బక్సర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బక్సర్ జిల్లా
बक्सर ज़िला
బీహార్ పటంలో బక్సర్ జిల్లా స్థానం
బీహార్ పటంలో బక్సర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుపాట్నా
ముఖ్య పట్టణంబక్సర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుబక్సర్
విస్తీర్ణం
 • మొత్తం1,624 కి.మీ2 (627 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం17,07,643
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,700/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత71.77 %
 • లింగ నిష్పత్తి922
ప్రధాన రహదార్లుNH 84
Websiteఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో బక్సర్ జిల్లా ఒకటి. బక్సర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

చరిత్ర

[మార్చు]

పౌరాణిక కథనాలు

[మార్చు]

పురాతన చరిత్రలో ఈ ప్రాంతం " సిద్ధాశ్రమం, వేద్‌ర్భపురి, కరుష్, తపోవన్, చైత్రాథ్, వ్యాగ్రసర్, బక్సర్ అని పిలువబడింది. బక్సర్ ప్రాతం రామాయణ కావ్యాంలో ప్రస్తావించబడింది. వ్యాగ్రసర్ నుండి బక్సర్ అనే పదం వచ్చిందని భావిస్తున్నారు. వేద్‌షిర ఋషిని దుర్వాసుడు శపించినందున వేద్‌షిర ఋషికి పులి ముఖం వచ్చిందని తరువాత వేద్‌షిర ౠషి ఒక పవిత్రమైన సరోవరంలో స్నానం ఆచరించిన తరువాత ఆయనకు తన అసలైన ముఖం వచ్చిందని అందువలన ఇది వ్యాగ్రసర్ అయిందని విశ్వసిస్తున్నారు.

విశ్వామిత్రుడు

[మార్చు]

శ్రీరాముని గురువైన విశ్వామిత్రుడు 8 వేలమంది సన్యాసులతో గంగాతీరంలో నిర్మించిన పవిత్ర ఆశ్రమప్రాంతం ఇదని విశ్వసిస్తున్నారు. శ్రీరాముడు ఈ ప్రాంతంలో శ్రీరాముడు రాక్షసి తాటకిని వధించాడని భావిస్తున్నారు. శ్రీరాముడు లక్షణునితో ఇక్కడ గురూపదేశం పొందాడని భావిస్తున్నారు.

అహల్య

[మార్చు]

గౌతమ మహర్షి భార్య అహల్య శ్రీరాముని ద్వారా శాపవిమోచనం పొందిన ప్రదేశం ఇదని భావిస్తున్నారు. బక్సర్ పట్టణానికి 6కి.మీ దూరంలో ఉన్న అహిరౌలి అహల్య శాపవిమోచనం పొందిన ప్రాంతమని భావిస్తున్నారు. వ్యాగ్రసర్ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా ఉంది.[1]

భౌగోళికం

[మార్చు]

బాక్సర్ జిల్లా వైశాల్యం వైశాల్యం 1703 చ.కి.మీ.[2] ఇది ఆస్ట్రేలియా లోని బత్రస్ట్ ద్వీపం జనసంఖ్యకు సమానమని భావిస్తున్నారు. .[3]

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : బక్సర్ , దుంరాన్.
  • బక్సర్ ఉపవిభాగంలో 6 మండలాలు ఉన్నాయి : బక్సర్, ఇతర్హి, చౌసా , రాజ్పూర్.
  • దుంరావ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి : దుంరావ్, నవ్‌నగర్, బ్రహ్మపూర్, కేసత్, చక్కి, చౌగైన్ , సింరి.
  • పురపాలకాలు 2 ఉన్నాయి : బక్సర్ , దుంరావ్.

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

బస్కార్ పట్టణం గంగానదీతీరంలో ఉంది. గంగానది మీద రహదారి వంతెన " వీర్ కుంవర్ సింగ్ సేతు " బక్సర్ జిల్లాను పొరుగునా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో అనుసంధానిస్తుంది. జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధాని పాట్నా నగరంతో రహదారి , రైలు మార్గంతో అనుసంధానించబడి ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారణాసి, బలియా , ఘాజీపూర్ నగరాలతో బక్సర్ చక్కాగా అనుసంధానించబడి ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,707,643,[4]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 285 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 1003 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.77%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 922:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 71.77%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

పంచ్‌కోషి పరిక్రమ

[మార్చు]

సంవత్సరానికి ఒకసారి ఈ ప్రాంతంలో చేసే మతపరమైన యాత్రను పంచ్‌కోషి పరిక్రమ అంటారు. ఈ యాత్ర 5 రోజులపాటు నిర్వహించబడుతుంది.పరిక్రమలో భాగంగా భక్తులు బక్సర్ పరిసరాలలో ఉన్న 5 గ్రామాలలో రాత్రివేళ బస చేస్తారు. పరిక్రమసమయంలో భక్తులు పలు వైవిధ్యమైన ఆహారాలను వండుకుంటారు. వాటిలో ఒకటి లిట్టి - భంట. బీహారులో ఈ వంట చాలా ప్రసిద్ధం. వేపిన మినుములకు ఉప్ప కారం చేసి నింపి వండే గోధుమలతో చేసిన గుడ్రని ఆహారమే లిట్టి. భంటా అంటే గుండ్రని వంకాయ. వంకాయలు, ఉర్లగడ్డలు, టమేటాలను కాల్చిన పిడకల మీద కాల్చి చెక్కుతీసి నలిపి అదే మంటమీద కాల్చిన లిట్టిలతో చేర్చి తింటారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-23. Retrieved 2014-12-08.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Bathurst Island1,693km2
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341

బయటి లింకులు

[మార్చు]

'మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]