బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బడంగ్‌పేట్
నగరపాలక సంస్థ
రకం
రకం
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
నాయకత్వం
మేయర్
సిఎచ్.పి.నరసింహారెడ్డి
2020 సాధారణ ఎన్నికలు నుండి
డిప్యూటీ మేయరు
ఇ.శేఖర్
కమీషనర్
ఇసాక్‌ఖాన్‌
నిర్మాణం
రాజకీయ వర్గాలు
టి.ఆర్.యస్
సమావేశ స్థలం
బడంగ్‌పేట్ నగరపాలకసంస్థ కార్యాలయం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్
పంచాయతీ కార్యాలయం, బడంగ్‌పేట్

బడంగ్‌పేట నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 13 నగరపాలక సంస్థలలో ఇది ఒకటి.ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో, హైదరాబాదు మహానగరపాలసంస్థకు సమీపంలో  ఉంది ఇది 2013 మార్చి 26 న 1. బడంగ్‌పేట్ 2. అల్మాస్‌గూడ 3. నాదర్‌గల్ 4. కుర్మల్‌గూడ 5. గుర్రమ్‌గూడ 6. బాలపూర్ (భాగం) 7. వెంకటాపూర్, 8. మామిడిపల్లి ఎనిమిది పూర్వ గ్రామాలు విలీనంతో నగర పంచాయితీగా ఏర్పడింది.నగరపంచాయతీ స్థాయి నుండి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడింది.ఎనిమిది గ్రామాల యుఎల్‌బి యొక్క వైశాల్యం 74.56 చ. కి.మీ. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 64579. ప్రస్తుతం ఇది 100000 జనాభాగా అంచనా వేయబడింది.బడంగ్‌పేట అనే పేరు దక్కన్ సుల్తానేట్ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బడంగి అనే పాలకుడి నుండి వచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్వపు గ్రామంలో బటన్ గుత్తా (కావలికోట) కోట గోడలు, కాశిబుగ్గ అనే పురాతన శివ - విష్ణు ఆలయం,ఇతర అందమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి.

కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థలో పరిపాలన నిర్వహణకు వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ఐదుగురు ఉన్నత అధికారులును నియమించారు.నగరపాలక సంస్థలో వివిధ శాఖలలో పనిచేయటానికి అవుట్ సోర్స్ంగ్ ఉద్యోగులు 170 మందిని నియమించారు.నగరపాలక సంస్థకు 2020 జనవరిలో జరిగే సాధారణ ఎన్నికలకు నగరపాలక సంస్థను 32 వార్డులుగా విభజించారు.[1] పౌరసంఘం కింద 98,038 మంది ఓటర్లు ఉన్నారు.[2]

మేయర్ , డిప్యూటీ మేయర్[మార్చు]

2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (యు.ఆర్.డబ్ల్యు రిజర్వుడు) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన చిగిరింత పారిజత నరసింహరెడ్డి ఎన్నికయ్యాడు.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఇబ్రమ్ శేఖర్ ఎన్నికయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-01-18. Retrieved 2020-04-16.
  2. Jan 14, Nabinder Bommala | TNN | Updated:; 2020; Ist, 08:58. "Battle of Badangpet: 158 in fray for 32 wards | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2020-04-15.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. https://tsec.gov.in/pdf/munc_corp/2020/Mayer_chairperson_MC_1427.pdf

వెలుపలి లంకెలు[మార్చు]