బండారు దత్తాత్రేయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండారు దత్తాత్రేయ
బండారు దత్తాత్రేయ


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌
మాజీ కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు
పదవీ కాలము
11సెప్టెంబర్ 2019 -
నియోజకవర్గము సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1946-06-12) 12 జూన్ 1946 (వయస్సు 74)
హైదరాబాదు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వసంత
సంతానము బండారు విజయలక్ష్మి, బండారు వైష్ణవ్.
నివాసము హైదరాబాదు
మతం హిందూ మతము
వెబ్‌సైటు bandarudattatreya.org

భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) జూన్ 12, 1946న జన్మించారు.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందినారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 3 సార్లు సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైనారు. అటల్ బిహారీ వాజపేయి హయంలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడి ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి గా పనిచేశారు. 2019 సెప్టెంబర్ 1న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ను కేంద్రప్రభుత్వం నియమించింది. 2019 సెప్టెంబర్ 11న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 27వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశాడు. [2]

జననం[మార్చు]

బండారు దత్తాత్రేయ 1947 జూన్ 12 వ తేదీన హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన తండ్రి బండారు అంజయ్య, తల్లి బండారు ఈశ్వరమ్మ. హైద‌రాబాద్‌లోని ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి ఆయ‌న డిగ్రీ పూర్తి చేశారు. బండారు దత్తాత్రేయ 1989 లో వసంతతో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు పిల్లలు విజయలక్ష్మి, బండారు వైష్ణవ్.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1980లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైనారు. 1981-89 కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. బండారు దత్తాత్రేయ తొలిసారిగా 1991లో సికింద్రాబాదు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైనారు. 1996-98 కాలంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1998, 1999లలో కూడా ఇదే స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించడమే కాకుండా రెండు సార్లు కేంద్ర మంత్రిమండలిలో స్థానం పొందారు. కేంద్రంలో పలు పార్లమెంటరీ కమిటీలలో పనిచేశారు. తిరిగి..2014 ఎన్నికల్లోనూ ఆయన సికింద్రాబాద్ స్థానం నుంచే పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. బండారు దత్తాత్రేయ అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు.2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టికెట్ దక్కలేదు. 2019 లో కేంద్ర ప్రభుత్వం బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు.[3][4]

ఇతర విశేషాలు దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయిక పద్ధతిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో[5] అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు. ఈ సందర్భంగా రాజకీయ సామాజిక ప్రముఖులను ఆహ్వానించి, తెలంగాణ సాంప్రదాయిక వంటకాలతో విందు ఇస్తారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-03. Retrieved 2014-02-06.
  2. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (11 September 2019). "హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం". ntnews.com. Archived from the original on 11 సెప్టెంబర్ 2019. Retrieved 11 September 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  3. నమస్తే తెలంగాణ (2 September 2019). "ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు". ntnews.com. Archived from the original on 2 సెప్టెంబర్ 2019. Retrieved 2 September 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  4. సాక్షి, హోం » తెలంగాణ (2 September 2019). "గౌలిగూడ టు సిమ్లా". Sakshi. Archived from the original on 2 సెప్టెంబర్ 2019. Retrieved 2 సెప్టెంబర్ 2019. Check date values in: |access-date= and |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  5. నమస్తే తెలంగాణ (2 October 2017). "తెలంగాణ సంస్కృతి గొప్పది". ntnews.com. నమస్తే తెలంగాణ. Archived from the original on 2 సెప్టెంబర్ 2019. Retrieved 2 September 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)