Coordinates: 31°58′05″N 76°12′25″E / 31.968°N 76.207°E / 31.968; 76.207

బంఖండి బగలముఖి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంఖండి బగలముఖి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:హిమాచల్ ప్రదేశ్
ప్రదేశం:బంఖండి
భౌగోళికాంశాలు:31°58′05″N 76°12′25″E / 31.968°N 76.207°E / 31.968; 76.207
వెబ్‌సైటు:https://mabaglamukhi.org

బంఖండి బగలముఖి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న హిందూ దేవాలయం.[1] ఉత్తర భారతంలో ఈ దేవతని పీతాంబర అని కూడా పిలుస్తారు. అత్యంత ప్రసిద్ధ, శక్తివంతమైన శక్తిపీఠమిది. వివిధ ఆభరణాలతో అలంకరించబడిన స్తంభాలతో కూడిన బంగారు సింహాసనంపై ఇక్కడి దేవత ఆసీనులై ఉంటుంది. మూడు కళ్ళు కలిగి ఉన్న దేవత, భక్తులకు అంతిమ జ్ఞానాన్ని అందించగలదని భక్తుల నమ్మకం.[2]

చరిత్ర[మార్చు]

నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని చారిత్రాత్మక బగలముఖి పుణ్యక్షేత్రాల మూడింటిలో ఇది ఒకటి.[3] 1815లో ఈ దేవాలయం పునరుద్ధరించబడింది. ఇక్కడి దేవతని పూజించడానికి, దివ్య ఆశీర్వాదం పొందడానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటారు. బగలముఖికి పసుపురంగుకి మధ్యనున్న అనుబంధాన్ని తెలియజేసేలా ఈ దేవాలయం పసుపు రంగులో పెయింట్ చేయబడింది. భక్తులు పసుపు రంగు దుస్తులు ధరిస్తారు, దేవతకు సమర్పించే నైవేధ్యం కూడా కూడా పసుపు రంగులో ఉంటాయి.[4]

ఆర్కిటెక్చర్[మార్చు]

ఈ దేవాలయంలో పార్వతి, లక్ష్మి, సరస్వతి కొలువై ఉన్నారు. కృష్ణుడు, హనుమంతుడు, భైరవుని విగ్రహాలు కూడా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Kinsley, David R. (1998). Tantric Visions of the Divine Feminine: The Ten Mahāvidyās (in ఇంగ్లీష్). Motilal Banarsidass Publ. p. 193. ISBN 978-81-208-1522-3.
  2. "Mata Bajreshwari Temple Kangra". matabajreshwari.com. Archived from the original on 2022-09-27. Retrieved 2022-09-27.
  3. Saluja, Kuldeep (13 March 2021). Impact of Vaastu on Nations, Religious & Historical Places (in ఇంగ్లీష్). Diamond Pocket Books Pvt Ltd. p. 181. ISBN 978-93-90504-86-2.
  4. "Baglamukhi Temple in Bankhandi, Kangra HP, India all Information". Most Trusted Portal devoted to Maa Baglamukhi. 2017-12-26. Archived from the original on 2022-01-21. Retrieved 2022-09-27.