బతఖ్ మియాన్
బతఖ్ మియాన్ | |
---|---|
बतख़ मियां अंसारी | |
మరణం | 1957 |
Burial place | సిసవా అజగరీ పల్లెటూరు |
వృత్తి | వంటమనిషి |
క్రియాశీల సంవత్సరాలు | 1917 |
ఉద్యోగం | ఎర్విన్ |
వీటికి ప్రసిద్ధి | గాంధీజీని విషప్రయోగం నుండి కాపాడినందుకు |
బతఖ్ మియాన్ అన్సారీ (बतख़ मियां अंसारी) గాంధీజీని విషప్రయోగం నుండి కాపాడిన ఒక వంటవాడు. ఇతను అప్పటికి బిహార్‌లోని మోతిహారీలో గల నీలిపొలంలో వంటవాడిగా ఉండేవాడు. ఈ సంఘటన తరువాత అతను పనిలో నుండి తీసివేయబడి, చెరసాలలో చిత్రహింసలకు గురి చేయబడి, కుటుంబంతో సహా ఊరి నుండి తరిమివేయబడ్డాడు.
సంఘటన
[మార్చు]1911లో చంపారణ్ నీలిమందు పొలాల్లోని పనివారిపై జరుగుతున్న శ్రమదోపిడీ మీద పోరాడడానికి మహాత్మా గాంధీ అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ పొలాలు ఉన్న ఎస్టేటుకు మేనేజర్‌గా ఉన్న ఎర్విన్ ఒక రాత్రి గాంధీజీని భోజనానికి పిలిచాడు. ఆ భోజన సమయంలో ఒక గ్లాసు పాలల్లో విషం కలిపి గాంధీజీకి ఇవ్వవలసిందిగా తన వంటవాడు బతఖ్ మియాన్‌ని ఇతను ఆదేశించాడు.[1] బతఖ్ ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ దగ్గర బయటపెట్టడంతో గాంధీజీ తప్పించుకున్నారు.[2][3] ఆ తరువాత అతను తన చంపారణ్ సత్యాగ్రహాన్ని కొనసాగించారు. ఈ సంఘటన తరువాత మేనేజరు, బతఖ్‌ను చిత్రహింసలకు గురి చేసి, అతని ఇల్లూ, ఆస్తిపాస్తులు లాక్కుని, కుటుంబంతో సహా ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేసాడు.[4]
స్వాతంత్ర్యానంతరం
[మార్చు]1950లో రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా మోతిహారీకి వచ్చినప్పుడు అతని దగ్గర్లో గుమిగూడిన జనంలో ఉన్న బతఖ్‌ను అతను గుర్తుపట్టి అందరి మధ్యలో నాటి సంఘటన చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. [5] భరతజాతి తరఫున బతఖ్‌కు 24 ఎకరాలు ఇవ్వవలసిందిగా అతను నాడు రాష్ట్రపతి హోదాలో ఆదేశించారు. ఐతే అతనికి రావలసిన దాన్లో ఆరు ఎకరాలే మంజూరు అవ్వగా, అందులోని ఐదు ఎకరాలు పక్కన ఉన్న నదిలో కలిసిపోయింది. 2010లో ఈ విషయంపై నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కలుగజేసుకున్నప్పటికీ, 2023 నాటికి బతఖ్‌కు అందవలసిన భూమి అతని వారసులకి ఇంకా అందలేదు.[6]
బతఖ్ మియాన్ 1957లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Their grandfather saved Gandhi's life" [వీళ్ళ తాతగారు గాంధీవి ప్రాణాలు కాపాడారు]. ఎన్డీటీవీ (in ఇంగ్లీష్). Patna. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. 29 January 2010. Retrieved 2 February 2025.
- ↑ Arun. J Mehta (20 December 2014). "Chapter IV". Lessons in Non-violent Civil Disobedience (in ఇంగ్లీష్). p. 87. Retrieved 2 February 2025.
- ↑ Batak Mian: Forgotten patriot who saved Bapu's life in 1917 [1917లో బాపూ ప్రాణాలు కాపాడిన ఒక మరుగున పడ్డ దేశభక్తుడు] (video) (in ఇంగ్లీష్). DD News. 2 October 2013. Retrieved 2 February 2025 – via Youtube.
- ↑ Sanchari Pal (30 January 2018). "The Forgotten Cook Who Paid Heavily For Refusing To Poison Mahatma Gandhi" [మహాత్మా గాంధీపై విషప్రయోగం చేయడానికి ఒప్పుకోనందుకు భారీ మూల్యం చెల్లించిన ఒక మరుగున పడ్డ వంటవాడు]. The better India (in ఇంగ్లీష్). Retrieved 2 February 2025.
- ↑ B Vijay Murty (22 January 2010). "Family of Mahatma's saviour in dire straits" [దీనస్థితిలో మహాత్ముడిని కాపాడిన అతని కుటుంబం]. హిందూస్తాన్ టైమ్స్ (in ఇంగ్లీష్). East Champaran. Archived from the original on 2024-02-22. Retrieved 2 February 2025.
- ↑ "Grandchildren of cook Batak Mian who refused to poison Mahatma Gandhi await entire land promised by then President Rajendra Prasad" [మహాత్మా గాంధీపై విషప్రయోగం చేయడానికి ఒప్పుకోని వంటవాడు బతఖ్ మియాఁ మనవళ్ళు, నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ మాటిచ్చిన మొత్తం భూమి కోసం ఎదురుచూస్తున్నారు]. ద హిందూ (in ఇంగ్లీష్). Patna. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. 15 August 2023. Retrieved 2 February 2025.