బక్కని నరసింహులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బక్కని నరసింహులు

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 1999
ముందు పి.శంకరరావు
తరువాత పి.శంకరరావు
నియోజకవర్గం షాద్‌నగర్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1956
లింగారెడ్డి గూడ , ఫరూఖ్‌నగర్ మండలం , రంగారెడ్డి జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు చంద్రయ్య
నివాసం షాద్‌నగర్‌
వృత్తి రాజకీయ నాయకుడు

బక్కని నరసింహులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర (టీటీడీపీ) అధ్యక్షుడిగా ఉన్నాడు. [1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బక్కని నరసింహులు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా , ఫరూఖ్‌నగర్ మండలం , లింగారెడ్డి గూడ గ్రామంలో జన్మించాడు. ఆయన 1970లో ఫరూఖ్‌నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బక్కని నరసింహులు 1983లో తెలుగుదేశం పార్టీ లో సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా తెలుగుదేశం పార్టీ లో వివిధ హోదాల్లో పని చేశాడు. నరసింహులు 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.శంకరరావు పై 45822 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి & బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ కి ఈ స్థానం కేటాయించడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నాడు. నరసింహులు 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.శంకరరావు చేతిలో 10632 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.[3]

అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీ షాద్‌నగర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, టీటీడీ పాలకమండలి సభ్యుడిగా, టీడీపీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. బక్కని నరసింహులు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. నర్సింహులు 19 జులై 2021న తెలంగాణతెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[4][5][6]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి (19 July 2021). "తెలంగాణ టీడీపీకి కొత్త బాస్". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  2. The Times of India (20 July 2021). "Ex-MLA Bakkani is new TTDP chief" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  3. Disha daily (దిశ) (20 July 2021). "కడు పేదరికం నుంచి TTDP అధ్యక్షుడిగా.. 'బక్కని' రాజకీయ ప్రస్థానం!". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  4. EENADU (20 July 2021). "తెతెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  5. Andrajyothy (20 July 2021). "బక్కనికి అరుదైన గౌరవం". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  6. Andrajyothy (19 July 2021). "కార్యకర్త నుంచి అధ్యక్షుడిగా.. !". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.