బండిపోరా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండిపోరా
بنڈ پُور
జిల్లా
వూలార్ సరస్సు, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు
వూలార్ సరస్సు, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు
దేశం India
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాబండిపోరా
Population
 (2001)
 • Total25,714
భాషలు
 • ఉర్దుఉర్దూ
 • వాడుక భాషకాశ్మీరి
Time zoneUTC+5:30
Websitehttp://bandipore.gov.in

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో బండిపోరా (బండిపోర్, బండిపురా అని కూడా అంటారు) జిల్లా ఒకటి. (Bandipora also spelled Bandipore, Bandipur, Bandipura) బండిపోరా పట్టణం బండిపోరా జిల్లా, పరిపాలనా కేంద్రంగా ఉంది. ఇది వూలర్ సరోవరం (ఆసియాలో అతి పెద్ద మంచినీటి సరోవరం) ఉత్తరతీరంలో ఉంది. శ్రీనగర్ లోని నిషాత్ బాగ్‌ను పోలిన టెర్రస్ గార్డెన్ బండిపోరాలో కూడా ఉంది. బండిపోరా ధ్యానం, సాహిత్యం, నీరు వంటి మూడు ఉన్నత ప్రమాణాలు కలిగిన ప్రదేశంగా బండిపోరాకు ప్రత్యేకత ఉంది.

భౌగోళికం[మార్చు]

బండిపోరా ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరోవరమైన వూలర్ సరోవరం పక్కన ఉంది. ఈ సరసు వలస పక్షులకు నిలయం. అశ్రద్ధగా కలుషిత నదీజలాలు ఈ సరసులో వచ్చి చేరుతున్న కారణంగ సరోవర జాలాలలో రోగపూరితమైన అల్గీ అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది సరసు ఉనికికి, దానిని ఆశ్రయించి ఉన్న ప్రాణుల ఉంకికీ ప్రమాదంగా మారింది. వూలర్ సరసులో అత్యధికంగా కలుషితం చేస్తున్న నది జెహ్లం. జెహ్లం నది శ్రీనగర్, పరిసర ప్రాంతాల నుండి వ్యర్ధాలను తీసుకువచ్చి వూలర్ సరసుకు చేర్చుతూ ఉంది. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరసు దక్షిణాసియాలో సుసంపన్నమైన చిత్తడి భూమి అయిన వూలర్ సరసును రక్షించడానికి ఏటువంటు చర్యలను తీసుకోవడం లేదు. కుప్వారా జీల్లాలో ఉన్న ప్రఖ్యాత లోలాబ్ లోయ బండిపోరా జిల్లాను ఆనుకుని ఉంది. బండిపోరా పట్టణం నుండి అలూసా మీదుగా 30 కి.మీ ప్రయాణించి లోలాబ్ లోయను చేరుకోవచ్చు. ఉత్తర భారతదేశాన్ని మద్య ఆసియాతో అనుసంధానించే సిల్క్ రోడ్ మార్గం బండిపోరా జిల్లాలోనే ఉంది. పజల్‌పోరా గ్రామంలో కస్టంస్, ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రద్తుతం ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉంది. స్కర్దు గురేజ్, బండిపోరా మద్య బలమైన బంధం ఉంది.

తహసీల్సు[మార్చు]

బండిపోరా జిల్లా 3 తెహ్సిల్సు (గురెజ్, సుంబల్ జమ్మూ కాశ్మీరు, బండిపోరా) ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో మొత్తం జనాభా 392,232. వీరిలో 207,680 మంది పురుషులు కాగా, 184,552 మంది మహిళలు ఉన్నారు.జిల్లాలో మొత్తం 58,392 కుటుంబాలు నివసిస్తున్నాయి. బండిపోరా జిల్లా సగటు లింగ నిష్పత్తి 1000:889గా ఉంది.పట్టణ ప్రాంతాల్లో 16.7% మంది నివసిస్తుండగా, 83.3% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 65.4% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 54.3%గా ఉంది. జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి1000: 845 కాగా, గ్రామీణ ప్రాంతాలలో 1000: 898గా ఉంది.జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సులోపు గల పిల్లల జనాభా 61754, ఇది మొత్తం జనాభాలో 16%గా ఉంది. 0-6 సంవత్సరాల వయస్సు లోపు 32641 మంది మగ పిల్లలు, 29113 మంది ఆడ పిల్లలు ఉన్నారు.బాలల లైంగిక నిష్పత్తి 892, ఇది బండిపోరా జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (889) కంటే ఎక్కువ. జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 56.28%.జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 56.36%, మహిళా అక్షరాస్యత రేటు 37.35%గా ఉంది.[1]

2001 గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లా మొత్తం జనాభా 3,04,886 ఉండగా,1,60,967 మంది పురుషులు, 1,43,919 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లా సరాసరి అక్షరాస్యత 39.01% అందులో పురిుషుల అక్షరాస్యత 50.26% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 26.23%గా ఉంది.జిల్లా జనాభాలో ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయస్సు గలవారు 61,754 మంది ఉన్నారు. వారిలో బాలురు 32,641 ఉండగా, బాలికలు 29,113 మంది ఉన్నారు. పురుష స్త్రీ నిష్పత్తి 1000:894 ఉండగా, బాల బాలికల నిష్పత్తి 1000:892 గా ఉంది.[2]

ప్రజలు[మార్చు]

బండిపొరా జిల్లాలో అధికంగా ముస్లిములు ఉన్నారు. ఇక్కడ ఉన్న పండితులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస పోయారు. అజర్, కలుస, ఖరపోరా, మంత్రిగాం అరగం మొదలైన గ్రామాలలో అధికమైన పండితుల కుటుంబాలు ఉండేవారు. ఇప్పటికీ ఈ గ్రామాలలో పండితులు వలస పోకుండా నివసిస్తున్నారు. వీరంతా ఇరుగు పొరుగు ముస్లిం కుటుంబాలతో మైత్రీ భావంతో మెలగుతూ సంతోషంగా జీవిస్తున్నారు. శారదా మందిర్ అనే పిలిచే కలూసా ఆలయం అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇక్కడ కొన్ని వందల పురాతనమని భావిస్తున్న 3 ఆలయాలు ఉన్నాయి. ఇది సాధారణంగా బ్రాన్ (మూడు) అని పిలువబడుతుంది. ఈ జిల్లాలో కొత్తగా రూపొందించబడిన పలు గ్రామాలున్నాయి. బండిపోరా జిల్లాలో " ది ఫారెస్ట్ ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ కాశ్మీర్ " ఉంది. ఇది 1905లో స్థాపినబడింది. ఆటవీ రక్షణకు ఇది ఆరంభ శిక్షణ ఇస్తుంది.

భాషలు[మార్చు]

బండిపోరా జిల్లాలోని ప్రజలు అధికంగా కాశ్మీరి, గోజ్రి, పహారి భషను మాట్లాడుతుంటారు. గుర్జే తెహ్సిల్‌లోని ప్రజలలో షినా భాష వాడుకలో ఉంది. ఈ గ్రామంలో షినా ప్రజలు అధికంగా ఉన్నారు. సరిహద్దు గ్రామంలో కంతమంది పష్టన్ ప్రజలు ఉన్నారు. గుర్జ్ గ్రామంలో " కిషన్ గంగా హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ " ఉంది. ఈ ప్రాజెక్ట్ విలువ 2700 కోట్లు. ఇది 330 మెగావాట్ల నిద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

విద్య[మార్చు]

బండిపోరా జిల్లాలో అక్షరాస్యత అధికంగా ఉంది. పండిట్ ప్రజలలో 100% అక్షరాస్యత ఉంది. రాంపూర్ (బండిపోరా ) వాసి " వసీం బిలాల్ షాహ్ " అడోబ్ సిస్టంస్ ఇంకార్పొరేటెడ్ రీజన్" మొదటి అధికారి అయ్యాడు. " మాట్ తాంసన్ " సంస్థకు వి.పిగా ఎన్నుకొనబడిన మొదటి కాశ్మీరీ యువకుడు " వసీం " . ఆయన క్రియాశీలకమైన కృషిని ప్రశంసిస్తూ ఆయనకు పలుమార్లు అవార్డులను బహూకరించారు. ఈ సంస్థలో ఆయన ఒక మార్గదర్శకుడుగా గుర్తించబడ్డాడు.

పట్టణాలు , గ్రామాలు[మార్చు]

బండిపోరా జిల్లా కేంద్రం బండిపోరా ప్రణాళికా బద్ధంగా నిర్మించబడింది. 1963లో అప్పటి కాశ్మీర్ ప్రధాన మంత్రి భక్షి గులాం మహమ్మద్ ఈ ప్రాంతం సందర్శించిన సందర్భంలో ఈ ప్రణాళికకు ఆమోదముద్ర వేసాడు.[3] నౌపోరా, లౌడారా, డచిగం, అహంషరీఫ్, అజర్, అలూసా, అరగమ్, అరిన్, అష్తంగూ, అయతుల్లాహ్, బారజుల్లాహ్, బొనకూట్, బిన్లీపోరా, డోబన్, డచినా, దర్ద్‌పోరా, గంరూ, గరూరా, గుండ్‌పోరా, గుండ్ -ఇ- క్వైజర్, గురెజ్, కలూసా, కెహ్నూసా, కెమహ్, ఖయర్, ఖరపోరా, క్రల్పోరా, కొనన్, లవేపోరా, మాదర్, మంగ్నిపోరా, మంత్రిగం, ముక్వాం, నదిహల్, నుసూ, పానార్, పజిగం, పపచాన్, పతుషై, పత్కూట్, క్వజిపోరా, క్విల్, రాంపోరా, సోనావాని, సుమలర్, తంగత్, తుర్క్పోరా, వటపోరా, వావెన్ మొదలైనవి. ఒకప్పుడు హిందువుల పవిత్రక్షేత్రం, చోటా అమర్నాథ్‌గా ఖ్యాతి చెందిన దనీశ్వర్ ఈ జిల్లలోనే ఉంది. ఈ గుహాలయం దట్టమైన ఎరిన్ అరణ్యాల మద్య ఉంది. ప్రజలు 60మీ ప్రాకి ఈ గుహాలయం చేరుకుని శివుని దర్శిస్తారు. ప్రజలు ఈ గుహాలయానికి శ్రావణ పూర్ణిమ నాడు చేరుకుంటారు. అమర్‌నాథ్ గుహాలయానికి కూడా అదే ముఖ్యమైన రోజు.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

అరిన్ నల్లా ట్రౌట్ హెవెన్
స్థానిక ట్రౌట్ హంటర్

బండిపోరా జిల్లా కాశ్మీర్‌లోని ప్రఖ్యాత " ఫారెస్ట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ "కు ఆతిథ్యం ఇస్తుంది. ప్రధానపట్టణానికి ఇది 3 కి.మీ దూరంలో ఉన్నాయి. " డ్రౌల్- ఉల్లమ్-రెహమియా "(ఫిలాసఫర్ స్కూల్) అనందమైన వాతావరణంతో కాశ్మీర్లో ఇది అతిపెద్ద మతపరమైన శిక్షణాసంస్థ అని గుర్తింపు పొందింది. కాశ్మీర్ లోయలో ఇది అతిపెద్ద ఇస్లామిక్ ఇంస్టిట్యూషన్ , దేశంలో రెండవ స్థానంలో ఉంది. బండిపోరా జిల్లా ట్రాకింగ్ , పర్వతారోహణ , చేపలు పట్టడం మొదలైన వాటికి ప్రసిద్ధం. ప్రఖ్యాత " అరిన్ నల్లా "రెయిన్‌బో ట్రాట్, సిల్వర్ ట్రాట్, గ్రే ట్రాట్ చేపలు ఖ్యాతిచెందింది.

హర్‌ముఖ్[మార్చు]

పర్వతారోహకులకు హర్‌ముఖ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇది పట్టణానికి తూర్పు దిశలో ఉంది. కొడారా వరకు బాడుగ కార్లు లభిస్తాయి.కార్లు నిలిచే ప్రదేశం నుడి కొండ ప్రాంతం మొదలౌతుంది కనుక కాలినడకన 17 కి.మీ ప్రయాణించి హర్‌ముఖ్ శిఖరం చేరుకోవాలి. సీరాసిర్ (ఆత్మల సరసు) హర్‌ముఖ్ పర్వతారోహకులకు బేస్‌క్యాంపుగా ఉంది. జిల్లా ఉత్తర భూభాగంలో బండిపోరా పట్టణానికి 86 కి.మీ దూరంలో ఉన్న గురెజ్ ఉంది. కాశ్మీర్ రాష్ట్రంలోని అనదమైన ప్రదేశంలో ఒకటిగా గురెజ్‌కు ప్రత్యేకత ఉంది. అధిక మంచుపాతం కారణంగా ఈ మార్గం శీతాకాలంలో మూసివేయబడుతుంది.

ఈ ప్రదేశం సహజ సౌందర్య దృశ్యాలతో అలరాతుతూ ఉంటుంది. అలాగే సరేందర్, కుదర, వేవన్, మోవా, ట్రెసంగం పర్వతావళి ఉన్నాయి. ఈ ప్రదేశాలలో గుజ్జర్లు (బకర్‌వాలాలు) అధికంగా నివసిస్తుంటారు. సహజ సౌందర్యం తొణికిసలాడే అందం, ప్రశాంతమైన ప్రదేశాలనేకం ఉన్నప్పటికీ బండిపోరాకు జమ్మూ కాశ్మీర్ పర్యాటక చిత్రపటంలో స్థానం లేదు.

మూలాలు[మార్చు]

  1. "Bandipora District Population Religion - Jammu and Kashmir, Bandipora Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-30. Retrieved 2020-11-29.
  2. "Bandipora (Bandipore) District Population Census 2011-2020, Jammu and Kashmir literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2020-11-29.
  3. http://www.greaterkashmir.com/news/2011/Jan/4/-neglected-then-neglected-now--50.asp

వెలుపలి లింకులు[మార్చు]