బంగారు మనిషి
బంగారు మనిషి (1976 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
నిర్మాణం | పి.పేర్రాజు |
తారాగణం | నందమూరి తారక రామారావు, లక్ష్మి, హేమాచౌదరి |
సంగీతం | కె. వి. మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
గీతరచన | కొసరాజు రాఘవయ్య, సి.నారాయణరెడ్డి, దాశరథి |
నిర్మాణ సంస్థ | త్రివేణి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
బంగారు మనిషి 1976 లో ఎ. భీమ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా[1]. ఇందులో ఎన్. టి. రామారావు, లక్ష్మి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా 1976, ఆగష్టు 25న విడుదలయ్యింది. ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి పి.పేర్రాజు నిర్మాత.
కథ[మార్చు]
కలెక్టర్ ఆఫీసులో బంట్రోతు రంగన్న కొడుకు వేణు. అవినీతికి పాల్పడి అక్రమ వ్యాపారాలు చేస్తూ సంపన్నుడైన భానోజీరావు కొడుకు ప్రసాద్. మరో కలవారి బిడ్డ గీత. వీరు ముగ్గురూ క్లాస్‌మేట్స్. వేణు పెద్ద చదువులు చదివి తండ్రి బంట్రోతుగా ఉన్నచోటనే కలెక్టరుగా వస్తాడు. గీత కుటుంబం పరిస్థితుల వల్ల తారుమారై కలెక్టరాఫీసులోనే టైపిస్టుగా చేరుతుంది. ప్రసాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అవుతాడు. ప్రేమించి పెళ్ళాడాలనుకున్న వేణు, గీత పరిస్థితుల ప్రభావం వల్ల దూరమౌతారు. అయినా బంగారం లాంటి మనిషి వేణు అవరోధాలను అధిగమించి భానోజీరావు అక్రమాలను, అవినీతిని ఎలా నిర్మూలించిందీ, గీతను ఎలా తనదాన్ని చేసుకుందీ, తండ్రిని ఖాతరు చేయకుండా ప్రసాద్ స్నేహితుడికి ఎలా తోడ్పడిందీ చిత్రంలో చూపారు[2].
సాంకేతికవర్గం[మార్చు]
- కథ: త్రివేణి యూనిట్
- మాటలు: గొల్లపూడి మారుతీరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
- సంగీతం: కె.వి.మహదేవన్
- నృత్యం: వెంపటి సత్యం
- ఛాయాగ్రహణం: విఠల్ రావు
- కళ: సూరన్న
- కూర్పు:పాల్ దురై సింగం
- దర్శకుడు: ఎ.భీమ్‌సింగ్
- నిర్మాత: పి.పేర్రాజు
నటీనటులు[మార్చు]
- నందమూరి తారక రామారావు - వేణు
- లక్ష్మి - గీత
- హేమాచౌదరి - పద్మ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - వేణు తండ్రి
- శ్రీధర్
- శరత్ బాబు
- నిర్మలమ్మ
- అల్లు రామలింగయ్య
- రావు గోపాలరావు
- ప్రభాకర రెడ్డి - పద్మ తండ్రి
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి - గీత తండ్రి
- గిరిజ
- రమాప్రభ - సిటీ బస్ ఆపరేటర్
- పండరీబాయి - వేణు తల్లి
- కె.వి.చలం
- ముక్కామల కృష్ణమూర్తి
- సుకుమారి
- జయమాలిని
- విజయవాణి
- జయవిజయ
- జగ్గారావు
- ప్రయాగ శాస్త్రి
- మోదుకూరి సత్యం
- వై.ఎన్.ఇంద్ర
- పి.జె.శర్మ
- ఎ.ఎల్.నారాయణ
- పొట్టి ప్రసాద్
- హనుమంతాచారి
- వీరభద్రరావు
- చలపతిరావు
- ప్రదీప్ కుమార్
- చంద్ర రాజు
- ఎన్.వి.పి.శాస్త్రి
- జి.ఎన్.స్వామి
- శ్యాం బాబు
- మాస్టర్ రమేష్
పాటలు[మార్చు]
- ఇది మరోలోకం ఇది అదో మైకం తెల్లని చీకటి - ఎస్.జానకి - రచన: కొసరాజు రాఘవయ్య
- నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత ఎక్కడి కెళుతుందీ దేశం ఏమైపోతుంది హిమశైల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- కలగన్నాను ఏదో కలగన్నాను నే కలగన్నాను బ్రతుకే - పి.సుశీల - రచన: దాశరథి
- నిండుకుండ తొణకనే తొణకదు అది తొణికినా తడపకుండా - పి.సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి
- మేలుకో వేణుగోపాలా నన్నేలుకో
- సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా సూటిగా సొర్గాన్ని చూపిస్తారా - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు రాఘవయ్య
మూలాలు[మార్చు]
- ↑ "బంగారు మనిషి". Archived from the original on 2020-01-05. Retrieved 2020-04-04.
- ↑ రెంటాల (5 September 1976). "చిత్రసమీక్ష - బంగారు మనిషి". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 5 April 2020.[permanent dead link]
- All articles with dead external links
- Articles with dead external links from జూన్ 2020
- Articles with permanently dead external links
- 1976 తెలుగు సినిమాలు
- ఎన్టీఆర్ సినిమాలు
- రావు గోపాలరావు నటించిన చిత్రాలు
- గుమ్మడి నటించిన చిత్రాలు
- అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన చిత్రాలు
- రమాప్రభ నటించిన చిత్రాలు
- శరత్ బాబు నటించిన చిత్రాలు
- లక్ష్మి నటించిన చిత్రాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు