిజిఫ్లిప్ పేరుతో కెమెరా బ్యాగులు, పెన్ డ్రైవులు, హెడ్ ఫోన్లు, కంప్యూటర్ పరికరాలు అమ్మే వ్యాపారంలో కూడా ప్రవేశించింది.[6][7]

చరిత్ర[మార్చు]

ఫ్లిప్‌కార్ట్ ను 2007వ సంవత్సరంలో ఐఐటీ డిల్లీ పూర్వ విద్యార్థులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ప్రారంభించారు. వారిరువురు అమెజాన్.కామ్ లో సహోద్యోగులు. బెంగళూరులోని కోరమంగళలో చిన్న ఇంట్లో దీని ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో ఇది కేవలం పుస్తకాలు మాత్రమే అమ్మేది. విస్తరణ తరువాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు, ఎయుర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఇ-పుస్తకాలు మొదలైనవన్నీ అమ్మడం ప్రారంభించారు. వాళ్ళు అమ్మిన మొట్టమొదటి ఉత్పత్తి లీవింగ్ మైక్రోసాఫ్ట్ టు చేంజ్ ది వరల్డ్ అనే పుస్తకం. దీన్ని కొనుగోలు చేసింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివికె చంద్ర.[8] ఉత్పత్తులను వినియోగదారుడికి చేరిన తర్వాతనే డబ్బు చెల్లించే విధానాన్ని(క్యాష్ ఆన్ డెలివరీ) ప్రవేశపెట్టడం ద్వారా ఇది ప్రజలకు మరింత చేరువైంది. అంతే కాకుండా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ మొదలైన సదుపాయాల ద్వారా ఇక్కడ డబ్బు చెల్లించవచ్చు.

మూలాలు[మార్చు]

  1. Dalal, Mihir (19 December 2013). "Flipkart India reports loss of Rs.281.7 crore". Mint. Bangalore. Retrieved 4 January 2014.
  2. http://timesofindia.indiatimes.com/tech/tech-news/Flipkart-makes-it-mandatory-for-all-top-executives-to-take-customer-calls/articleshow/34234110.cms?utm_source=facebook&utm_medium=referral&utm_campaign=TOITech
  3. 3.0 3.1 "Flipkart.com Site Info". Alexa Internet. Retrieved 2014-04-01. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "alexa" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ ను ఎలా ప్రభావితం చేసింది". Businesstoday.intoday.in. 2012-02-09. Archived from the original on 2013-10-04. Retrieved 2013-10-05.
  5. "ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్ జడత్వాన్ని ఎలా పోగొట్టింది". Hindustan Times. 2011-12-10. Retrieved 2013-10-05.
  6. "Flipkart launches its own accessories digiflip". Thinkdigit.com. Archived from the original on 2013-10-04. Retrieved 2013-10-05.
  7. "Exclusive: Flipkart forays into private label, launches DigiFlip brand". NextBigWhat.com. 2012-07-25. Archived from the original on 2013-10-05. Retrieved 2013-10-05.
  8. http://www.quora.com/Flipkart/Who-ordered-the-first-book-from-Flipkart-and-which-book-was-it