Jump to content

బజార్‌డ్యుజు పర్వతం

Coordinates: 41°13′28″N 47°51′30″E / 41.22444°N 47.85833°E / 41.22444; 47.85833
వికీపీడియా నుండి
బజార్‌డ్యుజు పర్వతం
షాదాగ్ పర్వతం నుండి బజార్‌డ్యుజు దృశ్యం
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు4,466 m (14,652 ft)[1]
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్2,454 m (8,051 ft)[1]
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్259.08 km (160.98 mi) Edit this on Wikidata
జాబితాఐరోపా దేశాల ఎత్తైన ప్రదేశాల జాబితా
దేశాల వారీగా ఎత్తైన ప్రదేశాల జాబితా
అల్ట్రా, రిబు
నిర్దేశాంకాలు41°13′28″N 47°51′30″E / 41.22444°N 47.85833°E / 41.22444; 47.85833[1]
భౌగోళికం
బజార్‌డ్యుజు పర్వతం is located in Caucasus mountains
బజార్‌డ్యుజు పర్వతం
బజార్‌డ్యుజు పర్వతం
అజర్‌బైజాన్‌లో బజార్‌డ్యుజు పర్వత స్థానం
బజార్‌డ్యుజు పర్వతం is located in Europe
బజార్‌డ్యుజు పర్వతం
బజార్‌డ్యుజు పర్వతం
బజార్‌డ్యుజు పర్వతం (Europe)
బజార్‌డ్యుజు పర్వతం is located in Azerbaijan
బజార్‌డ్యుజు పర్వతం
బజార్‌డ్యుజు పర్వతం
బజార్‌డ్యుజు పర్వతం (Azerbaijan)
స్థానంఅజర్‌బైజాన్రష్యా సరిహద్దు
దేశంఅజర్‌బైజాన్ and రష్యన్ ఫెడరేషన్
పర్వత శ్రేణిప్రధాన కాకసస్ పర్వత శ్రేణి
గ్రేటర్ కాకసస్
అధిరోహణం
మొదటి అధిరోహణమే 1849
సెర్గీ టిమోఫీవిచ్ అలెగ్జాండ్రోవ్

బజార్‌డ్యుజు పర్వతం (Azerbaijani: Bazardüzü dağı) అజర్‌బైజాన్, రష్యా (డాగేస్టాన్) సరిహద్దులోని గ్రేటర్ కాకసస్ పర్వత శ్రేణిలో ఉన్న ఒక పర్వత శిఖరం. సముద్ర మట్టానికి 4466 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం అజర్‌బైజాన్, డాగేస్టాన్ రెండింటిలోనూ ఎత్తైనది. ఇది కుసార్ ప్రాంతంలో ఉంది. డాగేస్టాన్ (తద్వారా రష్యా) దక్షిణాన ఉన్న చిట్టచివరి ప్రదేశం ఈ శిఖరానికి నైరుతి దిశలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. అజర్‌బైజాన్ భాష నుండి అనువదిస్తే బజార్‌డ్యుజు అంటే "మార్కెట్ కూడలి" అని అర్థం వస్తుంది, మరింత కచ్చితంగా చెప్పాలంటే ఒక నిర్దిష్ట మైలురాయిగా - "మార్కెట్ వైపు మళ్లడం, బజార్" అని అర్థం.[మూలం అవసరం] మధ్య యుగాలలో ఈ శిఖరానికి తూర్పున ఉన్న షాహ్నాబాద్ లోయలో ఏటా పెద్ద బహుళజాతి జాతరలు జరిగేవి.[మూలం అవసరం]

పర్వతారోహణ

[మార్చు]
అజర్‌బైజాన్ లోని కబాలా నుండి బజార్‌డ్యుజు పర్వత దృశ్యం

1890లో జి. పి. బేకర్, జి. యెల్డ్ ఈ పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులుగా నమోదు చేయబడ్డారు. ఈ శిఖరాన్ని అధిరోహించడానికి వేసవి కాలం అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.[2] ఈ పర్వతాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి: ఒకటి ఈశాన్యం నుండి, మరొకటి నైరుతి నుండి. ఈశాన్య మార్గంలో పర్వతారోహణ ఖినాలుగ్ (కుబా జిల్లా), లాజా (కుసార్ జిల్లా) గ్రామాల నుండి ప్రారంభమవుతుంది. నైరుతి మార్గం కబాలా జిల్లా మధ్యలో ఉన్న రెండు గ్రామాల నుండి ప్రారంభమవుతుంది: లాజా (కుసార్‌లోని గ్రామం పేరు కూడా ఇదే), కమర్వాన్. 2800 మీటర్ల ఎత్తులో ఉన్న యతాక్దారే నది వరద మైదానం శిఖరారోహణకు ప్రారంభ స్థానం.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "European Russia and the Caucasian States". Peaklist.org. Gora Bazardyuzi. Retrieved 2012-02-01.
  2. "Bazarduzu". peakware.com. Archived from the original on 2019-09-13. Retrieved 2018-11-03.
  3. "Mount Bazarduzu". www.traildino.com. Archived from the original on 2019-09-15. Retrieved 2017-09-04.

బయటి లింకులు

[మార్చు]