బంటుపల్లి (రణస్థలం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బంటుపల్లి, శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలానికి చెందిన గ్రామము.[1]

బంటుపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం రణస్థలం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,166
 - పురుషుల సంఖ్య 1,075
 - స్త్రీల సంఖ్య 1,091
 - గృహాల సంఖ్య 571
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వెలిసేటి మల్లికార్జునుడనే కమ్మ కులస్తుడైన సేనాని బంటుపల్లి గ్రామాన్ని నిర్మించారు. ఆయన తండ్రి, వెలిసేటి వంశ మూలపురుషుడైన తిరుపతి దొర క్రీ.శ.1650లో నేటి తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలానికి చెందిన వెలిచేరు గ్రామాన్ని కట్టించారు. క్షాత్రవృత్తి అవలంబించే కుటుంబాలలోనివారు చేసేట్టుగా సహజంగానే వలస వెళ్ళి విజయనగర సంస్థానంలో స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటుగా, పౌరుష ప్రతాపాలను చూపి ఈ గ్రామాన్ని పొంది నిర్మించాడు. వెలిసేటి వంశస్థుల్లో పూసపాటి వారి సంస్థానంలో ప్రవేశించిన మొదటి వ్యక్తి మల్లికార్జునుడు. ఈ గ్రామంలో తన పేరిట మల్లికార్జున లింగం ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. మల్లికార్జునుని ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడైన రెండవ తిరుపతి దొర నడిపల్లి గ్రామాన్ని నిర్మించారు.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,166 - పురుషుల సంఖ్య 1,075 - స్త్రీల సంఖ్య 1,091 - గృహాల సంఖ్య 571

మూలాలు[మార్చు]  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ధర్మనందన విలాసము గ్రంథ పీఠిక:సంపాదకుడు.కొత్త భావయ్య చౌదరి, రచన.కాళ్లకూరి గౌరీకాంతకవి:రచన.1800, ప్రచురణ.1951:పేజీ.4,5

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11