Jump to content

బందిని

వికీపీడియా నుండి
బందిని
బందిని పోస్టర్
దర్శకత్వంబిమల్ రాయ్
రచననబేందు ఘోష్ (స్క్రీన్‌ప్లే)
పాల్ మహేంద్ర (సంభాషణలు)
దీనిపై ఆధారితంచారు చంద్ర చక్రవర్తి రచించిన తామసి
నిర్మాతబిమల్ రాయ్
తారాగణంనూతన్
అశోక్ కుమార్
ధర్మేంద్ర
ఛాయాగ్రహణంకమల్ బోస్
కూర్పుమధు ప్రభావ్లకర్
సంగీతంసచిన్ దేవ్ బర్మన్
నిర్మాణ
సంస్థ
బిమల్ రాయ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1963 (1963)
సినిమా నిడివి
157 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

బందిని (అర్థం: ఖైదీ) 1963లో విడుదలైన హిందీ చలన చిత్రం. దీనికి బిమల్ రాయి దర్శకత్వం వహించి, ఆయనే నిర్మించారు. ఈ చిత్రంలో నూతన్ తన అత్యుత్తమ నటన ప్రదర్శించింది. అశోక్ కుమార్, ధర్మేంద్ర కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళా ఖైదీ కల్యాణి కథను చెబుతుంది. అన్ని బాధలు భరించే, త్యాగశీలి, అంతర్గతంగా బలమైనది అయిన బలహీనమైన భారతీయ మహిళగా ఆమె పాత్ర ఉంటుంది. ఆమె తన జీవితంలో ఇద్దరు వేర్వేరు పురుషులతో వ్యవహరించవలసి ఉంటుంది. ఒకరు ప్రేమగా వ్యవహరించే జైలు వైద్యుడు దేవేంద్ర (ధర్మేంద్ర), ఇంకోరు ఆమె గతానికి చెందిన వ్యక్తి బికాష్ (అశోక్ కుమార్).[1]

ఈ చిత్రం జరాసంధ (చారు చంద్ర చక్రవర్తి) రచించిన బెంగాలీ నవల 'తామసి' ఆధారంగా రూపొందించారు. ఆయన ఉత్తర బెంగాల్‌లో జైలు అధికారి (జైలర్)గా దీర్ఘకాలం పని చేసి, తన అనుభవాలను అనుసరించి అనేక కథలను రచించారు.

1963 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో బందిని పదవ స్థానంలో నిలిచింది. భారతదేశంలో బాక్స్ ఆఫిస్ దీన్ని ‘సెమీ హిట్’గా ప్రకటించింది.[2] అదే సంవత్సరంలో జరిగిన ఫిల్మ్ ఫేర్ పురస్కారాలల్లో ఇది ఆరు పురస్కారాలను గెలుచుకుంది—ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి మొదలగునవి. 1960ల దశకంలోని ప్రముఖ చిత్రాలలో ఇది ఒకటిగా అని ఇప్పటికీ గుర్తిస్తున్నారు. ఇది దర్శకుడు బిమల్ రాయ్ చివరి ఫీచర్ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో నూతన్ నటన భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ నటనలలో ఒకటిగా పరిగణించబడింది.[3][4]

ఈ కథ స్వాతంత్ర్యానికి పూర్వ భారతదేశంలో సుమారు 1934లో ఒక జైలులో సాగుతుంది.[5] హత్య చేసిన కారణంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న కల్యాణి, జైలు అధికారి వద్ద తన కథను చెప్పినప్పుడు, ఫ్లాష్‌బ్యాక్‌ ద్వారా ఆమె నేరానికి దారితీసిన పరిస్థితులు వెల్లడవుతాయి. కథ 1930ల బెంగాల్ లో, బ్రిటిష్ వారి కాలంలో జరుగుతుంది. కల్యాణి గ్రామ పోస్టుమాస్టర్ కుమార్తె. ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు బికాష్‌ను ప్రేమిస్తుంది. అతడు తిరిగి వస్తానని మాట ఇచ్చి గ్రామాన్ని విడిచిపోతాడు; కానీ ఎప్పటికీ తిరిగి రాడు. సమాజం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. తండ్రి దుఃఖంతో, తన బాధలతో విరిగిపోయిన కల్యాణి నగరానికి వెళ్తుంది; ఆ సమయంలో “ఓ జానేవాలే హో సకే తో లౌట్ కే ఆనా” అనే పాట వినిపిస్తుంది. నగరంలో ఆమె మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక మహిళకు సంరక్షకురాలిగా పని చేస్తుంది; ఆ మహిళే బికాష్ భార్య అని ఆమెకు తెలుస్తుంది. తన కోసం నగరానికి వచ్చిన తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడని తెలుసుకున్న కల్యాణి, క్షణిక కోపంలో తన ప్రియుడి భార్యనే తన దుఃఖాలకు కారణమని భావించి, ఆమెకు విషం ఇస్తుంది.

ఫ్లాష్‌బ్యాక్ ముగిసి జైలులోకి కథ తిరిగొస్తుంది. జైలు వైద్యుడు దేవెన్ ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు. కల్యాణి అందుకు సిద్ధంగా ఉండదు, అతడిని దూరంగా ఉంచుతుంది. దేవెన్ ఆమెకు ప్రేమ వ్యక్తం చేసిన తరువాత, ఇద్దరి మధ్య ఎప్పుడూ ఒక గోడ/అడ్డంకి కనిపించేలా సన్నివేశాలు కనపడతాయి. చిత్రంలో పరిస్థితి బాగాలేనప్పటికిని జైలు కాపలాదారు అప్పుడప్పుడు “అంతా బావుంది (All is well”) అని కేక వేస్తుంటాడు. కల్యాణి జైలు నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లే వేళ, ఒక అధికారి వ్యంగ్యంగా “అబ్ ఘర్ గృహస్తీ కి జైల్ మే ఖైద్ రహోగీ!” (ఇక ఇంటి సంసార జైలులో బంధించబడతావు!) అని చెబుతాడు. చివరికి ఆమె ఓడరేవు వద్ద బికాష్‌ను కలుస్తుంది; అతడు తీవ్రమైన అనారోగ్య స్థితిలో ఉంటాడు. అతడిని చూసి, అతని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకుంటుంది; ఆమె ప్రేమ మళ్లీ పునర్జన్మ పొందుతుంది.

నటీనటులు

[మార్చు]
  • అశోక్ కుమార్ — బికాష్ ఘోష్
  • నూతన్ బెహ్ల్ - కల్యాణి
  • ధర్మేంద్ర — దేవేంద్ర (జైలు వైద్యుడు)
  • రాజా పరాంజపే - కల్యాణి తండ్రి
  • తరుణ్ బోస్ — మహేష్ చంద్ర
  • అసిత్ సేన్ — శంబు
  • చంద్రమా బాధురి — జైలు వార్డెన్
  • మోని ఛటర్జీ - ఇన్‌స్పెక్టర్
  • కను రాయ్ - డా. వర్మ, మనోరమ నర్సింగ్ హోమ్
  • సులోచన లట్కర్
  • హీరాలాల్ - సూపరింటెండెంట్
  • ఇఫ్తేకర్
  • బేలా బోస్
  • సత్యేంద్ర కపూర్
  • సులోచన చటర్జీ — దేవేంద్ర తల్లి
  • రాజ్ వర్మ

నిర్మాణం

[మార్చు]
రచన

ఈ చిత్రానికి కథనం (స్క్రీన్‌ప్లే) నాబెన్దుఘోష్ రచించాడు. ఆయన ఇంతకూ ముందే బిమల్ రాయ్ దర్శకత్వంలోని దేవదాస్ (1955), సుజాత (1959) చిత్రాలకు కూడా పనిచేశారు. ఈ కథ జరసంధ (చారు చంద్ర చక్రవర్తి) రచించిన 'తామసి' ఆధారంగా రూపొందింది. ఉత్తర బెంగాల్‌లో జైలర్‌గా పనిచేసిన అనుభవాలపై ఆధారపడి ఆయన లౌహా-కపట్ (1953), తమాషా (1958), న్యాయదండ (1961) వంటి అనేక కథలు రాసి, బెంగాలీ సాహిత్యంలో జైలు కథల అనే కొత్త శైలికి బాటలు వేశారు.[3][5][6]

ఈ చిత్రానికి ప్రధాన చిత్రీకరణ ముంబైలోని మోహన్ స్టూడియోస్‌లో జరిగింది. అదనంగా నైనీ సెంట్రల్ జైలు, ఎరవాడ సెంట్రల్ జైలు, భాగల్పూర్ సెంట్రల్ జైళ్లలో, అలాగే ముగింపు సన్నివేశాన్ని ప్రస్తుత ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ వద్ద గంగా నది తీరంలో చిత్రీకరించారు.[7]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు ఎస్. డి. బర్మన్ సంగీతం సమకూర్చగా, పద్యాలు ప్రధానంగా శైలేంద్ర రచించాడు.[8] ఈ చిత్రంతోనే గుల్జార్ గీత రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. మొదట ఆయన ఈ అవకాశం నిరాకరించినా, సంగీత దర్శకుడు ఎస్. డి. బర్మన్ ఒప్పించడంతో, లతా మంగేష్కర్ పాడిన “మోరా గోరా అంగ్ లై లే” పాటను ఐదు రోజుల్లో రాశారు. మిగతా పాటలన్నీ శైలేంద్ర రచనలే. “మేరే సజన్ హై ఉస్ పార్”, “ఓ జానేవాలే హో సాకే” వంటి పాటలు విశేష ప్రజాదరణ పొందాయి.[9][6]

పాట గానం
"మోరా గోరా అంగ్ లై లే" లతా మంగేష్కర్
"జోగీ జబ్సే తు ఆయా" లతా మంగేష్కర్
"అబ్ కే బరస్ భేజ్" ఆశా భోంస్లే
"ఓ పంచీ ప్యారే" ఆశా భోంస్లే
"ఓ జానేవాలే హో సాకే" ముఖేష్
"మత్ రో మాతా" మన్నా డే
"ఓ మేరే మాఝీ" S. D. బర్మన్

పాటలు కథా పరిస్థితులను ప్రతిబింబించాయి. ఖైదీ ఒక పంజరంలో ఉన్న పక్షిని ఉద్దేశించి పాడే “ఓ పంచీ ప్యారే”, అలాగే కొత్త పెళ్లికూతురు తన పుట్టింటిని తలచుకునే జానపద శైలిలోని “అబ్ కే బరస్ భేజ్ భయ్యా కో బాబుల్” వంటి పాటలు, జైలు నేపథ్యంతో వినిపించడం వల్ల వ్యంగ్యాన్ని వ్యక్తం చేశాయి.[10]

మూలాలు

[మార్చు]
  1. ↑ Chatterjee, Saibal; Nihalani, Govind; Gulzar (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 599. ISBN 9788179910665.
  2. ↑ "Box Office 1963". Archived from the original on 12 February 2010. Box Office India.
  3. 1 2 Bhagwan Das Garg (1996). So many cinemas: the motion picture in India. Eminence Designs. p. 155. ISBN 81-900602-1-X.
  4. ↑ "Landmark films of the 60s: Bandini". Rediff.com. Rediff. 26 November 2008. Retrieved 4 October 2023.
  5. 1 2 Shoma A. Chatterji (3 March 2013). "Life behind bars". The Tribune. Retrieved 28 April 2013.
  6. 1 2 [(http://www.upperstall.com/films/1963/bandini) Bandini Review] Upperstall.com
  7. ↑ Film opening credits, 2:34.
  8. ↑ "Bandini 1963 songs". Earthmusic. Archived from the original on 21 June 2010. Retrieved 2026-01-27.
  9. ↑ [(https://www.thehindu.com/features/cinema/Bandini-1963/article16884224.ece) Bandini (1963)] The Hindu, 1 October 2009.
  10. ↑ [(https://books.google.com/books?id=ZI1wqkWsIjYC&dq=Bandini+1963+film&pg=PA371) Ab Ke Baras] Hindi Film Song: Music Beyond Boundaries, by Ashok Da. Ranade. Publisher:Bibliophile South Asia, 2006. ISBN 81-85002-64-9. p. 371.
"https://te.wikipedia.org/w/index.php?title=బందిని&oldid=4747348" నుండి వెలికితీశారు