బంగారద మనుష్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారద మనుష్య
దర్శకత్వంసిద్ధలింగయ్య
స్క్రీన్ ప్లేసిద్ధలింగయ్య
కథటి.కె.రామారావు
నిర్మాతగోపాల్ లక్ష్మణ్
తారాగణం
ఛాయాగ్రహణండి.వి.రాజారాం
కూర్పుపి.భక్తవత్సలం
సంగీతంజి.కె.వెంకటేష్
నిర్మాణ
సంస్థ
కంఠీరవ స్టూడియోస్
విడుదల తేదీ
31 మార్చి 1972
సినిమా నిడివి
174 నిమిషాలు
దేశంభారతదేశం
భాష
బడ్జెట్2.5 లక్షలు

బంగారద మనుష్య(కన్నడ: ಬಂಗಾರದ ಮನುಷ್ಯ ) (తెలుగు అర్థం బంగారం లాంటి మనిషి) సిద్ధలింగయ్య దర్శకత్వంలో కన్నడ కంఠీరవగా పేరొందిన రాజ్ కుమార్ నటించిన 1972 నాటి కన్నడ చలనచిత్రం. శ్రీనిధి పతాకంపై కంఠీరవ స్టూడియో నిర్మాణంలో ఆర్. లక్ష్మణ్ గోపాల్ నిర్మించారు. చిత్రంలో నాయకా నాయికలుగా రాజ్ కుమార్, భారతి పాత్రలు పోషించారు. టి. కె. రామారావు రాసిన నవలను ఆధారం చేసుకుని చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కన్నడ నాట సంచలనాత్మకమైన విజయం సాధించింది. స్టేట్స్ థియేటర్, బెంగుళూరులో రెండేళ్ళకు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైంది.[1] వాటిలో దాదాపు 500 రోజులపాటు హౌస్ ఫుల్ షోలే కావడం విశేషం.

నగరంలో ఉన్నత విద్యావంతుడైన యువకుడు పల్లెటూరికి తిరిగివచ్చి వ్యవసాయం చేయడం, అందులోని కష్టనష్టాలను ఎదిరించడం ఇందులోని ప్రధాన ఇతివృత్తం. అప్పటివరకూ పట్టణంలో రొమాంటిక్ హీరో పాత్రలు చేస్తూ తారాపథాన్ని అందుకున్న రాజ్ కుమార్ హఠాత్తుగా పల్లెటూరికి తిరిగివచ్చే యువకుడి పాత్ర చేయడం వినూత్నం, సాహసం అని విమర్శకులు పేర్కొంటున్నారు. రాజ్ కుమార్ చేసిన ఈ ప్రయత్నాన్ని మొదట విమర్శకులు, సినీ వర్గాల వారు విమర్శించారు, కానీ సినిమా వారి అంచనాలను తారుమారుచేస్తూ కన్నడ సినిమా చరిత్రలో, రాజ్ కుమార్ కెరీర్ లో మైలురాయిగా నిలిచే విజయం సాధించింది. ఏప్రిల్ 2013లో భారతీయ సినిమా శతజయంతి సందర్భంగా ఫోర్బ్స్ భారతీయ సినిమాలో 25 అతిగొప్ప నటన ప్రదర్శనలు అంటూ వేసిన జాబితాలో బంగారద మనుష్యలో రాజ్ కుమార్ నటన కూడా చోటుచేసుకుంది.[2]

ఈ చిత్రం సామాజికంగా కూడా చాలా ప్రభావం చూపించింది. సినిమా ప్రభావంతో కన్నడనాట పలువురు ఉన్నత విద్యావంతులు పట్టభద్రులై పల్లెటూర్లకు తిరిగివచ్చి వ్యవసాయం చేపట్టారు. సామాజిక సంచలనానికి కూడా సినిమా కారణం కావడం విశేషం. ఇప్పటికీ పలు ఎస్టేట్లకు బంగారద మనుష్య అని పేరుపెట్టుకోవడం ప్రాచుర్యంగా కనిపిస్తూంటుంది.

ఇతివృత్తం

[మార్చు]

నగరంలో పట్టభద్రుడైన రాజీవ (రాజ్ కుమార్) చదువు తర్వాత తన పల్లెటూరుకు తిరిగివస్తారు. పల్లెటూరుకు రాగానే తనను, అన్నగారిని తల్లిదండ్రులు మరణిస్తే చదివించిన బావగారి శవం కనిపిస్తుంది. తమ చదవులకే కాక దానధర్మాలకు ఎంతో ఖర్చుచేసిన బావ చదువుకుంటున్న కొడుకులిద్దరి బాధ్యత అక్క శారదమ్మపై వదిలి మరణించారు. ఆదుకోవాల్సిన బాధ్యత, నెలకు రూ.900 వచ్చే ఉద్యోగం కల అన్నయ్య తన భార్య ఛాయ మాటలు జవదాటలేక అక్కను, మేనల్లుళ్ళనీ వదిలిపెట్టి నగరానికి వెళ్ళిపోతారు. ఆయన నగరంలో బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తూంటారు. ఐతే రాజీవ మాత్రం బావకున్న రెండున్నర ఎకరాల పొలాన్ని సాగుచేస్తూ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసైన మేనల్లుళ్ళను పై చదువులు చదివించాలని నిర్ణయించుకుంటారు.
రాచుతప్ప (బాలకృష్ణ) గ్రామంలో సహృదయుడైన వడ్డీ వ్యాపారి. ఆయనకు పేద రైతులు తమ స్థితిగతులు మెరుగుపరుచుకోకుండా ఎప్పుడుపడితే అప్పుడు బెంగళూరు వెళ్ళి హోటల్లో తిని, సినిమా చూసి జల్సాలు చేస్తూ దెబ్బతింటున్నారని ఆవేదన, ఆగ్రహం ఉంటాయి. అతని కుమారుడు నగరంలో ఇచ్చిన డబ్బు జల్సా చేస్తూ సక్రమంగా చదువుకోకుండా తిరుగుతూంటారు. దీంతో ఆయనకు ఇటు నిజాయితీగా, శ్రమను నమ్ముకుని పనిచేసే వ్యవసాయదారులన్నా, అటు బాధ్యతగా చదువుకుంటున్న యువకులన్నా గౌరవం.

మూలాలు

[మార్చు]
  1. "Bangarada Manushya 1972". The Hindu. 23 August 2008. Retrieved 2 November 2013.
  2. Prasad, Shishir; Ramnath, N. S.; Mitter, Sohini (27 April 2013). "25 Greatest Acting Performances of Indian Cinema". Forbes. Archived from the original on 12 జనవరి 2016. Retrieved 27 January 2015.