బంగాళాదుంప చిప్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Potato chip
Potato-Chips.jpg
Potato chips
మూలము
మూలస్థానంSaratoga Springs, New York, United States
వంటకం వివరాలు
వడ్డించే విధానంSnack, side dish
వడ్డించే ఉష్ణోగ్రతRoom temperature

బంగాళాదుంప చిప్స్ (అమెరికన్, ఆస్ట్రేలియన్, దక్షిణ న్యూజిలాండ్, కెనడియన్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికన్, హవాయియన్ ఇంగ్లీష్, భారతీయ ఇంగ్లీష్ మరియు జమైకన్ ఇంగ్లీష్ మరియు చాలావరకూ యూరోపియన్ భాషలలో చిప్స్ అని; బ్రిటిష్ మరియు ఐరిష్ ఇంగ్లీష్ భాషలలో క్రిస్ప్స్ అని, ఉత్తర న్యూజిలాండ్‌లో చిప్పీస్ అని పిలువబడేవి) అనేవి నూనెలో వేయించిన సన్నని బంగాళాదుంప ముక్కలు. బంగాళాదుంప చిప్స్ సామాన్యంగా అప్పెటైజర్ (ఆకలి కలిగించే పదార్థం), సైడ్ డిష్, లేదా స్నాక్ రూపంలో వడ్డిస్తారు. ప్రాథమికమైన చిప్స్ వండి సాల్టెడ్; అదనపు రకాలను రుచులు (తరచూ ఉప్పు మరియు వినెగర్, చీజ్ అండ్ ఆనియన్, BBQ సాస్ లేదా ఉప్పు) మరియు రుచికరమైన పదార్థాలు, మూలికలు, మసాలాదినుసులు, చీజ్‍లు, మరియు కృత్రిమ పదార్థాలు కలిపి తయారు చేస్తారు . కానీ, క్రిస్ప్స్ అనేవి UK మరియు ఐర్లాండ్‍లలో వివిధరకాల స్నాక్ ఉత్పత్తులను సూచిస్తాయి, వీటిలో కొన్ని బంగాళాదుంపతో తయారైనప్పటికీ, కొన్ని ధాన్యం, మొక్కజొన్న మరియు టపియోకాలతో సైతం తయారు కావచ్చు. ఇటువంటి రకాల క్రిస్ప్స్ యొక్క ఉదాహరణ మాన్స్టర్ మంచ్.[1] ఉత్తర అమెరికాలో క్రిస్ప్స్ అనేవి పునర్నిర్మించిన, పొడి బంగాళాదుంప ముక్కలు మరియు ఇతర పదార్థాలతో తయారయిన బంగాళాదుంప స్నాక్స్‌ను సూచిస్తాయి,[ఉల్లేఖన అవసరం] ఉదాహరణకు "పొడిగా వేయించిన లేస్" మరియు ప్రింగిల్స్, వాస్తవానికి ప్రింగిల్స్ అనేవి సాంకేతికంగా నూనెలో "త్వరితంగా-వేయించినవి".

ఆంగ్లం-మాట్లాడే దేశాలు మరియు ఎన్నో ఇతర పశ్చిమ దేశాలలో బంగాళాదుంప చిప్స్ అనేవి స్నాక్ ఫుడ్ మార్కెట్లో ప్రధానమైన భాగంగా ఉన్నాయి. ప్రపంచం మొత్తమ్మీద బంగాళాదుంప చిప్ మార్కెట్ సాధించిన మొత్తం ఆదాయం 2005లో US$16.4 బిలియన్ ఇది ఆ సంవత్సరంలో మొత్తం రుచికరమైన స్నాక్స్ మార్కెట్ ఆదాయం (US$46.1 బిలియన్) లో 35.5%.[2]

చరిత్ర[మార్చు]

ఒక సంప్రదాయ కథ ప్రకారం, అసలైన బంగాళాదుంప చిప్ తయారీ పద్ధతిని సరటోగా స్ప్రింగ్స్, న్యూ యార్క్‌లో ఆగష్టు 24, 1853 నాడు సృష్టించడం జరిగింది. ఒక వినియోగదారుడు మాటిమాటికీ అతడి వేయించిన బంగాళాదుంపలను, అవి మరీ దళసరిగా, మెత్తగా మరియు చప్పగా ఉన్నాయని తిరిగి పంపడంతో విసిగిపోయి, రిసార్ట్ హోటల్ చెఫ్, జార్జ్ క్రమ్, ఆ బంగాళాదుంపలను వీలైనంత సన్నని ముక్కలుగా కోసి, కరకరలాడే వరకూ వేయించి, అదనంగా ఉప్పు చేర్చాలని నిర్ణయించాడు. క్రమ్ ఊహకు విరుద్ధంగా, ఆ వినియోగదారుడు (కొన్నిసార్లు ఇతడిని కార్నెలియస్ వాండర్‌బిల్ట్ అని చెబుతారు) ఈ కొత్త చిప్స్‌[3]ను ఎంతో ఇష్టపడ్డాడు మరియు అవి అనతికాలంలో ఆ లాడ్జ్ యొక్క మెనూలో "సరటోగా చిప్స్" పేరిట తప్పనిసరి పదార్థంగా చోటుచేసుకున్నాయి.[4]

20వ శతాబ్దంలో, బంగాళాదుంప చిప్స్ చెఫ్-వండే రెస్టారెంట్ పరిధిని దాటి, గృహోపయోగానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి కావడం మొదలైంది. 1910లో స్థాపించబడిన డేటన్, ఒహియో-లోని మైక్-సెల్ యొక్క బంగాళాదుంప చిప్ సంస్థ, తనను తాను "సంయుక్త రాష్ట్రాలలో అత్యంత పాతదైన బంగాళాదుంప చిప్ సంస్థ"గా చెప్పుకుంటుంది.[5] వాస్తవానికి 1908లో లియోమిన్స్టర్ బంగాళాదుంప చిప్ సంస్థ పేరిట లియోమిన్స్టర్, మసాచుసెట్స్‌లో స్థాపించబడిన న్యూ ఇంగ్లాండ్-లోని ట్రై-సమ్ బంగాళాదుంప చిప్స్, తామే అమెరికా యొక్క మొట్టమొదటి బంగాళాదుంప చిప్ అని చెప్పుకుంటుంది.[6] మార్కెట్లలో అమ్ముడయే చిప్స్ సామాన్యంగా టిన్లలో లేదా దుకాణం ముందరి గాజు బిన్ల నుండి తీయబడి, గుర్రపు బగ్గీల ద్వారా అందించబడేవి. ప్రారంభంలో బంగాళాదుంప చిప్ బ్యాగ్, కొసలు ఇస్త్రీ చేసిన లేదా కలిపి స్టేపుల్ చేసిన మైనపు కాగితంలా ఉండేది. మొదట్లో, బంగాళాదుంప చిప్స్ బారెల్స్ లేదా టిన్స్‌లో ప్యాక్ చేయబదేవి, తద్వారా అడుగున ఉన్న చిప్స్ మెత్తబడి, పొడిగా మారి ఉండేవి. మాంటెరీ పార్క్, కాలిఫోర్నియాలోని వ్యాపారవేత్త లారా స్కడ్డర్,[7] తన కార్మికులకు మైనపు కాగితం ఇచ్చి, దానిని ఇంటికి తీసుకువెళ్ళి, ఇస్త్రీచేయడం ద్వారా బ్యాగ్ రూపంలో తయారు చేసి తీసుకురమ్మని, మరుసటి రోజు వాటిని చిప్స్‌తో నింపేలా చేసింది. ఈ వినూత్న పద్ధతి ద్వారా నలిగిపోవడం తగ్గింది, మరియు ఎక్కువ సమయం పాటు చిప్స్ తాజాగా మరియు కరకరలాడుతూ ఉండేవి. సెల్లోఫేన్ ఆవిష్కారంతో పాటుగా ఈ ఆలోచన ద్వారా, బంగాళాదుంప చిప్స్ గొప్ప మార్కెట్ ఉత్పత్తిగా మారాయి మరియు లారా స్కడ్డర్ పేరు ప్రతి ఇంట్లోనూ మారుమ్రోగిపోయింది. ఈనాడు, చిప్స్ ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు మరియు నలగడం నుండి కాపాడేందుకు నత్రజని వాయువును నింపిన ప్లాస్టిక్ బ్యాగులలో ప్యాక్ చేయడం జరుగుతుంది.[8]

రుచి కలిసిన చిప్స్[మార్చు]

1920లో ఏర్పడిన స్మిత్స్ పొటాటో క్రిస్ప్స్ కంపెనీ లిమిటెడ్ కనుగొన్న ఆలోచనతో,[9] ఫ్రాంక్ స్మిత్ మొదట్లో తన క్రిస్ప్స్ కాస్త ఉప్పు కలిపి, గ్రీజ్‌ప్రూఫ్ పేపర్ బ్యాగ్స్‌లో ప్యాక్ చేసి, లండన్ చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మకాలు జరిపేవాడు.

ఒక విధంగా, 1950లలో టాయ్టోగా పిలువబడే ఒక ఐరిష్ క్రిస్ప్ సంస్థ యజమాని జో "స్పడ్ " మర్ఫీ (1923–2001)[10] తయారీ సమయంలో చేర్పులు జరిపేలా సాంకేతికతను అభివృద్ధి చేసేవరకూ, బంగాళాదుంప చిప్ ఎలాంటి చేర్పులూ లేకుండానే కొనసాగింది. అతడిది దాదాపుగా క్రిస్ప్స్ తయారీలో నిమగ్నమైన మొత్తం కుటుంబ సభ్యులతో కూడిన చిన్న సంస్థ అయినప్పటికీ, ఆ యజమాని ఎంతో కాలంగా తన వినూత్నమైన ఆలోచనా సరళిని రుజువు చేసుకున్నాడు. కొద్దిపాటి విఫల ప్రయత్నాల తరువాత, మర్ఫీ మరియు అతడి ఉద్యోగి సీమస్ బ్యుర్క్,[11] కలిసి ప్రపంచంలో మొట్టమొదటి రుచి కలిసిన క్రిస్ప్స్, చీజ్ & ఆనియన్ మరియు సాల్ట్ & వినెగర్ రకాలు తయారుచేశారు.

ఈ వినూత్నమైన ఆలోచన ఆహార పరిశ్రమలో వెనువెంటనే ఘనవిజయం సాధించింది, తద్వారా సంయుక్త రాష్ట్రాలలోని కొందరు అతిపెద్ద బంగాళాదుంప చిప్ సంస్థల అధిపతులు, ఐర్లాండ్లోని టాయ్టో సంస్థ యొక్క ఉత్పత్తిని పరిశీలించి, వారి కొత్త సాంకేతికతను ఉపయోగించుకునే హక్కులను బేరమాడేందుకు, అక్కడికి ప్రయాణం కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు టాయ్టో పద్ధతి హక్కులను కొనేందుకు పోటీపడ్డాయి. టాయ్టో సంస్థ అమ్మకం ద్వారా బంగాళాదుంప చిప్ తయారీని సమూలంగా మార్చివేసిన సదరు యజమాని మరియు అతడి చిన్న కుటుంబ బృందం, ఎంతో ధనవంతులయ్యారు.

స్మిత్ యొక్క బంగాళాదుంప క్రిస్ప్స్ ప్రకటన

టాయ్టో యొక్క వినూత్నమైన ఆలోచన బంగాళాదుంప చిప్ స్వరూపాన్ని మార్చివేసింది, మరియు స్మిత్ యొక్క ఉప్పు కలిపే ఆలోచనకు స్వస్తి పలికింది. (వాకర్స్ 1979లో స్మిత్స్ (UK) యాజమాన్యం చేపట్టాక తాము "సాల్ట్ ఇన్ ఎ బ్యాగ్" ఆలోచనను తమ సాల్ట్ 'ఎన్' షేక్ పొటాటో క్రిస్ప్స్‌తో తిరిగి అమలుపరచారు.[12]) అటుపై, చిప్ తయారీదారులు బంగాళాదుంప చిప్స్‌లో ప్రాకృతిక మరియు కృత్రిమ చేర్పులు చేర్చడంలో, వివిధ స్థాయిలలో విజయం సాధించారు. ఒక చేర్పు ద్వారా పరిమిత మార్కెట్లో ఎంతో ఆకర్షణ కలిగిన ఈ ఉత్పత్తి, ఎన్నో రకాల చేర్పుల ద్వారా ప్రస్తుతం మార్కెట్లో చొచ్చుకుపోవడంలో సఫలీకృతమైంది. ఎన్నో ఇతర చేర్పులు కలిసిన చిప్స్ వివిధ ప్రదేశాలలో అమ్ముడవుతున్నాయి, వీటిలో నిజానికి ఐర్లాండ్లో అత్యధిక స్థాయి క్రిస్ప్స్ తయారీదారు అయిన టాయ్టో యొక్క అసలైన ఉత్పత్తి "చీజ్ అండ్ ఆనియన్" కూడా ఉంది.

పరిభాష[మార్చు]

బంగ్లాదేశీ బంగాళాదుంప చిప్స్

వేయించిన బంగాళాదుంప ముక్కలకు ఉండే పేర్లలో ఆంగ్లం మాట్లాడే ప్రపంచంలో ఏమాత్రం సామ్యం లేదు. పైన చెప్పిన వంటకానికి అమెరికన్ మరియు కెనడియన్ ఇంగ్లీష్‌లలో "చిప్స్" అనే పదం ఉపయోగిస్తారు—ఈ పదం అమెరికన్ సంస్కృతి ప్రభావం వలన ఇంకా (కానీ ప్రపంచవ్యాప్తంగా కాదు) ప్రపంచంలోని ఇతర ప్రదేశాలలో ఉపయోగించబడుతుంది—మరియు కొన్నిసార్లు పిండితో తయారైన వాటిని "క్రిస్ప్స్"గా పిలుస్తారు.

యునైటెడ్ కింగ్డం మరియు ఐర్లాండ్‌లలో క్రిస్ప్స్ అనేవి బంగాళాదుంప చిప్స్ కాగా, చిప్స్ అనేవి ఫ్రెంచ్ ఫ్రైస్ ("ఫిష్ మరియు చిప్స్"లో లాగా) వంటి దళసరి ముక్కలను సూచిస్తాయి మరియు వీటిని వేడిగా వడ్డిస్తారు. ఆస్ట్రేలియా లో, దక్షిణ ఆఫ్రికా, దక్షిణాది న్యూజిలాండ్, భారతదేశం, సాధారణంగా వెస్ట్ ఇండీస్ ముఖ్యంగా బార్బడోస్‌ లోని కొన్ని ప్రదేశాలలో, ఈ రెండు రకాల బంగాళాదుంప ఉత్పత్తులను సైతం పెద్దవైన "గృహ-శైలి" బంగాళదుంప క్రిస్ప్స్‌ లాగే "చిప్స్" అని పిలుస్తారు. న్యూజిలాండ్‌కు ఉత్తరాన వీటిని "చిప్పీస్" అని పిలుస్తారు, కానీ వీటిని దేశవ్యాప్తంగా "చిప్స్"గా అమ్మడం జరుగుతోంది. కొన్నిసార్లు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌ లలో ఈ తేడా "వేడి చిప్స్" (వేయించిన బంగాళాదుంపలు) మరియు "బంగాళాదుంప చిప్స్" మధ్య సైతం ఉంటుంది. బంగ్లాదేశ్‌ లో, వీటిని సాధారణంగా చిప్, చిప్స్, క్రిస్ప్స్ ("కిరిస్" అని ఉచ్చరించడం జరుగుతుంది) మరియు స్థానికంగా ఆలూర్ పపోర్ (Álu'ŗ Păpôr) అని పిలుస్తారు.

ఆరోగ్య సూచనలు[మార్చు]

బంగాళాదుంప చిప్స్‌ను వాస్తవానికి క్రొవ్వు ఆమ్లాలు, సోడియం, చక్కెర, లేదా ఇతర పోషకాల స్థాయిలతో ప్రమేయం లేకుండా నూనెలో వేయించి, చేర్పులు చేసేవారు. ఎన్నో దేశాలలో పోషక అంతర్గ్రహణ సూత్రాలు తయారు కావడం మరియు పోషణ వాస్తవాల లేబిల్ సామాన్యం కావడం వలన, వినియోగదారులు, పక్షవాద బృందాలు, మరియు ఆరోగ్య సంస్థలు కలిసి బంగాళాదుంప చిప్స్‌తో సహా సదరు జంక్ ఫుడ్లపై దృష్టి సారించడం జరిగింది.[13]

కొన్ని బంగాళాదుంప చిప్ సంస్థలు అనధికారిక మరియు చట్టసంబంధ విమర్శలకు సమాధానంగా, ప్రస్తుత తయారీ విధానాలను మెరుగుపరచి, ఆరోగ్య-ప్రధాన ఉత్పత్తులను సృష్టించేందుకు పరిశోధన మరియు అభివృద్ధిపై నిధులు వెచ్చించడం జరిగింది. కెటిల్ ఫుడ్స్ 1978లో స్థాపించబడింది మరియు ప్రస్తుతం బంగాళాదుంప చిప్స్‌తో పాటుగా కేవలం క్రొవ్వు ఆమ్లాలు లేని ఉత్పత్తులను మాత్రమే అమ్ముతుంది. పెప్సికో పరిశోధనలో మ్రింగే ముందు చిప్స్‌పై ఉండే సుమారు 80% ఉప్పు నాలుకకు రుచి తెలియదు. 2009లో ఫ్రిటో-లే ఉత్పత్తి అభివృద్ధిపై $414 మిలియన్ ఖర్చుపెట్టింది, ఇందులో లేస్ బంగాళాదుంప చిప్స్ యొక్క ఉప్పు శాతం తగ్గించి, రుచి పాడవకుండా చేసేలా కొత్తరకం ఉప్పు స్ఫటికాలు తయారు చేయడం కూడా ఉంది.[13]

ప్రాంతీయ రకాల ఉదాహరణలు[మార్చు]

మూస:Example farm

దస్త్రం:HEDGEHOG CRISPS.jpg
హెడ్జ్‌హాగ్ రుచికరమైన క్రిస్ప్స్
 • ఆస్ట్రేలియాలో, ప్రముఖమైన రుచులు ప్లెయిన్ (సాల్టెడ్), రోస్ట్ చికెన్, బార్బెక్యూ, మరియు సాల్ట్ & వినెగర్. ఇటీవలి కాలంలో, లైం అండ్ పెప్పర్, చిల్లి, సోర్ క్రీం & చైవ్స్, స్వీట్ చిల్లి సాస్ & సోర్ క్రీం, హనీ సాయ్ చికెన్ అండ్ సీజర్ సలాడ్ వంటి ఇతర రుచులు ప్రసిద్ధి చెందాయి. కొంతకాలం క్రితం వరకూ, ఒక డోనర్ కెబాబ్ ఫ్లేవర్‌ను అర్నాట్స్ తయారుచేయడం జరిగింది.
 • ఆస్ట్రియా లో, వెల్లుల్లి రుచికలిగిన బంగాళాదుంప చిప్స్ లభిస్తాయి.
 • బల్గేరియా లో, ప్లెయిన్ సాల్టెడ్, పప్రికా, సోర్ క్రీం అండ్ ఆనియన్, మరియు చీజ్ అండ్ హాట్ చిల్లి అనేవి ప్రముఖమైన రుచులు. బార్బెక్యూ మరియు కెచప్ రుచికలిగిన చిప్స్ సైతం లభిస్తాయి.
 • కెనడా లో, చేర్పులలో డిల్ పికెల్, కెచప్, బార్బెక్యూ, బాల్‍పార్క్ హాట్‍డాగ్, బఫెలో వింగ్స్ అండ్ బ్లూ చీజ్, ఆనియన్ అండ్ గార్లిక్, జలపెన్యో అండ్ చెద్దర్, ఆల్ డ్రస్డ్, సాల్ట్ అండ్ వినెగర్, సాల్ట్ అండ్ పెప్పర్, సోర్ క్రీం అండ్ బేకన్, సోర్ క్రీం అండ్ చెద్దర్, సోర్ క్రీం అండ్ ఆనియన్, రోస్ట్ చికెన్, ఫ్రైస్ అండ్ గ్రేవీ, మరియు కర్రీ వంటివి ఉంటాయి. టొరాంటో మరియు వాంకోవర్లలో, లేస్ వాసబి చిప్స్ అందిస్తుంది.[14]
 • చైనా ప్రధాన భూభాగంలో, చైనీస్ వంటకాలు, ప్రపంచ వంటకాలు, మరియు దోసకాయ వంటి రుచికలిగిన బంగాళాదుంప చిప్స్‌ను లేస్ పరిచయం చేసింది.
 • కొలంబియా లో, చిప్స్ యొక్క ఐదు ప్రధాన రుచులు నాచురల్ (రెడీ సాల్టెడ్), బార్బెక్యూ, చికెన్, మయోన్నైస్ మరియు లిమోన్.
 • ఈజిప్ట్‌ లో, చిప్సి అనేది అత్యంత ప్రముఖమైన బ్రాండ్ బంగాళాదుంప చిప్స్. ఇందులో కెబాబ్, స్టఫ్డ్ వైన్ లీవ్స్ మొదలైనటువంటి స్థానిక వంటకాలచే ప్రేరితమైన రుచులు సైతం ఉంటాయి.
 • ఎన్నో ఖండాంతర EU దేశాలలో, ఎక్కువగా అమ్ముడయే చిప్స్ పప్రికా రుచికలిగినవి.
 • ఫిన్లాండ్‌ లో, బంగాళాదుంప చిప్స్ వ్యాపారంలో మార్కెట్ ఆధిపత్యం ఆలాండ్ లోని టాఫ్ఫెల్ (డెన్మార్క్ మరియు నార్వే లలో కిమ్స్ అని పిలువబడేవి మరియు స్వీడన్లో OLW పేరిట అమ్ముడయేవి), వీరి తయారీలో ప్రముఖమైనవి చీజ్ రుచికలిగిన "జూస్టో స్నాక్స్", ఉప్పు రుచికలిగిన "చిప్స్", సోర్ క్రీం అండ్ ఆనియన్ రుచికలిగిన "బ్రాడ్వే", మరియు బార్బెక్యూ రుచికలిగిన "గ్రిల్ చిప్స్", సాధారణంగా సోర్ క్రీం & ఆనియన్- మరియు బార్బెక్యూ -రుచికలిగిన బంగాళాదుంప చిప్స్ అనేవి తయారీదారుడితో ప్రమేయం లేకుండా అత్యంత ప్రముఖమైన రుచులు, స్థానిక టాఫ్ఫెల్‌కు అదనంగా ప్రముఖమైన బ్రాండ్లలో కొన్ని విదేశీ బ్రాండ్లు అయిన ఎస్ట్రెల్లా మరియు ప్రింగిల్స్ వంటివి.
 • జర్మనీ లో, పెప్పర్ అత్యంత సామాన్యమైన ఫ్లేవర్ . సాల్ట్ & వినెగర్ మరియు ఆసియన్ రుచుల వంటి మరిన్ని అసాధారణ రకాలు సైతం మొదలవుతున్నాయి. ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందినవి సాల్ట్ & పెప్పర్-ఫ్లేవర్ మరియు సేంద్రియ వ్యవసాయం నుండి ఉత్పత్తుల సరళి. ఎంతో ప్రసిద్ధమైన బీర్ రుచికలిగిన చిప్స్ చాలావరకూ కేవలం అపోహ మాత్రమే, ఇటీవలి కాలంలో అందరికీ లభ్యమైన బీర్ రుచికలిగిన చిప్స్ లోరెంజ్ స్నాక్-వరల్డ్ ప్రత్యేకంగా తయారు చేసిన 2006 సాకర్ వరల్డ్ కప్ సమయంలో లభించినవి. ప్రధానమైన బ్రాండ్లు ఇంటర్‌స్నాక్ తయారు చేసే చియో చిప్స్ మరియు ఫన్నీ ఫ్రిస్చ్, లోరెంజ్ స్నాక్ వరల్డ్ తయారుచేసే క్రంచిప్స్, మరియు ప్రింగిల్స్. లేస్ లేదా కెటిల్ వంటి ఇతర విదేశీ బ్రాండ్లు అప్పుడప్పుడూ కనిపించినా, సామాన్యంగా ప్రధాన పాత్ర పోషించవు.
 • గ్రీస్‌ లో, ఒరేగానో రుచికలిగిన చిప్స్ ఎంతో ప్రముఖమైనవి.
 • హాంగ్ కాంగ్‌ లో, రెండు ప్రధాన బంగాళాదుంప చిప్స్ రకాలు కాల్బీ వారి స్పైసీ "ఎత్నికన్" రకం, [15] మరియు జాక్ 'ఎన్ జిల్ వారి బార్బెక్యూ. లేస్ సైతం హాంగ్‌కాంగ్‌లో ప్రముఖమైనవి . (వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది BBQ మరియు సోర్ క్రీం అండ్ ఆనియన్.)
 • భారతదేశం మరియు పాకిస్తాన్‌ లలో, స్థానికంగా తయారయేవి మరియు లేస్ వంటి బహుళ-జాతీయ బ్రాండ్లు ఎన్నో విధాల రుచికలిగిన రకాలుగా లభిస్తాయి. కొన్ని రుచులు టొమాటో, పుదినా (మింట్), మసాలా, కొత్తిమీర, సాల్ట్ అండ్ పెప్పర్, మరియు రెడ్ చిల్లి పౌడర్. వీటిలో అత్యంత ప్రముఖమైన చిప్ రకాలు బంగాళాదుంప, టపియోకా మరియు అరటి (పసుపు లేదా ఆకుపచ్చ, వీటిలో ఒక్కొక్కటి విభిన్న రుచి కలిగి ఉంటుంది).
 • ఇండోనేషియా లో, బార్బెక్యూ, కార్న్, మరియు రోస్ట్ చికెన్ అందరూ అభిమానిస్తారు. మరొక రకం చిప్స్ పెండలం చిప్స్.
 • ఐర్లాండ్‌ లో, క్రిస్ప్స్ యొక్క సామాన్య రకాలు UK లో అమ్ముడయే వాటిని పోలి ఉంటాయి. కానీ, ఐర్లాండ్ లో, టాయ్టో అనే పదం టాయ్టో బ్రాండ్ తయారుచేసే క్రిస్ప్స్‌ను సూచిస్తుంది మరియు టాయ్టో ఉత్పత్తి చేయని వాటితో పాటుగా, అన్ని రకాల క్రిస్ప్‌నీ వివరించేందుకు ఉపయోగపడుతుంది. ఐరిష్ మార్కెట్లో టాయ్టో ఆధిపత్యం కారణంగా, ఈ పదం సార్వత్రిక ట్రేడ్‍మార్క్ అయింది. అక్కడ వాకర్స్ క్రిస్ప్స్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటికీ, మార్కెట్లో ఆధిపత్యం సాధించడంలో విఫలమయ్యాయి. హంకీ డోరీస్ మరియు కింగ్ క్రిస్ప్స్ అనేవి ఇతర ప్రముఖమైన ఐరిష్ బ్రాండ్లు. ఐరిష్ భాషలో, క్రిస్ప్స్‌ను క్రియోస్పాయ్ అని చెబుతారు. వాకర్స్ ప్రస్తుతం కొత్త రుచులైన ఫిష్ అండ్ చిప్స్ పరిశీలిస్తోంది, మరియు వాటి ప్రాముఖ్యత ఆధారంగా వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు.
 • జపాన్ లో, నోరి & సాల్ట్, కన్సమ్మే, వాసబి, సోయ్ సాస్ & బటర్, టకోయకి, కిమ్చి, వెల్లుల్లి, చిల్లి, బటర్‌తో కూడిన స్కాల్లప్, ఉమే, మయోన్నైస్, యకిటోరి మరియు రామెన్ రుచులు లభిస్తాయి. ప్రధాన తయారీదారులు కాల్బీ, [16] కోయికేయా[17] మరియు యమయోషి.
 • మెక్సికో లో, ఎన్నో రుచులు మసాలాతో కూడినవిగా ఉంటాయి. ప్రముఖమైన రుచులు సాల్ట్, లైమ్, హబనేరో, 'చిలీ య లిమాన్' మరియు చీజ్.
 • కొన్ని మధ్య ప్రాచ్య దేశాలలో,[clarification needed] ఎన్నో ప్రముఖమైన అమెరికన్ రుచులు మరియు చికెన్-రుచికలిగిన చిప్స్ లభిస్తాయి. ఇతర రకాలలో, సాల్ట్ మరియు సాల్ట్ అండ్ పెప్పర్ రకాలు అత్యంత ప్రముఖమైనవి.
 • నెదర్లాండ్స్‌ లో, మార్కెట్ ఆధిపత్యం లేస్ చేతిలో ఉంది; వారు నాచురల్ (సాల్టెడ్), పప్రికా, బోలోగ్నీస్ (ఇటాలియన్ హెర్బ్స్ అండ్ టొమాటో), బార్బెక్యూడ్ హామ్, చీజ్ & ఆనియన్, మెక్సికన్ హెర్బ్స్, హైన్జ్ టొమాటో కెచప్, చిల్లి, స్పేర్‍రిబ్స్, మెడిటరేనియన్ హెర్బ్స్, థాయి స్వీట్ చిల్లి, ఓరియంటల్ స్పైసెస్, పెప్పర్ & క్రీం, చికెన్ & థైమ్, మరియు స్పైసెస్ & లైమ్ వంటి ఎన్నో రుచులను అందిస్తారు. నాచురల్ (సాల్టెడ్) మరియు పప్రికా క్రిస్ప్స్ అనేవి అత్యంత ప్రసిద్ధమైనవి.
 • న్యూజిలాండ్ లో, బంగాళాదుంప చిప్స్ యొక్క అత్యంత ప్రసిద్ధ రకాలు రెడీ సాల్టెడ్, ఉప్పు ఎన్' వినెగర్ మరియు చికెన్. 2009లో, బ్లూబర్డ్ ఫుడ్స్ లిమిటెడ్ వారు 'మీట్ పై మరియు కెచప్' మరియు 'రెడ్యూస్ద్ క్రీం అండ్ ఆనియన్ సూప్ డిప్' వంటి అద్భుత న్యూజిలాండ్ రుచులతో తయారైన ఒక వినూత్న శ్రేణి చిప్స్ విడుదల చేసింది. ఈ శ్రేణికి 'కివి అస్' అని పేరుపెట్టడం జరిగింది.
 • నార్వే లో, చాలావరకూ చిప్స్ సాల్ట్, సాల్ట్ అండ్ పెప్పర్ మరియు పప్రికా రుచికలిగినవి. మష్రూమ్ మరియు హార్స్‌రాడిష్ వంటి ఎన్నో అద్భుత రుచులు సైతం లభిస్తాయి. ప్రధాన బ్రాండ్లు కిమ్స్, మారుడ్ మరియు హోఫ్ (HOFF).
 • ఫిలిప్పీన్స్‌ లో, అందరూ అభిమానించేవి చీజ్, బార్బెక్యూ, మరియు సోర్ క్రీం అండ్ ఆనియన్.
 • రష్యా లో, ప్రముఖమైన రుచులు ప్లెయిన్ (సాల్టెడ్), ఆనియన్, పప్రికా, బ్లాక్ పెప్పర్, మరియు సోర్ క్రీం, మరిన్ని అసాధారణ రకాలు బేకన్, షశ్లిక్, క్రాబ్, మరియు కేవియర్. లేస్ మరియు ప్రింగిల్స్ బ్రాండ్లు రెండూ విస్తారమైన శ్రేణిని కలిగినవి. పెరేక్రేస్తోక్ వంటి రష్యన్ సంస్థలు సైతం వారి స్వంత చిప్స్ తయారు చేస్తాయి.
 • సింగపూర్‌ లో, ప్రముఖమైన బ్రాండ్లు బార్బెక్యూ రుచికలిగిన జాక్ అండ్ జిల్ బంగాళాదుంప చిప్స్, సోర్ క్రీం అండ్ ఆనియన్ లేస్, చిప్స్టర్ మరియు లేస్ కెటిల్ కుక్డ్ చిప్స్ బ్రాండ్ .
 • సెర్బియా లో, ప్రముఖమైన బంగాళాదుంప చిప్స్ ప్లెయిన్ (సాల్టెడ్), పిజ్జా, గ్రిల్ మరియు కెచప్ రుచికలిగినవి. చిప్సీ సంస్థ చాలావరకూ సెర్బియన్ బంగాళాదుంప చిప్ మార్కెట్‍ను ఆక్రమించింది.
 • దక్షిణ ఆఫ్రికాలో ఎన్నో బంగాళాదుంప చిప్ రుచులు లభిస్తాయి, వీటిలో ఇతర రకాలతో పాటుగా "ఫ్రూట్ చట్నీ", "బిల్టాంగ్" (బీఫ్ జెర్కీ), "సాసేజ్", "వోర్సెస్టర్‍షైర్ సాస్", "పెరి పెరి" (మొజాంబికన్/పోర్చుగీస్ హాట్ సాస్ రుచి) మరియు టొమాటో సాస్ (కెచప్ రుచి) లభిస్తాయి.
 • స్పెయిన్ లో, అత్యంత ప్రముఖమైన రుచులు ప్లెయిన్ (ఆలివ్ ఆయిల్‍లో వేయించి, ఉప్పు కలిపినవి), మరియు హామ్.
 • స్వీడన్‍ లో, రెండు ప్రముఖ సంస్థలు ఎస్ట్రెల్లా (క్రాఫ్ట్ ఫుడ్స్ యాజమాన్యంలోనివి) మరియు OLW. అత్యంత ప్రముఖమైన రుచులు సాల్టెడ్, గ్రిల్ (ఉల్లిపాయ రుచికలిగినవి), సోర్ క్రీం & ఆనియన్, మరియు డిల్. అసాధారణ రుచులు సోర్ క్రీం & బీర్నైస్ మరియు హాట్ స్వీట్ చిల్లి. లాంట్చిప్స్ పేరిట చెక్కుతీయని బంగాళాదుంపలతో తయారైన చిప్స్ సైతం సామాన్యంగా లభిస్తాయి.
 • యునైటెడ్ కింగ్డంలోని మార్కెట్ ఆధిపత్యం వాకర్స్ (లేస్ యొక్క ప్రాంతీయ బ్రాండ్) చేతిలో ఉంది, ఆ సంస్థ తమ విస్తారమైన రకం క్రిస్ప్స్ వలన ప్రసిద్ధమైనది. ఇందులో మూడు ప్రధాన రుచులు రెడీ సాల్టెడ్, చీజ్ & ఆనియన్, మరియు సాల్ట్ & వినెగర్; కానీ, ఇతర ఉదాహరణలు ప్రాన్ కాక్‍టెయిల్, వోర్సెస్టర్‍షైర్ సాస్ (వాకర్స్ వద్ద వోర్సెస్టర్ సాస్ అని ప్రసిద్ధం), రోస్ట్ చికెన్, స్టీక్ & ఆనియన్, స్మోకీ బేకన్, ల్యాంబ్ & మింట్, హామ్ & మస్టర్డ్, బార్బెక్యూ, BBQ రిబ్, టొమాటో కెచప్, సాసేజ్ & కెచప్, పికెల్డ్ ఆనియన్, బ్రాన్స్టన్ పికెల్, మరియు మార్మైట్. మరిన్ని అసాధారణ రుచులు థాయి స్వీట్ చిల్లి, రోస్ట్ పోర్క్ & క్రీమీ మస్టర్డ్ సాస్, లైమ్ అండ్ తాయి స్పైసెస్, ఇటాలియన్ హెర్బ్స్ చేర్చిన చికెన్, సముద్రపు ఉప్పు మరియు పొడిచేసిన మిరియాలు, టర్కీ & బేకన్, కారమేలైజ్డ్ ఆనియన్ & స్వీట్ బల్సమిక్ వినెగర్, స్టిల్టన్ & క్రాన్‍బెర్రీ, మాంగో చిల్లి, మరియు అమెరికన్ చీజ్‍బర్గర్ మరియు ఇంగ్లీష్ రోస్ట్ బీఫ్ & యార్క్‌షైర్ పుడ్ వంటి ప్రత్యేకమైన రుచులు.[18] కెటిల్ ఫుడ్స్ లిమిటెడ్ యొక్క దళసరి ముక్కలు కలిగిన కరకరలాడే క్రిస్ప్స్ అద్భుతమైన రుచులు ఇవి: మిర్చి కొద్దిగా కలిగిన మెక్సికన్ లైమ్స్, మేస్క్వైట్ కలిగిన సల్సా, బఫెలో మోజ్జరెల్లా టొమాటో మరియు బేసిల్, అడ్నామ్స్ బ్రాడ్‍సైడ్ బీర్‍తో కూడిన మెచ్యూర్ చెద్దర్, సౌల్‍మేట్ చీజ్‌ అండ్ ఆనియన్, మరియు మునుపు చెప్పబడిన జాబితాలోని ఇతర రుచులు. చాలావరకూ చేర్పులలో శాకాహార పదార్థాలే ఉంటాయి, కానీ ఇటీవలి చేర్పులలో ల్యాంబ్ & మింట్ సాస్ వంటి కొన్ని మాంస పదార్థాలు కలిగి ఉంటాయి. 1980 ల ప్రారంభంలో, హెడ్జ్‌హాగ్ బ్రాండ్ రుచికలిగిన క్రిస్ప్స్ విస్తారంగా అమ్ముడయేవి మరియు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. మెక్‍కాయ్స్ క్రిస్ప్స్ సైతం UK లో ప్రముఖమైనవి. ఉత్తరాది ఐర్లాండ్‍లో టాయ్టో (NI) లిమిటెడ్ మార్కెట్లో ఆధిపత్యం సాధించింది.[ఉల్లేఖన అవసరం] ఈ సంస్థ రిపబ్లిక్ అఫ్ ఐర్లాండ్‍లో పూర్తిగా టాయ్టో సంస్థతో ప్రమేయం లేనిది. ఉత్తర ఇంగ్లాండ్‍ లో, సీబ్రూక్ బంగాళాదుంప క్రిస్ప్స్ ప్రముఖమైనవి, కానీ అవి దక్షిణ భాగంలో ఎంతో తక్కువగా లభిస్తాయి.
 • సంయుక్త రాష్ట్రాలలో, ప్రముఖమైన బంగాళాదుంప చిప్స్ రుచులలో సోర్ క్రీం అండ్ ఆనియన్, బార్బెక్యూ, రాంచ్ డ్రెస్సింగ్, మరియు సాల్ట్ అండ్ వినెగర్ ఉంటాయి. జాప్స్ తయారు కాజున్ క్రాటేటర్ చిప్స్ (క్రాఫిష్ ఉడికించి చేర్చిన రుచికలిగినవి) మరియు క్రెయోల్ టొమాటో చిప్స్ (టబాస్కో పెప్పర్ సాస్ రుచికలిగినవి). గణనీయమైన స్పానిష్ జనాభా కలిగిన రాష్ట్రాలలోని దుకాణాలలో మెక్సికన్ పేరు, లిమాన్ ఉపయోగించి నిమ్మరుచి కలిగిన చిప్స్ అమ్మడం జరుగుతుంది.[19]

పోలిన ఆహారపదార్థాలు[మార్చు]

మరొక రకం బంగాళాదుంప చిప్, ముఖ్యంగా ప్రింగిల్స్ మరియు లేస్ స్టాక్స్ బ్రాండ్లు, బంగాళాదుంపలను పొడిచేసి తయారుచేసిన పిండిని సాగదీయడం లేదా అనచడం ద్వారా కోరిన రూపంలో మలచి, వేయించడం ద్వారా తయారుచేస్తారు. దీంతో ఆ చిప్స్, పరిమాణం మరియు రూపంలో తేడాలు లేకుండా తయారవుతాయి, ఇందువలన ఇవి ఒకదానిపై ఒకటి అమర్చడం మరియు స్థిరమైన గొట్టాలలో ప్యాక్ చేయడం సులువవుతుంది. అమెరికాలో, ప్రింగిల్స్ యొక్క అధికారిక పదం "బంగాళాదుంప క్రిస్ప్స్", కానీ వాటిని అరుదుగా అలా పిలుస్తారు. దీనికి విరుద్ధంగా బ్రిటన్లో ప్రింగిల్స్‌ను సైతం సంప్రదాయ "క్రిస్ప్స్" నుండి వేరుచేయడానికి "బంగాళాదుంప చిప్స్"గా చెప్పవచ్చు.

బంగాళాదుంప చిప్స్ యొక్క మరొక అదనపు రూపం "బంగాళాదుంప స్టిక్స్", వీటినే "షూస్ట్రింగ్ బంగాళాదుంపలు" అని కూడా అంటారు. వీటిని ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫ్రై యొక్క అతి సన్నని (2–3 మిమీ) రూపాలలో తయారుచేస్తారు, కానీ మామూలుగా సాల్టెడ్ బంగాళాదుంప చిప్స్ లాగే వేయిస్తారు. కెనడాలో హికరీ స్మోక్ ఫ్లేవర్ ఎంతో ప్రముఖమైనది, వీటిని "హికరీ స్టిక్స్"గా పిలుస్తారు. బంగాళాదుంప స్టిక్స్ సామాన్యంగా దృఢమైన కంటైనర్లలో ప్యాక్ చేస్తారు, కానీ కొందరు తయారీదారులు బంగాళాదుంప చిప్ బ్యాగ్‌ల వంటి మెత్తటి కవర్లను ఉపయోగిస్తారు. బంగాళాదుంప స్టిక్స్ నిజానికి గాలిచొరని స్టీల్ క్యాన్లలో ప్యాక్ చేసేవారు. 1960లలో, తయారీదారులు తక్కువ ఖరీదైన కాంపోజిట్ కానిస్టర్ ఉపయోగించడం ప్రారంభించారు (ప్రింగిల్ యొక్క కంటైనర్‌ను పోలినది). ఈ వర్గంలోని డర్కీ బంగాళాదుంప స్టిక్స్ (Potato Stix) మరియు ఫ్రెంచ్స్ బంగాళాదుంప స్టిక్స్ పేర్లలో రెక్కిట్ బెంకైసర్ మార్కెట్ ఆధిపత్యం కలిగి ఉండేది, కానీ 2008లో వ్యాపారం నుండి వైదొలగింది. UKలో, "ఫ్రెంచ్ ఫ్రైస్" పేరిట రెడీ సాల్టెడ్వి, ఉప్పు మరియు వినెగర్, చీజ్ అండ్ ఆనియన్ లేదా వోర్సెస్టర్ సాస్ రుచితో బంగాళాదుంప స్టిక్ బ్రాండ్‌ను వాకర్స్ తయారుచేసింది.

నీరు తొలగించిన బంగాళాదుంపలతో తయారుచేసిన మరొక ఎక్కువ పరిమాణపు రూపం (సుమారు 1 సెంమీ దళసరివి) ఎంతో కాలంగా నడుస్తున్న బ్రిటిష్ చిత్ర కథల నేపథ్యాన్ని ఉపయోగించి ఆండీ కాప్స్ పబ్ ఫ్రైస్ పేరిట బేక్ చేసి, వివిధ రకాల రుచులలో అమ్ముడవుతాయి. వాకర్స్ "చిప్‌స్టిక్స్" పేరిట ఉప్పు మరియు వినెగర్ రుచికలిగిన అదే తరహా ఉత్పత్తిని తయారు చేస్తుంది. రెడీ సాల్టెడ్ ఫ్లేవర్ నిలిపివేయడం జరిగింది.

కొన్ని సంస్థలు వేడిమితో వేయించిన బంగాళాదుంప చిప్స్‌ను తక్కువ క్రొవ్వు శాతం కలిగిన ప్రత్యామ్నాయంగా అమ్మడం జరిగింది. అదనంగా, కొన్ని రకాల క్రొవ్వు-లేని చిప్స్ తయారీలో కృత్రిమ, మరియు జీర్ణం కాని, క్రొవ్వు ప్రత్యామ్నాయాలు ఉపయోగించడం జరిగింది. వీటిలో చాలా రకాలలో ఉండే పదార్థం, ఒలెస్ట్రా, కొందరు వ్యక్తులలో ఉదరంలో అసౌకర్యం మరియు విరేచనాలు కలిగించడంతో మీడియాలో ఎక్కువ ప్రచారం పొందింది.[20]

కరకరలాడే వేయించిన బంగాళాదుంప చిప్స్ యొక్క విజయం సైతం వేయించిన కార్న్ చిప్స్ ఉత్పత్తికి దారితీసింది, ఇందులో ఫ్రిటోస్, CCస్ మరియు డోరిటోస్ వంటి బ్రాండ్లు మార్కెట్లో ఆధిక్యత సాధించాయి. "స్వాంప్ చిప్స్" కూడా ఇదే తరహాలో ముల్లంగి, నూల్‍కోల్ మరియు క్యారట్ల వంటి ఎన్నో రకాల దుంప కూరల నుండి తయారు చేస్తారు. జపనీస్-శైలి రూపాలు బియ్యం లేదా పెండలంతో తయారైన ఉత్పత్తుల వంటి సాగదీసిన చిప్స్. దక్షిణ భారతీయ స్నాక్ వంటకాలలో, ఎన్నో శతాబ్దాలుగా బియ్యం/సగ్గుబియ్యం లేదా వివిధ ధాన్యాలతో తయారైన పిండితో తయారయ్యే పదార్థం ఉంది, దీనిని కన్నడంలో హప్ళ /తమిళంలో వడం (తెలుగులో వడియం) అని పిలుస్తారు.

బ్రిటన్లో "క్రిస్ప్స్" పేరిట ఎన్నో ఇతర ఉత్పత్తులు ఉన్నాయి, కానీ వీటిని "బంగాళాదుంప చిప్స్"గా వర్గీకరించడం జరగదు, ఎందుకంటే వీటిని బంగాళాదుంపతో చేయడం జరగదు మరియు/లేదా ముక్కలుగా తరగడం ఉండదు (ఉదాహరణకు, వోట్సిట్స్, క్వేవర్స్, స్కిప్స్, హుల హూప్స్ మరియు మాన్స్టర్ మంచ్).

కెటిల్-శైలి చిప్స్ (UK/యూరోప్‌లలో చేతి-వంటకాలుగా పిలువబడేవి) అనేవి సంప్రదాయపరంగా "విడత-శైలి" ప్రక్రియలో చేస్తారు, ఇందులో అన్ని చిప్స్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయించి, అవి అతుక్కోకుండా నివారించేందుకు విడవకుండా కదిలిస్తూ ఉండడం జరుగుతుంది. ఇటీవలే కెటిల్-శైలి చిప్స్ సైతం "నిరంతర-శైలి" ప్రక్రియలో (పొడవైన కన్వేయర్ బెల్ట్ వంటిది) తయారు చేయడం వంటి అభివృద్ధి చోటుచేసుకుంది, ఇందులో అదే పాత-రకం రూపం మరియు రుచి కలిగిన అసలైన కెటిల్‌లో వండిన చిప్ వంటివి తయారవుతాయి.

బంగాళాదుంప లేని చిప్స్ సైతం ఉంటాయి. కుమారా (చిలగడదుంప) చిప్స్ కొరియా, న్యూజిలాండ్ మరియు జపాన్‌లలో ఉపయోగిస్తారు; ముల్లాంటి, బీట్‌రూట్ మరియు క్యారట్ క్రిస్ప్స్ యునైటెడ్ కింగ్డంలో లభిస్తాయి. భారతదేశంలో ఎన్నో రకాల స్థానిక 'చిప్స్ దుకాణాలు' ఉంటాయి, వీటిలో కేవలం బంగాళాదుంప చిప్స్ మాత్రమే కాక ఇతర రకాలైన అరటి చిప్స్, తపియోకా చిప్స్, చేమదుంప చిప్స్, చివరికి క్యారట్ చిప్స్ సైతం అమ్ముడవుతాయి. చిఫిల్స్ లేదా టోస్టోన్స్ అని కూడా పిలువబడే అరటి చిప్స్ సైతం పశ్చిమార్థ గోళంలో సంయుక్త రాష్ట్రాల నుండి చిలీ వరకూ అమ్ముడవుతాయి. ఫిలిప్పీన్స్‌లో, అరటి చిప్స్ స్థానిక దుకాణాలలో అమ్ముడవడం కనిపిస్తుంది. కెన్యాలో, చివరికి పాలగుండ మరియు పెండలం నుండి సైతం చిప్స్ తయారుచేస్తారు. యునైటెడ్ కింగ్డం, స్వీడన్, ఫిన్లాండ్ మరియు ఆస్ట్రేలియాలలో, బియ్యంతో తయారైన కొత్త రకం ప్రింగిల్స్ విడుదలై, వాటి బంగాళాదుంప రూపాల కన్నా తక్కువ క్రొవ్వు శాతంతో అమ్ముడవుతాయి. ఇటీవలే, ఆబ్సొల్యూట్ ఆర్గానిక్ అనే ఆస్ట్రేలియన్ సంస్థ బీట్‍రూట్‌తో చేసిన చిప్స్ విడుదల చేసింది.

గమనికలు[మార్చు]

 1. "Walkers Crisps". Pepsico. మూలం నుండి 2011-07-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-09. Cite web requires |website= (help)
 2. "PotatoPro/Datamonitor". Potatopro.com. మూలం నుండి 2011-07-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)
 3. "How potato chip is made - used, processing, product, machine, Raw Materials, The Manufacturing Process, Quality Control, Byproducts/Waste, The Future". Madehow.com. 1915-01-06. Retrieved 2010-08-03. Cite web requires |website= (help)
 4. "సివిల్ యుద్ద పదార్దాలు మరియు ఆహార చరిత్ర - సివిల్ వార్ సమయంలో పొటాటో". మూలం నుండి 2014-10-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-05-25. Cite web requires |website= (help)
 5. "Mike Sells Chipper Shipper Online Store". Mike-sells.com. మూలం నుండి 2009-06-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)
 6. "Potato Chips". Atlas of Popular Culture in the Northeastern US. Retrieved 2010-03-30. Cite web requires |website= (help)
 7. 72.14
 8. "The History and Origin of Potato Chips". Students.cup.edu. మూలం నుండి 2010-01-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-03. Cite web requires |website= (help)
 9. "BBC h2g2 Potato Crisps - A History". Bbc.co.uk. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)
 10. "Joe 'Spud' Murphy". Daily Telegraph. 2001-11-22. Retrieved 2007-08-23. Cite web requires |website= (help)
 11. "Joe 'Spud' Murphy". Telegraph. 2001-11-05. Retrieved 2010-08-03. Cite web requires |website= (help)
 12. "BBC h2g2 - Smiths Salt 'n' Shake Crisps". Bbc.co.uk. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)
 13. 13.0 13.1 McKay, Betsy (2010-03-22). "PepsiCo Develops 'Designer Salt' to Chip Away at Sodium Intake". Wall Street Journal. Retrieved 2010-03-22. Cite web requires |website= (help)
 14. "Lay's website". Retrieved 2008-08-24. Cite web requires |website= (help)
 15. "Calbee Four Seas Co. Ltd". మూలం నుండి 2008-08-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-24. Cite web requires |website= (help)
 16. "Calbee カルビー株式会社". Calbee.co.jp. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)
 17. "株式会社湖池屋|総合スナックメーカーのコイケヤ". Koikeya.co.jp. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)
 18. "Walkers Flavour Cup". మూలం నుండి 2010-10-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-10-15. Cite web requires |website= (help)
 19. "LAY'S®". Frito-Lay. మూలం నుండి 2010-05-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-03. Cite web requires |website= (help)
 20. "NIDDK...WIN Notes". Win.niddk.nih.gov. 1998-02-21. మూలం నుండి 2009-02-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-05-26. Cite web requires |website= (help)

సూచనలు[మార్చు]

 • బంహం, రాయ్నేర్ (1977) "ది క్రిస్ప్ ఎట్ ది క్రాస్ రోడ్స్", P. బార్కర్ (ed) ఆర్ట్స్ ఇన్ సొసైటీ . లండన్: ఫోన్టనా.
 • Jones, Charlotte Foltz (1991). Mistakes That Worked. Doubleday. ISBN 0-385-26246-9. – బంగాళాదుంప చిప్స్ ఆవిర్భావాలు

బాహ్య లింకులు[మార్చు]

మూస:Potato dishes