బచ్చన్నపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


బచ్చన్నపేట
—  మండలం  —
వరంగల్ జిల్లా పటములో బచ్చన్నపేట మండలం యొక్క స్థానము
వరంగల్ జిల్లా పటములో బచ్చన్నపేట మండలం యొక్క స్థానము
బచ్చన్నపేట is located in Telangana
బచ్చన్నపేట
తెలంగాణ పటములో బచ్చన్నపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°47′31″N 79°02′07″E / 17.791843°N 79.035416°E / 17.791843; 79.035416
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రము బచ్చన్నపేట
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,265
 - పురుషులు 22,103
 - స్త్రీలు 22,162
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.34%
 - పురుషులు 68.74%
 - స్త్రీలు 40.29%
పిన్ కోడ్ 506221

బచ్చన్నపేట, తెలంగాణ రాష్ట్రములోని వరంగల్ జిల్లాకు చెందిన ఒక పెద్ద గ్రామము, మండలము. ఈ చిన్న పట్టణము జనగాం నుండి 17 కిలోమీటర్లు, హైదరాబాదు నుండి 85 కిలోమీటర్లు, వరంగల్ నుండి 75 కిలోమీటర్లు దూరములో ఉంది.

ఈ పట్టణములో

 • ఒక ప్రైవేటు సిద్ధార్థ జూనియర్ (ఇంటర్మీడియేట్) కళాశాల, బస్టాండుకి ఎదురుగా
 • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
 • 4 ప్రైవేటు పాఠశాలలు
 • సినిమా థియేటర్.
 • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
 • కాకతీయ గ్రామీణ బ్యాంక్.
 • 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి.
 • శివుని, హనుమంతుని మరియు సాయిబాబా గుడులు
 • టెలిఫోన్ ఎక్స్చేంజ్.
 • పెట్రోలు పంపు.
 • శ్రీమద్రామడుగు శ్రీ శివరామదీక్షిత అచలగురు ఉపపీఠం

బచ్చన్నపేట దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు :[మార్చు]

 • శ్రీ రామడుగు శ్రీ శివరామదీక్షిత అచల గురు ఉపపీఠం బచ్చన్నపేటలో ఉంది.ఈ పీఠము శ్రీ వివేకానంద ఆగోలు సంగయాఖ్య రాజయోగి గారిచే ప్రారంభించబడింది. వారి శిష్యులు శ్రీ బోధానంద రాపెల్లి రామచంద్రయాఖ్య రాజయోగి గారు ఈ పీఠములో అచలసిద్ధాన్త ప్రబోధను చేస్తున్నారు.
 • కొలనుపాక : బచ్చన్నపేట నుండి 8 కిలోమీటర్ల దూరంలో వున్న కొలనుపాక జైన మందిరము నకి ప్రసిద్ధి. జైనులకి ప్రసిద్దమైన శ్రీ శ్వేతాంబర్ జైన్ తీర్థ్ (జైన మందిరము) 2000 సంవత్సరముల పురాతనమైనది. ఇది నల్గొండ జిల్లా ఆలేర్ మండలంకి చెందినది.
 • కొమురవెల్లి : బచ్చన్నపేట నుండి 22 కిలోమీటర్ల దూరంలో కొమురవెల్లి ఉంది . "కొమురవెల్లి మల్లన్నగా" చెప్పుకొనే మల్లికార్జున స్వామి దేవాలయము చేర్యాల మండలంకి చెందినది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం సంక్రాతి సమయంలో బ్రహ్మొత్సవాలు జరుగును. ఈ బ్రహ్మొత్సవాలకి తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు.
 • కొడువటూర్ :
 • యాదగిరి గుట్ట :

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 44,265 - పురుషులు 22,103 - స్త్రీలు 22,162
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09

మండలంలోని గ్రామాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]