Jump to content

బగలాముఖి శక్తిపీఠం, శివ్వంపేట

వికీపీడియా నుండి

శ్రీబగలాముఖి శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా శివ్వంపేటలో నెలకొన్న బగలాముఖి అమ్మవారి ఆలయం.[1] హిందూధర్మంలో కాళికాదేవి దశమహావిద్యలలో బగలాముఖి అవతారం ఒకటి. బగలాముఖి దేవి తన దుడ్డు కర్రతో భక్తుల దురభిప్రాయాలు, భ్రమలు దూరం చేస్తుంది. అమ్మవారిని ఉత్తర భారతదేశంలో పీతాంబరీ దేవిగా కొలుస్తారు. పసుపు వర్ణంతో ప్రకాశించే బగలాముఖి అమ్మవారు స్తంభన దేవతగా ప్రసిద్ధి చెందింది.

ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

ఆలయ విశిష్టత

[మార్చు]

దక్షిణ భారతదేశంలోనే తొలిసారి 2023లో దాతల సహకారంతో శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో భగలాముఖి అమ్మవారికి నిర్మించిన ఆలయం. శృంగేరి జగద్గురు విద్యాతీర్థ స్వామి 1961లో, భారతీతీర్థ స్వామి 1985లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం విశేషం. భగలాముఖి అమ్మవారి అనుగ్రహం ఉంటే శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతీ పౌర్ణమి, అమవాస్యలకి మహామంత్ర హవనం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా శివ్వంపేట (శివంపేట) మండల కేంద్రంలోని ఈ ఆలయం చేరుకోవడానికి హైదరాబాదు నుండేకాక పరిసర పట్టణాల నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులో ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "బగలాముఖి శక్తిపీఠంలో విశేష పూజలు". EENADU. Retrieved 2025-06-29.