బకింగ్ హామ్ పాలెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బకింగ్ హామ్ పాలెస్.ఈస్ట్ ఫ్రంట్, ఇది ప్రధానమైన ముఖాకృతి; మొదట ఎడ్వర్డ్ బ్లోర్ చేత నిర్మింపబడి 1850లో పూర్తిగావింపబడి, 1913లో తిరిగి సర్ ఆస్టన్ వెబ్బ్ చేత పునరాకృతి గావించబడింది.
క్వీన్ విక్టోరియా, బకింగ్ హామ్ పాలెస్‍లో నివసించిన మొదటి రాజ్యాధినేత్రి, 1837 లో ఆమె పట్టాభిషేకం సందర్భంగా పాలెస్‍కు తరలి వచ్చింది.

బకింగ్ హామ్ పాలెస్ అనేది, లండన్‍లో బ్రిటీష్ రాజవంశానికి[1] చెందిన అధికార నివాసం. వెస్ట్ మినిస్టర్ నగరంలో ఉన్న ఈ పాలెస్, పాలనా కార్యకలాపాలకూ, రాచరికపు అతిథ్యానికీ పెట్టింది పేరు. బ్రిటిష్ ప్రజలకు సంబంధించిన ఎన్నో జాతీయ సంబరాలకూ, సంక్షోభాలకూ కూడా ఆ భవనం ప్రదర్శనా స్థలంగా (వేదికగా) నిలిచింది.

అనాదిగా బకింగ్ హామ్ హౌస్ గా చిరపరిచితమై, ఈ నాటి భవనానికి, అంతర్భాగంగా రూపు దాల్చిన ఆ ఇల్లు 1703లో అప్పటి బకింగ్ హామ్‍ యొక్క డ్యూక్ కోసం నిర్మితమై, ఒకప్పటి అతిపెద్ద ప్రాసాదంగా నిలిచి, దాదాపు 150 సంవత్సరాల వరకూ ఒక ప్రభుత్వేతర యాజమాన్య స్థలంలో ఉంది. అనంతరం ఆ భవనము 1761[2]కి చెందిన జార్జ్ III ద్వారా ఆక్రమింపబడి, క్వీన్ చార్లొట్ యొక్క వ్యక్తిగత నివాసంగా మారి, “ది క్వీన్స్ హౌస్”గా పిలువబడింది. 19వ శతాబ్దంలో జాన్ నాష్ మరియు ఎడ్వర్డ్ బ్లోర్ అనబడే వాస్తు శిల్పులు సూత్ర ప్రాయంగా ఆ భవనాన్ని విస్తరించి, ప్రధాన ప్రాంగణాన్ని మూడు శాఖలుగా ఏర్పరిచారు. అంతిమంగా 1837లో క్వీన్ విక్టోరియా హయాంలో బకింగ్ హమ్ పాలెస్, బ్రిటిష్ రాచరికపు అధికారిక రాజ ప్రాసాదంగా మారిపోయింది. ఆ కట్టడానికి చివరి ప్రధాన సంకలనాలు, ముఖ్యంగా రాజ కుటుంబీకులు సమావేశమై బయట ఉన్న జన సమూహాలను పలకరించే తూర్పు ముఖంలోని పిట్టగోడలాంటి బాగా ప్రాచుర్యం పొందిన కట్టడాలు, 19వ శతాబ్దం చివరి కాలం నుండి 20వ శతాబ్దపు ప్రారంభకాలంలోగా నిర్మితమైనాయి. అయినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ బాంబ్ వల్ల ఆ భవనంలోని ప్రార్థనా మందిరం ధ్వంసమై, ఆ ప్రదేశంలోనే క్వీన్స్ గాలరీ (ప్రదర్శన శాల) నిర్మింపబడి, రాచరిక వస్తు సేకరణను ప్రజల సందర్శనార్థం 1962 నుండి ప్రదర్శన కోసం ఏర్పాటు చేయబడింది.

19వ శతాబ్ద ప్రారంభ కాలానికి సంబంధించిన భవనం లోపలి నమూనాల్లో సర్ ఛార్లెస్ లాంగ్ సలహా మేరకు, విస్తృతంగా వాడిన ప్రకాశవంతమైన స్కాగ్లియోలా, నీలం మరియు గులాబీ వర్ణ వైడూర్యాలు ఇప్పటికీ రక్షింపబడి కనువిందు చేస్తున్నాయి. తర్వాత కింగ్ ఎడ్వర్డ్ VII పర్యవేక్షణలో, బెల్లె ఎపోకీ క్రీమ్‍ మరియు బంగారు రంగు ప్రణాళికతో పాక్షికంగా అలంకరింపబడింది. చాలా వరకూ ఉన్న చిన్న చిన్న స్వాగత మందిరాలలోని వస్తువులూ, ఉపకరణాలూ బ్రైటన్ లోని రాయల్ పవిలియన్ నుండి మరియు కార్ల్‌టన్ హౌజ్ నుండి తెప్పించబడి చైనీస్ రీజెన్సీ పద్ధతిలో సమకూర్చబడ్డాయి. ది బకింగ్ హామ్ పాలెస్ గార్డెన్ అనేది లండన్ లోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ గార్డెన్.

దేశ అధికార కార్యకలాపాలకు ఉపయోగించే స్టేట్ రూమ్స్, ప్రజల సందర్శనార్థం ఆ ప్రాంగణపు వేసవి ప్రదర్శనగా ప్రతీ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు మధ్యకాలంలో తెరుస్తారు.

చరిత్ర[మార్చు]

బకింగ్ హామ్ హౌస్, సి.1710, విలియమ్ విండే చేత, మొదటి డ్యూక్ అఫ్ బకింగ్ హామ్ మరియు నార్మన్‍బై కోసం పునరాకృతి గావించబడింది.ఈ ముఖాకృతి, క్వాడ్రాంగిల్ కు పడమర (లోపలి) వైపున, పైన గ్రీన్ డ్రాయింగ్ రూమ్ తో ఉన్న ఈనాటి గ్రాండ్ ఎంట్రెన్స్‌గా మారిపోయింది.

ప్రదేశం[మార్చు]

మధ్యయుగపు కాలంలో, బకింగ్ హామ్ పాలెస్ యొక్క ప్రదేశం ఏబ్యురీ (ఇయా అని కూడా పిలుస్తారు) కి సంబంధించిన మానర్ అంతర్భాగంగా స్థాపించబడింది. ఆ చిత్తడినేల టైబర్న్ నది పరీవాహక ప్రాంతమై, ఆ నది ఇప్పటికీ పాలెస్ యొక్క[3] ప్రధాన ప్రాంగణపు దక్షిణ శాఖ కిందుగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడైతే ఆ నది దాటగలిగే (కౌ ఫోర్డ్ వద్ద) ప్రదేశం ఉందో, దాన్ని ఐ క్రాస్ గ్ర్యూ అనే గ్రామంగా పిలుస్తారు. ఆ ప్రదేశం ఎన్నోసార్లు ఎంతో మంది హక్కుదార్ల చేతులు మారింది. వారిలో ఎడ్వర్డ్ ది కన్ఫెసర్, లేట్ సాక్సన్ లోని ఎడిత్ అఫ్ వెస్సెక్స్‌కు చెందిన అతని రాణి క్వీన్ కన్‍సోర్ట్ మరియు నార్మన్ విజయం తర్వాత పాలించిన విలియమ్ ది కాంకరర్ ముఖ్యులు. విలియమ్ ఆ ప్రదేశాన్ని జెఫ్రీ డి మాండవిలేకి ఇస్తే, అతడు దాన్ని వెస్ట్ మినిస్టర్ అబ్బే[4]కి చెందిన సన్యాసులకు వీలూనామా రాసి ఇచ్చాడు.

1951లో, ఈటన్ కాలేజ్ నుండి సెయింట్ జేమ్స్ (తరువాత సెయింట్ జేమ్స్ పాలెస్[5]గా మారింది) ఆసుపత్రిని హెన్రీ VIII హస్తగతం చేసుకుని, తర్వాత 1536లో అతడు వెస్ట్ మినిస్టర్ అబ్బే[6] నుండి మానర్ అఫ్ ఏబ్యురీని తీసేసుకున్నాడు. ఈ బదిలీల వల్ల, బకింగ్ హామ్ పాలెస్ కు చెందిన ఆ ప్రదేశం, దాదాపు 500 సంవత్సరాల క్రితం[7] విలియమ్ ది కాంకరర్ ధారాదత్తం చేసిన చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ రాజవంశస్థుల చేతిలో పడింది.

17వ శతాబ్దపు కాలంలో వివిధ రకాలైన వ్యక్తులు, రాజరిక భూస్వాముల దగ్గరి నుండి, ఆ ప్రదేశాన్ని ఫ్రెంజీడ్ స్పెక్యులేషన్ పద్ధతి కింద, స్వతంత్ర ప్రతిపత్తితో కౌలుకు తీసుకున్నారు. అప్పటి నుంచీ, ఆ పురాతన గ్రామమైన ఐ క్రాస్ క్రమంగా క్షీణించడం మొదలుపెట్టి, దాదాపు ఆ ప్రదేశం మొత్తం బంజరుభూమి[8]గా మారిపోయింది. డబ్బు అవసరమై, జేమ్స్I క్రౌన్ ఫ్రీ హోల్డ్ లోని కొంత మేరకు ప్రదేశాన్ని అమ్మేశాడు, కానీ మిగతా ప్రాంతంలో పట్టు ఉత్పత్తి కోసమని అతను ఓ4-acre (16,000 మీ2) మల్బరీ తోటను ఏర్పాటు చేశాడు. (ఇది ఇప్పుడున్న పాలెస్[9]కు వాయువ్య దిశలో ఉంది). అనార్చియా ఆంగ్లికానా (1649) లో క్లెమెంట్ వాకర్ ప్రస్తావిస్తూ " సెయ్ంట్ జేమ్స్ మల్బరీ తోటలో కొత్తగా-నెలకొల్పిన పుం మైథున, పరుగు వీరులు" దీన్ని బట్టి అక్కడ విశృంఖల వేశ్యాలోలత్వం నెలకొని ఉండేదని భావించవచ్చు అని చెప్పాడు. క్రమంగా 17 వ శతాబ్దపు చివర్లో, సంపన్నుడైన సర్ హ్యూ ఆడ్లే నుంచి అతని గొప్ప వారసురాలైన మేరీ డేవిస్[10]కు ఆ ఫ్రీ హోల్డ్ వారసత్వంగా సంక్రమించింది.

ఆ ప్రదేశపు మొట్టమొదటి గృహాలు[మార్చు]

గోరింగ్ హౌస్[మార్చు]

ఇంచుమించు 1624[11]లో సర్ విలియమ్ బ్లేక్ ఆ ప్రదేశంలో మొట్టమొదటి ఇల్లు నిర్మించాడు. తర్వాతి యజమాని లార్డ్ గోరింగ్, 1633 నుండి కొనసాగి బ్లేక్ ఇంటిని దాదాపు ఇప్పుడున్న తోటలా అభివృద్ధి పరిచిన తరువాత దానికి గోరింగ్ గ్రేట్ గార్డెన్[12][13] అనే పేరు స్థిరపడింది. ఆ తరువాత ఆయన ఆ మల్బరీ తోట మీద ఏ విధమైన శ్రద్ధ కనబరచలేదు. గోరింగ్ కు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా, 1640లో కింగ్ ఛార్లెస్ I లండన్ కు రాకముందు "ఆ దస్తావేజులు గ్రేట్ సీల్ ధ్రువీకరణలో విఫలమైనందున, ఆ ప్రాంతం చట్టపరమైన చర్య[14] లకు లోనుకావాల్సి వచ్చింది". (కింగ్ జార్జ్ III[15] హయాంలో, బ్రిటిష్ రాజకుటుంబానికి మళ్ళీ ఆ ఫ్రీ హోల్డ్ ను తిరిగి పొందటానికి ఇదే ఓ కీలకమైన వెసులుబాటుగా సహాయపడింది)

ఆర్లింగ్‍టన్ హౌస్[మార్చు]

ముందు చూపులేని గోరింగ్ ఇంటి అద్దెలను[16] పట్టించుకోనందువల్ల, గోరింగ్ హౌస్ గా పిలువబడుతున్న ఆ భవన సముదాయాన్ని హెన్రీ బెన్నెట్, మొదటి ఎర్ల్ అఫ్ ఆర్లింగ్టన్ 1674లో దాన్ని కాల్చివేసే వరకూ[13], క్రమక్రమంగా స్వాధీనపర్చుకున్నాడు. ఆ తర్వాతి సంవత్సరంలో[13]-ఆ ప్రదేశంలోనే ఆర్లింగ్టన్ భవంతి నిర్మించబడింది- ఇప్పుడున్న పాలెస్ లోని దక్షిణ శాఖ, దాని ఫ్రీ హోల్డ్ 1702లో కొనివేయబడింది.

బకింగ్ హామ్ హౌస్[మార్చు]

ప్రస్తుత పాలెస్ గా రూపుదాల్చిన ఆ ఇంటిని 1703లో విలియమ్ విండే ఇచ్చిన నమూనా ఆధారంగా మొట్టమొదటి డ్యూక్ అఫ్ బకింగ్ హామ్ మరియు నార్మన్ బై కొరకు నిర్మించారు. ఒక పెద్ద మూడంతస్తుల ప్రధాన సముదాయం, ఇరువైపులా ఉండే రెండు చిన్నచిన్న సేవా శాఖలు[17] ఉండే విధంగా కట్టడ నిర్మాణం ఎంచుకోబడింది. ఆ విధంగా 1761[2] లో, బకింగ్ హామ్ పాలెస్, బకింగ్ హామ్ వారసుడైన సర్ ఛార్లెస్ షెఫీల్డ్ ద్వారా జార్జ్ III కు £ 21,000[18] ( £<s,tro. అంటే2019) మూస:Inflation-fn అమ్మివేయబడింది.

తన తాతగారైన జార్జ్II లాగే, జార్జ్III కూడా మల్బరీ తోటను అమ్మడానికి ఒప్పుకోలేదు, దానివల్ల షెఫీల్డ్ కు ఆ ప్రదేశం యొక్క పూర్తి ఫ్రీ హోల్డ్ దక్కలేదు. ఎప్పుడైతే షెఫీల్డ్, బకింగ్ హామ్ హౌస్ ను అమ్మేశాడో అప్పుడే అది రాజకుటుంబీకుల చేతుల్లోకి వచ్చేసింది.

దస్త్రం:Buckingham palace 1897.jpg
1897 లో, బకింగ్ హామ్ పాలెస్ మరియు గార్డెన్స్.

క్వీన్ హౌస్ నుండి పాలెస్ వరకు[మార్చు]

బకింగ్ హామ్ పాలెస్ గార్డ్స్

ఆ ఇంటి ముఖ్యోద్దేశం ఏకాంత సేవనం, మరీ ముఖ్యంగా క్వీన్ చార్లొట్ కోసం ఉద్దేశింపబడి, క్వీన్స్ హౌస్[19]గా పిలువబడింది - వారి సంతానం 15 గురిలో 14 మంది పిల్లలు అక్కడే జన్మించారు. సెయింట్ జేమ్స్ యొక్క పాలెస్, రాచరికపు ఉత్సవాల అధికారిక నివాసంగా[20] ఉండిపోయింది.

1762[21]లో ఆ కట్టడ పునర్నిర్మాణం ప్రారంభించబడింది. 1820లో జార్జ్ IV పట్టాభిషిక్తుడైన తరువాత, కొంచెం చిన్నదిగా ఉండే సౌకర్యవంతమైన ఇంటిలా ఉండే విధంగా ఆ మరమ్మత్తులను అలాగే కొనసాగించాడు. ఓ పక్క కట్టడపు నిర్మాణం పనులు జరుగుతూండగానే, 1826లో వాస్తు శిల్పి జాన్ నాష్[22] సహాయంతో, రాజు ఆ ఇంటిని పాలెస్ లా మార్చడానికి సంకల్పించాడు. కొంత సామాగ్రి కార్ల్‌టన్ హౌస్ నుంచి బదిలీ చేయబడితే, మరికొంత ఫ్రెంచ్ విప్లవం[23] తరువాత, ఫ్రాన్స్ నుంచి కొనడం జరిగింది. బయటి ముఖభాగం నమూనా జార్జ్ IV కు నచ్చిన ఫ్రెంచ్ నియో-క్లాసికల్ ప్రేరణతో నిర్మింపబడింది. ఆ మరమ్మత్తు పనుల ఖర్చు విపరీతంగా పెరిగి, నాష్ నమూనా వల్ల జరిగిన దుబారా వల్ల 1829లో అతన్ని వాస్తుశిల్పిగా తొలగించడం జరిగింది. 1830లో జార్జ్ IV మరణం తరువాత, అతడి తమ్ముడైన విలియమ్ IV, ఆ పనులు[24][25] పూర్తిగావించడానికి ఎడ్వర్డ్ బ్లోర్ ను నియమించుకున్నాడు. ఒకానొక దశలో విలియమ్, అప్పటి వరకూ కట్టిన ఆ నిర్మాణాన్ని కాల్చివేసి, 1834[26]లో ఆ పాలెస్ ను కొత్త హౌస్ అఫ్ పార్లమెంట్ గా మార్చేయాలనుకున్నాడు.

రాజ్యాధినేత నివాసం[మార్చు]

ఈ పాలెస్ సి. 1837, పాలెస్ సరిహద్దుల్లో ఉండి ఉత్సవ ప్రవేశద్వారంగా వాడుకలోఉన్న మార్బుల్ స్వాగత తోరణాన్ని వర్ణిస్తోంది.1847 లో నిర్మించబడి, క్వాడ్రాంగిల్‍ను అంతర్భాగంగా కలిగి ఉన్న తూర్పు శాఖకు దారి ఏర్పరచడానికి దీన్ని అక్కడి నుండి తరలించారు.

అప్పటి రాజైన విలియమ్ IV, ఆ భవన నిర్మాణం పూర్తి కాక మునుపే[27] మరణించినందువల్ల, అతని స్థానంలో గద్దెనెక్కిన క్వీన్ విక్టోరియా[28] పట్టాభిషేకంతో బకింగ్ హామ్ పాలెస్, చివరికి 1837లో ప్రధాన రాచరిక నివాసంగా మారిపోయింది. స్టేట్ రూమ్స్ ఓ రకమైన రంగుతో దెబ్బతినడం వల్ల, కొత్త పాలెస్ కు సంబంధించిన సదుపాయాలు ఎంతో కొంత తక్కువ విలసవంతంగా ఉండేవి. ఒక్కోసారి దీపాల వల్ల రేగే పొగను ఆర్పడానికి, మంటను పూర్తిగా తగ్గించాల్సి వచ్చేది, ఫలితంగా మంచుతో కప్పబడటం[29] వల్ల ఆ కోర్టులో చలికి వణకాల్సి వచ్చేది. సరైన వెలుతురు లేనందువల్ల, లోపలంతా దుర్గంధం వ్యాపించేది, ఎప్పుడైతే గ్యాస్ ఆధారిత దీపాలు నెలకొల్పాలనే నిర్ణయం తీసుకోబడిందో, దాని వల్ల వ్యాపించే గ్యాస్ వల్ల కింది అంతస్తుల్లో తీవ్రమైన ఆందోళన చెలరేగేది. పనికి మాలిన సిబ్బంది, అపరిశుభ్రమైన భవంతి[29] అని అప్పట్లో అందరూ అనుకునేవారు. 1840లో క్వీన్ వివాహానంతరం ఆమె భర్త, ప్రిన్స్ ఆల్బర్ట్ వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, అన్ని హౌస్ హోల్డ్ కార్యాలయాలనూ, సిబ్బంది పనితీరునూ మెరుగు పర్చి, పాలెస్ లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దాదాపు 1840 నాటికి సమస్యలన్నీ దారిలోకి వచ్చాయి. అయినా, నిర్మాణ కర్తలు ఆ దశాబ్దంలోనే తిరిగి రావాల్సి ఉంది.

1847 లో కోర్టు వ్యవహారాలకూ, వృద్ధి చెందుతున్న తమ కుటుంబానికీ[30] ఆ పాలెస్ సరిపోదని ఆ జంట గ్రహించడంతో, ఎడ్వర్డ్ బ్లోర్ నమూనాకు అనుగుణంగా థామస్ క్యుబిట్[31] ద్వారా నిర్మితమై, ప్రధాన చతురస్రాకృతి రూపాన్ని కూడి ఉన్న కొత్త శాఖ రూపుదాల్చింది. బకింగ్ హామ్ పాలెస్ యొక్క "ప్రజా ముఖం" అంటే, ఇప్పుడున్న భవనం యొక్క అతి పెద్ద తూర్పు ముఖద్వారంలో రాజకుటుంబీకులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో, లేదా వార్షికోత్సవ సందర్భాలలో, ట్రూపింగ్ ది కలర్ కార్యక్రమం తరువాత ప్రజలకు అభివాదాలు తెలుపడానికి ఉపయోగించే బాల్కనీ (పిట్టగోడ) ఏర్పాటు చేయబడింది. నాష్ శిష్యుడైన సర్ జేమ్స్ పెన్నెథ్రోన్ నమూనాల ఆధారంగా, బాల్ రూమ్ శాఖ, స్టేట్ రూమ్స్ కు సంబధించిన మిగతా సూట్స్ అన్నీ ఈ కాలంలోనే నిర్మింపబడ్డాయి.

ప్రిన్స్ ఆల్బర్ట్ మరణించే వరకూ, ఆ పాలెస్ లో తరచుగా సంగీత వినోదాల[32] దృశ్యం కనిపిస్తూ ఉండేది, అలా బకింగ్ హామ్ పాలెస్ వేదికగా ఆ కాలంలోని ఎంతోమంది గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు తమ సంగీతంతో రంజింపజేసేవారు. ప్రముఖ స్వరకర్త ఫెలిక్స్ మెండల్‍సన్ మూడు సందర్భాలలో[33] అక్కడ తన సంగీతంతో ఆకట్టుకున్నాడని ప్రతీతి. జాన్ స్ట్రాస్ II ఇంగ్లాండ్[34]లో ఉన్నప్పుడు తమ ఆర్కెస్ట్రా‌తో అక్కడ ప్రదర్శనలిచ్చాడు. స్ట్రాస్ యొక్క "అలిస్ పోల్కా" మొట్టమొదటిసారిగా 1849లో క్వీన్ కుమార్తె, ప్రిన్సెస్ అలిస్[35] గౌరవార్థం ఆ పాలెస్ లో ప్రదర్శింపబడింది. విక్టొరియా కాలంలో, సాధారణ రాజరిక ఉత్సవాల్లోనూ, ప్రారంభోత్సవాల్లోనూ మరియు బహూకరణ మహోత్సవాల్లోనూ చాలా ఖరీదైన అసాధారణ వస్త్రాలంకరణ దృశ్యాలు కనిపిస్తుండేవి.

1861లో విధవగా మారిన తరువాత, ఎంతో మనోవేదన అనుభవించిన క్వీన్, పౌర జీవితం నుండి విరమించుకుని బకింగ్ హామ్ పాలెస్ ను వదిలిపెట్టి విండ్సర్ కాజిల్, బల్మోరల్ కాజిల్, మరియు ఒస్‍బోర్న్ హౌస్ ల్లో గడిపింది. చాలా సంవత్సరాల వరకూ ఆ పాలెస్ వినియోగంలో లేక, నిరాదరణకు గురైంది. దాని పర్యవసానంగా ప్రజాభీష్టం మేరకు బలవంతంగా ఆమె లండన్‍కు రావలసి వచ్చినా, అవకాశం దొరికినప్పుడు ఆమె వేరే చోట నివసించడానికే ఇష్టపడేది. బకింగ్ హామ్ పాలెస్ సంవత్సరంలో ఎప్పుడూ మూతబడి[36], శోకానికి గుర్తుగా ఉండే నల్లటి వస్త్రాలతో విచారంగా ఉన్న క్వీన్ ఆధ్వర్యంలో రాజ దర్బారు పాలెస్‍ను వదిలి ఇంకా విండ్సర్ కాజిల్ లోనే జరుగుతూండేది.

లోపలి భాగము[మార్చు]

బకింగ్ హామ్ పాలెస్ యొక్క పియానో నొబైల్.ఎ: స్టేట్ డైనింగ్ రూమ్; బి: బ్లూ డ్రాయింగ్ రూమ్; సి: మ్యూజిక్ రూమ్; డి: వైట్ డ్రాయింగ్ రూమ్; ఇ: రాయల్ క్లోసెట్; ఎఫ్: థ్రోన్ రూమ్; జి: గ్రీన్ డ్రాయింగ్ రూమ్; హెచ్: క్రాస్ గ్యాలరీ; జె: బాల్ రూమ్; కె: ఈస్ట్ గ్యాలరీ; ఎల్: యెల్లో డ్రాయింగ్ రూమ్; ఎమ్: సెంటర్/బాల్కనీ రూమ్; ఎన్: చైనీస్ లంచియన్ రూమ్; ఓ: ప్రిన్సిపల్ కారిడార్; పి: ప్రైవేట్ అపార్ట్‌మెంట్స్; క్యు: సర్వీస్ ఏరియాస్; డబ్ల్యు: ది గ్రాండ్ స్టెయిర్‌కేస్.గ్రౌండ్ ఫ్లోర్ లో: ఆర్: అంబాసిడర్స్ ఎంట్రెన్స్; టి: గ్రాండ్ ఎంట్రెన్స్.పైన ఉదహరించిన ప్రదేశాలన్నీ పూతపూసిన గోడలతో క్రిందిస్థాయి శాఖలుగా పాతినిధ్యం వహిస్తాయి.సూచన: ఇది కచ్చితమైన కొలతలు లేని రేఖాచిత్రం పరిశీలన కోసం మాత్రమే.కొన్ని గదుల నిష్పత్తులు మూలానికి కొంచెం అటూ ఇటూ ఉండవచ్చు.

పాలెస్ చుట్టుకొలత 108మీటర్లు/120మీటర్లుగా ఉండి, 24 మీటర్ల ఎత్తుతో 77,000 చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన ప్రాంగణాన్ని (828,818 చదరపు అడుగులు) [37] కలిగి ఉంటుంది. పాలెస్ యొక్క ముఖ్యమైన గదులు పియానో నోబైల్ ను కలిగి ఉండి, పాలెస్ కు వెనుక వైపుగల పడమటి ముఖద్వారపు తోటకు వెనుక వైపు ఉంటాయి. మధ్యలో అలంకరణతో ఉన్న స్టేట్ రూమ్ అనేది మ్యూజిక్ రూమ్, ఇది విల్లు ఆకృతిలో ఉండి ఆ భాగానికే ప్రముఖమైన అంశంగా విలసిల్లుతోంది. మ్యూజిక్ రూమ్‍కు ఇరువైపులా ఉండేవి నీలం మరియు తెలుపు వర్ణాల్లో ఉండే డ్రాయింగ్ రూమ్స్. సూట్ మధ్యలో నుండి, స్టేట్ రూమ్స్‌‍ను కలుపుతూ కారిడార్ గా వాడుకలో ఉన్న పిక్చర్ గ్యాలరీ (చిత్ర ప్రదర్శన శాల) ఎత్తుగా ఉండి, 55 గజాల (50మీ.) పొడవును[38] కలిగి ఉంటుంది. గాలరీలో ఎన్నో చిత్రపటాలు, వాటిల్లో కొన్ని రెంబ్రాంట్, వాన్ డిక్, రూబెన్స్ మరియు వెర్మీర్[39][40] గీసినవి వేలాడదీయబడి ఉంటే, గాలరీ నుండి వెళ్ళగలిగిన ఇతర గదుల్లో ఒకటి థ్రోన్ రూమ్ కాగా, మరొకటి గ్రీన్ డ్రాయింగ్ రూమ్. గార్డ్ రూమ్ మీదుగా గ్రాండ్ స్టైర్[38] కేస్ పై నుండి, ఉత్సవాల సమయంలో థ్రోన్ కు వెళ్ళడానికి గ్రీన్ డ్రాయింగ్ రూమ్ ప్రధాన దారిలా ఉంటూనే, థ్రోన్ రూమ్ కు సంబంధించిన విశ్రాంతి గదిగా ఉపయోగించబడుతుంది. గార్డ్ రూమ్‍లో ఆకర్షణీయమైన దుస్తుల్లో, ట్రిబ్యూన్ వరుసలో తీర్చిదిద్దిన, క్వీన్ విక్టోరియా మరియు ప్రిన్స్ ఆల్బర్ట్ పాలరాతి శిల్పాలు నెలకొల్పబడి ఉంటాయి. ఉత్సవాలు మరియు అధికారిక వినోదాల సమయంలో తప్ప ఉపయోగించని ఈ సాధారణ గదులు, ప్రతి సంవత్సరం వేసవిలో మాత్రం ప్రజల కోసం తెరుస్తారు.

స్టేట్ అపార్ట్‌మెంట్స్‌కు కచ్చితంగా కింద నెలకొల్పబడ్డ గదులు, కొంచెం తక్కువ వైభవంగా ఉండి, సెమీ-స్టేట్ అపార్ట్‌మెంట్స్‌గా పిలువబడతాయి. మార్బల్ హాల నుండి ప్రారంభమయ్యే ఈ గదులు ఓ మోస్తరు విందులకు, చిన్న చిన్న వినోదాలకు, మరియు ఇతర ప్రేక్షకులు వాడుకోడానికి ఉపయోగించబడతాయి. కొన్ని గదులకు కొంతమంది ప్రత్యేకమైన సందర్శకుల పేర్లు పెట్టబడి, అలంకరింపబడి ఉంటాయి, మచ్చుకు 1844లో సందర్శించిన రష్యా చక్రవర్తి నికోలస్ I కు గుర్తుగా ఒక గదికి 1844 రూమ్ అనీ, మరియు బో రూమ్ కు ఆ పక్కన ఉన్న ఇంకో గదికి ఫ్రెంచి[41] చక్రవర్తి నెపోలియన్ III కు గుర్తుగా 1855 రూమ్ అనీ పేర్లు పెట్టారు. ఈ సూట్‍కు మధ్యలో ఉన్నదే బో రూమ్, దాని గుండానే వెళ్ళి వేలాదిమంది అతిథులు వెనుక వైపు ఉన్న తోటల్లో[42] జరిగే క్వీన్స్ గార్డెన్ విందుల్లో పాలుపంచుకుంటారు. క్వీన్ మాత్రం తన వ్యక్తిగత అవసరాలకు ఉత్తరం వైపు శాఖలో ఉన్న ఒక చిన్న సూట్ ను ఉపయోగించుకుంటుంది.

ప్రిన్స్ ఆల్బర్ట్ యొక్క మ్యూజిక్ రూమ్, 1887 లో పాలెస్‍లో ఉన్న తక్కువ లాంఛనప్రాయమైన అన్ని గదుల్లోకెల్లా చిన్నది.

1847 మరియు 1850ల మధ్య కాలంలో బ్లోర్ తూర్పు శాఖను కట్టిస్తున్న సమయంలో, మరోసారి బ్రైటన్ పెవిలియన్ లోంచి పరికరాలు కొల్లగొట్టబడ్డాయి. ఫలితంగా, కొత్త శాఖలోని చాలా గదుల్లో తూర్పుదేశాలకు సంబంధించిన విలక్షణమైన వాతావరణం గోచరిస్తుంది. ఎరుపు నీలం రంగుల చైనీస్ మధ్యాహ్న భోజనశాల, బ్రైటన్ బాంక్వెటింగ్ మరియు మ్యూజిక్ రూమ్స్ కు సంబంధించిన వస్తువులతో రూపొందించబడింది, కానీ అందులోని పొగగొట్టం మాత్రం డబ్ల్యు.ఎమ్. ఫీతమ్ చే తయారుచేయబడింది. యెల్లో డ్రాయింగ్ రూమ్ కు ఉన్న వాల్ పేపర్ 1817లో బ్రైటన్ సెలూన్ కోసం సప్లై చేయబడింది, ఇంకా ఆ పొగగొట్టం మాత్రం పూర్తిగా మాండరిన్ లిపితో, భయం గొలిపే డ్రాగన్స్‌తో, రాబర్ట్ జోన్స్[43] చే రూపొందింపబడిన యూరోపియన్ నమూనా, అయినప్పటికీ అది చైనీస్ నమూనా మాదిరిగానే కనిపిస్తుంది.

ది క్వీన్స్ బ్రేక్‍ఫాస్ట్ రూమ్

ఈ శాఖకు మధ్యలో ఉండి, మధ్య గదితో అద్దాల తలుపులకు వెనుకనున్నదే బాగా ప్రాచుర్యం పొందిన బాల్కనీ. ఇది చైనీస్ శైలిలో, అధికమైన "బైండింగ్"[44] తో, డిజైనర్ సర్ ఛార్లెస్ ఆలమ్ తో కలిసి పనిచేస్తున్న క్వీన్ మేరీ చే 1920 చివరి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చైనీస్ ఇతివృత్తంతో మెరుగుపర్చబడ్డ సెలూన్. అయినప్పటికీ దానికి అమర్చబడిన లక్క తలుపులు మాత్రం 1873లో బ్రైటన్ నుంచి తెప్పించబడినవి. తూర్పు శాఖలో ఉన్నపియానో నొబైల్ మీదుగా కనిపించేది మహా గాలరీ, దాన్నే ప్రిన్సిపల్ కారిడార్ అని కూడా పిలుస్తారు, అది క్వాడ్రాంగిల్[45] (చతురస్రాకార ప్రాంగణము) నుంచి తూర్పు దిశగా వెళ్తుంది. అది అద్దాల తలుపులను, అడ్డంగా ఉండే అద్దాల గోడలను, పింగాణీ కుడ్యాలను మరియు బ్రైటన్ నుంచి తెప్పించిన ఇతర ప్రాచ్య వస్తుసామాగ్రిని కలిగి ఉంటుంది. మధ్య గది మధ్యలోనే ఉండి, చైనీస్ భోజన శాల మరియు యెల్లో డ్రాయింగ్ రూమ్, ఈ గాలరీకి ఇరువైపులా ఏర్పాటు చేయబడ్డాయి.

19వ శతాబ్ద ప్రారంభకాలానికి సంబంధించిన భవనం లోపలి నమూనాల్లో సర్ ఛార్లెస్ లాంగ్ సలహా మేరకు, విస్తృతంగా వాడిన ప్రకాశవంతమైన స్కాగ్లియోలా, నీలం మరియు గులాబీ వర్ణ వైడూర్యాలు ఇప్పటికీ రక్షింపబడి కనువిందు చేస్తున్నాయి. తర్వాత కింగ్ ఎడ్వర్డ్ VII పర్యవేక్షణలో, బెల్లె ఎపోకీ క్రీమ్‍ మరియు బంగారు రంగు శైలితో[46] పాక్షికంగా అలంకరింపబడింది.

సాధారణంగా ఇతర దేశాల ప్రముఖులు ఎప్పుడు బ్రిటన్ ను సందర్శించినా, బకింగ్ హామ్ పాలెస్ లోని క్వీన్ అతిథ్యాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. వారికి కింది అంతస్తులో, తోటకు ఉత్తర ముఖంగా ఉండే మినిస్టర్ స్టైర్ కేస్ ప్రారంభంలో ఉన్న బెల్జియన్ సూట్ అనబడే అతిపెద్ద సూట్ ఇవ్వబడుతుంది. ఆ సూట్లో ఉండే గదులు ఇరుకైన కారిడార్లతో కలుపబడి, ఎత్తుగా ఉండి, నాష్ చే రూపొందించబడ్డ సాసర్ డోమ్స్ దృష్టికోణంలో అలంకరిపబడి, సోయేన్[47] శైలిని కలిగి ఉంటాయి. ఇదే సూట్లో ఉన్న రెండో కారిడార్, గోథిక్ శైలిలో ఉండే అడ్డంగా ఉన్న నేలమాళిగ[47]. ఇక బెల్జియన్ గదులు వారి సొంత శైలిలోనే అలంకరింపబడి, బెల్జియమ్ మొదటి రాజైన ప్రిన్స్ ఆల్బర్ట్ అంకుల్ లియోపార్డ్ I యొక్క పేరుపెట్టబడి ఉంటాయి. అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సూట్ ప్రత్యేకంగా విదేశీ ప్రముఖుల కోసం మాత్రమే కేటాయించడం లేదు; 1936లో, వాటిని ఎడ్వర్డ్ VIII[48] ఆక్రమించిన తరువాత క్లుప్తంగా పాలెస్ లోని ప్రైవేట్ అపార్ట్‌మెంట్ గా మారిపోయింది.

ఆస్థాన కార్యక్రమాలు[మార్చు]

బకింగ్ హామ్ పాలెస్ లో ఉన్న గదుల్లోకెల్లా బాల్‍రూమ్ అతిపెద్దది.అది క్వీన్ విక్టోరియా చేత చేర్చబడి, ఇన్వెస్టిట్యూర్స్ మరియు స్టేట్ బాంక్వెట్స్ లాంటి వేడుకలకు ఉపయోగింపబడేది.ఈ చిత్రం 1856 కాలం నాటిది.ముఖ్యంగా గోల్డ్ డీటైల్స్ తో కూడిన వైట్ డేకొరేషన్ మరియు ఎరుపు రంగు మెత్తటి ఆసనాలకు మాత్రమే పాలీక్రోమ్ కలర్ స్కీమ్‍ను ప్రత్యామ్నాయంగా వాడబడింది.

కోర్టు డ్రెస్[మార్చు]

పూర్వం, పురుషులు సైనిక దుస్తులు ధరించకుండా, 18వ-శతాబ్దపు పద్ధతిలో మోకాలి వరకూ ఉండే బ్రీచెస్ ధరించేవారు. స్త్రీలు ఈవెనింగ్ డ్రెస్ తో పాటు తప్పనిసరిగా ట్రైన్స్ మరియు తియారాస్ లేదా వారి కొప్పులో ఈకలు (లేదా రెండూ) ధరించేవారు.

సాధారణ కోర్టు డ్రెస్ కోడ్‍‍కు సంబంధిచిన కోర్టు యూనిఫార్మ్ మరియు డ్రెస్ చాలా సౌకర్యవంతంగా ఉండేవి. మొదటి ప్రపంచపు యుద్ధం తరువాత, క్వీన్ మేరీ అప్పటి ఫ్యాషన్‍ను అనుసరించడం కోసం తన తన గౌనును భూమి నుంచి కొన్ని అంగుళాలు పైకి ఉండేలా తయారుచేయించుకోవాలనుకొని, మొదటి ప్రతిస్పందన కింగ్ నుండి రాబట్టడానికి, తన సొంత గౌనును పొట్టిగా చేయమని పరిచారికను అభ్యర్థించింది. ఆమె గౌను కింది అంచు మరీ పొట్టిగా[49] ఉండటం చూడగానే కింగ్ జార్జ్ V బిత్తరపోయాడు. ఫలితంగా, కింగ్ జార్జ్ VI మరియు అతని భార్య క్వీన్ ఎలిజబెత్, పగటిపూట గౌనులు పొట్టిగా ఉండటాన్ని అంగీకరించారు.

ప్రస్తుతం, అక్కడ ఎలాంటి అధికారిక డ్రెస్ కోడ్[50] లేదు. బకింగ్ హామ్ పాలెస్ కు ఆహ్వానింపబడిన చాలా మంది మగవాళ్ళు మార్నింగ్ కోట్స్ గానీ, సర్వీస్ యూనిఫార్మ్ గానీ వేసుకుని, సాయంత్రానికి సందర్భాన్నిబట్టి, బ్లాక్ టై గానీ వైట్ టై గానీ కట్టుకుంటారు. సందర్భం "వైట్ టై"కి సంబంధించిందైతే స్త్రీలు, తమ వద్ద ఉంటే, తియరా[48] ను ధరిస్తారు.

డెబ్యూటెంట్స్ ను కానుకగా ఇవ్వటం[మార్చు]

రాజు థ్రోన్ రూమ్ లో ఉనప్పుడు, ఉన్నత వంశస్థులైన ఆడపిల్లల్ని దర్బారు కానుకలుగా పంపిస్తుంది. ఈ అమ్మాయిల్ని డెబ్యూటెంట్స్ గా పిలుస్తారు, ఆ సందర్భాన్ని- షరతులతో వాళ్ళు"బయటికి రావడం"- సంఘంలోకి వాళ్ళ మొట్టమొదటిసారి ప్రాతినిధ్యం వహించే ప్రవేశంగా చెబుతారు. డెబ్యూటెంట్స్ మూడు పొడవైన ఉష్ట్రపక్షి ఈకలను కొప్పులో అలంకరించుకుని, పూర్తి కోర్టు డ్రెస్ ధరిస్తారు. వాళ్ళు ప్రవేశించగానే అభివాదం చేసి, వెనక్కు నడుస్తూ ఒక పద్ధతిగా నాట్యం చేస్తూ, తమ వస్త్రాలను నిర్దేశించిన పొడవులో విసిరుతూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. (ఆ తంతును, ఈవెనింగ్ కోర్ట్స్ గానూ, ముందు తరాల "కోర్ట్ డ్రాయింగ్ రూమ్స్"యొక్క ప్రాతినిధ్యం గానూ పిలుస్తారు)

1958లో రాణి ఈ డెబ్యూటెంట్స్[51] ప్రెజెంటేషన్ పార్టీలను బహిష్కరించి, వాటి స్థానంలో గార్డెన్ పార్టీలను[52] ప్రవేశపెట్టింది. ఈనాడు థ్రోన్ రూమ్‍ను, ఒకప్పుడు రాణి అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగా, అధికార లాంఛనాలతో స్వాగతం పలకడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడా థ్రోన్ వేదికపైన రాజరిక వివాహాలకూ, కుటుంబాలకూ సంబంధించిన చాయాచిత్రాలు తీయబడుతున్నాయి.

ఇన్వెస్టిట్యూర్స్[మార్చు]

ఇన్వెస్టిట్యూర్స్‌ అంటే, 1854లో నిర్మింపబడిన పాలెస్ ‍లో సేకరింపబడిన కత్తి, డాలుతో కూడిన నైట్ హుడ్స్, ఇంకా అనేక రకాలైన పురస్కారాలు, ఇతరాలు అందజేయబడతాయి. ఇది36.6 m (120.08 ft)పొడవుతో, 18 m (59.06 ft)వెడల్పుతో, 13.5 m (44.29 ft)ఎత్తుతో[53] (120' X 59' X 44' 3.5), పాలెస్‍లో కెల్లా అతిపెద్ద గది. వాడుకలోనూ, ముఖ్యత్వంలోనూ ఇది థ్రోన్ రూమ్ స్థానాన్ని ఆక్రమించింది. ఇన్వెస్టిట్యూర్స్ సమయంలో, 1911[54] లో ఢిల్లీ దర్బారు పట్టాభిషేకంలో ఉపయోగించిన, షామియానా లేదా బల్దాచిన్ గా పిలువబడే ఊదారంగు మండపం కిందనున్న థ్రోన్ వేదిక పై క్వీన్ నిలబడుతుంది. పురస్కార గ్రహీతలు, తమ బంధుమిత్రులు[55] చూస్తూండగా క్వీన్ ను చేరుకుని, సత్కరింపబడేటప్పుడు, మ్యూజిక్ రూమ్ లో ఉన్న ఒక మిలటరీ బ్యాండ్ మేళం, సంగీతాన్ని వినిపిస్తారు.

స్టేట్ బాంక్వెట్స్[మార్చు]

1870 లో గ్రాండ్ స్టెయిర్‍కేస్ ఆరోహిస్తున్న అతిథులు.

స్టేట్ బాంక్వెట్స్ బాల్‍రూమ్ లో కూడా చోటుచేసుకుంటాయి; ఈ అధికారిక రాత్రి భోజనాలు హెడ్ అఫ్ ది స్టేట్[55], రాష్ట్రాన్ని సందర్శించిన మొదటి సాయంత్రం జరుగుతాయి. ఈ వేడుకలో, 150 లేదా ఎక్కువ అతిథులు "వైట్ టై మరియు అలంకరణల"తో, స్త్రీలు, తియారాతో ఉన్నవాళ్ళు బంగారు పళ్ళెంలో భోంచేయవచ్చు. బకింగ్ హామ్ పాలెస్ లో అన్నింటిలోకి పెద్ద రిసెప్షన్స్, ప్రతి సంవత్సరం నవంబరులో లండన్[56] లో ఉంటున్న విదేశీ దౌత్యాధికారులను క్వీన్ సత్కరించే సమయంలో జరుగుతాయి. ఈ వేడుకలో, పిక్చర్ గ్యాలరీకి చెందిన గ్రేట్ నార్త్ డోర్స్ నుంచి మొదలుకొని, రాజకుటుంబీకులు తిరుగాడుతుంటారు[57] కాబట్టి అన్ని స్టేట్ రూమ్ లూ వాడుకలో ఉంటాయి. నాష్ ఊహించినట్టుగానే, అన్ని పెద్ద, డబుల్-మిర్రర్డ్ తలుపులు తెరువబడి, స్ఫటిక షాండ్లియర్స్‌నూ, స్కోన్సెస్ నూ ప్రతిబింబిస్తూ, ఆ ప్రదేశానికీ మరియు కాంతికీ చెందిన ఒక కృత్రిమమైన, ప్రకాశవంతమైన భ్రాంతికి గురిచేస్తుంది.

ఇతర వైదిక కర్మలు మరియు వేడుకలు[మార్చు]

చిన్నచిన్న వేడుకలు, కొత్త దౌత్యవేత్తలను సత్కరించడంలాంటివి "1844 రూమ్" లో జరుగుతాయి. ఇక్కడే క్వీన్ చిన్నచిన్న లంచ్ పార్టీలు, తరచుగా ప్రైవీ కౌన్సిల్ సమావేశాలనూ నిర్వహిస్తుంది. అతి పెద్దవైన లంచ్ పార్టీలు తరచుగా వంపు తిరిగిన కప్పును కలిగి ఉన్న మ్యూజిక్ రూమ్ లోనూ లేదా స్టేట్ డైనింగ్ రూమ్ లోనూ జరుగుతాయి. అన్ని వైదిక కర్మల వేడుకలకూ, యోమెన్ అఫ్ ది గార్డ్ వారి చారిత్రక దుస్తుల్లోనూ, మిగతా కోర్టు అధికారులు లార్డ్ చాంబర్‍లైన్[58] వంటి దుస్తుల్లోనూ హాజరవుతారు.

రెండో ప్రపంచయుద్దంలో పాలెస్ చాపెల్ మీద బాంబుదాడి జరిగినప్పటి నుండీ, రాయల్ క్రిస్టెనింగ్స్ కొన్నిసార్లు మ్యూజిక్ రూమ్ లో జరుపబడేవి. క్వీన్ మెదటి ముగ్గురు పిల్లలూ ఇక్కడే ఒక ప్రత్యేకమైన గోల్డెన్ ఫాంట్ లో బాప్తీస్మం తీసుకున్నారు[59]. ప్రిన్స్ విలియమ్ నామకరణం కూడా మ్యూజిక్ రూమ్ లోనే జరిగింది; అయినప్పటికీ, ప్రిన్స్ హారీకి, మాత్రం సెయింట్ జార్జ్స్ చాపెల్, విండ్సర్ లో నామకరణం చేశారు.

సంవత్సరంలో దాదాపు 8,000 మంది గార్డెన్ లోకి వచ్చే ఆహుతులతో, క్వీన్స్ గార్డెన్ పార్టీలే అతి పెద్ద వేడుకలుగా నిలుస్తాయి.

ఆధునిక చరిత్ర[మార్చు]

బకింగ్ హామ్ పాలెస్ పనోరమా, 1909

1901లో ఎడ్వర్డ్ VII పట్టాభిషేకంతో పాలెస్ లోకి ఒక కొత్త గాలి వీచింది. ఈ కొత్త రాజు మరియు అతని భార్య క్వీన్ అలెగ్జాండ్రా, లండన్ లోని హై సొసైటీ, మరియు వారి మిత్రులకు ఆదర్శంగా ఉండి, ఆ తరంలోనే సుప్రసిద్ధమైన ఫ్యాషనబుల్ గా పేరుపొందిన "ది మాల్బోరో హౌస్ సెట్" గా పిలువబడేవారు. బకింగ్ హామ్ పాలెస్-ది బాల్‍రూమ్, గ్రాండ్ ఎంట్రెన్స్, మార్బుల్ హాల్, గ్రాండ్ స్టైర్‌కేస్, వెస్టిబుల్స్ మరియు గ్యాలరీస్ అన్నీ బెల్లె ఎపోకీ క్రీమ్ మరియు గోల్డ్ కలర్ స్కీమ్ తో తిరిగి అలంకరింపబడి ఈ నాటికీ అలాగే ఉన్నాయి-ఫలితంగా అది మరొక్కసారి దర్పానికి, అతిథ్యానికీ వేదికగా నిలిచింది. చాలా మంది మాత్రం కింగ్ ఎడ్వర్డ్ పాలెస్ కు చేయించిన భారీ అలంకరణ, దీనికి మూలమైన నాష్ యొక్క పనితనానికి[60] దీటుగా లేదని అనుకుంటారు. అయినప్పటికీ, అది వంద సంవత్సరాలకు పైగా అలాగే నిలిచి ఉండగలిగింది.

The east front of Buckingham Palace was completed in 1850, seen here in 1910
...it was remodelled to its present form in 1913.

కింగ్ జార్జ్ V తరంలో, ఎప్పుడైతే, 1913లో, సర్ ఆస్టన్ వెబ్బ్, బ్లోర్ యొక్క 1850 ఈస్ట్ ఫ్రంట్ ను చెషైర్ లోని గియాకమో లియోనీస్ లైమ్ పార్క్ లోని భాగాన్ని పోలిన విధంగా తిరిగి తీర్చిదిద్దాడో, అప్పుడే చివరి అతిపెద్ద భవన నిర్మాణం జరిగింది. ఇలా కొత్తగా తిరిగి రూపొందిన ప్రముఖ ముఖద్వారం(పోర్ట్‌లాండ్ స్టోన్ తో), మెయిన్ గేట్స్‌[61] కు బయట క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అతిపెద్ద విగ్రహం విక్టోరియా మెమోరియల్ కు వెనుకవైపు ఉండే విధంగా తీర్చిదిద్దబడింది. 1910లో ఎడ్వర్డ్ VII తరువాత అధికారంలోకి రాగానే జార్జ్ V, తండ్రికన్నా అధికంగా తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉండి; మితిమీరిన విందువినోదాల[62] కన్నా అధికార ఆతిథ్యాలమీదా, రాజరిక సేవల మీదా దృష్టి సారించాడు. అతడు జాజ్ సంగీతకారులతో ఏర్పాటుచేసిన సమ్మోహనభరితమైన ప్రదర్శనల పరంపరలో, ఒరిజినల్ డిక్సీలాండ్ జాజ్ బాండ్(1919) - స్టేట్ అఫ్ హెడ్ లో జరిగిన మొదటి జాజ్ ప్రదర్శన, సిడ్నీ బాచెట్, మరియు యునైటెడ్ కింగ్‍డమ్[63][64] లోని జాజ్ మ్యూజిక్ కోసం తోడ్పాటునందించే వేదికల్లో ఒకటైన బ్రెకన్ జాజ్ ఫెస్టివల్ యొక్క బ్లూ ప్లాక్ కోసం (లాంటి) 2009 లో పాలెస్ కు నామినేషన్ సంపాదించిన లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1932) లాంటివి కొన్ని ఉన్నాయి. కళాపోషకురాలైన జార్జ్ V యొక్క భార్య క్వీన్ మేరీ, రాయల్ కలెక్షన్ కు సంబంధించిన వస్తు సామాగ్రి మరియు కళలకు సంబంధించి, వాటి పరిరక్షణ, సేకరణల్లో చాలా శ్రద్ధ వహించేది. క్వీన్ మేరీ ఎన్నో ఉపకరణాలను, వాటిల్లో గార్డెన్ ముఖాకృతికి మధ్య, క్రింది అంతస్తులో ఉండే అతిపెద్ద బో రూమ్ లో, బెంజిమన్ వలీమీ రూపొందించిన 1810 నాటి పెయిర్ అఫ్ మార్బల్ ఎంపైర్-స్టైల్ చిమ్నీ ముక్కలు లాంటివాటిని అమర్చేలా చేసింది. బ్లూ డ్రాయింగ్ రూమ్[65] అలంకరణకు కూడా క్వీన్ మేరీయే కారణం. ఈ గది, 69 ఫీట్ల (21) పొడవుతో, భారీ గిల్ట్ కన్సోల్ బ్రాకెట్స్[66] యొక్క ఖజానాతో నాష్ చే రూపొందింపబడిన సీలింగ్ ను కలిగి ఉన్న ఈ గది, పూర్వం సౌత్ డ్రాయింగ్ రూమ్ గా పిలువబడేది.

రాయల్ సేకరణ విభాగం ద్వారా 1999 లో ప్రచురితమైన ఒక పుస్తకంలో, పాలెస్ లో 19 స్టేట్ రూమ్స్, 52 ప్రిన్సిపల్ రూమ్స్, 188 సిబ్బంది గదులు, 92 కార్యాలయాలు, 78 స్నాన శాలలు[67] ఉన్నాయని ఉటంకించారు. చూడ్డానికి ఇది పెద్దదిగా ఉన్నట్టు అనిపించినా, సెయింట్ పీటర్స్ బర్గ్ లో మరియు సార్స్‌కో సెలోల్లో ఉన్న రష్యన్ ఇంపీరియల్ పాలెస్‍లు, రోమ్‍లోని పాపల్ పాలెస్, మాడ్రిడ్ లోని రాయల్ పాలెస్, ది స్టాక్ హోమ్ పాలెస్, లేదా మునుపటి పాలెస్ అఫ్ వైట్ హాల్, వీటితో పోలిస్తే చిన్నదిగా, ఫర్‍బిడెన్ సిటీ మరియు పొటాలా పాలెస్‍తో పోలిస్తే సూక్ష్మమైనదిగా అనిపిస్తుంది. లోపలి క్వాడ్రాంగిల్‍ను ఒక్కదాన్ని మినహాయిస్తే, పాలెస్ యొక్క సూక్ష్మత ఎన్నో ప్రశంసలను అందుకుంది. నార్త్-వెస్ట్ పెవిలియన్‍లోని అంతర్భాగమై, నాష్ చేత కన్సర్వేటరీగా రూపొందింపబడి, 1911 - 13 మధ్య సరిచేయబడ్డ రాక్వెట్స్ కోర్టు, స్విమ్మింగ్ పూల్‍గా మార్చబడిన తరువాత 1938లో కొద్దిగా మార్పుచేయబడింది.

విక్టోరియా మెమోరియల్, సర్ థామస్ బ్రాక్ అనే శిల్పి చేత 1911 లో సృష్టించబడి, వాస్తుశిల్పి సర్ ఆస్టన్ వెబ్బ్ చేత చుట్టూ రూపొందింపబడిన పరిసరాలతో మెయిన్ గేట్స్‌కు ఎదురుగా నిలుపబడింది.

మొదటి ప్రపంచపు యుద్ధం సమయంలో, కింగ్ జార్జ్ V మరియు క్వీన్ మేరీ నివాసంగా ఉన్న ఆ పాలెస్ దెబ్బతినకుండా తప్పించుకుంది. దాని విలువైన వస్తుసామాగ్రి అంతా ఖాళీ చేయబడి విండ్సర్ కు తరలించినా, రాయల్ ఫ్యామిలీ మాత్రం సిట్యు లోనే ఉండిపోయింది. కింగ్ తన అతిథులు మరియు పరివారం[68] అంతా విస్తుపోయేలా పాలెస్ వద్ద సరుకుల కోత విధించాడు. ఆ తరువాత, డేవిడ్ లాయిడ్ జార్జ్ బలవంతం వల్ల ఆడంబరంగా వైన్ సెల్లార్స్ లకు తాళం వేయించి, ఆల్కాహాల్ నుంచి దూరంగా ఉండి, మత్తుకు అలవాటుపడ్డ పనివాళ్ళకు ఆదర్శంగా ఉండేందుకు చేసిన ప్రయత్నం వల్ల కింగ్ పశ్చాత్తప పడవలసి వచ్చింది. పనివాళ్ళు మెల్లగా దాన్ని జీర్ణించుకున్నా కింగ్ మాత్రం తను ఆచరిస్తున్న నిర్ణయం[69] పట్ల అసంతృప్తితో ఉండిపోయాడు.

రెండో ప్రపంచయుద్ధ సమయంలో పాలెస్ దారుణమైన మూల్యం చెల్లించుకుంది; 1940లో పాలెస్ చాపెల్ ధ్వంసం కావడానికి, దాదాపు ఏడుసార్లు చాలా తీవ్రంగా బాంబు దాడులకు గురైనట్టు ప్రచారం జరిగింది. ధనికులకైనా, పేదవారికైనా కష్టాలు తప్పవని, ఈ ఘటన యొక్క దృశ్యాలను UK అంతా సినిమాల్లో వేసి ప్రదర్శించారు. కింగ్ జార్జ్ VI మరియు క్వీన్ ఎలిజబెత్, నివాసంలో ఉన్నపుడే ఒక బాంబు పాలెస్ క్వాడ్రాంగిల్ లో వచ్చి పడి, ఎన్నో కిటికీలు కాలి బూడిదై, చాపెల్ ధ్వంసమైంది.[70] అయినప్పటికీ, ఇలాంటి యుద్ధ-సమయపు ఘటనలకు సంబంధించిన వార్తా సేకరణ చాలా తీవ్రంగా నిషేధింపబడింది. రాజు మరియు రాణి బాంబుల వల్ల ధ్వంసమైన తమ ఇంటిని తనిఖీ చేయడాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు, ఎప్పటిలాగే చిరునవ్వు చెదరని రాణి, చక్కటి దుస్తులతో మరియు తలమీద టోపీతో దానికి సరిపోయే కోటుతో ఆమె చుట్టూరా ఉన్న విధ్వంసాన్ని చూస్తూ కూడా ఏ విధమైన ఉద్విగ్నానికి లోనుకాలేదు. అంతే కాకుండా ఆ సమయంలో రాణి ఇలా ప్రకటించింది "మా మీద బాంబుదాడి జరగడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను తూర్పుభాగపు చివరను చూడగలుగుతున్నాను". రాజకుటుంబం తమ భావాలనూ, కష్టాలనూ పై విధంగా పంచుకుంటున్నారని, ది సండే గ్రాఫిక్ ప్రచురించింది:

By the Editor: The King and Queen have endured the ordeal which has come to their subjects. For the second time a German bomber has tried to bring death and destruction to the home of Their Majesties...When this war is over the common danger which King George and Queen Elizabeth have shared with their people will be a cherished memory and an inspiration through the years.[71]

1940 సెప్టెంబరు 15న, రే హోమ్స్ అనబడే ఒక RAF పైలట్, పాలెస్[72] మీద బాంబ్ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక జర్మన్ విమానాన్ని ఢీకొన్నాడు. హోమ్స్‌కు ఆయుధాలు కొరత రావడంతో గత్యంతరం లేక, దాన్ని ఢీకొట్టాలనే నిర్ణయం తీసుకున్నాడు. కానీ రెండు విమానాలు కూడా ధ్వంసమై, పైలట్లు మాత్రం బ్రతికిన ఆ సంఘటనను ఫిల్మ్ మీద చిత్రీకరించారు. తరువాత ఆ విమానం యొక్క ఇంజిన్ ను ఇంపీరియల్ వార్ మ్యూజియమ్ లండన్ లో ప్రదర్శించారు. ఇక ఆ బ్రిటిష్ పైలట్ మాత్రం యుద్ధానంతరం రాజు యొక్క దూతగా మారి, తన 90వ ఏట, 2005[73] లో మరణించాడు.

VE రోజు నాడు-8 మే 1945-ఆ పాలెస్ బ్రిటిష్ సంబరాలకు కేంద్రంగా మారి, రాజు, రాణి మరియు కాబోయే రాణి ప్రిన్సెస్ ఎలిజబెత్, మరియు ప్రిన్సెస్ మార్గరెట్ వారి వెనుక వైపు దారిగల కిటికీలతో ఉన్న బాల్కనీలో నిలబడి,మాల్[74] లోకి పోటెత్తిన జనసందోహాల హర్షాతిరేకాలను స్వీకరించారు.

1838 మరియు 1841 మధ్య కాలంలో, బాయ్ జోన్స్ అనే ఒక చొరబాటుదారుడు, మూడు సందర్భాలలో పాలెస్ లోపలికి ప్రవేశానుమతి పొందాడని, 40 సంవత్సరాల తరువాత[75] చార్లెస్ డికెన్స్ రికార్డ్ చేశాడు. 1982 లో మైకేల్ ఫాగన్ అనే వాడు, రెండుసార్లు పాలెస్ లోపలికి దూసుకువచ్చి, వీటిల్లో ఏదో ఒకసారి[76] మాత్రం రాణితో మాట్లాడగలిగాడు, నివేదికల ప్రకారం పాలెస్ పోలీసులు చేరుకునే లోగా, ఫాగన్ కూడా ఎలాంటి కీడు చేసే ఉద్దేశ్యంతో రాణి దగ్గర వ్యవహరించలేదు కాబట్టి, రాణి తన గొప్పదనాన్ని నిలుపుకుంటూ శాంత చిత్తంతో వ్యవహరించింది.

గార్డెన్, రాయల్ మ్యూస్ మరియు మాల్[మార్చు]

బకింగ్ హామ్ పాలెస్ యొక్క పడమటి ముఖాకృతి, స్నానపు రాయితో ఆకృతిదాల్చి, పాలెస్ గార్డెన్స్ నుంచి కూడా కనిపిస్తుంది.

పాలెస్ వెనుక వైపున, ఒక సరస్సుతో కలిసి విలసిల్లే పార్క్-లాంటి అతిపెద్ద గార్డెన్, లండన్[77] లోకెల్లా పెద్దదైన ప్రైవేట్ గార్డెన్. ఇక్కడే ప్రతీ వేసవిలో రాణి తన వార్షిక గార్డెన్ పార్టీలకు అతిథ్యాన్ని ఇస్తూ, జూబిలీస్ లాంటి రాయల్ మైల్‍‍స్టోన్స్ కు సంబంధించిన అతిపెద్ద వేడుకలను కూడా నిర్వహిస్తుంది. తొలుత కేపబిలిటీ బ్రౌన్ చే ఏర్పరచబడ్డ ఆ గార్డెన్, తరువాత క్యూ గార్డెన్స్ యొక్క విలియమ్ టౌన్‍సెండ్ ఐటన్ మరియు జాన్ నాష్ లచే పునరాకృతి గావించబడింది. కృత్రిమమైన ఆ సరస్సు 1828లో పూర్తిగావించబడి, హైడ్ పార్క్ గుండా ప్రవహించే సెర్పెంటైన్ నది నుంచి నీళ్ళను తెప్పించి నింపబడింది.

నాష్ చేతనే రూపొందింపబడి, పాలెస్ ను ఆనుకొని ఉన్న రాయల్ మ్యూస్ లో గోల్డ్ స్టేట్ కోచ్ లాంటి రాయల్ క్యారేజెస్ ను నిలుపుతారు. ఈ రొకోకో గిల్ట్ కోచ్, 1760లో సర్ విలియమ్ చాంబర్స్ చేత రూపొందింపబడి, జి. బి. సిప్రియాని చేత పెయింట్ చేయించబడింది. అది మొట్టమొదటిసారి జార్జ్ III ద్వారా 1762లో స్టేట్ ఓపెనింగ్ అఫ్ పార్లమెంట్ కోసం ఉపయోగింపబడి, అప్పుడప్పుడూ రాజ్యాధినేతల పట్టాభిషేకాల సమయంలో మరియు జూబిలీ వేడుకల్లో[78] ఉపయోగింపబడుతుంది. ఇంకా, రాచ వేడుకల ఊరేగింపుల్లో[79] ఉపయోగించే క్యారేజ్ గుర్రాలు కూడా మ్యూస్ లోనే ఉంచబడతాయి.

ఇక మాల్, వేడుకల సందర్భంగా పాలెస్ కు చేరుకోడానికి వెళ్ళే ఒక మార్గం లాగా, క్వీన్ విక్టోరియా యొక్క గ్రాండ్ మెమోరియల్ లోని అంతర్భాగంగా, సర్ ఆస్టన్ వెబ్బ్ చేత రూపొందింపబడి, 1911లో పూర్తిగావింపబడింది. ఇది అడ్మిరాల్టీ ఆర్చ్ నుండి ప్రారంభమై, విక్టోరియా మెమోరియల్ మీదుగా, కెనడా గేట్, సౌత్ ఆఫ్రికా గేట్ మరియు ఆస్ట్రేలియా గేట్లను దాటుకుని, పాలెస్ ఫోర్ కోర్ట్ ను చేరుకుంటుంది. ఈ మార్గం అశ్విక దళాలు మరియు మోటారు దళాల చేత, ప్రతీ హెడ్ ఆఫ్ స్టేట్ సందర్శన సమయంలోనూ, రాజకుటుంబం చేత వార్షిక స్టేట్ ఓపెనింగ్ అఫ్ పార్లమెంట్ మరియు ప్రతీ సంవత్సరం జరిపే ట్రూపింగ్ ది కలర్ లాంటి సందర్భాల్లోనూ ఉపయోగింపబడుతుంది.

21వ శతాబ్దం: రాజరిక వాడుక మరియు ప్రజా సౌలభ్యం[మార్చు]

1986 లో బాల్కనీ పైన ఉన్న రాయల్ ఫ్యామిలీ

ప్రతీ సంవత్సరం గార్డెన్ పార్టీల్లో, రిసెప్షన్స్‌లో, ప్రేక్షకులు, మరియు బాంక్వెట్స్ ల్లోనూ, దాదాపు 50,000 లకు పైగా ఆహ్వనింపబడిన అతిథులు, అతిథ్యాన్ని స్వీకరిస్తారు. దాదాపు మూడు గార్డెన్ పార్టీలు, వేసవిలో అంటే ఇంచుమించు జూలైలో జరుగుతాయి. బకింగ్ హామ్ పాలెస్ యొక్క ఫోర్ కోర్ట్‌లో, ప్రధాన వేడుకగా మరియు పర్యాటకులకు ఆకర్షణగా నిలిచే గార్డుల మార్పిడి లాంటి విధులు జరుపబడతాయి (వేసవి నెలల్లో ప్రతీరోజూ; శీతాకాలంలో రోజు విడిచి రోజు).

విండ్సర్ కాజిల్ లాగానే, ఈ పాలెస్ కూడా బ్రిటిష్ స్టేట్ కు సొంతం. శాండ్రింగ్ హామ్ హౌస్ మరియు బెల్‍మోరల్ హౌస్ లాగా, ఇది రాజుల వ్యక్తిగత స్థిరాస్థి కాదు. బకింగ్ హామ్ పాలెస్, విండ్సర్ కాజిల్, కెన్‍సింగ్టన్ పాలెస్ మరియు సెయింట్ జేమ్స్ పాలెస్ లలో నెలకొని ఉన్న చాలా వరకు వస్తుసామాగ్రిని రాయల్ కలెక్షన్ గా పిలుస్తారు; రాయల్ మ్యూస్ దగ్గర ఉన్న క్వీన్స్ గాలరీ వద్ద, బ్రిటన్ సార్వభౌమత్వానికి చెందిన వీటిని, పలుసందర్భాలలో ప్రజలు దర్శించవచ్చు. పాలెస్ మరియు కాజిల్ లాగా కాకుండా ఈ గ్యాలరీ నిరంతరంగా తెరువబడి, సేకరణలోని వివిధ వస్తువులను ఎంపిక చేసి మారుస్తూ ప్రదర్శింపబడుతుంటాయి. క్వీన్స్ గాలరీని కలిగి ఉన్న ఆ గదులు, రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా పాలెస్ పై పడిన ఏడు బాంబుల్లో, ఒకదాని వల్ల ధ్వంసం కాబడ్డ మునుపటి చాపెల్ నెలకొని ఉన్న ప్రదేశంలో నిర్మింపబడ్డాయి. 1993 నుండి పాలెస్ యొక్క స్టేట్ రూమ్స్ ప్రజల కోసం, ఆగస్టు మరియు సెప్టెంబర్ల మధ్య తెరువబడుతున్నాయి. ప్రవేశ రుసుము ద్వారా సేకరింపబడిన డబ్బును, 1992లో సంభవించిన అగ్నిప్రమాదం వల్ల దెబ్బతిన్న విండ్సర్ కాజిల్‍కు చెందిన అనేక స్టేట్ రూమ్స్ యొక్క పునర్నిర్మాణ పనుల కోసం ఉపయోగిస్తున్నారు.

మే 2009లో, బకాయిపడ్డ పాలెస్ మరమ్మతు పనులకు కావాల్సిన డబ్బు కోసం, ప్రభుత్వానికి రాజ కుటుంబం చేసిన అభ్యర్థనకు స్పందించి, ఇంకా అధికంగా దానికి కావల్సిన £4 మిలియన్ల వార్షిక నిధి కోసం, ప్రస్తుతం కొనసాగుతున్న విధంగా రాజ కుటుంబ సభ్యులు నివాసంలో ఉన్నప్పుడు[80], పాలెస్ ను ప్రజల కోసం 60 రోజులకన్నా అధికంగా తెరిచి ఉంచాలని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చెందిన కొంతమంది ఎంపి లు ప్రతిపాదించారు. బ్రిటిష్ గవర్నమెంట్ ప్రస్తుతం, సంవత్సరానికి £15 మిలియన్లను పాలెస్ యొక్క నిర్వహణ కోసం కేటాయిస్తోంది.

ఆ విధంగా, బకింగ్ హామ్ పాలెస్, బ్రిటిష్ రాజవంశానికి నివాసంగా, ఒక ఆర్ట్ గ్యాలరీగా మరియు పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. బ్రోమ్స్‌గ్రోవ్ గిల్డ్[36] తయారుచేసిన ఆ గిల్డెడ్ రెయిలింగ్స్ మరియు గేట్స్ ఇంకా వెబ్బ్ యొక్క ప్రసిద్ధికెక్కిన ముఖాకృతి గురించి రాయల్ కలెక్షన్ చేత ప్రచురింపబడిన "లైక్ ఎవ్రీబడీస్ ఐడియా అఫ్ ఎ పాలెస్"[36] అనే పుస్తకంలో వివరింపబడింది; ఇది క్వీన్ మరియు ప్రిన్స్ ఫిలిప్ యొక్క నివాసమే కాకుండా, డ్యూక్ అఫ్ యార్క్ మరియు ఎర్ల్ అండ్ కౌంటెస్ అఫ్ వెస్సెక్స్ యొక్క లండన్ లోని నివాసం. ఈ పాలెస్, రాయల్ హౌస్‍హోల్డ్ యొక్క నివాసాలు మరియు కార్యాలయాలే కాకుండా 450 మంది పనిచేస్తున్న కేంద్రం కూడా.

వీటిని పరిశీలించండి[మార్చు]

 • బకింగ్ హామ్ పాలెస్ వద్దనున్న ఫ్లాగ్స్
 • బ్రిటిష్ రాయల్ రెసిడెన్సీల జాబితా

సూచనలు[మార్చు]

 1. తరతరాలుగా బ్రిటిష్ రాయల్ కోర్ట్ ఇప్పటికీ సెయింట్ జేమ్స్‌స్ పాలెస్ లోనే ఉంటోంది. విదేశాంగ దూతలు వారి కొత్త స్థానాలను ఆక్రమించేముందు, బకింగ్ హామ్ పాలెస్ వద్ద గల బ్రిటిష్ సార్వభౌమత్వం వారిని ఆహ్వానించినా, నిజానికి వాళ్ళను "కోర్ట్ అఫ్ సెయింట్ జేమ్స్‌స్ పాలెస్" కు అధికారికంగా పరిచయం చేయడమే ముఖ్యోద్దేశం. ఈ నియమాతీతమైన చర్య, కేవలం బకింగ్ హామ్ పాలెస్, అన్ని ఉద్దేశ్యాలకూ, కార్యాలకూ అధికారిక నివాసం కాబట్టి నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. హిస్టరీ అఫ్ సెయింట్ జేమ్స్‌స్ పాలెస్ (రాయల్ వెబ్‍సైట్) చూడండి.
 2. 2.0 2.1 రాబిన్సన్, p.14
 3. గోరింగ్, P.15
 4. ఆ సైట్ స్థలాకృతి మరియు యాజమాన్యాలు రైట్ పరిధిలోనే బేరమాడబడ్డాయి, చాప్టర్స్ 1-4
 5. గోరింగ్, p.28
 6. గోరింగ్, p.18
 7. ది ఆక్విజిషన్ అఫ్ ది ఎస్టేట్ , సర్వే అఫ్ లండన్ : వాల్యూమ్ 39: ది గ్రాస్‍వెనర్ ఎస్టేట్ ఇన్ మేఫెయిర్, పార్ట్ 1 (జనరల్ హిస్టరీ) (1977), pp. 1–5. పరిశోధించిన తేదీ: 3 ఫిబ్రవరి 2009
 8. రైట్, pp. 76–8
 9. గోరింగ్, pp. 31&36
 10. ఇప్పటికీ నిలిచి ఉన్న ఏబ్యురీ మానర్ మరియు గ్రాస్‍వెనర్ ఎస్టేట్‍లను అభివృద్ధి చేసిన వారిలో ఆడ్లే మరియు డేవిస్ ముఖ్యులు (డ్యూక్స్ అఫ్ వెస్ట్‌మినిస్టర్ చూడండి). (మే ఫెయిర్‍లో వాటిని నార్త్ ఆడ్లే స్ట్రీట్, సౌత్ ఆడ్లే స్ట్రీట్, మరియు డేవిస్ స్ట్రీట్ ఇలా వీధిపేర్లతో గుర్తుచేసుకుంటారు.)
 11. రైట్, p. 83
 12. గోరింగ్, చాప్టర్ V
 13. 13.0 13.1 13.2 హారిస్, p.21
 14. రైట్, p. 96
 15. గోరింగ్, p.62
 16. గోరింగ్, p.58
 17. హారిస్, p.22
 18. నాష్, p. 18, అయినప్పటికీ కొనుగోలు ధర రైట్ చేత £28,000 గా ఇవ్వబడింది p. 142
 19. క్వీన్ చార్లొట్ తన సోమర్సెట్ హౌస్ హక్కులకు బదులుగా 1775 లో చేసిన ఒక పార్లమెంట్ చట్టం ఈ అస్తిని ఆమెకు కట్టబెట్టింది (ఓల్డ్ అండ్ న్యూ లండన్ చూడండి(క్రింద)
 20. వెస్ట్‌మినిస్టర్: బకింగ్ హామ్ పాలెస్ , ఓల్డ్ అండ్ న్యూ లండన్ : వాల్యూమ్ 4 (1878), pp. 61–74. పరిశోధించిన తేదీ: 3 ఫిబ్రవరి 2009. క్వీన్‍ను కలిసే నిర్ణీత సమయానికి సంబంధించిన అధికార పత్రాలు మరియు సిబ్బంది వారికి బకింగ్ హామ్ పాలెస్ వద్దనే ఉన్నప్పటికీ, విదేశాంగ దూతలను లాంఛనంగా "ది కోర్ట్ అఫ్ సెయింట్ జేమ్స్‌స్"కు పరిచయం చేయడం అనే సాంప్రదాయం ఇంకా కొనసాగుతోంది.
 21. హారిస్, p.24
 22. హారిస్, pp.30–31
 23. జోన్స్, p. 42
 24. హారిస్, p.33
 25. "The Royal Residences > Buckingham Palace > History". www.royal.gov.uk. Retrieved 2 February 2009. Cite web requires |website= (help)
 26. Ziegler, Phillip (1971). King William IV. Collins. p. 280. ISBN 0-00-211934-X. Check |isbn= value: invalid character (help).
 27. హేడ్లే, p. 10
 28. "The Royal Residences > Buckingham Palace". www.royal.gov.uk. Retrieved 2 February 2009. Cite web requires |website= (help)
 29. 29.0 29.1 వుడ్‍హామ్-స్మిత్, p. 249
 30. హారిస్, డి బెల్లైగ్యూ & మిల్లర్, p. 33
 31. హాలండ్ & హనెన్ అండ్ క్యుబిట్స్ - ది ఇన్సెప్షన్ అండ్ డెవలప్‍మెంట్ అఫ్ ఎ గ్రేట్ బిల్డింగ్ ఫర్మ్ , ప్రచురణ 1920, p. 35
 32. హేడ్లే, p. 19
 33. హీలే, pp.137–138
 34. హీలే, p.122
 35. అలెన్స్ ఇండియన్ మెయిల్, మరియు రిజిస్టర్ అఫ్ బ్రిటిష్ అండ్ ఫారిన్ ఇండియా, చైనా, మరియు ఈస్ట్ యొక్క అన్ని భాగాలు. 1850, వాల్యూమ్ VIII. గూగుల్ బుక్ లింక్
 36. 36.0 36.1 36.2 రాబిన్సన్, p. 9
 37. [1] రిఫరెన్స్ ఫర్ ఫ్లోర్‍స్పేస్.
 38. 38.0 38.1 హారిస్, p.41
 39. హారిస్, pp.78–79
 40. హీలే, pp.387–388
 41. హారిస్, p.81
 42. హారిస్, p.40
 43. హీలే, pp.159–160
 44. హారిస్, డి బెల్లైగ్యూ & మిల్లర్, p. 93
 45. హారిస్, డి బెల్లైగ్యూ & మిల్లర్, p. 91
 46. జోన్స్, p. 43
 47. 47.0 47.1 హారిస్, p.82.
 48. 48.0 48.1 40 ఫాక్ట్స్ ఎబౌట్ బకింగ్ హామ్ పాలెస్ (రాయల్ ఇన్‍సైట్: ది బ్రిటిష్ మోనార్కీ మీడియా సెంటర్) పరిశోధించిన తేదీ: 3 ఫిబ్రవరి 2009.
 49. హీలే, p.233, పేర్కొన్న ది మెమోయిర్స్ అఫ్ మాబెల్, కౌంటెస్ అఫ్ ఎయిర్‍లీ , ఎడిటెడ్ అండ్ అరేంజ్డ్ బై జెన్నిఫర్ ఎల్లిస్, లండన్:హచిన్సన్, 1962.
 50. హెచ్‍ఎమ్స్ రిప్రజెంటేటివ్స్ సలహా మేరకు
 51. "Mailbox". Royal Insight Magazine. Retrieved 25 May 2007. Cite web requires |website= (help)
 52. దివంగత ప్రిన్సెస్ మార్గరెట్ డెబ్యూటెంట్ ప్రెజెంటేషన్స్‌ను ఉద్దేశించి: "మనం దీన్ని ఆపివేయాలి, లండన్‍లోని ప్రతీవాడూ లోపలికి వస్తున్నాడు" అనే వాఖ్య చేసి ప్రసిద్ధికెక్కింది. బ్లైకీ, థామస్ (2002) చూడండి. యు లుక్ ఆవ్‍ఫుల్లీ లైక్ ది క్వీన్: విట్ అండ్ విస్డమ్ ఫ్రమ్ ది హౌస్ అఫ్ విండ్సర్ . లండన్: హార్పర్ కోలిన్స్. ISBN 0-00-714874-7
 53. "Fact files > 40 facts about Buckingham Palace". Royal.gov.uk. Retrieved 11 August 2010. Cite web requires |website= (help)
 54. హారిస్, p.72
 55. 55.0 55.1 హీలే, p.364
 56. హీలే, p.362
 57. హీలే, p. 16
 58. హీలే, pp.363–365
 59. రాబిన్సన్, p. 49
 60. ప్లాస్టర్ అనుకరణలు మరియు ఇతర అలంకరణల మూలాలు "చాదస్తంగా" మరియు "నాష్ యొక్క విస్తృత నమూనాలకు విరుద్ధంగా" ఉన్నాయని, రాబిన్సన్ (పేజ్ 9) అలంకరణల గురించి నొక్కి చెప్పాడు.
 61. హారిస్, p.34
 62. హీలే, p.185
 63. "Buckingham Palace hits right note with jazz fans". London Evening Standard. Thisislondon.co.uk. 3 August 2009). Retrieved 11 August 2010. Check date values in: |date= (help)
 64. Stephen Bates. "Bates, Stephen, "By royal approval: Buckingham Palace's place in jazz history" ''The Guardian'' (August 3, 2009". Guardian. Retrieved 11 August 2010.
 65. హీలే pp.221–222
 66. హారిస్, p.63
 67. రాబిన్సన్, p. 11
 68. Rose, Kenneth (1983). King George V. London: Weidenfeld and Nicolson. pp. 176–177. ISBN 0297782452.
 69. రోస్, pp. 178–179
 70. Thornton, Michael (1984). Royal Feud. M.Joseph. p. 216.
 71. The Sunday Graphic, 18 September 1939, p. 1
 72. " ‘పాలెస్‍ను కాపాడిన’ పైలట్ గౌరవింపబడ్డాడు" 2 నవంబర్ 2005, బిబిసి న్యూస్ . ఏప్రిల్ 25, 2007న సేకరించబడింది.
 73. "Pilot who 'saved Palace' honoured". BBC news website. British Broadcasting Corporation (BBC). 2 November 2005. Retrieved 18 March 2009.
 74. 1945: యూరప్‍లో యుద్ధం ముగిసిన సంబరాలు (బిబిసి ఆన్ దిస్ డే ) సేకరణ తేదీ ఫిబ్రవరి 3, 2009.
 75. డికెన్స్, చార్లెస్ (5 జూలై 1885) "ది బాయ్ జోన్స్", ఆల్ ది ఇయర్ అరౌండ్ , pp. 234–37.
 76. గాడ్ సేవ్ ది క్వీన్, ఫాస్ట్ స్పెన్సర్ డేవిడ్‍సన్ మరియు ఆర్థర్ వైట్ టైమ్ మేగజైన్ 26 జూలై 1982 పరిశోధించిన తేదీ 3 ఫిబ్రవరి 2009
 77. బకింగ్ హామ్ పాలెస్ (మ్యూజియమ్ అఫ్ లండన్.) సేకరణ తేదీ ఫిబ్రవరి 3, 2009.
 78. "Kid's Zone:The Gold State Coach". The official website of the British Monarchy. Retrieved 25 May 2007. Cite web requires |website= (help)
 79. "The Royal Residences > The Royal Mews". www.royal.gov.uk. Retrieved 2 February 2009. Cite web requires |website= (help)
 80. Pierce, Andrew (30 May 2009). "Queen must open palace more in return for extra funds". The Daily Telegraph. London. Retrieved 4 June 2009.

మూలాలు[మార్చు]

 • బ్లైకీ, థామస్ (2002). యు లుక్ ఆవ్‍ఫుల్లీ లైక్ ది క్వీన్: విట్ అండ్ విస్డమ్ ఫ్రమ్ ది హౌస్ అఫ్ విండ్సర్ . లండన్: హార్పర్ కోలిన్స్. ISBN 0-00-714874-7.
 • గోరింగ్, ఓ.జి (1937). ఫ్రమ్ గోరింగ్ హౌస్ టు బకింగ్ హామ్ పాలెస్ . లండన్:ఐవర్ నికల్సన్ & వాట్సన్.
 • హారిస్, జాన్; డి బెల్లాగూ, జెఫ్రీ; & మిల్లర్, ఆలివర్ (1968). బకింగ్ హామ్ పాలెస్ . లండన్:నెల్సన్. ISBN 0-17-141011-4
 • హీలే, ఎడ్మా (1997). ది క్వీన్స్ హౌస్: ఎ సోషల్ హిస్టరీ అఫ్ బకింగ్ హామ్ పాలెస్ . లండన్:పెంగ్విన్ గ్రూప్. ISBN 0718170893.
 • హెడ్లీ, ఓల్వెన్ (1971) ది పిక్చోరియల్ హిస్టరీ అఫ్ బకింగ్ హామ్ పాలెస్ . పిట్‍కిన్, ISBN 0-85372-086-X
 • Jones, Nigel R. (2005). Architecture of England, Scotland, and Wales. Greenwood Publishing Group. ISBN 0313318506.
 • నాష్, రాయ్ (1980). బకింగ్ హామ్ పాలెస్: ది పాలెస్ అండ్ ది పీపుల్ . లండన్: మెక్‍డొనాల్డ్ ఫ్యుచూరా. ISBN 0354045296
 • రాబిన్సన్, జాన్ మార్టిన్ (1999). బకింగ్ హామ్ పాలెస్ . పబ్లిష్డ్ బై ది రాయల్ కలెక్షన్, సెయింట్. జేమ్స్‌స్ పాలెస్, లండన్ ISBN 1-902163-36-2.
 • విలియమ్స్, నెవిలే (1971). రాయల్ హోమ్స్ . లుటర్‍వర్త్ ప్రెస్. ISBN 0-7188-0803-7.
 • వుడ్‍హామ్-స్మిత్, సిసిల్ (1973). క్వీన్ విక్టోరియా (వాల్యూమ్ 1) హమీష్ హామిల్టన్ లిమిటెడ్.
 • రైట్, పాట్రీషీయా (1999; మొదటి ప్రచురణ 1996). ది స్ట్రేంజ్ హిస్టరీ అఫ్ బకింగ్ హామ్ పాలెస్ . స్ట్రౌడ్, గ్లౌక్స్.: సట్టన్ పబ్లిషింగ్ లిమిటెడ్. ISBN 0-7509-1283-9

బాహ్య లింకులు[మార్చు]

Coordinates: 51°30′04″N 0°08′31″W / 51.501°N 0.142°W / 51.501; -0.142