బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
(బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి


పదవీ కాలం
 2018 - ప్రస్తుతం
ముందు డి.కె.అరుణ
నియోజకవర్గం గద్వాల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1967, సెప్టెంబరు 21
గద్వాల, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు వెంకటరామ్ రెడ్డి - రేవతమ్మ
జీవిత భాగస్వామి జ్యోతి
సంతానం ఒక కుమారుడు

బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున గద్వాల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం, విద్య[మార్చు]

కృష్ణమోహన్ రెడ్డి 1967, సెప్టెంబరు 21న వెంకటరామ్ రెడ్డి - రేవతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాలలో జన్మించాడు.[2] 1982లో గద్వాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి, 1988లో ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌ను పూర్తిచేసాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కృష్ణమోహన్ రెడ్డి కొంతకాలం వ్యాపారం చేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కృష్ణమోహన్ రెడ్డికి జ్యోతితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.

రాజకీయ విశేషాలు[మార్చు]

చదువుకునే రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చురుకుగా పనిచేశాడు, అక్రమ మైనింగ్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.[3] 2009లో తెలుగుదేశం పార్టీ తరపున గద్వాల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె. అరుణ చేతిలో ఓడిపోయాడు.[4] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె. అరుణ చేతిలో 8,260 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[6] బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె. అరుణపై 51,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8]బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 26 జనవరి 2022న జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[9]

ఇతర వివరాలు[మార్చు]

సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-06.
  2. admin (2019-01-08). "Gadwal MLA Bandla Krishna Mohan Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-06.
  3. "Bandla Krishna Mohan Reddy | MLA | Bureddypally | Dharoor | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-16. Retrieved 2021-09-06.
  4. 4.0 4.1 "Bandla Krishna Mohan Reddy(TRS):Constituency- GADWAL(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-06.
  5. Namasthe Telangana (27 June 2021). "అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తాం". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  7. "dk aruna defeated by krishnamohan reddy". ww25.saakshyam.com. Retrieved 2021-09-06.
  8. "Bandla Krishna Mohan Reddy(TRS):Constituency- GADWAL(JOGULAMBA-GADWAL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-06.
  9. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)