బంగారు బాబు (2009 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు బాబు
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం జొన్నలగడ్డ శ్రీనివాసరావు
నిర్మాణం కె. రామకృష్ణ ప్రసాద్
కథ దాసరి నారాయణరావు
చిత్రానువాదం దాసరి నారాయణరావు
తారాగణం జగపతి బాబు
మీరా జాస్మిన్
హేమ
జయసుధ
జ్యోతిలక్ష్మి
మాగంటి మురళీమోహన్, సుధ
గౌరీ ముంజాల్[1]
సంగీతం ఎం.ఎం.శ్రీలేఖ
సంభాషణలు మరుధూరి రాజా
ఛాయాగ్రహణం సిహెచ్. రమణరాజు
కూర్పు బి. కృష్ణం రాజు
నిర్మాణ సంస్థ సౌభాగ్య మీడియా లిమిటెడ్
విడుదల తేదీ 1 మే 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బంగారు బాబు 2009 లో వచ్చిన సినిమా. సౌభాగ్య మీడియా లిమిటెడ్ బ్యానర్‌లో, దాసరి నారాయణరావు కథ, చిత్రానువాదంతో జోన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వంలో కె.రామకృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. జగపతి బాబు, మీరా జాస్మిన్, శశాంక్, గౌరీ ముంజాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం శ్రీలేఖా సంగీతం అందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలను జమ్మూ కాశ్మీర్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రం కన్నడ చిత్రం రిషి (2005) కి రీమేక్.

కథ[మార్చు]

హరి ( శశాంక్ ) విపరీతమైన కోపోద్రేకాలున్న వ్యక్తి. అతను తన తండ్రిని ఎప్పుడూ చూడలేదు, పెళ్ళికాకుండానే తల్లైన అతడి తల్లి కొన్ని సంవత్సరాల తరువాత మరణించింది. ఇప్పుడు హరి గంజాయి పీల్చడం, లెక్చరర్లను కొట్టడం లాంటి పనులు చేస్తూ తిరుగుతున్నాడు. అతని కళాశాల అతన్ని బహిష్కరించాలని అనుకుంది, కాని బోర్డు ఛైర్మన్ రవీంద్ర ( జగపతి బాబు ) అలాఅందుకు తిరస్కరించాడు. అతను హరిని సంస్కరించాలని, అతన్ని కళాశాలలో అగ్రస్థానంలో ఉంచాలనీ కోరుకుంటాడు. ఒక డి అడిక్షన్ కేంద్రంలో ఒక సెషన్లో హరి దురుసుగా ప్రవర్తిస్తాడు. కాని రవి అనునయిస్తాడు. ఇంతలో, ఒక నిశ్శబ్ద రొమాంటిక్ ట్రాక్లో, రవి మీరా ( మీరా జాస్మిన్ ) ను ప్రేమిస్తాడు. హరి కోసం సమయం వెచ్చిస్తూ, రవి తనకు దూరంగా ఉంటున్నడని మీరా అంటూంటుంది. హరితో ఉండటం కోసం, రవి తన నిశ్చితార్థానికి కూడా రాలేక పోయినపుడు ఇక మీరా తట్టుకోలేకపోతుంది. అతడి ప్రవర్తన పట్ల రవి కుటుంబం కూడా విమర్శించింది. కొన్ని డజన్ల కంపెనీల ఛైర్మన్ అయిన అతను ఒక అప్రయోజకుడికి దగ్గరవడం వాళ్ళకు ఇష్టం లేదు. హరి తన నటనా నైపుణ్యంతో రవిని మోసగిస్తున్నాడని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు రవి అసలు రహస్యాన్ని అందరికీ చెప్పవలసి వస్తుంది - హరి తండ్రి మరెవరో కాదు, మరణించిన రవి తండ్రే. మరణిస్తున్న పెద్దమనిషి (మురళీ మోహన్) రవికి ఇచ్చిన విసిడిలో చాలా రహస్యాలు వెల్లడించాడు. ఈ సమయంలో అతని తల్లి ( జయసుధ ) మూర్ఛపోతుంది. ఆమె భర్త దీన్ని ఎలా చేయగలిగాడు? తన భర్త చేసిన తప్పుకు మూల్యం చెల్లించడంలో రవితో కలవడం తప్ప తాను ఏమీ చేయలేనని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె, రవి, ఆమె కుమార్తె ( హేమ ) 'ఆ' కుటుంబానికి వారు చేయగలిగిన సహాయం అన్ని విధాలుగా చేయడానికి అందరూ బయలుదేరుతారు. కానీ రవి అన్నయ్య రాజేంద్ర ( సోను సూద్ ) ఇంకా తన తల్లికి జరిగిన అన్యాయం పట్ల కోపంగానే ఉన్నాడు. రవి ఈ వ్యవహారాన్ని ఎలా సమర్ధించుకు వస్తాడు అనేది మిగతా కథ.[2]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."గులాబీ పువ్వు"చంద్రబోస్టిప్పు, ఎం.ఎం.శ్రీలేఖ3:54
2."నింగి లోని"చిన్నిచరణ్హరిహరన్, నిత్య సంతోషిణి4:34
3."ఘల్లు ఘల్లు ఘల్లు"చంద్రబోస్సైరోనా4:43
4."పదహారవ ఏట"చిన్నిచరణ్శంకర్ మహదేవన్, చిత్ర4:00
5."సన్నని నడుముకి"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,ఎం.ఎం.శ్రీలేఖ4:12
6."దేవుడే నవ్వేడురే"సుద్దాల అశోక్ తేజవందేమాతరం శ్రీనివాస్3:48
మొత్తం నిడివి:25:11

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  2. "Official Title". fullhyd.