బంకురా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంకురా జిల్లా
ఎడమ నుండి సవ్యదిశలో: బిష్ణుపూర్‌లోని రస్మంచ, ముకుత్‌మణిపూర్ డ్యామ్, బంకురాలోని పాత ఇంజిన్, సుసునియా కొండ, మహదేబ్సినన్ కొండ సమీపంలోని అటవీ
బంకూరా జిల్లా
বাঁকুড়া জেলা
పశ్చిమ బెంగాల్ పటంలో బంకూరా జిల్లా స్థానం
పశ్చిమ బెంగాల్ పటంలో బంకూరా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
డివిజనుబర్ద్‌వాన్ డివిజన్
ముఖ్య పట్టణంబంకూరా
Government
 • లోకసభ నియోజకవర్గాలుబంకూరా, బిష్ణుపూర్ (ఎస్.సి)
 • శాసనసభ నియోజకవర్గాలుసల్తోరా, ఛట్నా, రాణిబాఘ్, రాయపూర్, తల్‌దంగ్రా, బంకూరా,బర్జోరా, ఒండా, బిష్ణుపూర్, కతుల్‌పూర్, ఇండస్, సోనాముఖి
Area
 • మొత్తం6,882 km2 (2,657 sq mi)
Population
 (2011)
 • మొత్తం35,96,292
 • Density520/km2 (1,400/sq mi)
 • Urban
2,35,264
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.95 per cent[1]
 • లింగ నిష్పత్తి914
ప్రధాన రహదార్లుNH 60
సగటు వార్షిక వర్షపాతం1,400 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

బంకురా జిల్లా (బెంగాలి:বাঁকুড়া জেলা) పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని బర్దామన్ డివిషన్ లోని ఒక జిల్లా. జిల్లా తూర్పు సరిహద్దిలో గంగానదిమైదానం, పశ్చిమ సరిహద్దులో చోటానాగపూర్ ఉన్నాయి. జిల్లా తూర్పు, ఈశాన్యభూభాగంలో సారవంతమైన దిగువమైదానాలు ఉన్నాయి. పశ్చిమంగా క్రమంగా నేలమట్టం అధికమౌతూ పర్వతమయమైన భూభాగానికి చేరుకుంటున్నది.[2]పశ్చిమ బెంగాల్‌కు చెందిన మల్లా రాజ్యానికి కేంద్రంగా ఉన్న జిల్లా ప్రాంతం బంకురా, దాని పరిసర ప్రాంతాలలో చారిత్రక, సాంస్కృతిక చిహ్నాలు అనేకం ఉన్నాయి. మద్యయుగం, వైష్ణవిజం (7వ శతాబ్ధానికి చెందిన మల్లాపాలనలో ఆరంభం అయింది) జిల్లా సంస్కృతిని రూపొందించాయి. 1765లో మల్లా రాజ్యం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో విలీనం చేయబడింది. ఆధునిక బంకురా జిల్లా 1881లో రూపుదిద్దుకుంది. జిల్లాకేంద్రం పేరుకు జిల్లాకు నిర్ణయించబడింది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

బంకురా పేరుగురించిన విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. హోభాష (కోల్) - ముందా భాషలలో ఒరాహ్ (ఒరా) అంటే మానవ ఆవాసం అని అర్ధం. బానికి అంటే అందమైన అని అర్ధం. బంకా అంటే జిగ్ - జాగ్ అని అర్ధం. అతిపవిత్రమైన దైవం పేరు " ధర్మథాకూర్ "ను ప్రాంతీయంగా బంకురా రాయ్ అని కూడా అంటారు.[3] ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న నగరానికి స్థాపకుని పేరు పెట్టబడిందని భావిస్తున్నారు. సైనికాధికారి బంకురాయ్ ఈ నగరాన్ని స్థాపించినందున ఈ నగరానికి బంకురా అని పేరు వచ్చిందని కొందరు భావిస్తున్నారు. మరొక కథనం అనుసరించి మిష్ణుపూర్ మహారాజా బీర్ హంబీర్ 22 మంది కుమారులలో ఒకడైన బీర్ బంకురా పేరు ఈ నగరానికి వచ్చి ఉండవచ్చని ఒక కథనం ప్రచారంలో ఉంది. బిష్ణుపూర్ మహారాజు తన 22 కుమారులకొరకు రాజ్యాన్ని 22 తాలూకాలు (సర్కిల్స్) గా విభజించి తన కుమారులకు ఒక్కొకరికి ఒకటి ఇచ్చాడని. ఈ ప్రాంతం బీర్ బంకురాకు ఇచ్చిందున అతడు నగరాన్ని మరింత అభివృద్ధిచేసి నగరానికి బంకురా అని నామకరణం చేసాడు. నగరంలో బకుండా (అంటే ఐదు సరసులు) ఉన్నాయని అందువలన నగరానికి బంకురా అని పేరు వచ్చిందని భావిస్తున్నారు. బకుండా అనే పేరు పురాతన దస్తావేజులలో కనుగొనబడింది.[2]

చరిత్ర[మార్చు]

జిల్లాలోని దిహార్ ప్రాంతంలో మానవులు నివసించిన ఆరంభకాలాంనాటి ఆధారాలు లభించాయి. క్రీ.పూ.1000లో చాకోలిథిక్స్ ప్రజలు ద్వారకేశ్వర్ నది ఉత్తరతీరంలో ఆవాసాలు ఏర్పరచుకుని నివసించారు.[4] బంకురా జిల్లా ప్రోటో- ఆశ్ట్రలాయిడ్ , ప్రోటో- డ్రావిడియన్ తెగలకు నివాసంగా ఉండేది. తరువాత చరిత్రకు ముందు కాలంలో ఆర్యసంతతికి చెందిన ప్రజలు , ఉత్తర భారతంలో నివసించిన ప్రోటో- ఇండో - యురోపియన్ ప్రజలు ఇక్కడ నివసించడం ఆరంభించారు. తరువాత వారు యుద్ధాలు , సుహృద్భావ సంబంధాలతో బెంగాల్ ప్రాంతమంతా విస్తరించారు. పురాతన కాలంలో జిల్లాప్రాంతం రాహ్‌లో భాగంగా ఉండేది. ఐతరేయ అరణ్యక (క్రీ.పూ 7వ శతాబ్దం) లో ఈప్రాంతవాసులను అసురులు అని వ్యవహరించారు. 4వ శతాబ్ధానికి చెందిన " అకరంగ సూత్రా " అనే జైనగ్రంధంలో సుంహా రాజ్యం గురించిన ప్రస్తావన ఉంది. అందులో ఈప్రాంతంలో అనాగరిక , మృగప్రాయమైన ప్రజలు నివసించారని పేర్కొనబడి ఉంది.[5][6] 4వ శతాబ్ధానికి చెందిన ప్రాకృతం , సంస్కృతం భాషలలో ఉన్న సుసునియా శాసనాల ఆధారంగా సింహవర్మన్ కుమారుడు చంద్రవర్మన్ పుష్కరణప్రాంతానికి (జిల్లా లోని ఆధునిక పొఖన్న) పాలకునిగా ఉన్నాడు.[7] అలహాబాదు స్తంభం శాసనం ఆధారంగా చంద్రవర్మన్ సముద్రగుప్తుని చేత ఓడించబడ్డాడని భావిస్తున్నారు. తరువాత జిల్లాప్రాంతం గుప్తసామ్రాజ్యంలో భాగంగా మారింది.[8] ఈప్రాంతం చాలాసంవత్సరాల కాలం దండభుక్తి , బర్ధమాంభుక్తిలో భాగంగా ఉంది.[9] అనేకమంది చరిత్రకారుల అభిప్రాయంలో ప్రోటో- ఇండో- యురేపియన్లు ముందుగా ఉత్తర , తూర్పు బెంగాలులో ప్రవేశించి తరువాత పశ్చిమబెంగాలు ప్రాంతానికి విస్తరించారని భావిస్తున్నారు. తరువాత బెంగాలు ప్రాంతంలో జైనిజం , బుద్ధిజం విస్తరించింది. బెంగాలు పశ్చిమప్రాంతంలో 6వ శతాబ్దంలో ఆర్యులు నివసించిన ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి.[5]

బిష్ణుపూర్ రాజ్యం[మార్చు]

Dalmadal cannon at Bishnupur, commissioned by the Malla kings

7వ శతాబ్దం నుండి బ్రిటిష్ ప్రభుత్వపాలనలోకి మారేవరకు దాదాపు ఒక సహస్రాబ్ధి కాలం బంకురాజిల్లా ప్రాంతంలో బిష్ణుపూర్ రాజుల ఆవిభావం , పతనం సంభవించాయి.[10] బిష్ణుపూర్ ప్రాంతం మల్లాభూం అని పిలువబడింది. బిష్ణుపూర్ రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో రాజ్యం శాతంతల్ పరగణాలోని " దమిన్- ఐ- కోహ్ " నుండి మిడ్నాపోర్ జిల్లా , బర్ధామన్ , చోటా నాగపూర్ జిల్లాలలో కొంత భాగం వరకు విస్తరించి ఉండేది.ఆదిమ తెగలకు చెందిన ధాల్భుం, సమంతభుం , వరాహభూమి మొదలైన కురు రాజ్యాలను మల్లారాజులు తమకు సామంతరాజ్యాలుగా చేసుకున్నారు.[10] ఆది మల్లా (సా.శ. 695 జననం) మల్లారాజవంశాన్ని స్థాపించి లౌగ్రం (కొతుల్పూర్‌కు 8.4కి.మీ దూరంలో ఉంది) 33 సంవత్సరాల కాలం పాలించాడు. 15 సంవత్సరాల వయసులోనే ఈప్రాంతంలో ఆయనకు సమానమైన మల్లయోధుడు ఉండేవాడు కాదు. అందువలన ఆయన ఆదిమల్లాగా ప్రశంశించబడ్డడాడు. అతను బగ్దిరాజాగా పిలువబడ్డాడు. అతని తరువాత కుమారుడు జయమల్లా రాజ్యానికి వారసుడయ్యాడు. జయమల్లా రాజ్యవిస్తరణచేసి తనరాజధానిని బిష్ణుపూరుకు మార్చాడు. తరువాత వచ్చిన వారసులు కూడా గణనీయంగా రాజ్యవిస్తరణ చేసారు. వీరిలో కలు మల్లా, ఝౌమల్లా , సూర మల్లా కీర్తివంతులుగా రాజ్యపాలన చేసారు.

వైష్ణవం[మార్చు]

Jor Mandir complex (c. 1726), Bishnupur

49వ మల్లా పాలకుడు బిర్ హంబీర్ (సా.శ.పూ 1586) 17-17 శతాబ్దంలో పాలనసాగించాడు. ఆయన మొఘల్ చక్రవర్తి అక్బర్కు సమకాలీనుడు. ఆయన మొఘల్ చక్రవర్తి పక్షం వహించి ఆఫ్ఘన్లతో పోరాడినట్లు చరిత్రకారులు సూచించారు. ఆయన మొఘల్ చక్రవర్తికి సామంతరాజుగా బెంగాల్ మొఘల్ రాజప్రతినిధికి కప్పం చెల్లించాడు. ఆయన శ్రీనివాసాచే వైష్ణవునిగా మారి బిష్ణుపూర్‌లో " మదన మోహన "ను ఆరాధించాడు.[10] బీర్ హంబీర్ తరువాత ఆధికారం చేపట్టిన రఘునాథ్ సింగ్ బిష్ణుపూర్ రాజులలో మొదటిసారిగా క్షత్రియ బిరుదనామంగా సింగ్‌ను తనపేరుతో చేర్చుకున్నాడు. ఆయన తన పాలనా సమయంలో ఈప్రాంతంలో సుందరభవనాలు, ఆలయాలను నిర్మించాడు. అందువలన బిష్ణుపూర్ ప్రంపంచఖ్యాతి చెందిన నగరాలలో ఒకటిగా మారింది. ఇది భూలోక స్వర్గంగా అభివర్ణించబడింది. అయినప్పటికీ రాజకుటుంబీకులు హిందూ కళాత్మక నిర్మాణాలు, ఆలయనిర్మాణాల మీద ఆసక్తితో స్వతంత్రం కోల్పోయి సామంతరాజులుగా కుంచించుకు పోయారు. బీర్ సింగ్ తన 18 మంది కుమారులను సజీవంగా సమాధిచేసిన సమయంలో చిన్నకుమారుడైన దుర్జన్ సేవకులచేత రక్షించబడ్డాడు.[10]

మరాఠీ దాడులు[మార్చు]

Dalmadal Canon

17వ శతాబ్దం చివరిదశలో బిష్ణుపూర్ రాజాల పతనావస్థ ఆరంభమై 18వ శతాబ్దం సగంలో ముగింపుకు వచ్చింది. బర్ద్వాన్ మహారాజా ఫతేపూర్‌ను ఆక్రమించాడు. తరువాత బర్గిల్ మరాఠా దండయాత్రలో దేశంచిన్నభిన్నం అయింది. 1742లో భాస్కరావు నాయకత్వంలో మరాఠీలు బిష్ణుపూరు మీద దాడి చేసారు. భిష్ణుపూరు సైన్యం సాహసోపేతంగా పోరాడినప్పటికీ చివరకు గోపాల్ సింగ్ రక్షించమని రాజా మదన మోహనుని ప్రార్థించమని పౌరులను ఆదేశించాడు. మదనమోహనుడు ప్రతిస్పందించి మానవప్రయత్నం లేకుండా తమను రక్షిస్తాడని వారు విశ్వసించారు. మరాఠీసేనలు బలమైన కోటను ఛేదించలేక వెనుతిరిగాయి. కోటను స్వాధీనం చేసుకోలేని మరాఠీలు కోటను వదిలి రక్షణకొరవడిన ప్రాంతాలవైపు ముందుకు సాగారు. తరువాత కుట్ర, వ్యాజ్యాల కారణంగా బిష్ణుపూర్ రాజకుటుంబం పతనావస్థకు చేరుకుని 1806 నాటికి రాజాస్థాన భూములు బుద్వాన్ మహారాజుకు విక్రయించబడ్డాయి.[10]

బ్రిటిష్ పాలన[మార్చు]

1760లో బుర్ద్వాన్ చక్లాతో చేర్చి బిష్ణుపూర్ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాధీనం చేయబడింది. మరాఠీలు దేశాన్ని ధ్వంసం చేసిన తరువాత సంభవించిన బెంగాల్ కరువు (1770) బిష్ణుపూరు దేశాన్ని మరింత ఛిద్రం చేసింది. ప్రజలు అధిక సంఖ్యలో ఈ ప్రాంతం వదిలి వెళ్ళారు. వ్యవసాయం క్షీణించి చట్టవ్యవస్థ క్షీణించింది. ఒకప్పటి శక్తివంతమైన రాజ్యం కుచించుకుపోయి జమీదారీ స్థాయికి చేరింది. 1787లో బిష్ణుపూరు బర్ద్వానుతో సమైక్యమై ప్రత్యేక నిర్వహణా భూభాగంగా మారింది. రాజధాని సూరికి మార్చబడింది. తరువాత తిరుగుబాటు ఆరంభమైంది. బంకురా జిల్లా 1793 వరకు బిర్భుంతో చేర్చి ఒకే జిల్లాగా ఉండేది. తరువాత ఇది బుర్ద్వాల్ కలక్టరేటుకు మార్చబడింది.[10] 18వ శతాబ్దం చివరిదశలో జిల్లాలోని రాజ్పూర్ ప్రాంతంలో తిరుగుబాటు తలెత్తింది. ఆసమయంలో బంకురా జంగిల్ మహల్స్‌లో భాగంగా ఉండేది.1832లో చౌరాల అల్లర్ల కారణంగా జిల్లాపశ్చిమ ప్రాంతం జంగిల్ మహల్స్ నుండి విడదీయబడి 1833లో బుర్ద్వాన్‌లో చేర్చబడింది. 1832లో సోనాముఖి, ఇందాస్, కొతుల్పూర్, షేర్గర్, సెంపహరి పరగణాలు మంభుం నుండి బుర్ద్వాన్‌కు ఇవ్వబడ్డాయి. అవి పశ్చిమ బుర్ద్వాన్ అని పిలువబడి 1881లో బంకురా జిల్లాగా గుర్తించబడింది.[10]

స్వతంత్రం తరువాత[మార్చు]

జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[11]

భౌగోళికం[మార్చు]

బంకురా జిల్లా బుర్ద్వాన్ డివిషన్‌లో భాగంగా ఉంది. ఇది 22-38 నుండి 23-38 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86-36 నుండి 87-46 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 6882 చ.కి.మీ. జిల్లా ఉత్తర, ఈశాన్య సరిహద్దులో బర్ధామన్ జిల్లా (ఈజిల్లాలను దామోదర్ నది విడదీస్తూ ఉంది), ఆగ్నేయ సరిహద్దులో హుగ్లీ జిల్లా, దక్షిణ సరిహద్దులో పశ్చిమ మెదీనాపూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో పురూలియా జిల్లా ఉన్నాయి.[2][12][13] బంకురా జిల్లా భౌగోళికంగా తూర్పున గంగా మైదానం (బెంగాల్), పశ్చిమంలో చోటా నాగపూర్‌లను అనుసంధానిస్తూ ఉంది.జిల్లా తూర్పు, ఈశాన్యభాగంలో సారవంతమైన దిగువ భూములు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా వరిపండించడానికి అనుకూలంగా ఉంటుంది.పశ్చిమంలో భూమి క్రమంగా ఎత్తుగా ఉంటాయి.ఇక్కడ భూమి అసమానంగా ఉండి అక్కడక్కడా కొండలు దర్శనం ఇస్తుంటాయి.ఇక్కడ భూమి అరణ్యాలతో కప్పబడి ఉంటుంది.[2] జిల్లా పశ్చిమ భూభాగం సారహీనంగా ఉంటుంది. ఇక్కడ ఇరైన్ ఆక్సైడ్ మిశ్రితమైన మట్టి, ఇయాటరైట్ హార్డ్‌బెడ్ మిశ్రితమైన భూమిలో అక్కడక్కడా అరణ్యం (షోరియా రోబస్టా వృక్షాలు) ఉంటుంది. బృహత్తర ఖండితమైన గట్ల మద్య సమీపకాలంలో పోగైన సారవంతమైన మట్టి సీజనల్ పంటలకు అనుకూలంగా ఉంటుంది. తూర్పు భూభాగంలో వరిపొలాలు వర్షాకాలంలో పచ్చగానూ వేసవిలో ఎండిన భూములు కనిపిస్తూ ఉంటాయి.[2] జిల్లా ఉత్తరభూభాగం నుండి దక్షిణంలో దామోదర్ మద్య (మెజియా, బిహరీనాథ్ కొండల మద్య) గొండ్వానా విధానం ఉంది. సారవంతమైన మట్టితో కూడిన బెడ్స్ రాణిగంజ్ విధానంలో ఉంటుంది.[2]

కొండలు , నదులు[మార్చు]

Susunia hills

చోటా నాగపూర్ పీఠభూమిలో భాగంగా ఉన్న జిల్లాభూభాగం బిహరీనాథ్, సుసునియా పర్వతప్రాంతంలో అత్యంత ఎత్తైన భూభాగంగా గుర్తించబడుతుంది. ఇక్కడ భూమి సముద్రమట్టానికి 448 మీ నుండి 440 మీ మద్యలో ఉంటుంది.[2] నదులు జిల్లా ఈశాన్య భూభాగం నుండి నైరుతీ భూభాగం వైపు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ అధికంగా కొండ సెలయేర్లు పశ్చిమం నుండి ప్రవహిస్తున్నాయి. ఘనవర్షాల కారణంగా నదులలో వరదలు సంభవిస్తుంటాయి. వేసవిలో నదులలోని ఇసుకతిన్నెలు దాదాపు పొడిగా ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా దామోదర్, ద్వారకేశ్వర్, షిలబతి, కంగ్స్‌బతి, సాలి, గంధేశ్వరి, కుఖ్రా, బిరై, జయ్పండా, భైరబ్బంకీ నదులు ప్రవహిస్తున్నాయి.షిలబతీ నదీప్రవాహక ప్రాంతంలో హర్మస్రా సమీపంలో, కంగ్సబతి నదీప్రహక ప్రాంతంలోని రాయ్పూర్ (బంకురా) సమీపంలో సుందరమైన చిన్నచిన్న జలపాతాలు కనిపిస్తుంటాయి. [2] కంగ్స్‌బతి ప్రాజెక్ట్ పంచవర్షప్రణాళికగా మొదటి ప్రణాళిక (1956-1961) రెండవ ప్రణాళిక (1956-1961) చేపట్టబడింది. కంగ్స్‌బతి వంతెన పొడవు 10098మీ, ఎత్తు 38 మీ.[14]

వాతావరణం[మార్చు]

బెంగాల్ పశ్చిమ భూభాగంలో తూర్పు భూభాగం కంటే పొడిగా ఉంటుంది. మార్చి- జూన్ మద్య వేడి పశ్చిమవాయువులు వీస్తుంటాయి. ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షపాతం సంభవిస్తూ ఉంటుంది. సరాసరి వర్షపాతం 1400 మి.మీ. ఉంటుంది. శీతాకాలం ఆహ్లాదకరంగా ఉండి డిసెంబరు మాసానికి కనిష్ఠంగా 27 డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుంది.[2]

ఆర్ధికం[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బంకురా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[15] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[15]

విభాగాలు[మార్చు]

ఉపవిభాగాలు[మార్చు]

  • బంకురా జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: బంకురా సాదర్ ఉపవిభాగం, ఖత్రా ఉపవిభాగం, బిష్ణుపూర్ ఉపవిభాగం.
  • బంకురా పురపాలకం నుండి బంకురా (సాదర్) ఉపవిభాగం, 8 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: బంకురా-1, బంకురా-2, చాత్నా, గంగాజలఘటి, మెజియా, ఒండా, షల్తొరా.
  • ఖత్రా ఉపవిభాగం: ఇంద్పూర్, ఖత్రా, హిర్బంధ్, రాయ్పూర్, సరెంగ, రాణిబంధ్, సిమ్లాపాల్, తాందంగ్రా.
  • బిష్ణుపూర్ ఉపవిభాగం:- బిష్ణుపూర్, సోనాముఖి., 6 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు. (ఇండస్, జాయ్పూర్, పత్రాసయార్, కొతుల్పూర్, సోనాముఖి, బిష్ణుపూర్.[16] జిల్లాకు కేంద్రంగా బంకురా నగరం ఉంది. జిల్లాలో 21 పోలీస్ స్టేషన్లు, 22 డెవెలెప్మెంటు బ్లాకులు, 3 ముంసిపాలిటీలు, 190 గ్రామపంచాయితీలు, 5,187 గ్రామాలు ఉన్నాయి.

[16][17] పురపాలకప్రాంతం కాక ఒక్కొక ఉపవిభాగంలో కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు, గ్రామీణప్రాంతాలు,న్ పట్టణాలు ఉన్నాయి. మొత్తంగా 5 నగరప్రాంతాలు, 3 పురపాలకాలు 2 పట్టణాలు ఉన్నాయి.[17][18]

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

బంకురా జిల్లా 13 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది.[19]

  • తాల్దంగ్రా (విధాన సభ నియోజకవర్గం) (244)
  • రాయ్పూర్, బంకురా (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (245)
  • రాణిబంధ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (246)
  • ఇందుపూర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (247)
  • చాత్నా (విధాన సభ నియోజకవర్గం) (248)
  • గంగాజలఘతి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (249),
  • బర్జోరా (విధాన సభ నియోజకవర్గం) (250)
  • బంకురా (విధాన సభ నియోజకవర్గం) (251)
  • ఓండా (విధాన సభ నియోజకవర్గం) (252)
  • బిష్ణుపూర్, బంకురా (విధాన సభ నియోజకవర్గం) (253)
  • కతుల్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (254)
  • ఇండాస్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (255),
  • సోనాముఖి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (256).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు[మార్చు]

  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు:- రాయ్పూర్, రాణిబంధ్
  • ఇందుపూర్, గంగాజలఘటి, ఇండాస్, సోనాముఖి.
  • తాల్దంగ్రా, రాయ్పూర్, రాణిబంధ్, ఇంద్పూర్, విష్ణుపూర్, కొతుల్పూర్, ఇండాస్.
  • బంకురా పార్లమెంటు నియోజకవర్గం నుండి:- చాత్నా, బంకురా, ఒనిడా. పురూలియా జిల్లా నుండి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు.
  • పార్లమెంటు నియోజకవర్గం నుండి:- గంగాజలంఘతి, బర్జోరా, సోనాముఖి నియోజకవర్గాలు. బర్ధామన్ జిల్లా నుండి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజక వర్గాలు[మార్చు]

పశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం బంకురా జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 12 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది.[20]

  • సాల్టోరా (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (247)
  • చాత్నా (విధాన సభ నియోజకవర్గం) (248)
  • రాణిబంధ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (249),
  • రాయ్పూర్, బంకురా (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (250)
  • తాల్దంగ్రా (విధాన సభ నియోజకవర్గం) (251)
  • బంకురా (విధాన సభ నియోజకవర్గం) (252)
  • బర్జోరా (విధాన సభ నియోజకవర్గం) (253)
  • ఓండా (విధాన సభ నియోజకవర్గం) (254)
  • బిష్ణుపూర్, బంకురా (విధాన సభ నియోజకవర్గం) (255)
  • కతుల్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (256)
  • ఇండస్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (257) ,
  • సోనాముఖి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (258).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు[మార్చు]

  • షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు:- .రాయ్పూర్ , రాణిబంధ్.సల్తోరా, కతుల్పూర్, ఇండాస్ , సోనాముఖి.
  • బంకురా పార్లమెంటరీ నియోజకవర్గం:- సల్తోరా, చాత్నా, రాణిబంధ్, రాయ్పూర్, తాల్దంగ్రా , బంకురా. జిల్లా నుండి 1 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి అసెంబ్లీ నియోజక వర్గాలు.
  • బిష్ణుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం:- బర్జోరా, ఒండ, బిష్ణుపూర్, కతుల్పూర్, ఇండాస్ , సోనాముఖి. బర్ధామన్ జిల్లా నుండి 1 అసెంబ్లీ నియోజకవర్గాలతో చేర్చి.అసెంబ్లీ నియోజకవర్గాలు.

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,596,292,[21]
ఇది దాదాపు. లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[22]
కనెక్టికట్ అమెరికాలోని.[23] నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 80వ స్థానంలో ఉంది.[21]
1చ.కి.మీ జనసాంద్రత. 523 [21]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.64%.[21]
స్త్రీ పురుష నిష్పత్తి. 954:1000 [21]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.95%.[21]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
అనుసరించి - జనసంఖ్య 3,191,822
నగరీకరణ శాతం
ఇందులో పురుషుల సంఖ్య 1,634,561
స్త్రీలసంఖ్య 1,557,261
1991-2001 మద్య జసంఖ్య వృద్ధి 13.79%
1991-2001 మద్య పశ్చిమ బెంగాల్ జసంఖ్య వృద్ధి 17.84%
నగరప్రాంత జనసంఖ్య 235,264
గ్రామప్రాంత జనసంఖ్య 2,956,558.
జనసాంధ్రత (1 చ.కి.మి) 464 [13]
షెడ్యూల్డ్ కులాలసంఖ్య 1,040,297
షెడ్యూల్డ్ తెగల సంఖ్య 335,047.[24]
మొదటి గంణాంకాలు 1872 (జనసంఖ్య 968,597)
బెంగాలి మాట్లడేవారి శాతం 90.7 %
హిదువుల శాతం 87.4 %
ముస్లిముల శాతం 5.6%
అనిమిస్టుల శాతం 8% .[25] Bankura has a literacy rate of 63.84 per cent.[26]

సంస్కృతి[మార్చు]

పర్యాటకప్రదేశాలు[మార్చు]

బంకురా జిల్లాకు బంకురా పట్టణం కేంద్రంగా ఉంది. బంకురా జిల్లాలోని ఉపవిభాగ పట్టణాలలో బిష్ణుపూర్ ఒకటి. ఒకప్పుడు బెంగాలుకు చెందిన ప్రముఖరాజ్యాలలో ఒకటైన మల్లభం రాజ్యానికి ఈ ప్రాంతం రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ పట్టణం ప్రాతీయంగా లభిస్తున్న ఎర్రమట్టితో చేయబడిన టెర్రకోటా ఆలయాలకు ప్రసిద్ధి. ఈ నగరం తరచుగా " బెంగాల్ ఆలయాల నగరం" అని పిలువబడుతుంది. జిల్లాలో సుసునియా కొండలు, బిహర్నినాథ్ కొండలు ఉన్నాయి. ముకుత్మొనిపూర్ ఆనకట్ట, సుతాన్ మొదలైనవి పర్యాటక ఆకర్ణష్ణలుగా గుర్తింపు పొందాయి. జిల్లాలోని గౌరీపూర్ వద్ద ఉన్న " గౌరిపూర్ లెరోసీ హాస్పిటల్ " ఆసియాలోనే అతిపెద్ద లెప్రసీ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. జిల్లాలో ఒకేఒక విద్యుదుత్పత్తి కేంద్రం ( " మెజియా విద్యుదుత్పత్తి కేంద్రం " ) ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో దారకేశ్వర్, గాందృశ్వరి, కంసబతి నదులు ముఖ్యమైనవి. జిల్లాలోని జయపూర్ అరణ్యం దక్షిణబెంగాల్‌లోని ఒకేఒక అరణ్యంగా గుర్తింపుపొందింది. జిల్లాలో ఉన్న " బంకురా సమ్మిలానీ మెడికల్ కాలేజి " ఆసియాలోనే పురాతనమైనదిగా గుర్తినబడుతుంది.

వృక్షసంపద , జంతుసంపద[మార్చు]

జిల్లా తూర్పు భూభాగం పశ్చిమ బెంగాల్ వరిపంట మైదానాలలో భాగంగా ఉంది. వరిపంట పండించబడుతున్న భూములలో గంగానది చిత్తడి భూములలో ఉండే కలుపు మొక్కలు ఉంటాయి. నీటి మడుగుల, గుంటలలో నీటి మొక్కలు, నీటి కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మానవనివాసాలుండే ప్రాంతాలలో గ్లైకోస్మిస్, పొల్యాల్థియా, క్లెరోడెనారెన్ ఇంఫాచ్యునేటం, సోలనం, టర్వుం, అదే ప్రజాతికి చెందిన పలు ఇతర జాతి మొక్కలున్నాయి. ట్రెమా, స్టిబ్లస్, ఫికస్ హిస్పిడ జాతి మొక్కలు కూడా ఉన్నాయి. పెద్దచెట్లలలో సాక్రెడ్ ఫిగ్ల్పపల్, మర్రి, రెడ్‌కాటన్ చెట్టు, బాంబాక్స్ మలబారికం, మామిడి, జియల్, ఫోనిక్స్ డాక్టిలిఫెరా, బొరాసస్ ఫ్లాబెల్లిఫర్ వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతంలో జత్రోఫల్, ఉరెనా, హెలీయోట్రోపియం, సిబ మొదలైనవి ఉన్నాయి. అరణ్యాలు (స్క్రబ్ జంగిల్) లో వెండ్లెండియా ఎక్సెర్టా, జ్మెలినార్బొరియా, హల్దినా, హోలర్హెన యాంటీడిసెంట్రియా, విటెక్స్ నెగుండో, కదంబ మొదలైన చెట్లు ఉన్నాయి.[27] జిల్లా పశ్చిమ భూభాగం ఎగువన ఉంటుంది. ఒకవేళ ఖాళీగా లేకున్న జిజిఫస్ స్క్రబ్ జంగిల్, ఇతర థార్నీ స్క్రబ్స్ ఉన్నాయి. ఈ త్రోనీ అరణ్యాలు క్రమంగా సాల్ అరణ్యంలో కలుస్తూ ఉంది. దిగువ కొండలలో మిల్లియుస, స్క్లెయిచెర, డియోస్ఫిరస్ వంటి చెట్లు ఉన్నాయి.[27]

ఆర్ధికవనరుగా ఉపకరించగలిగిన చెట్లు: అల్కుషి, అమల్తాస్, అసన్, బాబుల్, బైర్, బీల్, బాగ్ బెరెండ, బిచుటి, బహెర, ధతుర, ధమన్, గాబ్, హర్రా, చింత, కుచిల, మహియా, పలాస, సజిన, కెండ్, మామిడి, ఖర్జూరం, వేప, మర్రి, పాపల్, రెడ్ కటన్, జియాల్ ప్రధానమైనవి.[27]

మూలాలు[మార్చు]

  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 O’Malley, L.S.S., ICS, Bankura, Bengal District Gazetteers, pp. 1-20, first published 1908, 1995 reprint, Government of West Bengal
  3. "Wecome to Historical Details of Bankura". Origin of Name. www.bankura,org. Retrieved 2009-07-11.
  4. Das, Dipak Ranjan. "Dihar". Banglapedia. Asiatic Society of Bangladesh. Retrieved 2009-07-12.
  5. 5.0 5.1 Ghosh, Binoy, Paschim Banger Sanskriti, (in Bengali), part I, 1976 edition, pp. 60-62, pp. 328-331, Prakash Bhaban
  6. Ray, Nihar Ranjan, Bangalir Itihas Adi Parba, (in Bengali), 1980 edition, pp. 276-281, Paschim Banga Niraksharata Durikaran Samiti
  7. Majumdar, R.C., History of Ancient Bengal, pp. 32, 444, Tulshi Prakashani.
  8. Sengupta, Nitish, History of the Bengali-speaking People, p.21, UBS Publishers’ Distributors Pvt. Ltd.
  9. Ghosh, Binoy, Paschim Banger Sanskriti, (in Bengali), part I, 1976 edition, pp. 82-86, Prakash Bhaban
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 O’Malley, L.S.S., ICS, Bankura, Bengal District Gazetteers, pp. 21-46, 1995 reprint, Government of West Bengal
  11. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  12. "Bankura, West Bengal". Location and extent. District administration. Archived from the original on 2011-09-26. Retrieved 2009-07-11.
  13. 13.0 13.1 "Provisional population totals, West Bengal, Table 4, Bankura District". Census of India 2001. Census Commission of India. Retrieved 2009-07-12.
  14. "Sankhipta Bharatkosh". abasar.net. Archived from the original on 2007-09-27. Retrieved 2009-06-15.
  15. 15.0 15.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  16. 16.0 16.1 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-12-06.
  17. 17.0 17.1 "Administrative Features". Official website of Bankura district. Archived from the original on 2008-07-25. Retrieved 2008-12-06.
  18. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". Bankura. Directorate of census operations, West Bengal. Archived from the original on 2011-07-21. Retrieved 2008-12-06.
  19. "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2008-11-14.
  20. "Delimitation Commission Order No. 18" (PDF). Table B – Extent of Parliamentary Constituencies. Government of West Bengal. Archived from the original (PDF) on 2010-09-18. Retrieved 2009-05-27.
  21. 21.0 21.1 21.2 21.3 21.4 21.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  22. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lithuania 3,535,547 July 2011 est.
  23. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097
  24. "TRU for all Districts (SC & ST and Total)". Census 2001. Census Commission of India. Retrieved 2009-07-12.
  25. O’Malley, L.S.S., pp. 48-52
  26. "District Industrial Potential Report of Bankura (2003-04)". Archived from the original on 2011-07-21. Retrieved 2010-07-21.
  27. 27.0 27.1 27.2 O’Malley, L.S.S., pp. 12-15

బయటి లింకులు[మార్చు]

  • Bankura travel guide from Wikivoyage