బందీ (2025 సినిమా)
| బందీ | |
|---|---|
| దర్శకత్వం | తిరుమల రఘు |
| రచన | ఆదిత్య ఓం |
| స్క్రీన్ ప్లే | ఆదిత్య ఓం |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | మధుసూదన్ కోట |
| కూర్పు | ప్రకాష్ ఝా |
| సంగీతం | వీరల్ లవణ్, సుధేష్ సావంత్ |
| మాటలు | కార్తీక్ టోలీ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2025 ఫిబ్రవరి 28 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
బందీ 2025లో విడుదలైన సినిమా. గల్లీ సినిమా బ్యానర్‌పై వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించిన ఈ సినిమాకు తిరుమల రఘు దర్శకత్వం వహించాడు. ఆదిత్య ఓం[1] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 12న విడుదల చేయగా,[2] ఫిబ్రవరి 28న సినిమాను విడుదల చేశారు.
కథ
[మార్చు]ఆదిత్య వర్మ (ఆదిత్య ఓం ) ఓ కార్పొరేట్ లాయర్. మానవ సంబంధాల కంటే డబ్బే ప్రాణంగా జీవించే స్వార్ధ పూరిత వ్యక్తి. ఓ కార్పొరేట్ కంపెనీ ఒక అడవిని నాశనం చేసి అక్కడ పెద్ద ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకుంటుంది. కానీ దానికి లీగల్ సమస్యలు రావడంతో కంపెనీ తరఫున వాదించే కేసు ఆదిత్య వర్మకు వస్తుంది. ఆ కేసు ఒప్పుకున్న కొద్దిరోజులకే ఆదిత్య వర్మ కిడ్నాప్‌నకు గురవుతాడు. తాను ఏ అడవికి వ్యతిరేకంగా అయితే కేసు వాదిస్తున్నాడో అదే అడవిలో ఆదిత్య వర్మ ప్రత్యక్షమవుతాడు. అక్కడ అతనితో మాట్లాడటానికి ఎవరూ ఉండరు. ఇంతకీ ఆదిత్య వర్మను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ అడవి నుంచి బయటపడ్డాడా ? లేదా ? అసలు ఆదిత్య వర్మ కిడ్నాప్‌నకు ఉన్న సంబంధమేంటి? అనేదే మిగతా సినిమా కథ.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "ఆదిత్య ఓం 'బందీ'.. ఏ స్టేజ్‌లో ఉందంటే." Chitrajyothy. 9 January 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "అతడిని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది..? ఇంట్రెస్టింగ్‌గా ఆదిత్య ఓం బంధీ". NT News. 10 January 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "'బందీ' మూవీ రివ్యూ.. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆదిత్య ఓం హీరోగా మొదటి సినిమా ఎలా ఉంది?". 10TV Telugu. 28 February 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "బందీ రివ్యూ - సింగిల్ క్యారెక్టర్‌తో వచ్చిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?". Hindustantimes Telugu. 6 March 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.
- ↑ "Bandi Review: Engaging survival drama" (in ఇంగ్లీష్). 28 February 2025. Archived from the original on 6 March 2025. Retrieved 6 March 2025.